కొత్త కారు డెలివరీ తీసుకునే ముందు చెక్ చేయాల్సిన అంశాలు

By Ravi

ఇదివరకటి కథనంలో కారును ఎలా కొనుగోలు చేయాలో తెలుసుకున్నాం. అయితే, ఇప్పుడు ఈ కథనంలో కారును డెలివరీ తీసుకునేటప్పుడు ఏయే అంశాలను చెక్ చేయాలో తెలుసుకుందాం రండి.

సాధారణంగా కారును డెలివరీ తీసుకునేటప్పుడు కొన్ని ముఖ్యమైన అంశాలను తెలుసుకోవాలి. కారు ఒక్కసారి షోరూమ్/డీలర్‌షిప్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కారులో ఏవైనా సమస్యలు ఉంటే, కారును రీప్లేస్ చేయటం చాలా వరకూ సాధ్యం కాదు. అందుకే, కారును డెలివరీ తీసుకోవటానికి ముందే, ఆయా అంశాలను చెక్ చేసుకున్నట్లయితే, తర్వాత ఎదురయ్యే సమస్యలను తప్పించుకోవచ్చు.

ఇటీవల ఓ కార్ షోరూమ్‌లో రాత్రివేళలో డెలివరీ తీసుకున్న ఓ కస్టమర్, ఉదయం తన కారును చూడగానే అవాక్కయ్యాడు. ఎందుకంటే, అతనికి డెలివరీ చేసిన కారును రీపెయింట్ చేసి ఇచ్చారు. కారు బాడీ ఓ కలర్‌లో, డోర్స్ మరో కలర్‌లోను ఉన్నాయి. రాత్రి సమయంలో కారును డెలివరీ తీసుకున్న కారణంగా సదరు కస్టమర్ ఈ మార్పును గుర్తించ లేకపోయాడు.

ఇలా కొందరు డీలర్లు, కస్టమర్లను బురిడి కొట్టించిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అలా జరగకుండా ఉండాలంటే, కారును డెలివరీ తీసుకునేటప్పుడు ఏయే అంశాలను చెక్ చేయాలో తెలుసుకోవాలి. అదెలాగో ఈ కథనంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి.

కొత్త కారు డెలివరీ తీసుకునే ముందు చెక్ చేయాల్సిన అంశాలు

తర్వాతి స్లైడ్‌లలో కారును కారును డెలివరీ తీసుకునేటప్పుడు ఏయే అంశాలను చెక్ చేయాలో తెలుసుకోండి.

కారును సెలక్ట్ చేసుకోవటం

కారును సెలక్ట్ చేసుకోవటం

మీరు ఏ కలర్ కారునైతే సెలక్ట్ చేసుకున్నారో అదే కారును మీకు డెలివరీ చేస్తున్నారో లేదో నిర్ధారించుకోండి. ఒకవేళ షోరూమ్‌కి సమీపంలోనే స్టాక్ యార్డ్ ఉంటే, అక్కడికి వెళ్లి మీ కారును ప్రత్యక్షంగా చూసి సెలక్ట్ చేసుకోండి. వీలైతే ఆ కారు సంబంధించిన షాషీ, ఇంజన్ నెంబర్‌ను నోట్ చేసుకోండి. మీ స్మార్ట్‌ఫోన్‌తో ఫొటో క్లిక్ చేయండి.

పెయింట్, స్క్రాచెస్, డెంట్స్

పెయింట్, స్క్రాచెస్, డెంట్స్

కారు మొత్తాన్ని ఒకే కలర్‌లో పెయింట్ చేయబడి ఉందా, ఏదైనా పెయింట్ వ్యత్యాసం ఉందా చెక్ చేసుకోవాలి. కారు బాడీపై ఎక్కడైనా స్క్రాచెస్, చిన్నపాటి డెంట్స్, ఎక్కడైనా పెయింట్ ఉడినట్లుగా ఉందో లేదో చెక్ చేసుకోవాలి. ప్రతి డీటేలింగ్‌ను కూడా చాలా జాగ్రత్తగా చెక్ చేయాలి. ఇలా కారు పెయింట్‌ని చెక్ చేసేటప్పు బాగా వెలుతురుగా ఉండే ప్రదేశంలో కారును ఉంచండి. వీటి విషయంలో అజాగ్రత్త వహించి, గుడ్డిగా కారును డెలివరీ తీసుకుంటే, కారు షోరూమ్ నుంచి బయటకి వచ్చిన తర్వాత ఆ మరమ్మత్తు ఖర్చులను మనమే భరించాల్సి ఉంటుంది.

