జయలలిత గారి ఒకప్పటి ప్రపంచం ఇదే...!!

Written By:

ప్రతి పక్షాన్ని ఎదుర్కునే ధైర్యం, పనితీరులో స్పష్టత, పాలనలో చిత్తశుద్ది గల నాయకులు చాలా అరుదుగా ఉంటారు. అందులో ఒకరు తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత గారు. సభలలో ఆమె నిర్ణయానికి అడ్డే ఉండరు, ప్రతి పక్షమైన కూడా ఆమె నిర్ణయానికి తల వంచాల్సినే, అత్యంత ముక్కుసూటి వ్యక్తిత్వం గల జయలలిత గారు పత్రికలకు, ఛానెళ్లకు చాలా దూరంగా ఉంటారు. అనవసరపు ఆడంబరాలకు ఎప్పుడు దూరమే. ఎంతటి నాయకులనైనా ఎదుర్కొనే ఆమె చివరికి మరణానికి తల వంచింది. 75 రోజుల పాటు మృత్యువుతో పోరాడి చివరికి అసువులు బాసారు.

సినీరంగం ద్వారా దక్షిణాదికి పరిచయమైన అమ్మ, అనతి కాలంలోనే రాజకీయ ప్రవేశం చేశారు. మూడు సార్లు తమిళనాడు ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. దివంగత జయలలిత గారికి పాలనతో పాటు కార్లు, వాహనాలన్నా కూడా ఎంతో ఇష్టం. ఆమెకు చెందిన వాహనాల మొత్తం విలువ 42.25 మిలియన్ రుపాయలుగా ఉంది. జయలలిత గారు ఉపయోగించిన వాహనాలు గురించి ఇవాళ్టి స్టోరీలో తెలుసుకుందాం రండి.

01. అంబాసిడార్

జయలలిత కు చెందిన వాహన శ్రేణిలో 1980 మోడల్‌కు చెందిన అంబాసిడర్ కారు కలదు. అమ్మ గారికి ఇప్పటి నుండి ఇప్పటి వరకూ ఇదే ఫేవరేట్ కారు. ప్రస్తుతం దీని విలువ రూ. 10,000 లుగా ఉంది.

02. స్వరాజ్ మ్యాక్సి మజ్దా

జయలలిత గారు మొదటి ముఖ్యమంత్రి ఎన్నికలకు నామినేషన్ వేసినపుడు స్వరాజ్ కు చెందిన మ్యాక్సి మజ్దా మిని బస్సును ఎంచుకున్నారు. 1988 మోడల్‌కు చెందిన ఈ బస్సు ప్రస్తుతం విలువ రూ. 10,000 లుగా ఉంది.

03. టెంపో ట్రక్

టెంపో ట్రక్క్ ఆ కాలంలో దీనిని ఇది మంచి డిమాండ్ ఉన్న ఎస్‌యువి. జయలలిత గారు వాహన శ్రేణిలో 1989 మోడల్‌కు చెందిన టెంపో ట్రక్ ఎస్‌యువి కలదు. దీని ప్రస్తుత మార్కెట్ విలువ 30,000 రుపాయలుగా ఉంది.

04. కాంటెస్సా కారు

1990 లో జయలలిత గారు ఈ కాంటెస్సా లగ్జరీ కారును ఎంచుకున్నారు. జయ గారి మొదటి లగ్జరీ కారు కూడా ఇదే. ఇప్పుడు మార్కెట్ విలువ ప్రకారం దీని ధర సుమారుగా రూ. 5,000 లుగా ఉంటుంది.

05. మహీంద్రా బొలెరో

ఇండియన్ మార్కెట్లో మహీంద్రా వారి నెంబర్ 1 ఎస్‌యువి బొలెరో. ఇది అంటే తమిళ మాజీ దివంగత ముఖ్యమంత్రి గారికి కూడా అమితమైన ఇష్టం.2000 ఏడాది మోడల్‌కు చెందిన బొలెరో విలువ ప్రస్తుతం మార్కెట్ ప్రకారం రూ. 80,000 లుగా ఉంటుంది.

06. టెంపో ట్రావెలర్

రాజకీయ ప్రచారం కోసం నాయకులు ఎక్కువగా ఇలాంటి వాహనాలను ఎంచుకుంటారు. జయ గారు కూడా దీనిని అందుకోసమే ఎంపికచేసుకున్నారు. 2,000 ఏడాదిలో కొనుగోలు చేసిన దీని విలువ ప్రస్తుతం మార్కెట్ ప్రకారం రూ. 80,000 లుగా ఉంది.

07. మహీంద్రా జీపు

మహీంద్రా అండ్ మహీంద్రా ఇండియన్ మార్కెట్లోకి విడుదల చేసిన జీపును కస్టమర్లు పెద్దగా ఎంచుకోలేదు. అయితే జయ గారు 2001 మోడల్‌కు చెందిన మహీంద్రీ జీపును ఎంచుకున్నారు. ప్రస్తుత మార్కెట్ ప్రకారం దీని విలువ రూ. 10,000 లుగా ఉంది.

08. టయోటా ప్రాడో

జయలలిత గారి వాహన శ్రేణిలో రెండు టయోటా ప్రాడో లగ్జరీ ఎస్‌యువిలు ఉన్నాయి. 2010 మోడల్‌కు చెందిన వీటి ఒక్కొక్కొటి విలువ రూ. 20 లక్షలుగా ఉంది.

ప్రస్తుతం....

వీటితో పాటు తాజాగ తమిళనాడు నూతన ముఖ్యమంత్రిగా ఎన్నికైన తరువాత మళ్లీ నాలుగు టయోటా ఎస్‌యువిలను కొనుగోలు చేశారు.

ప్రత్యేకతలు

జయలలిత గారు చివరిగా వినియోగించిన వాహనం పూర్తిగా బుల్లెట్ ఫ్రూఫ్ బాడీని కలిగి ఉంది. ప్రమాద సమయంలో ప్రాణాలు దక్కించుకునేందుకు సుమారుగా 10 లైఫ్ సేవింగ్ ఎయిర్ బ్యాగులు ఉన్నాయి. మరియు నాలుగు జోన్ల ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ వ్యవస్థ కలదు.

శక్తివంతమైన ఎస్‌యువి

ఇందులో 4.5-లీటర్ సామర్థ్యం గల వి-8 డీజల్ ఇంజన్ కలదు. దీనికి 6-స్పీడ్ ట్రాన్స్‌మిషన్ గల గేర్‌బాక్స్ అనుసంధానం చేయబడింది. ఇది లీటర్‌కిు 5 కిలోమీటర్ల మైలేజ్ ఇవ్వగలదు. ఇందులోని డీజల్ ఇంధన ట్యాంక్ గరిష్ట స్టోరేజి సామర్థ్యం 93 లీటర్లుగా ఉంది.

 

Click to compare, buy, and renew Car Insurance online

Buy InsuranceBuy Now

Story first published: Tuesday, December 6, 2016, 12:21 [IST]
English summary
Tamilnadu Cm Jayalalithas Car Collection
Please Wait while comments are loading...

Latest Photos