Just In
- 1 hr ago సేఫ్టీలో మహీంద్రా బొలెరో నియోకు కేవలం 1-స్టార్ రేటింగ్.. దీనిపై కంపెనీ ఏమందంటే??
- 4 hrs ago 'కావ్య మారన్' ఖరీదైన కార్లు ఇవే! ఇక్కడ చూడండి
- 4 hrs ago ట్రాఫిక్‌లో ఉన్నప్పుడు ఈ పొరపాట్లు చేశారో.. ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్లే.!!
- 5 hrs ago బిలినీయర్ మనసుదోచిన ఆటో ఇదే!.. ధర తెలిస్తే మీరు కొనేస్తారు
Don't Miss
- News ఉరేయాలన్న బొత్స తండ్రి సమానుడా ? వైఎస్ నూ వదల్లేదుగా- జగన్ కు షర్మిల కౌంటర్..!
- Sports ఒక్కసారి కమిటైతే నా మాట నేనే వినను- కమిన్స్ Video
- Travel ఐఆర్సిటీసి వారి హైదరాబాద్ టు అహ్మదాబాద్ 8 రోజుల ట్రైన్ టూర్ ప్యాకేజీ...
- Finance Gold Bonds: గోల్డ్ బాండ్స్ ప్రీమెచూర్ ధర ప్రకటించిన ఆర్బీఐ.. పూర్తి వివరాలివే..
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
- Lifestyle వేసవిలో కడుపులో చల్లగా ఉంచే కీరకాయ పెరుగుపచ్చడి-అన్నం, రోటీ లేదా చపాతీ దేనికైనా...
- Movies నాతో ఆ పని చేస్తావా? ఒక రాత్రికి ఎంత తీసుకుంటావ్.. జబర్ధస్త్ బ్యూటీ ఏమన్నదో చూశారంటే!
మీ జన్మ నక్షత్రానికి తగిన కారు ఏదో తెలుసా.. అయితే ఇక్కడ చూడండి
ప్రపంచం ఆధునిక పుంతలు తొక్కుతున్న నేపథ్యంలో కూడా చాలా మంది న్యూస్ పేపర్లలో తమ జాతకాలను చూసుకుంటూ ఉంటారు. వార్తా పత్రికను తిరగేసే ప్రతి ఒక్కరూ పరిపాటిగా చూసే అంశం రాశి ఫలం, వారి జన్మ నక్షత్రం వారి వారి రాసులకు అనుగుణంగా వార ఫలాలను చూసుకుంటూ ఉంటారు.
లావా దేవీలూ, వివాహం, ఉద్యోగం యోగం కలసొచ్చే రంగు, ప్రయాణించ వలసిన దిశ వంటి ఎన్నో వివరాలను మన ప్రతి రోజు చదువుతుంటాం. ఇవి కొంత మందికి అదృష్టంగా పరిణమిస్తే మరికొందరు బ్యాడ్ లక్ అని ఉసూరుమంటారు.
అయితే
ప్రతి
ఒక్కరి
జన్మ
నక్షత్రం
మరియు
రాశి
ప్రకారం
ఏ
రాశి
వారికి
ఏ
కారు
సరైనదో
మీకు
తెలుసా
?
అందుకే
డ్రైవ్
స్పార్క్
నూతన
సంవత్సరం
సందర్భంగా
వివిధ
రాసుల
వారికి
కుదిరే
కార్ల
గురించి
ప్రత్యేక
కథనం.
1. మేష రాశి
అశ్వని , భరణి , కార్తీక జన్మనక్షత్రం గల వారు ఈ రాశికి చెందుతారు. వీరి మీద కుజుడు యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది. వీటకి గుర్తులు ఎరుపు మరియు రక్తం వంటి రంగులు అని చెప్పవచ్చు. ఈ రాశివారు చాలా బోల్డ్‌గా మరియు సొగసుగా ఉంటారు. వీరు ఎల్లప్పుడూ నూతనత్వాన్ని కోరుకుంటూ విభిన్న తీరు తెన్నులను కలిగి ఉంటారు. వీరు వేగాన్ని ఎక్కువగా ఇష్టపడతారు. కాబట్టి వీరికి షెవర్లే క్రూయిజ్ కారు అచ్చంగా నప్పుతుంది.
మేష రాశి యొక్క రంగు ఎరుపు దేవుని పురాణాల ప్రకారం చూస్తే ఇది వినాకునికి ఎంతో ప్రీతి పాత్రమైన రంగు. ఎరుపు రంగు మీకు ఎంతో సామరస్యాన్ని మరియు శక్తిని మీకు ఇస్తుంది. షెవర్లే క్రూయిజ్ మరియు వి12-ఇంజన్‌ను కలిగి ఉన్న ఫెరారి కారు యఫ్12బెర్లినెట్టా కూడా వీరికి సరిపోతుంది. అయితే ఇది ఎంతో ఖర్చుతో కూడుకున్నది.
