కార్ డెలివరీ తీసుకునే ముందు చెక్ చేయాల్సిన 15 విషయాలు

By Vinay

కారు షోరూమ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఏవైనా సమస్యలు ఉంటే, కారును మార్చుకోవడం సాధ్యం కాదు. అందుకే కారును డెలివరీ తీసుకోవటానికి ముందే, ఆయా అంశాలను చెక్ చేసుకున్నట్లయితే, తర్వాత ఎదురయ్యే సమస్యలను తప్పించుకోవచ్చు.

కార్ డెలివరీ తీసుకునే ముందు చెక్ చేయాల్సిన 15 విషయాలు క్రింది కథనం ద్వారా తెలుసుకుందాం రండి..........

1. కారును నిర్ధారించుకోవడం :

1. కారును నిర్ధారించుకోవడం :

మొదట మీరు ఏ కారునైతే ఆర్డర్ చేశారో ఆ కారునే డెలివరీ చేసినట్లు నిర్ధారించుకోండి. వీలైతే చాసీ, ఇంజన్ నంబర్‌ను సరిచూసుకోండి.

 2. పెయింట్, స్క్రాచెస్ :

2. పెయింట్, స్క్రాచెస్ :

కారు మొత్తం ఒకే రంగులో ఉందా లేక వేరేగా ఉందా సరిచూసుకోండి. కారు బాడీపై స్క్రాచెస్ ఏమైనా ఉన్నాయా చెక్ చేయండి. వెలుతురు ఉండే ప్రదేశంలో కారును చెక్ చేయండి.

3. టైర్లు :

3. టైర్లు :

కారు డెలివరీ తీసుకునేయటప్పుడు టైర్లు ఎక్కువగా అరిగి పోయాయా అన్న విషయాన్ని గమనించండి. స్పేర్ వీల్‌ను కూడా చెక్ చేయండి.

4. లైట్ల పనితీరు :

4. లైట్ల పనితీరు :

కారులో అన్ని లైట్ల పనితీరును క్షుణ్ణంగా చెక్ చేయాలి. చీకటిగా ఉన్న ప్రదేశంలో లైట్ల పనితీరును చెక్ చేయాలి. సీటులో కూర్చొని లైట్ పొజిషన్ చెక్ చేయాలి.

5. యాక్ససరీస్ :

5. యాక్ససరీస్ :

కారు కొనేటప్పుడు ఇచ్చిన చెక్ లిస్ట్ ప్రకారం యాక్ససరీస్‌లను చెక్ చేయాలి. ఏవైనా తగ్గినట్టు అనిపిస్తే అడిగి తీసుకోవాలి.

6. సీట్ బెల్ట్స్ :

6. సీట్ బెల్ట్స్ :

అత్యవసర సమయాల్లో ఉపయోగపడే సీట్ బెల్ట్స్ సరిగ్గా పనిచేస్తున్నాయా అని చెక్ చేసుకోండి. వాటి క్లిప్పుల్లో సరిగా కుర్చుంటున్నాయో చెక్ చేసుకోండి.

7. చైల్డ్ సేప్టీ డోర్ లాక్ :

7. చైల్డ్ సేప్టీ డోర్ లాక్ :

కారులో ఉన్న చైల్డ్ సేప్టీ డోర్ లాక్ సరిగ్గా పనిచేస్తోందా అని చెక్ చేసుకోండి. అది మీ పిల్లలను రక్షిస్తుంది.

8. పవర్ విండో స్విచెస్ :

8. పవర్ విండో స్విచెస్ :

కారులో ఉన్న పవర్ విండో స్విచెస్ సరిగ్గా పనిచేస్తున్నాయా అని చెక్ చేసుకోండి. ఆటో డౌన్, ఆటో అప్ సరిగ్గా పనిచేస్తున్నాయా అని చెక్ చేసుకోండి.

9. జాకీ, టూల్ కిట్ :

9. జాకీ, టూల్ కిట్ :

పంక్చర్ అయినపుడు ఇవి చాలా ఉపయోగపడుతాయి. కాబట్టి కారులో జాకీ, టూల్ కిట్ ఉన్నాయో, లేదో చెక్ చేసుకోండి. అలాగే ఫస్ట్ ఎయిడ్ కిట్‌ను కూడా చెక్ చేసుకోండి.

 10. ప్లోర్ మ్యాట్ :

10. ప్లోర్ మ్యాట్ :

కారులో దుమ్ము చేరకుండా ప్లోర్ మ్యాట్ ఎంతగానో ఉపయోగపడుతుంది. కాబట్ట కారులో ప్లోర్ మ్యాట్‌ను చెక్ చేసుకోండి.

11. వేరియంట్ డిటేల్స్ :

11. వేరియంట్ డిటేల్స్ :

మీరు డెలివరీ చేసుకున్న వేరియంట్ డిటేల్స్ సరిగ్గా ఉన్నాయా అన్నది చెక్ చేసుకోండి.

12. ఎలక్ట్రికల్ సిస్టమ్స్ :

12. ఎలక్ట్రికల్ సిస్టమ్స్ :

కారులోని అన్ని ఎలక్ట్రికల్ సిస్టమ్స్ సరిగ్గా పనిచేస్తున్నాయో లేదో చెక్ చేసుకోండి. వైపర్లు, ఎయిర్ కండిషనింగ్/హీటర్ సిస్టమ్, ఆడియో సిస్టమ్, 9 వోల్ట్ అవుట్‌లెట్స్ ఇంకా ఏవైనా ఎలక్ట్రికల్ సిస్టమ్స్ ఉంటే, అవన్నీ సరిగ్గా పనిచేస్తున్నాయో లేదో చెక్ చేసుకోవాలి.

13. శాటిలైట్ న్యావిగేషన్ :

13. శాటిలైట్ న్యావిగేషన్ :

మీరు కొనుగోలు చేసే కారులో శాటిలైట్ నావిగేషన్ సిస్టమ్ ఉన్నట్లయితే, దానిని ఎలా ఆపరేట్ చేయాలి, మ్యాప్స్ ఎలా సెట్ చేసుకోవాలి, లొకేషన్‌ను ఎలా సెర్చ్ చేయాలి మొదలైన అంశాలను డెమో తీసుకోవాలి.

14. ఇంజన్, ఆయిల్ లెవల్స్ :

14. ఇంజన్, ఆయిల్ లెవల్స్ :

ఇంజన్ బేలో అన్ని ఆయిల్ లెవల్స్ (ఇంజన్ ఆయిల్, కూలెంట్ ఆయిల్, బ్రేక్ ఆయిల్, స్టీరింగ్ ఆయిల్ మొదలైనవి) తగిన మోతాదులో ఉన్నాయోలో లేదో చెక్ చేసుకోవాలి. క్యాబిన్ లోపల ఇంజన్ శబ్ధం, వైబ్రేషన్ లెవల్స్‌ను చెక్ చేసుకోవాలి.

15. ఓడో మీటర్ :

15. ఓడో మీటర్ :

డెలివరీకి ముందు మీ కారు ఎన్ని కిలోమీటర్లు తిరిగి ఉందో చెక్ చేసుకోవాలి. ఏదేమైనప్పటికీ, కొత్త కారును డెలివరీ తీసుకోవటానికి ముందు ఓడోమీటర్ రీడింగ్ 50 కిలోమీటర్లకు మించకూడదు.

Most Read Articles

English summary
here about 15 things to chrck when you can take a delivery of a car.
Story first published: Saturday, July 4, 2015, 9:25 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X