టైర్లు

టైర్లు

కారును డెలివరీ తీసుకునే సమయంలో టైర్లను కూడా చెక్ చేసుకోవాలి. టైర్లు ఎక్కువగా అరిగిపోయినట్లు ఉన్నాయా లేదా ఏదైనా డ్యామేజ్, కట్స్ వంటి ఉన్నాయో చెక్ చేసుకోవాలి. స్పేర్ వీల్‌ను కూడా చెక్ చేసుకోవాలి.

హెడ్‌ల్యాంప్స్, టెయిల్ ల్యాంప్స్, ఫాగ్ ల్యాంప్స్

హెడ్‌ల్యాంప్స్, టెయిల్ ల్యాంప్స్, ఫాగ్ ల్యాంప్స్

కారులో అన్ని లైట్ల పనితీరును చెక్ చేసుకోవాలి. లైట్లను చెక్ చేసేటప్పుడు చీకటిగా ఉండే ప్రదేశంలో కారు ఉండేలా చూసుకోవాలి. లైట్లను ఆన్ చేసిన తర్వాత కారులో కూర్చొని, లైట్ల పొజిషన్ చక్కగా ఉందో లేదో చెక్ చేసుకోవాలి. అలాగే అన్ని లైట్ల సక్రమంగా పనిచేస్తున్నాయో లేదో కూడా తనిఖీ చేసుకోవాలి. హెడ్‌లైట్, టెయిల్ ల్యాంప్ క్లస్టర్లపై స్క్రాచెస్ ఉన్నాయోమో చెక్ చేసుకోవాలి.

యాక్ససరీస్

యాక్ససరీస్

డీల్ మాట్లాడుకునే సమయంలో మీకు ప్రామిస్ చేసిన అన్ని యాక్ససరీలను ఆఫర్ చేశారో లేదో చెక్ చేసుకోవాలి. మీ చెక్ లిస్ట్ ప్రకారం, కారులోని యాక్ససరీలను ఒక్కొక్కటిగా చెక్ చేసుకోవాలి. ఏవైనా మిస్ అయినట్లపిస్తే, వెంటనే సేల్స్ పర్సన్‌ని లేదా షోరూమ్ మేనేజర్‌ని సంప్రదించవచ్చు.

సీట్ బెల్ట్స్

సీట్ బెల్ట్స్

సీట్ బెల్ట్ ఓ బేసిక్ సేఫ్టీ ఫీచర్. అత్యవసర సమయాల్లో ఇది ప్రణాపాయం నుంచి రక్షిస్తుంది. ముందు వెనుక సీట్లలో సీట్ బెల్టులు సరిగ్గా పనిచేస్తున్నాయో లేదో చెక్ చేసుకోవాలి. సీట్ బెల్ట్స్ నాణ్యతను కూడా పరిశీలించాలి. వాటి క్లిప్స్‌లో అవి సరిగ్గా సెట్ అవుతున్నాయో లేదో చెక్ చేసుకోవాలి. అంతేకాదు, వీటి ప్రీ టెన్షన్ సామర్థ్యాన్ని చెక్ చేసేందుకు ఒక్కసారి గట్టిగా లాగి చూడాలి.

చైల్డ్ సేఫ్టీ డోర్ లాక్

చైల్డ్ సేఫ్టీ డోర్ లాక్

దాదాపు అన్ని ప్యాసింజర్ కార్లలో చైల్డ్ సేఫ్టీ డోర్ లాక్ ఉంటుంది. డోర్‌కి సైడ్స్‌లో ఉండే ఈ లాక్‌ని ఆన్ చేయటం వలన వెనుక సీట్లలో చిన్న పిల్లలు కూర్చున్నప్పుడు కారును లోపలి వైపు నుంచి ఓపెన్ చేయలేరు. కేవలం బయటి వైపు నుంచి మాత్రమే ఈ డోర్లను ఓపెన్ చేయటం సాధ్యమవుతుంది.

పవర్ విండో స్విచెస్

పవర్ విండో స్విచెస్

టాప్-ఎండ్ వేరియంట్ కార్లలో అన్ని డోర్లకు పవర్ విండో ఉంటాయి. ఈ పవర్ విండోస్ అన్నీ సరిగ్గా పనిచేస్తున్నాయో లేదో చెక్ చేసుకోవాలి. పవర్ వింటో ఆటో డౌన్, ఆటో అప్ ఫంక్షన్లు సరిగ్గా ఉన్నాయో, పవర్ విండో లాక్ బటన్ పనిచేస్తుందా అనే అంశాలను చెక్ చేసుకోవాలి.

