ప్రపంచంలో కెల్లా 10 అత్యుత్తమ ఎయిర్‌లైన్స్

By Ravi

మానవుడు కనుగొన్న వాటిలో విమానం చాలా గొప్పది. వేల మైళ్ల దూర ప్రయాణాన్ని సైతం గంటల్లో చేరుకోవటం క్క విమానంతోనే సాధ్యమవుతుంది. ఈ విమాన సేవలను ప్రజలు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రపంచ వ్యాప్తంగా అనేక విమానయాన కంపెనీలు పుట్టుకొచ్చాయి. అయితే, వాటిలో బెస్ట్ ఎయిర్‌లైన్స్ సంస్థ ఏదో తెలుసుకునేందుకు ఓ సర్వే నిర్వహించారు.

మరిన్ని టాప్ 10 కథనాల కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి

ప్రపంచ వ్యాప్తంగా సుమారు 245కి పైగా విమానయాన సంస్థలపై నిర్వహించిన ఈ సర్వేలో పది విమానయాన సంస్థలు అత్యుత్తమ సంస్థలుగా నిలిచాయి. మరి ఆ టాప్ బెస్ట్ ఎయిర్‌లైన్స్ సంస్థలు ఏవో ఈ కథనంలో తెలుసుకుందాం రండి.

మరింత సమాచారం తర్వాతి సెక్షన్‌లో.. మరిన్ని వివరాలను ఈ ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి..!

10 అత్యుత్తమ ఎయిర్‌లైన్స్

తర్వాతి స్లైడ్‌లలో ప్రపంచంలో కెల్లా 10 అత్యుత్తమ ఎయిర్‌లైన్స్ గురించి తెలుసుకోండి.

10. లుఫ్తాన్సా

10. లుఫ్తాన్సా

ఈ సంస్థను 1953లో స్థాపించారు, దీని సేవలు మాత్రం 1955లో ప్రారంభమయ్యాయి. జర్మనీకి చెందిన లుఫ్తాన్సా ఎయిర్‌లైన్స్ వద్ద 282 విమానాలు ఉన్నాయి. మొత్తం 215 గమ్యాలకు సేవలు అందిస్తుంది. ఈ జాబితాలో లుఫ్తాన్సా ఎయిర్‌లైన్స్ స్థానం పది.

9. ఎతిహాద్ ఎయిర్‌వేస్

9. ఎతిహాద్ ఎయిర్‌వేస్

ఈ జాబితాలో తొమ్మిదవ స్థానంలో ఉన్నది దుబాయ్‌కి చెందిన ఎతిహాగ్ ఎయిర్‌వేస్. ఈ సంస్థ వద్ద మొత్తం 104 విమానాలున్నాయి. ఇది 96 గమ్యస్థానాలకు ప్రయాణీకులను చేరవేస్తుంది. 2003లో ప్రారంభమైన ఈ ఎయిర్‌లైన్స్ ఇప్పటి వరకు 30కి పైగా అవార్డులు దక్కించుకుంది.

8. ఏషియన్ ఎయిర్‌లైన్స్

8. ఏషియన్ ఎయిర్‌లైన్స్

26 ఏళ్ల క్రితం 1988లో ప్రారంభించబడిన ఏషియన్ ఎయిర్‌లైన్స్ ఈ జాబితాలో 8వ స్థానంలో ఉంది. దక్షిణ కొరియాకు చెందిన ఈ ఎయిర్‌లైన్స్ వద్ద 84 విమానాలున్నాయి, ఇటీవలే మరో 35 విమానాలకు ఈ సంస్థ ఆర్డర్ పెట్టింది. సియోల్ ప్రధాన కార్యలయంగా పనిచేసే ఈ సంస్థ 108 గమ్యస్థానాలకు ప్రయాణీకులను చేరవేస్తుంది.

7. గరుడా ఇండోనేషియా

7. గరుడా ఇండోనేషియా

గరుడా ఇండోనేషియా ఎయిర్‌లైన్స్ సంస్థను 1947లో ప్రారంభించారు, దీని సేవలు మాత్రం 1949లో అందుబాటులోకి వచ్చాయి. ఈ జాబితాలో 7వ స్థానంలో ఉన్న గరుడా ఇండోనేషియా ఎయిర్‌సైన్స్ వద్ద 120 విమానాలున్నాయి. ఈ సంస్థ 35 డొమెస్టిక్, 21 ఇంటర్నేషనల్ డెస్టినేషన్లకు విమాన సేవలు అందిస్తుంది. దీని హెడ్‌క్వార్టర్స్ బాన్టెన్‌లో ఉంది.

