టాటా-సింగం రిటర్న్స్ టీమ్ నుంచి ముంబై పోలీసులకు 2 సుమోలు

By Ravi

ప్రముఖ బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్ నటించిన సింగం రిటర్న్ చిత్రంలో మన హీరో ఓ టాటా సఫారీని ఉపయోగించిన సంగతి తెలిసినదే. టాటా మోటార్స్, సింగం రిటర్న్ చిత్ర నిర్మాతల మధ్య కుదిరిన ఒప్పందం మేరకు ఈ చిత్రంలో టాటా సుమో, సఫారీ స్టోర్మ్, ఆరియా, సుమో గ్రాండే, జెనాన్, నానో వంటి కార్లను ఉపయోగించారు.

ఇటీవలే విడుదలైన సింగం రిటర్న్స్ చిత్రం భారీ విజయాన్ని సాధించిన నేపథ్యంలో, ఈ విజయాన్ని పురస్కరించుకొని టాటా మోటార్స్ మరియు సింగం రిటర్న్స్ బృందాలు రెండు టాటా సుమో గోల్డ్ ఎస్‌యూవీలను ముంబై పోలీసులకు కానుకగా ఇచ్చారు.

ముంబై పోలీస్ కమీషనర్ రాకేష్ మరీనా, మహారాష్ట్ర స్టేట్ హోమ్ మినిస్టర్ ఆర్.ఆర్. పాటిల్, బాలీవుడ్ సూపర్‌స్టార్ అజయ్ దేవగన్, సింగం రిటర్న్స్ చిత్ర దర్శకుడు రోహిత్ శెట్టి తదితరులు ఈ కార్యక్రమాన్ని హాజరయ్యారు. అజయ్ దేవగన్, రోహిత్ శెట్టిలు టాటా సుమో గోల్డ్ తాళం చెవులను పోలీసులకు అందజేశారు.

Sumo Gold

టాటా సుమో గోల్డ్ విషయానికి వస్తే.. ఇందులో పవర్‌ఫుల్ 3 లీటర్, సిఆర్4 ఇంజన్ 3000 ఆర్‌పిఎమ్ వద్ద 85 పిఎస్‌ల గరిష్ట శక్తిని మరియు 1000-2000 ఆర్‌పిఎమ్ వద్ద 250 ఎన్ఎమ్‌ల గరిష్ట టార్క్‌ను ఉత్ప్తతి చేస్తుంది. ఈ సెగ్మెంట్లో కెల్లా తొలిసారిగా ఇందులో డ్యూయెల్ ఏసి కూలింగ్, బ్లూటూత్/యూఎస్‌బి కనెక్టివిటీ ఫీచర్లను ఆఫర్ చేస్తున్నారు. 5 మీటర్ల టర్నింగ్ రేడియస్, 15.3 కిలోమీటర్ల మైలేజ్ వంటి ఫీచర్లు ఈ టాటా సుమో గోల్డ్ సొంతం.

గ్రామీణ, పట్టణ మార్కెట్ల కోసం ఇందులో డై టర్బో బిఎస్3 ఇంజన్‌ను కూడా జోడించారు. ఈ 2956సీసీ ఇంజన్ 3000 ఆర్‌పిఎమ్ వద్ద 70 పిఎస్‌ల గరిష్ట శక్తిని మరియు 1600-2000 ఆర్‌పిఎమ్ వద్ద 223 ఎన్ఎమ్‌ల గరిష్ట టార్క్‌ను ఉత్ప్తతి చేస్తుంది. ఇందులో స్పోర్టీ గేర్ నాబ్, డబుల్ విష్‌బోన సస్పెన్షన్, స్టయిలిష్ ఉడెన్ సెంటర్ కన్సోల్ మరియు డ్యాష్‌బోర్డ్, ప్లష్ ఫ్యాబ్రిక్, విశాలమైన ఇంటీరియర్స్, ఉత్తమ హెడ్, లెగ్ మరియు షోల్డర్ స్పేస్, వన్ టచ్ పవర్ విండోస్, ఇంజన్ ఇమ్మొబిలైజర్, ఫుల్లీ ఫీచర్డ్ ఇన్‌స్ట్రుమెంట్ ప్యానెల్ వంటి ఫీచర్లున్నాయి.

Most Read Articles

English summary
Tata Motors and Singham Returns superstar Ajay Devgn, along with producer Rohit Shetty, presented two Tata Sumo Gold Utility Vehicles to the Mumbai Police. 
Story first published: Thursday, August 28, 2014, 17:56 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X