తెలంగాణా సెపరేట్: వాహనాలకు కొత్త రిజిస్ట్రేషన్ నెంబర్స్

By Ravi

ప్రస్తుత ఆంధ్రప్రదేశ్‌ను రెండుగా చీల్చి తెలంగాణా పేరుతో, పది జిల్లాలలో కూడిన కొత్త రాష్ట్రాన్ని ఏర్పాటు చేసేందుకు కాంగ్రెస్ సర్కారు సిగ్నల్ ప్రకటించిన సంగతి తెలిసినదే. ఈ నేపథ్యంలో, మారుతున్న రాష్ట్రాలతో పాటే ఆయా రాష్ట్రాల్లో అనేక మార్పులు కూడా చోటు చేసుకోనున్నాయి. ఈ మార్పుల్లో ఆటోమోటివ్ రంగానికి సంబంధించి ప్రధానంగా, వాహనాల రిజిస్ట్రేషన్ నెంబర్లు మారే అవకాశం ఉంది.

ఆంధ్రప్రదేశ్ (సీమాంద్ర)లోని వాహనాల రిజిస్ట్రేషన్లు AP సిరీస్‌తోనే ఉంటాయి. అయితే, తెలంగాణా రాష్ట్రంలోని వాహనాల రిజిస్ట్రేషన్ నెంబర్లు కొత్త సిరీస్‌ (బహుశా TG)తో ప్రారంభమయ్యే ఆస్కారం ఉంటుంది. మోటార్ వాహన చట్టం ప్రకారం ఈ నిబంధన పాటించడం తప్పనిసరి. అయితే, ప్రత్యేకించి తెలంగాణా రాష్ట్రంలోని పది జిల్లాలలో ఉండే వాహనాల రిజిస్ట్రేషన్ నెంబరులో కేవలం రాష్ట్ర కోడ్ (స్టేట్ కోడ్)ను మాత్రమే మార్చి, మిగిలిన నెంబరును యధావిధిగా ఉంచే అవకాశం అధికారులకు ఉంది.

దీన్నిబట్టి చూస్తే, తెలంగాణా రాష్ట్రం పూర్తిగా ఏర్పడిన తర్వాత, ఆ రాష్ట్రంలోని పది జిల్లలాలో ఉండే వారు ఉపయోగించే అన్ని రకాల వాహనాల రిజిస్ట్రేషన్ కాపీని మార్చుకోవాల్సిన అవశ్యకత ఏర్పడుతుంది. ఈ మార్పు కేవలం నెంబరు ప్లేటుపై మాత్రమే కాకుండా, ఒరిజినల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లలోనూ చేయాల్సి ఉంటుంది, కాబట్టి అన్ని వాహనాలుకు ఆర్‌సి కాపీలను రీఇష్యూ చేయాలి రావచ్చు.

Vehicle Number Plate

కేవలం వాహనల రిజిస్ట్రేషన్ మార్పులే కాకుండా అనేక ఇతర మార్పులు కూడా ఇరు రాష్ట్రాలలో చోటు చేసుకునే ఆస్కారం ఉంది. ఇందులో ముఖ్యంగా.. తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ పూర్తయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ పేరుతో ఉన్న ప్రభుత్వ కార్యలయాల సైన్‌బోర్డులను తెలంగాణా పేరుపై మార్చాలి. ఇరు రాష్ట్రాలకు రోమింగ్ ఛార్జీలు వర్తించే అవకాశం ఉంది. రాష్ట్రాల లోగోలు మారాలి. స్టేషనరీలో మార్పులు, రాష్ట్ర పక్షి, రాష్ట్ర జంతువు, రాష్ట్ర గీతం ఇలా అనేక మార్పులు జరగాలి.

ఈ విషయాల్లో ఆంధ్రప్రదేశ్‌లో పెద్దగా మార్పులు జరగకపోవచ్చు. కానీ తెలంగాణా రాష్ట్రం మాత్రం వీటిన్నింటినీ మొదటి నుంచి ప్రారంభించాలి. ఇవన్నీ జరగాలంటే సుమారు ఏడాది వరకు సమయం పట్టొచ్చని అంచనా.
వయా: హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్

Most Read Articles

English summary
With New Delhi announcing the formation of a new state, officials and denizens in new Telangana state will have to cope with several changes. To begin with, the licence plate of every vehicle registered in Telangana region will have to reflect the change (comprising two letters from the name of the state) under the Motor Vehicles Act.
Story first published: Thursday, August 1, 2013, 10:43 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X