Thought for the day
Your page will load in ...
Close Ad X
Advertisement
English हिन्दी ಕನ್ನಡ മലയാളം தமிழ்
 
Share This Story

జార్ఖండ్ పోలీసులకు టాటా మైన్ ప్రొటెక్టెడ్ వెహికల్స్

Posted by:
Updated: Tuesday, August 7, 2012, 18:07 [IST]

Tata Motors Delivers 5 Mpvs The Jharkhand Police Force

దేశీయ ఆటో దిగ్గజం టాటా మోటార్స్ భద్రతా సిబ్బంది కోసం తయారు చేసిన అధునాతన టాటా మైన్ ప్రొటెక్ట్ వాహనాలను జార్ఖండ్ పోలీస్ ఫోర్స్‌కు డెలివరీ చేసింది. ల్యాండ్ మైన్స్ పేలుళ్లను సైతం తట్టుకునేలా సమర్థవంతమైన, శక్తివంతమైన వాహనాలను టాటా మోటార్స్ తయారు చేసింది. ఇలాంటివి మొత్తం ఐదు మైన్ ప్రొటెక్టెడ్ వాహనాలను టాటా మోటార్స్ జార్ఖండ్ పోలీసులకు డెలివరీ చేసింది.

ఈ సందర్భంగా టాటా మోటార్స్ విపి-డిఫెన్స్, గవర్నమెంట్ బిజినెస్ వెర్నాన్ నోరోన్హా మాట్లాడుతూ.. దేశంలోని పోలీసు బలగాలు, ప్యారామిలటరీ బలగాలు ఉపయోగించే సాయుధ వాహనాలను తయారు చేయటం టాటా మోటార్స్ డిఫెన్స్ విభాగం పూర్తిస్థాయి ఉత్పత్తులను కలిగి ఉందని, తమ ఎమ్‌పివి (మైన్ ప్రొటెక్టెడ్ వెహికల్) ఈఐడి (ఇంప్రూవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైజ్)లు, యాంటీ-పర్సనల్ మైన్స్ వంటి పేలుడు పదార్థాల నుంచి సైతం జార్ఖండ్ పోలీసుకు రక్షణ కల్పిస్తుందని ఆయన చెప్పారు.

కాగా.. మహారాష్ట్ర సర్కారు నుంచి కూడా టాటా మోటార్స్‌కు మరొక ఆర్డర్‌ను సొంతం చేసుకుంది. ఈ ఆర్డర్‌లో భాగంగా, మహారాష్ట్ర పోలీసులకు టాటా మోటార్స్ 32 ఎమ్‌పివి (మైన్ ప్రొటెక్టెడ్ వాహనా)లను సరఫరా చేయాల్సి ఉంటుంది. ఊ టాటా ఎమ్‌పివిని మాడ్యూలర్ ఫ్లెక్సిబిలిటీ, వి-షేప్డ్ హల్ బ్లాస్ట్ ప్రొటెక్షన్ టెక్నాలజీలను ఉపయోగించి తయారు చేశారు. సెక్యూరిటీ ఆపరేషన్స్ కోసం వీటిని ఉపయోగిస్తారు. భీకర కాల్పులు, పేలుళ్లు వంటి సంఘటనల నుంచి ఇందులో ఉండే ప్రయాణికులను ఈ ఎమ్‌పివి రక్షిస్తుంది.

Story first published:  Tuesday, August 7, 2012, 13:16 [IST]
English summary
Tata Motors has delivered 5 Mine Protected Vehicles (MPV) to the Jharkhand Police force, to bolster security preparedness. For Tata Motors, this order comes close on the heels of another prestigious order already received from the Maharashtra State Police to supply 32 MPV’s, which the company has executed.
మీ వ్యాఖ్య రాయండి
Click here to type in Telugu