కారు మీద ఈ స్టిక్కర్ అంటించడం వెనకున్న ఆంతర్యం ఏమిటో తెలుసా ?

Written By:

సాధారణంగా ప్రతి వాహనం మీద ప్రజలు తమ తమ ఇష్టపూర్వకమైన దేవుళ్ల స్టిక్కర్లను అంటించుకోవడం చాలా సార్లు గమనించి ఉంటాము. కానీ ఈ యాంగ్రీ హనుమాన్ (కోపంతో ఉన్న ఆంజనేయ స్వామి)స్టిక్కర్లను ఓ విప్లవంలా స్కూటర్, కారు, బస్సు, ట్రక్కు అనే తేడా లేకుండా దాదాపు అన్ని వాహనాల మీద కూడా గమనించవచ్చు. దక్షిణ భారతదేశంలో ఓ ప్రధానమైన నగరంలో దీనిని ఎక్కువగా గమనించవచ్చు. ఈ స్టిక్కర్ వినియోగం ఏలా మొదలైంది, దీని వెనుకున్న ఆంతర్యం గురించి ఇవాళ్టి స్టోరీలో తెలుసుకుందాం రండి...

మీరు బెంగళూరులో నివశిస్తున్నట్లయితే ఈ స్టిక్కర్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదని చెప్పవచ్చు. ఐటి రంగంలో దేశంలోనే ప్రథమ స్థానంలో ఉన్న బెంగళూరు, ట్రాఫిక్‌కు కూడా పెట్టింది పేరు. ఏదైనా ట్రాఫిక్‌లో చిక్కుకున్నపుడు ఇంజన్ ఆఫ్ చేసి... ఛా ఏంటబ్బా ఈ ట్రాఫిక్ అని విసుక్కుని రోడ్డుకు అటు వైపు ఇటు వైపు తలాడిస్తే ఈ యాంగ్రీ హనుమాన్ స్టిక్కర్ ఉన్న వెహికల్స్‌ను వ్రేళ్ల మీద లెక్కబెట్టేయవచ్చు.

చీకటిలో కోపంగా చూస్తున్న హనుమాన్ స్టిక్కర్ వినియోగం ఇప్పుడు విప్లవంలా అల్లుకుపోయింది. ప్రభుత్వం, ప్రయివేట్, వ్యక్తిగత వాహనాల మీద ఈ స్టిక్కర్‌ను గమనించవచ్చు. బెంగళూరుతో పాటు కర్ణాటకలోని కొన్ని ఇతర ప్రాంతాల్లో ఇదే ట్రెండ్ ఉంది.

కేవలం వెహికల్స్ మీద మాత్రమే కాదు, గడియారంలో, టి-షర్టుల మీద, ల్యాప్ ట్యాప్ మీద, మరియు ఇతర తరచూ వినియోగించి పరికరాల మీద ఈ స్టిక్కర్‌ను విరివిగా వినియోగిస్తున్నారు.

ఈ స్టిక్కర్ రూప కర్త ఎవరు ? అసలు ఎక్కడ నుండి ఈ ట్రెండ్ మొదలైంది అనే దాని గురించి ఆలోచిస్తే, కాస్త ఆసక్తికరంగా ఉంటుంది కదా..... నిజమే దీని వెనుక ఓ ఆసక్తికరమైన కథే ఉంది.

2015 కి ముందు కోపంగా ఉన్నటువంటి ఆంజనేయ స్వామి రూపం గానీ, స్టిక్కర్ గానీ ఏవీ కూడా ఉండేవి కాదు. 2015 లో కాసర్‌గోడ్‌కు దగ్గర్లోని కుంబ్లి గ్రామానికి చెందిన కరఇ్ ఆచార్య అనే గ్రాఫిక్ ఆర్టిస్ట్ ఈ హనుమాన్ స్టిక్కర్‌ను రూపొందించాడు.

తమ గ్రామంలో జరిగే వినాయక చవితి ఉత్సవాలకు వివియోగించే జెండాలో ఓ ముద్ర ఉండాలని ఆ గ్రామంలోని కరణ్‌ను కోరారు. అయితే కరణ్ "ఓం" గుర్తును వినియోగించమని సలహా ఇచ్చాడు.

అది కాకుండా మరింత కొత్తగా ఉండాలని బలవంతపెడితే ఒక్కరోజు ముందుగా రాత్రి 11:30 నుండి 12 గంటల మధ్యలో కోపంగా ఉండే హనుమాన్ ముఖ చిత్రాన్ని తన మొబైల్ ద్వారా డిజైన్ చేశాడు. తరువాత ఆ గ్రామ కుర్రాళ్లకు పంపించాడు.

అలా బయటకు వచ్చిన యాంగ్రీ హనుమాన్ స్టిక్కర్ కొంత కాలానికి చాలా మంది వాట్సాప్ మరియు ఫేస్‌బుక్ లలో ప్రొఫైల్ ఫోటోగా, ఆ తరువాత వెహికల్స్ మీద ఇలా వినియోగించడం ప్రారభించారు. గడిచిన రెండేళ్లలో ఈ స్టిక్కర్‌ దాదాపు అనేక కార్లు మరియు బైకుల మీదకు చేరిపోయింది.

రెండు నెలల క్రితం ఈ స్టిక్కర్ రూపకర్త కరణ్ ఆచార్య బెంగళూరుకు వచ్చినపుడు తాను రూపొందించిన స్టిక్కర్ వినియోగం చూసి ఆశ్చర్యపోయాడు. బెంగుళూరులో ఇప్పుడు ఇదో ట్రెండుగా మారిపోయింది.

విలక్షణమైన రామభక్తి గల వారిలో హనుమంతుడిది ప్రత్యేక స్థానం, ప్రతి హిందువుకి హనుమంతుడు ప్రియమైన దేవుడని చెప్పవచ్చు. బెంగళూరులో ఎక్కువగా యువత ఈ స్టిక్కర్‌ను తమ వాహనాల మీద అంటించుకుంటున్నారు.

మరి మీకు ఈ యాంగ్రీ హనుమంతుడు నచ్చాడా...? మరెందుకు ఆలస్యం మీరు కూడా స్టార్ట్ చేయండి....

Story first published: Friday, March 24, 2017, 13:05 [IST]
English summary
The Mystery Behind Why Bengaluru Is Covered In Stickers Of Angry Hanuman
Please Wait while comments are loading...

Latest Photos