ప్రపంచంలో కెల్లా 10 అతిపెద్ద షిప్పింగ్ కంపెనీలు

రవాణ రంగంలో ఓడలు అత్యంత కీలక పాత్రను పోషిస్తాయి. అత్యధిక సామాగ్రిని ఒకదేశం నుంచి మరొక దేశానికి చేరవేయటంతో ఈ ఓడలు ఎంతగానో సహకరిస్తుంటాయి. షిప్పింగ్ ఇండస్ట్రీ ఒక మల్టీ బిలియన్ డాలర్ బిజినెస్. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు షిప్పింగ్ ఇండస్ట్రీ వెన్నెముక లాంటిది. ప్రపంచ వ్యాపారంలో దీని వాటా దాదాపు 90 శాతం.

ఇది కూడా చదవండి: 'టైటానిక్ 2' లగ్జరీ షిప్: ఫొటోలు, వివరాలు

ఏ ఇతర రవాణా మార్గం ద్వారా సాధ్యం కాని రీతిలో ఓడలు సరుకు రవాణా చేస్తుంటాయి. ఇలాంటి ఓడలను నిర్వహించడం అంటే కూడా మాటలు కాదు, అది ఎంతో వ్యవప్రయాసలతో కూడినది. ఈనాటి మన ఆఫ్ బీట్ కథనంలో టిఈయూ (ట్వెంటీ ఫూట్ ఈక్వలెంట్ యూనిట్) లేదా ఆ షిప్పులు మోయగలిగే సామర్థ్యాన్ని ఆధారంగా చేసుకొని ప్రపంచంలో కెల్లా 10 అత్యుత్తమ షిప్పింగ్ కంపెనీల గురించి తెలుసుకుందాం రండి.

టిఈయూ అంటే..
ఉదారహణకు, ఏదైనా షిప్పింగ్ కంపెనీ తమ సామర్థ్యం 5,00,000 టిఈయూలని చెబితే, ఆ ఓడపై 5,00,000 భారీ కంటైనర్లను మోసుకెళ్లొచ్చన్నమాట. ఒక టిఈయూ (కంటైనర్) అంటే 20 అడుగుల పొడవు, 8 అడుగుల వెడల్పు, 9 అడుగులు ఎత్తు ఉన్న కంటైనర్ అని అర్థం.

టాప్ 10 షిప్పింగ్ కంపెనీలు

తర్వాతి స్లైడ్‌లలో టాప్ 10 షిప్పింగ్ కంపెనీలకు సంబంధించిన సమాచారాన్ని తెలుసుకోండి.

Picture credit: Cseeman via Flickr

10. ఎమ్ఓఎల్

10. ఎమ్ఓఎల్

ఎమ్ఓఎల్ (మిత్సుయ్ ఓ.ఎస్.కె. లైన్స్ లిమిటెడ్) ప్రపంచంలో కెల్లా 10వ అతిపెద్ద షిప్పింగ్ కంపెనీ. జపాన్‌కు చెందిన ఈ కంపెనీ ప్రధాన కార్యాలయం టోక్యోలో ఉంది. ఇది ప్రధానంగా అంతర్జాతీయ షిప్పింగ్ వ్యాపారం చేస్తుంది. 1886లో స్థాపించిన ఈ కంపెనీ సామర్థ్యం 5,07,988 టిఈయూలు. ఈ కంపెనీ కోస్టల్ లైనర్స్, క్రూయిజ్ షిప్స్, ఫెర్రీస్ వ్యాపారంలో కూడా ఉంది.

Picture credit: Scotthessphoto via Flickr

9. సిఎస్‌సిఎల్

9. సిఎస్‌సిఎల్

సిఎస్‌సిఎల్ (చైనా షిప్పింగ్ కంటైనర్ లైన్స్) ప్రపంచంలో కెల్లా 9వ అతిపెద్ద షిప్పింగ్ కంపెనీ. చైనాలోని షాంగైకి చెందిన ఈ కంపెనీని 1997లో స్థాపించారు. దీని సామర్థ్యం 5,65,567 టిఈయూలు. ఆసియా, ఆస్ట్రేలియా, యూరప్, మెడిటెర్రానియన్, నార్త్ అమెరికా, సౌత్ అమెరికా, పర్షియన్ గల్ఫ్, సౌత్ ఆఫ్రికా దేశాల్లో ఈ కంపెనీ కార్యకలాపాలు కొనసాగిస్తోంది.

Picture credit: Cseeman via Flickr

8. హాంజిన్ షిప్పింగ్ కంపెనీ

8. హాంజిన్ షిప్పింగ్ కంపెనీ

కొరియాకు చెందిన ఈ కంపెనీ ప్రపంచంలో కెల్లా 8వ అతిపెద్ద షిప్పింగ్ కంపెనీ. 1977లో స్థాపించిన ఈ కంపెనీ సామర్థ్యం 5,79,840 టిఈయూలు. ఈ కంపెనీ సాలీనా 100 మిలియన్ టన్నుల సరుకును రవాణా చేస్తుంది.

Picture credit: Wirralwater via Flickr

7. ఏపిఎల్

7. ఏపిఎల్

ఇక ఈ జాబితాలో 7వ స్థానంలో ఉన్న కంపెనీ ఏపిఎల్ (అమెరికన్ ప్రెసిడెంట్ లైన్స్). 1848లో స్థాపించబడిన ఈ కంపెనీ వారానికి 80కి పైగా సర్వీసులను అందిస్తుంది. సింగ్‌పూర్ హెడ్‌క్వార్టర్స్‌గా పనిచేసే ఈ కంపెనీ సామర్థ్యం 5,89,924 టిఈయూలు.