2. వృషభ రాశి
వృషభ రాశి వారి మీద శుక్రుడి ఆధిపత్యం ఎక్కువగా ఉంటుంది. వీరికి గులాబీ మరియు తెలుపు రంగు బాగా కలసి వస్తుంది. వీరి నిత్యం జీవితంలో అప్పుడపుడు చాలా ఘాటుగా స్పందిస్తారు. కాని ఎంతో మృదుగా వ్యవహరిస్తారు. దీనిని బట్టి ఈ రాశి వారికి రెనో వారి వైట్ కలర్ లాజీ కారు సరిపోతుంది.
వృషభ రాశి వారు భద్రతకు ఎక్కువ ప్రాధాన్యతను ఇవ్వగలిగితే టయోటా వారి ల్యాండ్ క్రూయిజర్ కారును ఎంచుకోవచ్చు. ఎందుకంటే ఇది బుల్లెట్ ప్రూఫ్ కారు. మరియు ఇందులో దాదాపుగా ఏడు మంది వరకు కలసి ప్రయాణించవచ్చు. ఈ రాశి వారు వారి కుటుంబ సంరక్షణలో కూడా చొరవ తీసుకుంటారు.
3.మిథున రాశి
మిథున రాశి వారి మీద బుధుడి యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఈ మిథున రాశి వారకి కష్టే ఫలి అనే సామెతి అప్పనంగా సరిపోతుంది. దంపతులకు గుర్తుగా గల మిథున రాశి వారు ఎంతో తెలివైన వారు మరియు మారుతున్న కాలానికిన అనుగుణంగా సృజనాత్మకతను, ప్రతిభను వెలికితీస్తారు. వీరికి ఆకుపచ్చ రంగు కలసి వస్తుంది.
మిథున రాశి వారికి షెలర్లే వారి ఆకుపచ్చ రంగులో గల బీట్ కారు, హోండా సివిక్ మరియు జాగ్వార్ వారి యక్స్యఫ్ కార్లు కలసి వస్తాయి.
4. కర్కాటక రాశి
కర్కాటక రాశి వారి మీద చంద్రుడి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఈ రాశి వారి గుణం ప్రకారం కొంచెం పిరికి వారు అని చెప్పవచ్చు. వీరికి మూడు రంగులు కలిసి వస్తాయి. నీలం, తెలుపు మరియు సముద్రపు నీలం వీరికి అనుకూలంగా ఉంటాయి.
కర్కాటక రాశి వారికి వోక్స్వ్యాగన్ మరియు రెనో లోని స్కాలా కార్లు కలిసి వస్తాయి. ఇక పసుపు రంగు కూడా వీరి జీవితంలో కూసిన్ని మార్పులు తీసుకువచ్చే అవకాశాలు ఉన్నాయి. వీరికి వోక్స్వ్యాగన్ వారి బీటిల్ కారు కూడా నప్పుతుంది.
5. సింహ రాశి
సింహరాశి అన్ని రాశులకు రాజుగా ఉంటుంది. సింహ రాశి వారు సూర్యునిచే పరిపాలించబడతారు. ఈ సింహ రాశి వారికి ఆరెంజ్, ఎరుపు మరియు బంగారపు రంగులు కలసి వస్తాయి. ఈ రాశి వారికి ఫియట్ వారు అవెంచురా కారు బాగా సరిపోతుంది.
సింహ రాశి వారు కొంచెం ఖరీదుగా బ్రతకడానికి ప్రయత్నిస్తారు. ఇలాంటి వారికి ల్యాంబోర్గిని వారి ఆరెంజ్ కలర్ అవెంతడోర్ కారు బెటర్ గా ఉంటుంది.
6. కన్య రాశి
బుధు గ్రహం చే పాలించబడుతున్న రెండవ రాశి కన్యా. వీరు కొంచెం చాదస్త స్వభావాన్ని కలిగి ఉంటారు. వీరు అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. వచ్చిన అవకాశాన్ని ఏ మాత్రం వదులుకోరు. బుధ గ్రహం ఆధీనంలో ఉన్న మిథున రాశి కన్నా వీరు కొంచెం ప్రత్యేకంగా ఉంటారు. వీరికి ఎక్కుగా ఉన్న నీలం రంగు మరియు ఆకు పచ్చ రంగులు వీరికి బాగా కలసివస్తాయి.
అంతే కాకుండా లైటుగా ఉన్న బ్రౌన్ కలర్ కూడా వీరికి బాగానే కుదురుతుందని చెప్పవచ్చు. ఈ కన్యా రాశి వారికి గోధుమ రంగులో ఉన్న వోల్వో వి-40 మరియు పూర్తి నీలం రంగులో ఉన్న వోక్స్వ్యాహన్ జెట్టా కార్లు వీరికి సరిపోతాయి.
7. తుల రాశి
వీరు ఎంతో సౌమ్యంగా, జాలి మరియు దయను కలగి ఉంటారు. అంతే కాకుండా ఎంతో నూతనంగా సామాజిక జీవితంలో ఎంతో చురుకైన పాత్రను పోషిస్తారు. ఈ రాశి వారికి నీలం రంగు బాగా అనుకూలుస్తుతుంది. మరియు నీలం రంగులో గల స్కార్పియో వాహనం వీరి జీవితాన్ని మరింత సుగమం చేస్తుంది.
