కార్ మైలేజ్ - అపోహలు మరియు వాస్తవాలు

కార్లను కొనుగోలు చేసే కస్టమర్లు, తమ కారు విషయంలో ప్రాధాన్యత ఇచ్చే అంశాల్లో మైలేజ్ కూడా ఒకటి. తాము కొనుగోలు చేసే కారు కొత్తదైనా లేదా పాతదైనా సరే మైలేజ్ విషయంలో వారు ప్రత్యేక దృష్టి సారిస్తుంటారు. వాస్తవానికి, కారు రన్నింగ్ కాస్ట్‌ను తగ్గించుకోవాలంటే ఎక్కువ మైలేజీనిచ్చే కార్లనే కొనుగోలు చేయటం మంచిది.

నిజానికి కార్ కంపెనీలు సర్టిఫై చేసే మైలేజ్ గణాంకాలు చాలా సందర్భాల్లో పేపరుకు మాత్రమే పరిమితమై ఉంటాయి. రియల్ వరల్డ్ డ్రైవింగ్ కండిషన్స్‌లో, కంపెనీలు పేర్కొన్నట్లుగా ఖచ్చితమైన మైలేజీని పొందటం సాధ్యం కాదు. అలాగే, మరికొన్ని సందర్భాల్లో కంపెనీ పేర్కొన్న మైలేజీ కన్నా ఎక్కువ మైలేజీ వచ్చిన సంఘటనలు కూడా ఉన్నాయి.

సందర్భం ఏదేతైనేం, ఇక్కడ మైలేజ్ అనేది ముఖ్యం. కార్ మైలేజ్ మనం నడిపే తీరు, రోడ్డు, లోడ్, టైర్ ప్రెజర్ ఇలా అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. అయితే, కార్ మైలేజ్ విషయంలో చాలా మందికి కొన్ని అపోహలు ఉండి ఉంటాయి. ఈనాటి మన కార్ టాక్ శీర్షికలో అలాంటి అపోహలను, వాస్తవాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి.

కార్ మైలేజ్ - అపోహలు మరియు వాస్తవాలు

తర్వాతి స్లైడ్‌లలో కారు మైలేజీకి సంబంధించిన అపోహలను, వాస్తవాలను తెలుసుకోండి.

అపోహ

అపోహ

ఉదయాన్నే లేదా చల్లటి వేళ్లలో పెట్రోల్ ఫిల్ చేయించుకుంటే మంచిది. ఇలా చేయటం వలన పెట్రోల్ ఆవిరి కాకుండా ఉంటుంది.

ఫ్యాక్ట్

ఫ్యాక్ట్

ఇది అవాస్తవం. పెట్రోల్ అధిక ఉష్ణోగ్రతల వద్ద ఆవిరి అయ్యి, గాలిలో కలిసిపోయే స్వభావాన్ని కలిగి ఉండటం నిజమే అయినప్పటికీ, పెట్రోల్‌ని ఉదయం లేదా మధ్యాహ్నం ఫిల్ చేసుకోవటంలో పెద్ద తేడా ఉండదు. ఎందుకంటే, పెట్రోల్ బంకులలో ఈ ఇంధనాన్ని భామిలోపల ఉండే భారీ ట్యాంకులలో భద్రపరుచుతారు. ఆ ప్రాంతంలో ఉష్ణోగ్రతలు దాదాపు చల్లగానే ఉంటాయి. ఒకవేళ పెట్రోల్‌ని భూమి బయట స్టోర్ చేసి ఉంటే మాత్రమే ఇలా జరిగేందుకు ఆస్కారం ఉంటుంది.

అపోహ

అపోహ

ఎయిర్ కండిషనర్‌ను ఆఫ్ చేసి డ్రైవ్ చేస్తే, ఇంజన్‌పై లోడ్ తగ్గి బెటర్ మైలేజ్ లభిస్తుంది.

