ఈ సూపర్ సోనిక్ విమానంలో ముంబాయ్ నుండి న్యూయార్క్‌ను 4.5 గంటల్లో చేరుకోవచ్చు

By Anil

విమానాల తయారీ స్టార్టప్ సంస్థ బూమ్ సుమారు 13 ఏళ్ల క్రితం కంకోర్డ్ తయారు చేసినటువంటి సూపర్ సోనిక్ జెట్‌ను తిరిగి వెనక్కి తీసుకురావడానికి మ్యాక్ 2.2 వేగంతో పరుగులు పెట్టే ప్రొటోటైప్‌ను తయారు చేయడానికి సుమారుగా 11 మంది ఇంజనీర్ల బృందం నిరంతరం శ్రమిస్తోంది. బూమ్ అభివృద్ది చేస్తున్న ఈ సూపర్ సోనిక్‌ జెట్‌లో భారత దేశపు ఆర్థిక రాజధాని ముంబాయ్ నుండి న్యూయార్క్‌ నగరానికి కేవలం 4.5 గంటల్లో చేరుకోవచ్చు.

బూమ్ సూపర్ సోనిక్ జెట్ విమానం గురించి మరిన్ని వివరాలు క్రింది కథనం ద్వారా క్లుప్తంగా తెలుసుకుందాం రండి.

సూపర్ సోనిక్ జెట్

సుదూర గమ్యస్థానాలకు ప్రయాణం చేయాలనుకునే వారికి అధిక ప్రయాణం సమయం ఎంతో ఇబ్బంది కలిగిస్తుంది. ప్రయాణికుల ప్రయాణ సమయాన్ని తగ్గించడానికి బూమ్ సంస్థ ఈ సూపర్ సోనిక్ జెట్‌ను అభివృద్ది చేస్తోంది.

సూపర్ సోనిక్ జెట్

సుమారుగా 5000 డాలర్ల (3.34లక్షలతో) టికెట్ ధరతో అత్యంత దూరాన్ని అతి తక్కువ సమయంలో చేరుకునే అవకాశం ఉన్నట్లు బూమ్ ప్రతినిధులు తెలిపారు.

సూపర్ సోనిక్ జెట్

ఈ ప్రాజెక్ట్‌ను పూర్తి స్థాయిలో అభివృద్ది చేయడానికి సిలికాన్ వ్యాలీ బిలియనీర్స్ మరియు బూమ్ సంస్థతో తాజాగ చేతులు కలిపిన వర్జిన్ గ్రూప్ నుండి నిధుల సేకరణ మొదలు పెట్టింది.

సూపర్ సోనిక్ జెట్

ఈ కథనం వెల్లడైన నేపథ్యంలో వర్జిన్ గ్రూప్ ప్రతినిధి మాట్లాడుతూ, బూమ్ సంస్థ భవిష్యత్తులో స్పేస్ షిప్ కంపెనీగా అవతరించి, డిజైన్, తయారీ, సర్వీసింగ్, విమానా పరీక్షలు, ఆపరేషన్స్ వంటి ఎన్నో సేవలను అందుబాటులోకి తీసుకురానుందని తెలిపారు.

సూపర్ సోనిక్ జెట్

ఈ సూపర్ సోనికి విమానంలో 40 మంది కూర్చునే విధంగా రెండు వరుసలలో ప్రక్కప్రక్కన సీటింగ్ విధానాన్ని కల్పించనున్నారు. గగనతలం నుండి భూమి వాలుతలాలను ఇందులో ప్రయాణించే వారు చక్కగా వీక్షించవచ్చు.

సూపర్ సోనిక్ జెట్

బూమ్ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులు ప్రముఖ స్పేస్ సంస్థలైన నాసా, బోయింగ్ మరియు లాక్‌హీడ్ వంటి వాటిలో అశేష అనుభవం గడించారు. శబ్దం ప్రయాణించే వేగం కన్నా 2.6 రెట్లు ఎక్కువ వేగంతో ప్రయాణించే విధంగా ఈ సూపర్ సోనిక్ జెట్‌ను రూపొందిస్తున్నారు.

సూపర్ సోనిక్ జెట్

దీని వేగం గంటకు 3,210 కిలోమీటర్లుగా ఉంది. ఇందులో లండన్ నుండి న్యూయార్క్ నగరానికి 3:30 గంటల్లో మరియు టోక్యో నుండి శాన్ ఫ్రాన్సిస్కోకు కేవలం 4:30 గంటల్లో చేరుకోవచ్చు.

సూపర్ సోనిక్ జెట్

ఈ ఏడాది ప్రారంభంలో కెనేడియన్ ఇంజనీర్, చార్లెస్ బాంబర్‌డైయర్ డిజైన్ చేసిన యాంటిపోడ్ ద్వారా ఢిల్లీ నుండి లండన్‌కు కేవలం 30 నిమిషాల్లో చేరుకోవచ్చని ప్రకటించారు.

సూపర్ సోనిక్ జెట్

అయితే ఈ బూమ్ సంస్థ అభివృద్ది చేస్తున్న ప్రోటోటైప్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి రావడానికి మరో రెండేళ్ల సమయం పట్టే అవకాశాలు ఉన్నాయి.

సూపర్ సోనిక్ జెట్

బూమ్ సంస్థ ఈ సూపర్‌ సోనిక్‌ జెట్‌తో పాటు మ్యాక్ 5 వేగంతో దూసుకెళ్లే విమానానికి కూడా శ్రీకారం చుడుతోంది. అందుకు కావాల్సిన ప్రత్యేక బాడీని డిజైన్ కూడా చేస్తోంది.

సూపర్ సోనిక్ జెట్

ప్రస్తుతం కాలంలో సమయం అంటే డబ్బు నిర్వచనం చాలా మంది చెబుతారు. అందుకోసమే ప్రయాణ సమయాన్ని తగ్గించడానికి నూతన ప్రయాణ పద్దతులు మరియు సాధనాలు అందుబాటులోకి వస్తున్నాయి. అందుకు నిదర్శనం, ఇండియన్ రైల్వే అందుబాటులోకి తెస్తున్న హై స్పీడ్ రైళ్లు, గుర్గావ్ నగరంలో మొదలైన పోడ్ ట్యాక్సీల నిర్మాణం మరియు విసృతంగా అభివృద్ది చెందుతున్న విమానయాన రంగం.

సూపర్ సోనిక్ జెట్

  • ప్రపంచంలోనే అత్యంత పొడవైన రైలు ఇది !!

Most Read Articles

English summary
This Supersonic Jet Can Take You From Mumbai To New York In 4.5 Hours!
Story first published: Wednesday, July 27, 2016, 11:58 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X