ప్రపంచంలో అత్యధిక స్థాయిలో ప్రాణ నష్టం కలిగించే పది బాలిస్టిక్ క్షిపణులు

By Anil

ప్రపంచాన్ని ఉక్కిరిబిక్కిరి చేసిన మొదటి మరియు రెండవ ప్రపంచ యుద్దాల తరువాత ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో దేశాలు తమ ఆత్మరక్షణ కోసం భయంకరమైన ఆయుధాలను సమకూర్చుకోవడం ప్రారంభించాయి. కొన్ని దేశాలను సమూలంగా తుడిచిపెట్టే సామర్థ్యం ఉన్న ఆయుధాలను రూపొందించుకుంటున్నాయి.

యుద్ధ క్షేత్రాలలో అత్యంత శక్తివంతమైన ఆయుధాలలో బాలిస్టిక్ మిస్సైల్ ఒకటి. ఇలాంటి వాటిని వివిధ దేశాలు తమదైన శైలిలో శక్తివంతంగా అభివృద్ది చేసుకుంటున్నాయి. అందులో ప్రపంచ వ్యాప్తంగా అత్యంత శక్తివంతమైన బాలిస్టిక్ మిస్సైల్స్‌లలో పదింటి గురించి క్రింది కథనంలో.....

10. ఆర్ఎస్‌ఎమ్-56 - రష్యా

10. ఆర్ఎస్‌ఎమ్-56 - రష్యా

దీనిని బల్వా లేదా ఆఎర్‌ఎస్ఎమ్-56 అని పిలుస్తారు, రష్యా నేవీలో సబ్ మెరైన్‌ల నుండి ప్రయోగించే ఖండాతర బాలిస్టిక్ మిస్సైల్ ఇది. దీని రేంజ్ సుమారుగా 10,000 కిలోమీటర్లుగా ఉంది.

సాంకేతిక వివరాలు:

  • బరువు: 36.8 టన్నులు
  • చుట్టు కొలత: 2 మీటర్లు
  • ఇంజన్: మూడు స్టేజిల సాలిడ్ ఫ్యూయల్ రాకెట్
  • ఆపరేషనల్ రేంజ్: 8,000-8,300 కిమీలు
  • వేగం: మ్యాక్25
  • తయారీదారులు: మోస్కో ఇన్‌స్ట్యూట్ ఆఫ్ థర్మల్ టెక్నాలజీ
  •  09. ఎమ్51-ఎస్ఎల్‍‌బిఎమ్ - ఫ్రాన్స్

    09. ఎమ్51-ఎస్ఎల్‍‌బిఎమ్ - ఫ్రాన్స్

    ఎమ్‌51-ఎస్ఎల్‌బిఎమ్ అనే సబ్ మెరైన్ ఆధారంగా ప్రయోగించే బాలిస్టిక్ మిస్సైల్‌ను ఆస్ట్రియమ్ వారు తయారు చేశారు. ప్రస్తుతం దీనిని ఫ్రెంచ్ నేవీ వినియోగిస్తోంది.

    సాంకేతిక వివరాలు

    • బరువు: 52,000 కిలోలు
    • చుట్టు కొలత: 2.3 మీటర్లు
    • ఇంజన్: మూడు స్టేజిల సాలిడ్ ఫ్యూయల్ రాకెట్
    • ఆపరేషనల్ రేంజ్: 8,000-10,000 కిమీలు
    • వేగం: మ్యాక్25
    • తయారీదారులు: ఇఎ‌డిఎస్ ఆస్ట్రియమ్ స్పేస్ ట్రాన్స్‌పోర్టేషన్

      Picture credit: IceUnshattered/Wiki Commons

    • 08. డిఎఫ్ 31/31ఎ - ఐసిబిఎమ్ - చైనా

      08. డిఎఫ్ 31/31ఎ - ఐసిబిఎమ్ - చైనా

      డాంగ్ ఫెంగ్ అనే పేరుతో పిలువబడే డిఎఫ్ 31/31 ఎ అనే రహదారి ఆధారిత ఖండాతర బాలిస్టిక్ మూడు స్టేజిల సాలిడ్ ఫ్యూయల్ రాకెట్ మిస్సైల్ ను పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా వారు అభివృద్ది చేసారు.