ఫ్యాక్ట్

ఫ్యాక్ట్

ఇందులో కొంత వాస్తవం, కొంత అవాస్తవం కూడా ఉంది. ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న కార్లలో ఉపయోగిస్తున్న మోడ్రన్ ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్‌లు ఎక్కువ సామర్థ్యాన్ని కలిగి ఉండి, మంచి పనితీరును కనబరుస్తాయి. అలాగని మైలేజ్ పెరగటం కోసం కారు అద్దాలను దించి డ్రైవ్ చేస్తే, దాని వలన కలిగే అదనపు ఏరోడైనమిక్ డ్రాగ్ వలన వాహనంపై మరింత అధిక భారం పడి, ఆదా చేయాలనుకున్న మైలేజ్ కాస్తా ఆవిరైపోతుంది. ఒకవేళ ఏసి ఆన్ చేసుకొని డ్రైవ్ చేసినప్పటికీ, మైలేజ్‌లో వచ్చే వ్యత్యాసం చాలా నామమాత్రంగానే ఉంటుంది.

అపోహ

అపోహ

ఇంజన్‌ను కొన్ని నిమిషాల పాటు ఐడిల్‌గా ఉంచడం కన్నా ఇంజన్‌ను తరచూ ఆన్/ఆఫ్ చేయటం వల్లనే ఎక్కువ ఇంధనం ఖర్చు అవుతుంది.

ఫ్యాక్ట్

ఫ్యాక్ట్

ఇది పూర్తిగా అవాస్తం. దశాబ్ధాల క్రితం కార్బురేటర్లు మరియు కంప్యూటర్ రహిత నియంత్రిత వాహనాలలో బహుశా ఇది నిజమై ఉండచ్చేమో కానీ, ప్రస్తుత మోడ్రన్ కార్ల విషయంలో మాత్రం ఇది నిజం కాదు. ఈ విషయంలో రూల్ ఒక్కటే.. మీ కారును 90 సెకండ్ల కన్నా ఎక్కువ సేపు ఐడిల్‌గా ఉంచాల్సి వచ్చినప్పుడు, ఇంజన్‌ను ఆఫ్ చేయటమే ఉత్తమం. ఇంజన్ ఆన్/ఆఫ్ చేయటం కన్నా ఐడిల్‌గా ఉంచడం వల్లనే ఎక్కువ ఇంధనం ఖర్చు అవుతుంది.

అపోహ

అపోహ

మీ పికప్ ట్రక్కు టెయిల్‌గేట్‌ను డౌన్ చేసి నడిపినట్లయితే, అది తక్కువ ఫ్లాట్ బెడ్‌పై తక్కువ గాలి వత్తిడిని కలుగ జేస్తుంది, ఫలితంగా మీరు బెటర్ మైలేజ్ పొందగలరు.

ఫ్యాక్ట్

ఫ్యాక్ట్

ఇది అవాస్తం. మోడ్రన్ పికప్ ట్రక్కులను బెటర్ ఏరోడైనమిక్స్‌తో డిజైన్ చేస్తున్నారు. ఖాలీగా ఉన్న పికప్ ఫ్లాట్ బెడ్‌పై గాలి ప్రవాహం తేలికగా ఉండేలా వీటిని డిజైన్ చేస్తున్నారు. ఉదాహరణకు ఫోర్డ్ ఎఫ్-150 వంటి పికప్ ట్రక్కులు ఈ విధంగా డిజైన్ చేయబడినవే. కాబట్టి, ఖాలీగా ఉన్న పికప్ ట్రక్కులను నడుపుతున్నప్పుడు, దాని టెయిల్ గేట్‌ని డౌన్ చేయాల్సిన అవసరం లేదు.

అపోహ

అపోహ

మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్ (గేర్‌బాక్స్) కలిగిన కార్లతో పోల్చుకుంటే ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ కలిగిన కార్లు ఎల్లప్పుడూ తక్కువ మైలేజీని ఆఫర్ చేస్తాయి.