స్పేర్ వీల్, జాక్, టూల్ కిట్

స్పేర్ వీల్, జాక్, టూల్ కిట్

కారు పంక్చర్ అయినప్పుడు లేదా టైరు మార్చాల్సి వచ్చినప్పుడు ఈ మూడు వస్తువులు ఎంతో అవసరం. కాబట్టి, మీ కొత్త కారును డెలివరీ తీసుకునే సమయంలో కారులో ఈ మూడింటినీ ఆఫర్ చేస్తున్నారో లేదో కూడా చెక్ చేసుకోవాలి. అలాగే, ఫస్ట్ ఎయిడ్ కిట్‌ను కూడా చెక్ చేసుకోవాలి.

ఫ్లోర్‌మ్యాట్స్

ఫ్లోర్‌మ్యాట్స్

కారులో దుమ్ము, ధూళి చేరకుండా ఉండేందుకు ఫ్లోర్‌మ్యాట్స్ చక్కగా ఉపయోగపడుతాయి. కొన్ని కార్లలో ఫ్లోర్‌మ్యాట్స్ కారుతో పాటుగానే లభిస్తాయి. అయితే, కొన్ని కార్లలో మాత్రం ఫ్లోర్‌మ్యాట్స్ కోసం అధనంగా డబ్బు చెల్లించాల్సి ఉంటుంది. కాబట్టి, కారు కొనుగోలు చేసేటప్పుడు అందులో తప్పనిసరిగా ఫ్లోర్ మ్యాట్స్ ఉండేలా చూసుకోండి. ఒకవేళ డీలర్ ఫ్లోర్‌మ్యాట్స్‌ని ఆఫర్ చేయకపోయినట్లయితే, సదరు డీలర్ వద్ద కానీ బయటి మార్కెట్లో కానీ ఫ్లోర్‌మ్యాట్స్‌ని కొనుగోలు చేయండి.

వేరియంట్ డీటేల్స్

వేరియంట్ డీటేల్స్

మీరు బుక్ చేసుకున్న వేరియంట్‌నే మీకు డెలివరీ చేశారా లేదా చెక్ చేసుకోండి. వినడానికి విచిత్రంగా ఉన్న కొన్ని సందర్భాల్లో ఈ విషయంలో కూడా మోసం జరిగే ఆస్కారం ఉంటుంది. మీరు ఎంచుకున్న వేరియంట్‌లో ఉన్న ఫీచర్లన్నీ మీరు డెలివరీ తీసుకునే కారులో కూడా ఉన్నాయో లేదో చూసుకోవటం ఉత్తమం.

ఎలక్ట్రికల్ సిస్టమ్స్

ఎలక్ట్రికల్ సిస్టమ్స్

కారులోని అన్ని ఎలక్ట్రికల్ సిస్టమ్స్ సరిగ్గా పనిచేస్తున్నాయో లేదో చెక్ చేసుకోండి. వైపర్లు, ఎయిర్ కండిషనింగ్/హీటర్ సిస్టమ్, ఆడియో సిస్టమ్, 9 వోల్ట్ అవుట్‌లెట్స్ ఇంకా ఏవైనా ఎలక్ట్రికల్ సిస్టమ్స్ ఉంటే, అవన్నీ సరిగ్గా పనిచేస్తున్నాయో లేదో చెక్ చేసుకోవాలి. అలాగే, వాటిలో దేని ఆపరేటింగ్ సిస్టమ్ మీకు అర్థం కాకపోయినా, వెంటనే షోరూమ్ ప్రతినిధి నుంచి డెమో తీసుకోవాలి.

శాటిలైట్ నావిగేషన్

శాటిలైట్ నావిగేషన్

ఒకవేళ మీరు కొనుగోలు చేసే కారులో శాటిలైట్ నావిగేషన్ సిస్టమ్ ఉన్నట్లయితే, దానిని ఎలా ఆపరేట్ చేయాలి, మ్యాప్స్ ఎలా సెట్ చేసుకోవాలి, లొకేషన్‌ను ఎలా సెర్చ్ చేయాలి మొదలైన అంశాలను డెమో తీసుకోవాలి.

