ప్రపంచపు మొదటి హాస్పిటల్ రైలు: 25 ఏళ్ల క్రితం ఇండియాలో మొదలైంది

Written By:

కొత్తగా సృష్టించలేకపోయినా ఉన్న వనరుల్ని ఎలా వాడుకోవాలి అనే విషయం భారతీయులకు బాగా తెలుసు. అందులో భాగంగా ఆచరణలోకి వచ్చిన ఆలోచనే ఈ హాస్పిటల్ రైలు. ఇంపాక్ట్ అనే సేవా సంస్థ ఇండియన్ రైల్వే సహకారంతో ఎన్నో సంవత్సరాలుగా ఊరూరా సంచారం చేస్తూ వైద్య సేవలు అందిస్తోంది. ఈ లైఫ్ లైన్ హాస్పిటల్ రైలు గురించి మరిన్ని వివరాలు క్రింది కథనం ద్వారా తెలుసుకుందాం రండి.

గత 25 ఏళ్లుగా

ఆ జీవన్ రేఖ ఎక్స్‌ప్రెస్ రైలు ద్వారు సుమారుగా 25 ఏళ్లు వైద్య సేవలు అందిస్తున్నారు.

1991 లో

1991 లోనే జూలై 16 న ప్రపంచ వ్యాప్తంగా మొదటి హాస్పిటల్ ఎక్స్‌ప్రెస్ రైలుకు ఇండియన్ రైల్వే మరియు ఇంపాక్ట్ సేవా సంస్థ దీనిని అందుబాటులోకి తీసుకువచ్చారు.

1.15 లక్షల కిలోమీటర్లు

దీనిని ప్రారంభించనప్పటి నుండి నేటి వరకు సుమారుదా 1.15 లక్షల కిలోమీటర్లు పాటు ఇండియన్ రైల్వే పట్టాల మీద వివిధ ప్రాంతాలకు తిరిగి వైద్య సేవలు అందించారు.

10,00,000

ఈ మ్యాజిక్ ట్రైన్ ఆఫ్ ది ఇండియా రైలు బండి తన 25 ఏళ్ల జీవితంలో సుమారుగా 10,00,000 మంది ప్రాంతీయ పేద ప్రజలకు వైద్య సేవలు అందించింది.

ఇందులో ఆరు మంది ముఖ్యమైన డాక్టర్లను నిరంతరం అందుబాటులో ఉంటారు. 

ఉచితంగా

గత 24 ఏళ్ల నుండి ఎటువంటి పైకం ఆశించకుండా వినికిడి లోపం, చీలిన పెదవు, దంత సమస్యలు న్యూరోలాజికల సమస్యలు ఉన్న వారికి వైద్యం అందిస్తూ వచ్చారు.

ఆపరేషన్ థియేటర్లు

ఈ రైలు బండిలోని రెండు బోగీలను పూర్తిగా ఆపరేషన్ థియేటర్లుగా వినియోగించుకుంటున్నారు. వీటితో పాటు వైద్యంలో ఉపయోగించే అన్ని రకాల మందులను కూడా ఇక్కడే నిల్వచేసుకుంటున్నారు.

ల్యాబ్‌లు

ఈ లైఫ్ లైన్ ఎక్స్‌ప్రెస్‌లో కంటి పరీక్షల చేసే ల్యాబ్, దంత విభాగం, ల్యాబొరేటరీ, ఎక్స్‌-రే విభాగం మరియు అతి పెద్ద పరిమాణం గల ఎల్‌సిడి తెర ఇందులో ఉన్నాయి.

దీని ప్రేరణతో

ఈ లైఫ్‌లైన్ రైలు గత 25 ఏళ్లుగా సేవలను అందిచడం వలన ఇది విజయవంతమైన నేపథ్యంలో దీనిని ప్రేరణగా తీసుకుని చైనా, మధ్య ఆఫ్రికాలో అలేగా బోట్లలో వైద్యం సదుపాయన్ని బంగ్లాదేశ్ మరియు కంబోడియా వంటి దేశాలు తమ ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చారు.

విసృత పరిచే ఆలోచనలో

ఈ రైలులో ఉన్న భోగీలు మరిన్ని భోగీలను అనుసంధానం చేసి మరిన్ని సేవలు అందుబాటులోకి తెచ్చే ఆలోచనలో ఉన్నారు.

ఈ రైలుని లైఫ్‌లైన్, మ్యాజిక్ ట్రైన్ ఆఫ్ ఇండియా, జీవన్ రేఖ ఎక్స్‌ప్రెస్ అనే వివిధ రకాల పేర్లతో పిలుస్తారు.

Read more on: #రైలు #rail
Story first published: Saturday, April 23, 2016, 12:33 [IST]
English summary
The Worlds First Hospital Train The Lifeline Express
Please Wait while comments are loading...

Latest Photos