24 దేశాల మీదుగా 70 రోజుల పాటు కోయంబత్తూర్ నుండి లండన్‌కు ముగ్గురు మహిళల రోడ్ ట్రిప్

24 దేశాల మీదుగా, సుమారుగా 70 రోజుల పాటు ముగ్గురు భారతీయ మహిళలు కోయంబత్తూరు నుండి లండన్‌కు సాహస యాత్రగా వెళ్లారు. స్త్రీ సాధికారత మరియు అక్షరాస్యతను ప్రోత్సహించడం కోసం ఈ యాత్రను ప్రారంభించారు.

By Anil

సంకల్పం ఎంతో మందిని విజయపుటంచులను తాకిస్తుంది, దీనికి బలం, ధైర్యం, సాహసం వంటివి కూడా సహకరిస్తాయి. సాధించాలి అనే బలమైన సంకల్పం ఎంతటి అసాధ్యాన్ని అయినా సుసాధ్యం చేస్తుంది. అందుకు ఉదాహరణ ఇవాళ్టి కథనం.

24 దేశాల మీదుగా 70 రోజులు పాటు కేవలం ముగ్గురు మహిళలు కోయంబత్తూరు నుండి లండనక్‌కు సాహస యాత్రను ప్రారంభించారు. అక్షరాస్యత మరియు స్త్రీ సాధికారతను ప్రోత్సహించేందుకు ముగ్గురు మహిళలు ఈ యాత్రకు శ్రీకారం చుట్టారు.

కోయంబత్తూర్ నుండి లండన్‌కు ముగ్గురు మహిళల రోడ్ ట్రిప్

స్త్రీ సాధికారత మరియు అక్షరాస్యతను ప్రోత్సహించడం కోసం ముగ్గురు మహిళా మూర్తులు ఏ మాత్రం భయం లేకుండా కోయంబత్తూరు నుండి లండన్‌కు సాయస యాత్రను ప్రారంభించారు. వీరి యాత్రను కోయంబత్తూరులో కుటుంబ సభ్యులు, బంధు మిత్రులు మరియు అక్కడి రాజకీయ నాయకులు దగ్గరుండి ప్రారంభించి, వారి యాత్ర విజయంవంతంగా పూర్తిగా కావాలని ఆకాక్షించారు.

కోయంబత్తూర్ నుండి లండన్‌కు ముగ్గురు మహిళల రోడ్ ట్రిప్

ఆదివారం నాడు (27 మార్చి, 2017) తమిళనాడు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మంత్రి ఎస్ పి వేలుమణి జెండా ఊపి ధైర్య మూర్తుల సాహసయాత్రను ప్రారంభించారు. కారు ద్వారా తమ ఖండాతరం సాహస యాత్రను పూర్తి చేయనున్నారు.

కోయంబత్తూర్ నుండి లండన్‌కు ముగ్గురు మహిళల రోడ్ ట్రిప్

ఈ యాత్రలో పాల్గొన్న ముగ్గురు మహిళలు మీనాక్షి అరవింద్ (45) కోయంబత్తూరు, ప్రియా రాజ్‌పాల్(55) ముంబాయ్ మరియు మూకాంబికా (38) పొల్లాచి. వీరు ముగ్గురు తమ యాత్రను ఆదివారం ఉదయం 11 గంటలకు టాటా హెక్సా ద్వారా ప్రారంభించారు.

కోయంబత్తూర్ నుండి లండన్‌కు ముగ్గురు మహిళల రోడ్ ట్రిప్

సుమారుగా 24,000 కిలోమీటర్ల మేర సాగించనున్న వీరి యాత్ర కోసం మోడిఫై చేయబడిన టాటా హెక్సా ను ఉపయోగించుకున్నారు. ఇందులో అదనపు స్టోరేజీకి ఎక్కువ ప్రధాన్యతనిస్తూ మరింత ఇంధనాన్ని నింపుకునేందుకు మోడిఫికేషన్స్ చేయించుకున్నారు.

కోయంబత్తూర్ నుండి లండన్‌కు ముగ్గురు మహిళల రోడ్ ట్రిప్

కోయంబత్తూరులో ప్రారంభమైన వీరి యాత్ర మయన్మార్, చైనా, కిర్గిజిస్తాన్, ఉబ్జెకిస్తాన్, కజకిస్తాన్, రష్యా, బెలారస్, పోలాండ్, స్లోవేకియా, హంగేరి, రొమేనియా, బల్గారియా, మెక్డోనియా, సెర్బియా, క్రొయెషియా, ఆస్ట్రియా, సిజెక్ రిపబ్లిక్, స్విట్జర్లాండ్, ఫ్రాన్స్, బెల్జియం, నెదర్లాండ్స్ దేశాలను దాటుకొని ఇంగ్లాండ్ లోని లండన్‌కు 70 రోజుల్లో చేరుకోనున్నారు.

కోయంబత్తూర్ నుండి లండన్‌కు ముగ్గురు మహిళల రోడ్ ట్రిప్

45 ఏళ్ల మీనాక్షి మాట్లాడుతూ, కఠినమైన ఈ యాత్రకు సర్వం సిద్దం చేసుకున్నాం, అయినప్పటికీ స్వల్ప ఒడిదుడుకులను ఎదుర్కోవాల్సి ఉంటుందని తెలిపారు.

