బంగారపు విమానాన్ని కలిగి ఉన్న సుల్తాన్ ఆఫ్ జోహార్

Written By:

ఆస్ట్రేలియాలోని పెర్త్ విమానాశ్రయానికి దగ్గరగా ఒక ఆస్ట్రేలియన్ వ్యక్తి వచ్చి నిలుచున్నాడు. ఇంతలో అక్కడ ల్యాండవ్వడానికి వచ్చిన విమానాన్ని చూసి అతను నివ్వెరపోయాడు. ఎందుకంటే ఇది సాధారణ విమానం కాదు. బంగారంతో మిలమిలా మెరుస్తూ వస్తోంది. కాసేపటికి ఆ బంగారపు విమానం అక్కడ పెర్త్ విమానాశ్రయంలో ల్యాండ్ అయ్యింది.

సాధారణంగా బాగా డబ్బున్న రాజులు బంగారపు బైకులో లేదంటో కార్లనో తయారు చేయించుకుంటారు. కాని మలేషియాకు చెందిన జోహార్ అనే ప్రాంతపు సుల్తాన్ ఇబ్రహీం ఇస్మాయిల్ ఇలా బంగారపు విమానాన్ని తయారు చేయించుకున్నాడు. దీని గురించి మరిన్ని వివరాల కోసం.

మలేషియాకు చెందిన జోహార్ అనే భూ భాగానికి ఇబ్రహీం ఇస్మాయిల్ 25 వ సుల్తాన్‌గా ఉన్నారు.

జోహార్ సుల్తాన్ ఇబ్రహీం ఇస్మాయిల్ మరియు ఇతని భార్య రజా జరిత్ సోఫియా ఇద్దరూ గత వారంలో పశ్చిమ ఆస్ట్రేలియాకు అక్కడ లగ్జరీ హాలిడే హోంను నిర్మించడానికి ఈ బంగారపు విమానంలో చేరుకున్నారు.

 

బోయింగ్ అనే సంస్థకు చెందిన 737 అనే విమానాన్ని పూర్తి బంగారుతో తయారుచేయించుకున్నాడు.

దీని మొత్తం నిర్మాణాన్నికి సుమారుగా 100 మిలియన్ డాలర్లు ఖర్చయినట్లు అంచనా (1మిలియన్ = 10 లక్షలు).

ఇందులో సకల సదుపాయాల కోసం డైనింగ్ రూమ్, బెడ్ రూమ్, షవర్ మరియు మూడు వంట శాలలను నిర్మించారు.

ఈ విమానాన్ని సుల్తాన్ ఆఫ్ జోహార్ వారి కోరిక మేరకు నిర్మించడానికి సుమారుగా 2 సంవత్సరాల సమయం పట్టింది.

సుల్తాన్ ఆఫ్ జోహార్ పెర్త్ లోని సముద్ర తీరాన సుమారుగా మూడు విలాసవంతమైన భవంతులను నిర్మించడానికి పశ్చిమ ఆస్ట్రేలియా ప్రభుత్వం నుండి 6.5 మిలియన్ డాలర్లు వెచ్చించి కొనుగోలు చేశాడు.

ప్రస్తుతం సుల్తాన్ ఆఫ్ జోహార్ ఇబ్రహీం ఇస్మాయిల్ యొక్క మొత్తం సంపద 1 బిలియన్ అమెరికన్ డాలర్లుగా ఉంది.

 

 

సుల్తాన్ ఆఫ్ జోహార్ ఇబ్రహీం ఇస్మాయిల్ కుటుంబ సభ్యులతో...

సుల్తాన్ ఆఫ్ జోహార్ ఇబ్రహీం ఇస్మాయిల్ పెర్త్ అంతర్జాతీయ విమానాశ్రయంలో....

సుల్తాన్ ఆఫ్ జోహార్ ఇబ్రహీం ఇస్మాయిల్ యొక్క బంగారపు విమానం యొక్క ఇంటీరియర్ క్యాబిన్ 

సుల్తాన్ ఆఫ్ జోహార్ ఇబ్రహీం ఇస్మాయిల్ బంగారపు విమానంలో విశ్రాంతపు గదులు

సుల్తాన్ ఆఫ్ జోహార్ ఇబ్రహీం ఇస్మాయిల్ బంగారపు విమానంలోని ఇంటీరియర్ 

సుల్తాన్ ఆఫ్ జోహార్ ఇబ్రహీం ఇస్మాయిల్ యొక్క బంగారపు విమానంలో వినోదపు ఫీచర్లు 

సుల్తాన్ ఆఫ్ జోహార్ ఇబ్రహీం ఇస్మాయిల్ బంగారపు విమానంలో బోజన శాలలు

  

Click to compare, buy, and renew Car Insurance online

Buy InsuranceBuy Now

English summary
Meet the Real Life Sultan; The Billionaire Who Owns a Luxurious Golden Private Jet!
Please Wait while comments are loading...

Latest Photos