తుల రాశి వారికి ఇంకొంచెం ఖరీదైన కలిసొచ్చే కారు కావాలంటే బియమ్డబ్ల్యూ-3 సిరీస్ కారు బాగానే ఉంటుంది. ఈ రెండు కార్లు కూడా వీరికి బాగా సహకరిస్తాయి.
8. వృఛ్చిక రాశి
వృఛ్ఛిక రాశి వారు చెప్పడానికి ఆధ్యాత్మిక భావాలను కలిగి ఉంటారు. జోతిష్య శాస్త్రం ప్రకారం వీరికి స్కార్లెట్ అనే రంగు అనుకూలంగా ఉంటుంది. అదే దాదాపుగా ఎరుపు రంగుకు కాస్త దగ్గరగా ఉంటుంది. వీరకి ఫియట్ కు చెందిన లీనయా కారు సరిగ్గా కలసి వస్తుంది.
ఈ డార్క్ ఎరుపురంగులో గల మరొక కారు మసెరాటి గ్రాన్క్యాబ్రియె. పొరపాటున కూడా దీని గురించి ఊహంచకండి. ఎందుకంటే ఇది చాలా ఖరీదైనది.
9. ధనుస్సు రాశి
ధనుస్సు రాశి గల వారు బృహస్పతి (గురు) గ్రహం ఆధీనంలో ఉంటారు. వీరికి కలసి వచ్చే రంగు పసుపు రంగు. ధనుస్సు రాశి వారు ఇతరుల మాట వినరు, వీరి పనిని వీరికి నచ్చిన రీతిలో చేసుకుంటారు.
అత్యం త ఆకర్షణీయమైన రంగులో ఉన్న స్కోడా ఆక్టావియా ఆర్ మరియు ఫెరారి 458 కార్లు ధనస్సు రాశి వారికి బాగా నప్పుతాయి.
10. మకర రాశి
మకరరాశి చాలా కోపిస్టులు, వీరు దీర్గంగా మరియు లోతుగా ఆలోచిస్తారు. వీరికి చీకటిగా, మబ్బుగా గల కలర్లు బాగా కలసి వస్తాయి. అంతే కాకుండా నలుపు, తెలుపు కలయికలో అధేవిధంగా బ్రౌన్ కలర్లు వీరికి మంచి చేకూరస్తాయి.
మకర రాశి వారికి నిస్సాన్ వారి సన్ని కారు మరియు ఆడి వారి ఎ8యల్ కారు ఈ రెండు బాగా సరిపోతాయి
11.కుంభ రాశి
కుంభ రాశి వారు శని గ్రహం ఆధీనంలో ఉంటారు.య వీరు ఆచారములను ఏ మాత్రం పాటించరు మరియు సమాజానికి ఎక్కువగా వ్యతిరేకంగా ఉంటారు. పని విషయంలో కాస్త శ్రద్దగా ఉంటారు. కరెంటుకు సంభందించిన రంగులు వీరికి అచ్చొస్తాయి. లైట్ బ్లూ మరియు వంగ పూవు రంగులు అనగా రీ పెయింట్ జాబ్‌తో వచ్చిన వాహనాలు వీరికి బాగా కలసి వస్తాయి.
కస్టమ్ పెయింట్ జాబ్‌తో వచ్చిన వాహనాలు టాటా వారి జెనాన్ మరియు ఖాన్ సంస్థ వారు డిజైన్ చేసిన రేంజ్ రోవర్ ఎవోక్ కూడా వీరి విజయాలకు బాగా సహకరిస్తుంది. అయితే కొంచెం ఖరీదుతో కూడుకున్నది.
12. మీనం రాశి
మీన రాశి వారు బృహస్పతి యొక్క ఆధీనంలో ఉంటారు. వీరు రహస్యాలను సున్నితంగా, సౌమ్యంగా ప్రదర్శిస్తారు మరియు వీరి నిర్ధష్టంగా ఉంటారు. ఈ రాశి వారరకి నిశ్శబ్ధమైన తెలుపు వంటి లేత రంగులు బాగా అనుకూలిస్తాయి
ఈ రాశి వారికి టయోటా ఆల్టిస్ మరియు మెర్సిడెస్ యస్-క్లాస్ కార్లు బాగా కలసి వస్తాయి. అయితే మెర్సిడెస్ కారు ఖరీదుగా ఉంటుంది. టయోటా ఆల్టీస్ కారును మీరు ప్రయత్నించవచ్చు.
ప్రతి విషయంలోను జోతిష్యాన్ని గుడ్డిగా నమ్మడం మంచిది కాదు. అతి ముఖ్యమైన సంధర్భాలలో ఒకటికి రెండు సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోండి. తప్పనసరి సమయాల్లో మీకు తెలిసిన సిద్దాంతి గారి నుండి సలహాలు తీసురకోండి.