కోయంబత్తూర్ నుండి లండన్‌కు ముగ్గురు మహిళల రోడ్ ట్రిప్

70 వ స్వాతంత్ర్యపు దినోత్సవ వేడుకల స్మారకోత్సవంగా ఈ 70 రోజులు రహదారి యాత్ర ప్రణాళికను రచించినట్లు తెలిపారు. అంతేకాకుండా "భారతదేశం అది గ్రహించిన దానికంటే ఎక్కువ" అనే మెసేజ్‌ను ప్రచారం చేస్తున్నట్లు తెలిపారు.

కోయంబత్తూర్ నుండి లండన్‌కు ముగ్గురు మహిళల రోడ్ ట్రిప్

ఈ సుధీర్ఘయాత్ర గురించి తలుచుకంటే కాస్త భయంగా ఉంది. అయితే మధ్య ఆసియా దేశాల సహకారం అందించాల్సి ఉంటుంది. చైనా నుండి ఓ గైడ్‌ను, మయన్మార్‌లో మిలిటరీ సహకారం మరియు కిర్గిజిస్తాన్ దేశంలో ఓ గైడ్‌ను ఏర్పాటు చేసుకున్నట్లు మీనాక్షి వెల్లడించారు.

కోయంబత్తూర్ నుండి లండన్‌కు ముగ్గురు మహిళల రోడ్ ట్రిప్

అయినప్పటీ 24 దేశాల మీదుగా సాగే మా ప్రయాణంలో అనేక సవాళ్లు ఎదుర్కోవాల్సి ఉంటుంది, ప్రధానంగా ఉబ్జెకిస్తాన్‌లో ఇంధన లభించకపోవడం, ఈ సమస్యను అధిగమించేందుకు బారీ స్థాయిలో స్టాక్ ఉంచుకునే ఏర్పాట్లు చెేసుకున్నట్లు లిపారు.

కోయంబత్తూర్ నుండి లండన్‌కు ముగ్గురు మహిళల రోడ్ ట్రిప్

ఈ యాత్రలో ఉన్న మరో మహిళ మూకాంబికా మాట్లాడుతూ, తన ఎనిమిదేళ్ల కుమార్తెకు దూరంగా వెళుతున్నట్లు చెప్పుకొచ్చారు. ఈ యాత్ర ప్రారంభించడానికి కొన్ని రోజుల ముందు ఆరోగ్యం, ఫిట్‌నెస్ మరియు మానసింక పరంగా అనేక కసరత్తులు చేసినట్లు తెలిపారు.

కోయంబత్తూర్ నుండి లండన్‌కు ముగ్గురు మహిళల రోడ్ ట్రిప్

ముందుగా రాసుకున్న ప్రణాళిక ప్రకారం రోజుకు ఇన్ని కిలోమీటర్లు లెక్కన ఏరోజుకారోజు యాత్రను పూర్తి చేసుకుంటూ ముందుకు సాగాల్సి ఉంటుంది. అయితే ఈ 70 రోజుల్లో ఆరోగ్యం పరంగా ఎలాంటి ఇబ్బందిపడకుండా అన్ని వాతావరణ పరిస్థితులను ఎదుర్కునేందుకు సిద్దపడినట్లు తెలిపారు.

కోయంబత్తూర్ నుండి లండన్‌కు ముగ్గురు మహిళల రోడ్ ట్రిప్

యాత్రలో పాల్గొన్న మరో మహిళ 55 ఏళ్ల ప్రియా రాజ్‌పాల్ మాట్లాడుతూ, ప్రతిష్టాత్మకమైన దేశం దాటి, ఖండాలను దాటి సాగే మా యాత్రను విజయవంతంగా పూర్తిచేయడానికి ధృడనిశ్చయంతో ఉన్నట్లు చెప్పుకొచ్చారు.

కోయంబత్తూర్ నుండి లండన్‌కు ముగ్గురు మహిళల రోడ్ ట్రిప్

వీరి యాత్రలో వాహనంలో తలెత్తే చిన్న చిన్న రిపేర్లను సరిచేసుకునేందుకు ట్రైనింగ్ కూడా తీసుకున్నారు. ఎలాంటి సమస్యలు వస్తాయి, టైర్లను మార్చడం వంటివాటి గురించి ముగ్గురు మహిళలు తర్పీదు పొందారు. కాబట్టి వాహనానికి ఎదైనా సమస్య వచ్చినా ఎదుర్కునేందుకు సిద్దంగా ఉన్నారు.

కోయంబత్తూర్ నుండి లండన్‌కు ముగ్గురు మహిళల రోడ్ ట్రిప్

తయ యాత్రకు అన్ని ఏర్పాట్లు చేసి, సహాయసహకారాలు అందించిన కుంటుబ సభ్యులకు, మిత్రులకు మరియు అధికారులకు ధన్యవాదాలు తెలుపుతూ యాత్రను ప్రారంభించారు. ఈ ముగ్గురు మహిళ సంకల్పంతో ప్రారంభించిన సాహస యాత్ర విజయవంతం కావాలని కోరుకుందాం...

Most Read Articles

English summary
Three Indian Women Coimbatore To London Road Trip
Story first published: Tuesday, March 28, 2017, 13:13 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X