ఇంజన్, ఆయిల్ లెవల్స్

ఇంజన్, ఆయిల్ లెవల్స్

ఎక్స్టీరియర్, ఇంటీరియర్ చెకప్స్ అయిపోయిన తర్వాత ఇంజన్ వద్దకు రావాలి. ఇంజన్ బేలో అన్ని ఆయిల్ లెవల్స్ (ఇంజన్ ఆయిల్, కూలెంట్ ఆయిల్, బ్రేక్ ఆయిల్, స్టీరింగ్ ఆయిల్ మొదలైనవి) తగిన మోతాదులో ఉన్నాయోలో లేదో చెక్ చేసుకోవాలి. క్యాబిన్ లోపల ఇంజన్ శబ్ధం, వైబ్రేషన్ లెవల్స్‌ను చెక్ చేసుకోవాలి.

ఓడోమీటర్ (కిలోమీటర్లు చెక్ చేసేందుకు)

ఓడోమీటర్ (కిలోమీటర్లు చెక్ చేసేందుకు)

డెలివరీకి ముందు మీ కారు ఎన్ని కిలోమీటర్లు తిరిగి ఉందో చెక్ చేసుకోవాలి. సాధారణంగా స్టాక్ యార్డు నుంచి షోరూమ్‌కి తీసుకురావాటనికి, వెహికల్‌ను టెస్ట్ చేయటానికి కొత్త కారును నడుపుతారు. ఏదేమైనప్పటికీ, కొత్త కారును డెలివరీ తీసుకోవటానికి ముందు ఓడోమీటర్ రీడింగ్ 50 కిలోమీటర్లకు మించకూడదు. అంతకు మించినట్లయితే, డీలరును వివరణ కోరవచ్చు.

పగటి వేళలో డెలివరీ తీసుకోండి

పగటి వేళలో డెలివరీ తీసుకోండి

కొత్త కారును ఎల్లప్పుడూ పగటి వేళలోనే డెలివరీ తీసుకునేందుకు ప్రయత్నం చేయండి. ఎందుకంటే, ఇప్పటి వరకు మనం చెప్పుకున్న అంశాల్లా చాలా వాటిని రాత్రివేళల్లో గుర్తించడం సాధ్యం కాదు. కాబట్టి, వీలైనంత వరకూ కారును పగటి వేళలోనే డెలివరీ తీసుకోండి.

పేపర్ వర్క్, డాక్యుమెంట్స్

పేపర్ వర్క్, డాక్యుమెంట్స్

కారు డెలివరీ తీసుకునే సమయంలో పేపర్ వర్క్‌కి సంబంధించి జాగ్రత్త తీసుకోవాలి. ఇన్వాయిస్, ఇన్సూరెన్స్, ఓనర్ మ్యాన్యువల్, తాత్కాలిక (టెంపరరీ) రిజిస్ట్రేషన్, అకనాలెడ్జ్‌మెంట్ స్లిప్ మొదలైన వాటిని తీసుకోవాలి. ఈ డాక్యుమెంట్లలో పేర్లు, అమౌంట్లు సరిగ్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి. ఇన్సూరెన్స్ పేపర్లపై వాలిడిటీ డేట్‌ని చెక్ చేసుకోవాలి మరియు అందులోని ఇంజన్/షాషీ నెబర్లు ఇన్వాయిస్‌లోని నెంబర్లతో సరిపోయాయో లేదో చెక్ చేసుకోవాలి.

రిజిస్ట్రేషన్‌కి ముందే రీప్లేస్‌మెంట్

రిజిస్ట్రేషన్‌కి ముందే రీప్లేస్‌మెంట్

కారు డెలివరీ తీసుకున్న తర్వాత, ఒక్కసారి కారు మీ పేరుపై రిజిస్టర్ అయితే, ఇక కారును మార్చడం 99 శాతం సాధ్యం కాదు. అందుకే, కారులో ఏవైనా పెద్ద సమస్యలను గుర్తించినట్లయితే, కారును రిజిస్టర్ చేయటానికి ముందే రీప్లేస్‌మెంట్ కోసం రిక్వెస్ట్ చేయాలి. మీరు కొనుగోలు చేసే కారు విషయంలో, మీరు పూర్తిగా 100 శాతం సంతృప్తి చెందినట్లయితేనే డెలివరీ తీసుకోండి.

Most Read Articles

English summary
It’s usually a very happy time when you take delivery of that shiny new addition to your garage. But nothing should be taken for granted, especially considering the number of zeroes involved in new car purchase transactions these days.
Story first published: Monday, November 24, 2014, 17:43 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X