ప్రపంచంలో కెల్లా అత్యంత వేగంగా పరుగులు తీసే ట్రక్

By Ravi

ప్రపంచంలో కెల్లా అత్యంత వేగంగా పరుగులు పెట్టే కారు అనగానే మనకు టక్కున గుర్తుకు వచ్చేది 'బుగాటి వేరాన్'. అయితే, ప్రపంచంలో కెల్లా అత్యంత వేగంగా పరుగులు పెట్టే ట్రక్కు గురించి మీకు తెలుసా..?

బుగాటి వేరాన్ గరిష్ట వేగాన్ని (408.47 కెఎమ్‌పిహెచ్) మించి పరుగులు తీసే ట్రక్కు పేరు 'షాక్‌వేవ్' (Shockwave). మూడు గిగాంటిక్ జెట్ ఇంజన్లతో తయారు చేయబడిన ఈ ట్రక్కు గరిష్ట వేగం గంటకు 643.7 కిలోమీటర్లు.

కెనడాలోని ఆంటారిలో జరిగిన ఓ కార్ షోలో ఈ ట్రక్కు దర్శనమిచ్చింది. పసుపు రంగులో మూడు టన్నల బరువుండే ఈ చెవీ ట్రక్కుకు సంబంధించిన మరిన్ని ఆసక్తికరమైన అంశాలను క్రింది ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి.

ప్రపంచంలో కెల్లా అత్యంత వేగంగా పరుగులు తీసే ట్రక్

షాక్‌వేవ్ ట్రక్కును 1984లో లెస్ షాక్లే తయారు చేశాడు. ఇది జపాన్ బుల్లెట్ ట్రైన్ వేగంతో సమానంగా పరుగులు తీయగలదు. ప్రస్తుతం ఈ ట్రక్కు వయస్సు 30 ఏళ్లు.

ప్రపంచంలో కెల్లా అత్యంత వేగంగా పరుగులు తీసే ట్రక్

అమెరికన్ నావీ ట్రైనింగ్ జెట్లలో ఉపయోగించే మూడు ప్రాట్ అండ్ విట్నే జె34-48 జెట్ ఇంజన్లను ఇందులో ఉపయోగించారు. ప్రస్తుతం ఈ ట్రక్కుకు నియల్ డార్నెల్ యజమాని. ఈ ట్రక్కును నడిపేది కూడా అతనే.

ప్రపంచంలో కెల్లా అత్యంత వేగంగా పరుగులు తీసే ట్రక్

షాక్‌వేవ్ ట్రక్కులో ఉపయోగించిన మూడు జెట్ ఇంజన్ల సాయంతో ఇది కేవలం 6.5 సెకండ్ల వ్యవధిలోనే 36,000 హార్స్‌పవర్‌ల శక్తిని ఉత్పత్తి చేయటం సాధ్యమవుతుంది.

ప్రపంచంలో కెల్లా అత్యంత వేగంగా పరుగులు తీసే ట్రక్

ఇందులో 190 గ్యాలన్ల ఇంధనం స్టోర్ చేసుకోవచ్చు. ప్రతి పెర్ఫామెన్స్‌కు 180 గ్యాలెన్ల ఇంధనం ఖర్చు అవుతుంది.

ప్రపంచంలో కెల్లా అత్యంత వేగంగా పరుగులు తీసే ట్రక్

షాక్‌వేవ్ ట్రక్కు గరిష్ట వేగం గంటకు 400 మైళ్లు. అంటే గంటకు 643.7 కిలోమీటర్లు.

వీడియో

షాక్‌వేవ్ ట్రక్కు పెర్ఫార్మెన్స్‌ను ఈ వీడియోలో వీక్షించండి.

Most Read Articles

English summary
Shockwave, the world’s fastest jet powered truck is capable of reaching speeds of close to 400 mph, that is 643.7 kmph, much faster than Bugatti Veyron’s top speed of 408.47 km/h (253.81 mph). 
Story first published: Saturday, February 22, 2014, 17:44 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X