6. ఆల్ నిప్పన్ ఎయిర్‌వేస్ (ఏఎన్ఏ)

6. ఆల్ నిప్పన్ ఎయిర్‌వేస్ (ఏఎన్ఏ)

జపాన్‌కు చెందిన ఆల్ నిప్పన్ ఎయిర్‌వేస్ సంస్థను 1952లో ప్రారంభించారు. ఈ సంస్థ వద్ద మొత్తం 202 విమానాలున్నాయి. ఇది 73 గమ్యస్థానాలకు ప్రయాణీకుల చేరవేస్తుంది. జపాన్‌లోని టోక్యో నగరంలో దీని ప్రధాన కార్యాలయం ఉంది. కార్గో సేవలు అందించేందుకు గాను ఈ సంస్థ వద్ద తొమ్మిది బోయింగ్ 767-300 విమానాలు కూడా ఉన్నాయి.

5. టర్కిష్ ఎయిర్‌లైన్స్

5. టర్కిష్ ఎయిర్‌లైన్స్

టాప్ 5 స్థానంలో ఉన్నది టర్కిష్ ఎయిర్‌లైన్స్. ఈ సంస్థను 1933లో ప్రారంభించారు, ప్రపంచంలో కెల్లా ఇది నాల్గవ అతిపెద్ద విమానయాన సంస్థగా ఉంది. ఈ సంస్థ వద్ద మొత్త 258 ప్యాసింజర్ విమానాలు, తొమ్మిది కార్గో విమానాలు ఉన్నాయి. ఇది 257 గమ్యస్థానాలకు ప్రయాణీకులను చేరవేస్తుంది.

4. ఎమిరేట్స్

4. ఎమిరేట్స్

ఈ జాబితాలో నాల్గవ స్థానంలో ఉన్నది దుబాయ్‌కి చెందిన ఎమిరేట్స్. 1985లో స్థాపించిన ఈ విమానయాన సంస్థ వద్ద మొత్తం 211 విమానాలు ఉన్నాయి. ఒక్క 2013 సంవత్సరంలోనే ఈ కంపెనీ 200 విమానాలకు ఆర్డర్ ఇచ్చింది. ఇది 142 గమ్యస్థానాలకు ప్రయాణీకులను చేరవేస్తుంది.

3. సింగపూర్ ఎయిర్‌లైన్స్

3. సింగపూర్ ఎయిర్‌లైన్స్

టాప్ 3లో ఉన్నది సింగపూర్ ఎయిర్‌లైన్స్. 1947లో స్థాపించిన ఈ సంస్థ ప్రపంచంలో కెల్లా అతిపెద్ద విమానం ఎయిర్‌బస్ ఏ380ని కొనుగోలు చేసిన మొదటి కంపెనీ కూడా ఇదే. ఈ సంస్థ వద్ద 106 విమానాలు ఉన్నాయి, ఇవి 62 గమ్యస్థానాలకు ప్రయాణీకులను చేరవేస్తాయి.

2. ఖతార్ ఎయిర్‌వేస్

2. ఖతార్ ఎయిర్‌వేస్

ప్రపంచంలో కెల్లా అత్యుతమ విమానయాన సంస్థలలో ద్వితీయ స్థానంలో ఉన్నది ఖతార్ ఎయిర్‌వేస్. ఈ సంస్థ 133 విమానాలు ఉన్నాయి, ఇవి 144 గమ్యస్థానాలకు ప్రయాణీకులను చేరవేస్తాయి. ఈ సంస్థను 1993లో స్థాపించారు, దీని ప్రధాన కార్యాలయం ఖతార్‌లోని దోహా వద్ద ఉంది.

1. కేథీ పసిఫిక్ ఎయిర్‌వేస్

1. కేథీ పసిఫిక్ ఎయిర్‌వేస్

ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్న కేథీ పసిఫిక్ ఎయిర్‌వేస్. హాంగ్‌కాంగ్‌కు చెందిన ఈ విమానయాన సంస్థను 1946లో స్థాపించారు. ఇది మొత్తం 141 విమానాలతో 112 గమ్యస్థానాలకు ప్రయాణీకులను చేరవేస్తుంది.

Most Read Articles

English summary
The aeroplane is one of man's greatest inventions. It has shrunk the size of the world and proven to be the quickest way to get from one distant place to another. Over the years, several airline companies have made travel easier and accessible for people across the world.
Story first published: Monday, August 4, 2014, 14:01 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X