Picture credit: Buonasera via Wikimedia Commons

6. హపాగ్-లాయడ్

6. హపాగ్-లాయడ్

ప్రపంచంలో కెల్లా 6వ అతిపెద్ద షిప్పింగ్ కంపెనీ హపాగ్-లాయడ్. జర్మనీకి చెందిన ఈ షిప్పింగ్ కంపెనీని 1970లో స్థాపించారు. 19వ శతాబ్ధానికి చెందిన రెండు కంపెనీల విలీనమే ఈ హపాగ్-లాయడ్. జర్మనీలోని హాంబర్గ్ ప్రధాన కార్యాలయంగా పనిచేస్తున్న ఈ షిప్పింగ్ కంపెనీ సామర్థ్యం 6,32,348 టిఈయూలు

Picture credit: Henry M. Trotter via Wikimedia Commons

5. సిఓఎస్‌సిఓ (కాస్కో)

5. సిఓఎస్‌సిఓ (కాస్కో)

ఈ జాబితాలో 5వ స్థానంలో ఉన్నది చైనాకి చెందిన చైనా ఓషన్ షిప్పింగ్ (గ్రూప్) కంపెనీ (కాస్కో). బీజింగ్ ప్రధాన కార్యాలయంగా పనిచేస్తున్న ఈ కంపెనీ సామర్థ్యం 7,15,266 టిఈయూలు. చైనాలో అలాగే ప్రపంచంలో కెల్లా అతిపెద్ద డ్రై బల్క్ క్యారీయర్లలో ఈ కంపెనీ ఒకటి. దీనిని 1961లో స్థాపించారు.

Picture credit: Roman Boed via Wikimedia Commons

4. ఎవర్‌గ్రీన్ లైన్

4. ఎవర్‌గ్రీన్ లైన్

తైవాన్ హెడ్‌క్వార్టర్స్‌గా పనిచేస్తున్న ఎవర్‌గ్రీన్ లైన్ కంపెనీ 1968లో స్థాపించారు. ఈ సంస్థ ప్రపంచంలోని 80 దేశాల్లోని 240 పోర్టులకు సేవలు అందిస్తుంది. ఇది ప్రపంచంలో కెల్లా 4వ అతిపెద్ద షిప్పింగ్ కంపెనీ. దీని సామర్థ్యం 7,20,893 టిఈయూలు.

Picture credit: Evergreen via Maritime

3. సిఎమ్ఐ సిజిఎమ్

3. సిఎమ్ఐ సిజిఎమ్

ప్రపంచంలో కెల్లా మూడవ అతిపెద్ద షిప్పింగ్ కంపెనీ సిఎమ్ సిజిఎమ్. ఫ్రాన్స్‌లోని మార్సీల్లే ప్రధాన కార్యాలయంగా పనిచేస్తున్న ఈ షిప్పింగ్ కంపెనీ 150కి పైగా దేశాల్లో 400 పోర్టులకు సేవలు అందిస్తోంది. ఈ కంపెనీ 1978లో స్థాపించారు. దీని సామర్థ్యం 13,98,216 టిఈయూలు.

Picture credit: CMA CGM Group

2. మెడిటెర్రానియన్ షిప్పింగ్ కంపెనీ

2. మెడిటెర్రానియన్ షిప్పింగ్ కంపెనీ

ప్రపంచంలో కెల్లా రెండవ అతిపెద్ద షిప్పింగ్ కంపెనీ మెడిటెర్రానియన్ షిప్పింగ్ కంపెనీ. స్విట్జర్లాండ్, జెనీవాలో హెడ్‌క్వార్టర్స్ కలిగిన ఈ షిప్పింగ్ కంపెనీని 1970లో స్థాపించారు. ఇది ప్రపంచంలోని దాదాపు అన్ని ప్రధాన పోర్టులకు సేవలు అందిస్తోంది. దీని సామర్థ్యం 22,45,342 టిఈయూలు.

Picture credit: MSC by Havenfoto

1. మార్స్క్

1. మార్స్క్

ప్రపంచంలో కెల్లా అతిపెద్ద షిప్పింగ్ కంపెనీ ఏ.పి. మోల్లర్-మార్స్క్ గ్రూప్‌కి చెందినది. దీనిని 1904లో డెన్మార్క్‌లోని కోపెన్‌హ్యాగెన్‌లో స్థాపించారు. ఈ కంపెనీ 1996లో ప్రపంచంలో కెల్లా అతిపెద్ద కంపెనీగా అవతరించింది. ప్రపంచంలో కెల్లా అతిపెద్ద కంటైనర్ షిప్ ఎమ్మా మార్స్క్‌ను ఈ షిప్పింగ్ కంపెనీ కలిగి ఉంది. దీని సామర్థ్యం 25,89,905 టిఈయూలు.

Picture credit: Maersk by Havenfoto

ఎయిర్‌ల్యాండర్

ఎయిర్‌ల్యాండర్

ఇది కూడా చదవండి: ప్రపంచంలో కెల్లా అతిపెద్ద ఎయిర్ షిప్ 'ఎయిర్‌ల్యాండర్'

Most Read Articles

English summary
The shipping industry is a huge, multi-billion dollar business. This industry is the lifeblood of the world's economy. It accounts to 90% of the world's trade. Ships can carry goods in quantities that are impossible by any other mode of transport.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X