      సాంకేతిక వివరాలు:

      • బరువు: 42 టన్నులు
      • పొడవు: 13 మీటర్లు
      • చుట్టు కొలత: 2.25 మీటర్లు
      • ఇంజన్: మూడు స్టేజిల సాలిడ్ ఫ్యూయల్ రాకెట్
      • ఆపరేషనల్ రేంజ్: 7,200-8,000 కిమీలు(డిఎఫ్-31) మరియు 11,200 కిమీలు(డిఎఫ్-21ఎ)
      • తయారీదారులు: అకడమీ ఆఫ్ రాకెట్ మోటార్స్ టెక్నలజీ
      • Picture credit: IceUnshattered/Wiki Commons

         07. ఆర్‌టి-2యుటిటికెహెచ్ టోపోల్-ఎమ్ - రష్యా

        07. ఆర్‌టి-2యుటిటికెహెచ్ టోపోల్-ఎమ్ - రష్యా

        రష్యాలో సోవియన్ యూనియన్ ప్రభావం కోల్పోయిన తరువాత రష్యా అభివృద్ది చేసిన మొదటి ఖండాతర బాలిస్టిక్ క్షిపణి ఈ ఆర్‌టి-2యుటిటికెహెచ్. దీనిని రష్యా (ఆర్ఎస్-24() అభివృద్ది చేశారు.

        సాంకేతిక వివరాలు:

        • బరువు: 47,200 కిలోలు
        • పొడవు: 22.7 మీటర్లు
        • చుట్టు కొలత: 1.9 మీటర్లు
        • ఇంజన్: మూడు స్టేజిల సాలిడ్ ఫ్యూయల్ రాకెట్
        • ఆపరేషనల్ రేంజ్: 11,000 కిమీలు
        • వేగం: గంటకు 26,400 కిలోమీటర్లు
        • తయారీదారులు: వాట్కింస్క్ మెషీన్ బిల్డింగ్ ప్లాంట్
        • Picture credit: Vitaliy Ragulin/Wiki Commons

          06.ఆర్ఎస్-24 యార్స్ - రష్యా

          06.ఆర్ఎస్-24 యార్స్ - రష్యా

          ఈ ఆర్ఎస్-24 యార్స్ ను ఆర్‌టి-24 యార్స్ అని కూడా పిలుస్తారు. ఇందులో థర్మో న్యూక్లియర్ ఆధులాను కూడా అమర్చారు. మొదటి సారిగా ఈ ఖండాతర మిస్సైల్‌ను మే 29, 2007 న పరీక్షించారు. ప్రస్తుతం ఉన్న టోపోల్-ఎమ్ కన్నా మరింత శక్తివంతమైనది ఈ మిస్సైల్.

          సాంకేతిక వివరాలు:

          • బరువు: 40,000 కిలోలు
          • చుట్టు కొలత: 12 మీటర్లు
          • ఇంజన్: సాలిడ్
          • ఆపరేషనల్ రేంజ్: 11,000 కిమీలు
          • వేగం: గంటకు 24,500 కిలోమీటర్లు
          • తయారీదారులు: వాట్కింస్క్ మెషీన్ బిల్డింగ్ ప్లాంట్

            Picture credit: Соколрус/Wiki Commons

          •  05. ఎల్‌జిఎమ్-30జి మినిట్‌మ్యాన్ III - అమెరికా

            05. ఎల్‌జిఎమ్-30జి మినిట్‌మ్యాన్ III - అమెరికా

            ఎల్‌జిఎమ్-30 మినిట్‌మ్యాన్ మిస్సైల్ అమెరికా యొక్క భూతల ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి ఇది. ప్రస్తుతం ఎయిర్ ఫోర్స్ గ్లోబల్ స్ట్రైక్ కమాండ్ వారి ఆధ్వర్యంలో వినియోగంలో ఉంది.

            సాంకేతిక వివరాలు

            • బరువు: 36,030 కిలోలు
            • చుట్టు కొలత: 1.67 మీటర్లు
            • ఇంజన్: మూడు స్టేజిల సాలిడ్ ఫ్యూయల్ రాకెట్
            • ఆపరేషనల్ రేంజ్: 6000 కన్నా ఎక్కువ మైళ్లు
            • వేగం: గంటకు 24,000 కిలోమీటర్లు
            • తయారీదారులు: బోయింగ్
            • Picture credit: marvellouswings
               04. ఆర్-29 ఆర్ఎమ్‌యు సినేవా (ఆర్ఎస్‌ఎమ్-54) - రష్యా

              04. ఆర్-29 ఆర్ఎమ్‌యు సినేవా (ఆర్ఎస్‌ఎమ్-54) - రష్యా

              ఆర్-29 ఆర్ఎమ్‌యు సినేవా ను ఆర్ఎస్‌ఎమ్-54 అని కూడా పిలుస్తారు. ఇది రష్యా యొక్క మూడవ తరానికి చెందిన ఖండాంతర బాలిస్టిక్ మిస్సైల్. రష్యా నేవీలో దీనిని డెల్టా IV తరగతికి చెందిన సబ్‌మెరైన్‌లు మోసుకెళతాయి.