ఫ్యాక్ట్

ఫ్యాక్ట్

ఇది అవాస్తం. ఒకప్పటి ఆటోమేటిక్ కార్ల విషయంలో ఇది నిజమే, కానీ ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న మోడ్రన్ టెక్నాలజీ మరియు మోడ్రన్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ల వలన మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్‌తో సమానంగా (కొన్ని సందర్భాల్లో అధనంగా) మైలేజీని పొందవచ్చు. ఇటీవలే అందుబాటులోకి వచ్చిన ఏఎమ్‌టి (ఆటోమేటెడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్) కూడా మ్యాన్యువల్‌తో సమానమైన మైలేజీని ఆఫర్ చేస్తుంది.

అపోహ

అపోహ

టెలివిజన్లు, మ్యాగజైన్లు, సేల్స్‌మెన్‌లు చెప్పే ఇంధనం ఆదా చేసే పరికరాలను ఉపయోగిస్తే మైలేజ్ పెరుగుతుందా?

ఫ్యాక్ట్

ఫ్యాక్ట్

ఇది అవాస్తవం. ఇంజన్‌లోని యాంత్రిక వ్యవస్థ సరిగ్గా పనిచేస్తున్నంత కాలం, మైలేజ్ కోసం అందులో ఎలాంటి అదనపు పరికరాలను ఉపయోగించాల్సిన అవసరం లేదు. ఇలాంటి పరికరాలను ఉపయోగించడం వలన మైలేజ్ పెరగడం మాటేమో కానీ, వాటి వలన ఇంజన్ దెబ్బతినే ప్రమాదం ఉంది.

అపోహ

అపోహ

ఫ్యూయెల్ లాకింగ్ క్యాప్స్‌ను ఉపయోగిస్తే, దొంగలు పెట్రోల్‌ని చోరీ చేసే అవకాశం ఉండదు.

ఫ్యాక్ట్

ఫ్యాక్ట్

ఇది అవాస్తవం. పాత కార్లలో (ఊరికే ఊడిపోయే/ఓపెన్ అయ్యే ఫ్యూయెల్ క్యాప్ కలిగిన కార్లలో) ఈ సమస్య ఉండేదేమో కానీ, ప్రస్తుత మోడ్రన్ కార్లలో ఇలాంటి సమస్య లేదు. కాబట్టి, ఫ్యూయెల్ ఫిల్లింగ్ స్పాట్ నుంచి ఇంధనం దొంగిలించే ప్రమాదం ఉండదు. అలాంటప్పుడు అదనంగా ఫ్యూయెల్ లాకింగ్ క్యాప్స్‌ను వినియోగించాల్సిన అవసరం లేదు.

అపోహ

అపోహ

కారు టైర్లలో సరైన గాలి లేకపోతే, మైలేజ్ తగ్గుతుందా?

ఫ్యాక్ట్

ఫ్యాక్ట్

ఇది వాస్తవం. టైర్లలో నిర్దేశిత గాలి పీడనం కన్నా తక్కువ గాలి ఉన్నప్పుడు, వాహనంపై అధిక భారం పడి, తక్కువ మైలేజ్ లభిస్తుంది. ఇలా నడపటం వలన మైలేజ్ తగ్గటమే కాదు, టైర్లు కూడా త్వరగా పాడవుతాయి. మీ కారు టైర్లలో ఎంత మోతాదులో గాలి నింపాలనే విషయాన్ని, మీ కారు డ్రైవర్ సైడ్ డోరుపై అంటించిన స్టిక్కర్‌పై ముద్రించబడి ఉంటుంది.

అపోహ

అపోహ

ప్రీమియం పెట్రోల్ వాడితే మైలేజ్ పెరుగుతుందా?

ఫ్యాక్ట్

ఫ్యాక్ట్

ఇది వాస్తవం. అయితే, మైలేజ్ పెరుగుదల చాలా నామ మాత్రంగానే ఉంటుంది. కానీ రెగ్యులర్ పెట్రోల్‌కి, ప్రీమియం పెట్రోల్‌కి మాత్రం ధరలో ఎక్కువ వ్యత్యాసం కూడా ఉంటుంది. అయితే, ప్రీమియం పెట్రోల్ లభ్యత కూడా చాలా పరిమితంగా ఉంటుంది.

Most Read Articles

English summary
Mileage is one of the most important factor that car buyers considering while buying new or used cars. Here are the myths and facts about the mileage of cars.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X