              సాంకేతిక వివరాలు:

              • బరువు: 40 టన్నులు
              • పొడవు: 15 మీటర్లు
              • చుట్టు కొలత: 1.9 మీటర్లు
              • ఇంజన్: మూడు స్టేజిల లిక్విడ్ ప్రొపెల్లంట్
              • ఆపరేషనల్ రేంజ్: 11,547 కిమీలు
              • తయారీదారులు: Krasnoyarsk Machine-Building Plant
              • Picture credit: The Richest
                 03. యుజిఎమ్-133ఎ ట్రైడెంట్ II- (అమెరికా/ఇంగ్లాండ్)

                03. యుజిఎమ్-133ఎ ట్రైడెంట్ II- (అమెరికా/ఇంగ్లాండ్)

                సబ్ మెరైన్ ఆధారంగా ప్రయోగించే ఈ యుజిఎమ్-133ఎ ట్రైడెంట్ II ఖండాంతర బాలిస్టిక్ మిస్సైల్‌ను ట్రైడెంట్ డి5 అని కూడా అంటారు. దీనిని సన్నీవేల్‌లోని లాక్ హీడ్ మార్టిన్ స్పేస్ సిస్టమ్స్ అభివృద్ది చేసింది. అమెరికా మరియు రాయల్ నేవీ దీనిని వినియోగిస్తున్నాయి.

                సాంకేతిక వివరాలు:

                • బరువు: 59,000 కిలోలు
                • పొడవు: 13.57 మీటర్లు
                • చుట్టు కొలత: 2.11 మీటర్లు
                • ఇంజన్: మూడు స్టేజిల సాలిడ్ ఫ్యూయల్ రాకెట్
                • ఆపరేషనల్ రేంజ్: 7,840 నుండి 11,300 కిమీలు
                • వేగం: గంటకు 29,020 కిలోమీటర్లు
                • తయారీదారులు: లాక్ హీడ్ మార్టిన్ స్పేస్ సిస్టమ్స్
                • Picture credit: Wiki Commons
                   02. డిఎఫ్-41, డాంగ్ ఫెంగ్-41 - చైనా

                  02. డిఎఫ్-41, డాంగ్ ఫెంగ్-41 - చైనా

                  రేంజ్ పరంగా డిఎఫ్-41 శ్రేణి ప్రపంచంలోనే అత్యంత ఉత్తమమైనది. అమెరికా వారి మినిట్ మ్యాన్ రేంజ్ 13,000 కిమీల కన్నాఇంకా ఎక్కువగా ఉంది.

                  సాంకేతిక వివరాలు:

                  • బరువు: 80,000 కిలోలు
                  • పొడవు: 21 మీటర్లు
                  • చుట్టు కొలత: 2.25 మీటర్లు
                  • ఇంజన్: మూడు స్టేజిల సాలిడ్ ఫ్యూయల్ రాకెట్
                  • ఆపరేషనల్ రేంజ్: 12,000 నుండి 15,000 కిమీలు
                  • వేగం: మ్యాక్25
                  • తయారీదారులు: చైనా అకాడమీ ఆఫ్ లాంచ్ వెహికల్ టెక్నాలజీ
                  • Picture credit: Anton Denisov / Sputnik
                     01. ఆర్-36ఎమ్ - రష్యా

                    01. ఆర్-36ఎమ్ - రష్యా

                    ఆర్-36ఎమ్ లేదా ఎస్ఎస్-18 సతన్ మిస్సైల్ ప్రపంచ వ్యాప్తంగా అత్యంత శక్తివంతమైన మరియు అధిక రేంజ్ గల మిస్సైల్ ఇది. ఈ ఖండాంతర బాలిస్టిక్ మిస్సైల్ రేంజ్ గరిష్టంగా 16,000 కిలోమీటర్లుగా ఉంది. 8.8 టన్నుల బరువున్న ఇందులో రెండు స్టేజిలున్న లిక్విడ్ రాకెట్ ఇంజన్‌ కలదు. దీని గరిష్ట వేగం సెకనుకు 7.9 కిలోమీటర్లుగా ఉంది. దీని పొడవు 32.2 మీటర్లు మరియు 3.05 మీటర్లు చుట్టు కొలతతో ఉంది.

                    Picture credit: Wiki Commons

                    ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఈ మిస్సైల్స్ శక్తితో మొత్తం భూ గోళాన్నే నాశనం చేయవచ్చు. అంతటి మోతాదులో ప్రపంచ దేశాలు ఈ మిస్సైల్స్‌ను కలిగి ఉన్నాయి.

                    అత్యధిక స్థాయిలో ప్రాణ నష్టం కలిగించే పది బాలిస్టిక్ క్షిపణులు

                    శక్తివంతమైన సైనికబలాన్ని కలిగిన దేశాలు: ఇందులో భారత్ ఉందా...?

Most Read Articles

English summary
Ten Most Powerful Missiles The World
Story first published: Saturday, June 25, 2016, 13:08 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X