నార్త్ కొరియా జలాంతర్గామిని కోల్పోయినప్పటికీ భాదపడలేదు...ఎందుకో తెలుసా ?

By Anil

ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఒక దేశం మరొక దేశం మీద తీవ్ర ఆరోపణలు చేయడం సహజం. అందులో ఈ మధ్య నార్త్ కొరియా తమ దేశానికి చెందిన జలాంతర్గామి తప్పిపోయిందని తెలిపినట్లు సమాచారం. అయితే తాజాగా నార్త్ కొరియా తమ శత్రు దేశాలు అయిన అమెరికా మరియు దక్షిణ కొరియాల మీద తీవ్ర ఆరోపణలు చేస్తోంది.

అయితే ప్రస్తుతం నార్త్ కొరియా వద్ద దాదాపుగా 70 వరకు జలాంతర్గాములు ఉన్నట్లు తెలిసింది. ఒక చిన్న దేశానికి ఇన్ని అవసరం అంటారా...? అందుకే ప్రంపచ వ్యాప్తంగా అత్యధికంగా జలాంతర్గామిలను కలిగి ఉన్న టాప్-10 దేశాలు గురించి క్రింది కథనంలో ఇవ్వడం జరిగింది. మరి ఇందులో భారత్ ఎన్నవ స్థానంలో ఉందో చూద్దాం రండి.

జలాంతర్గామిని కోల్పోయిన నార్త్ కొరియా : అమెరికాపై ఆరోపణలు

నార్త్ కొరియా నిజంగానే 70 సబ్‌మెరైన్‌లను కలిగి ఉంది. అంతే కాకుండా నార్త్ కొరియా అశ్చర్యం కలిగించే విధంగా తమ తప్పిపోయిన జలాంతర్గామికి కారణం అమెరికా మరియు సౌత్ కొరియాలే అని తీవ్ర ఆరోపణలు చేస్తోంది.

Picture credit: U.S. Navy/Wiki Commons

జలాంతర్గామిని కోల్పోయిన నార్త్ కొరియా : అమెరికాపై ఆరోపణలు

అయితే గత వారంలో ఈ ఆరోపణలకు తెరతీసిన సమయం నుండే నార్త్ కొరియాకు చెందిన జలాంతర్గామి తప్పిపోయిందా, మునిగిపోయిందా లేక ఇంకా తేలియాడుతూ ఉందా అనే ప్రశ్నగానే మిగిలిపోయింది.

Picture credit: U.S. Navy/Wiki Commons

జలాంతర్గామిని కోల్పోయిన నార్త్ కొరియా : అమెరికాపై ఆరోపణలు

అమెరికాకు చెందిన ప్రముఖ ఛానెల్ సిఎన్ఎన్ మరియు అమెరికా అధికార యంత్రాంగం కూడా ఇదే విదంగా నార్త్ కొరియాకు చెందిన సబ్‌మెరైన్ గురించి ప్రశ్నార్థకంగా ఉంది అని తెలిపాయి. ఈ సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా శక్తివంతమైన జలాంతర్గాములను కలిగి ఉన్న టాప్-10 దేశాలు గురించి తరువాత స్లైడర్ల నుండి తెలుసుకోగలరు.

Picture credit: RT

10. గ్రీస్

10. గ్రీస్

జలాంతర్గాముల సంఖ్య పరంగా టాప్-10 దేశాల జాబితాలో గ్రీస్ పదవ స్థానంలో ఉంది. ప్రస్తుతం గ్రీస్ వద్ద 11 సబ్‌మెరైన్‌లు కలవు. వీటిని సంఖ్యను పెంచుకునే పనిలో ఉంది గ్రీస్.

 09. టర్కీ

09. టర్కీ

తొమ్మిదవ స్థానంలో ఉన్న టర్కీ ప్రస్తుతం 13 జలాంతర్గాములను కలిగి ఉంది. టర్కీ నేవీ దాదాపుగా 48,600 సైన్యాన్ని కలిగి ఉంది.

08. భారత దేశం

08. భారత దేశం

దేశ వ్యాప్తంగా అత్యంత శక్తివంతమైన సైనిక బలాన్ని కలిగి దేశాలలో జాబితాలో మన దేశం నాలుగువ స్థానంలో ఉంది. అదే నేవీ పరంగా గల జలాంతర్గాముల విషయంలో 14 సబ్‌మెరైన్‌లతో ఎనిమిదవ స్థానంలో ఉంది. అంతే కాకుండా అకులా అనే ఒక అణు జలాంతర్గామిని కూడా కలిగి ఉంది.

07.దక్షిణ కొరియా

07.దక్షిణ కొరియా

దక్షిణ కొరియా నావికా ధళం యొక్క బలం పరంగా ఏడవ స్థానంలో ఉంది. ఇది 15 జలాంతర్గామిలను కలిగి ఉంది.

06. జపాన్

06. జపాన్

ఆరవ స్థానంలో ఉన్న జపాన్ 17 జలాంతర్గామిలను కలిగి ఉంది. ఈ 17 జలాంతర్గాములుకు ఎలాంటి నౌకల్ని అయినా నీటి ముంచే సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి.

05. ఇరాన్

05. ఇరాన్

ఐదవ స్థానంలో ఉన్న ఇరాన్ ఏకంగా 33 జలాంతర్గామిలను కలిగి ఉంది. మధ్య పాశ్చ్య దేశాలకు చెందిన మూడు జలాంతర్గాములు వీరి జాబితాలో కలవు. అందులో రష్యా తయారు చేసిన కిలో క్లాస్ సబ్‌మెరైన్‌లను ఇది కలిగి ఉంది.

04. రష్యా

04. రష్యా

యుద్దమే ఆరంభం అయితే దానికి జలాంతర్గాములు ఎంతగానో ఉపయోగపడుతాయని రష్యా గట్టిగా నమ్ముతోంది. అందుకే కాబోలు రష్యా ఏకంగా 60 జలాంతర్గామిలను కలిగి ఉంది. ఈ సంఖ్యతో ఇది నాలుగవ స్థానంలో ఉంది.

03. చైనా

03. చైనా

ప్రపంచ వ్యాప్తంగా విస్తీర్ణం మరియు జనాభా పరంగా అతి పెద్ద దేశం చైనా. అంతే కాకుండా దీనికి భారీ స్థాయిలో సముద్ర తీర ప్రాంత కూడా ఉంది. చైనా మొత్తం 68 సబ్‌మైరైన్‌లను కలిగి ఉంది. ఇందులో న్యూక్లియర్, డీజిల్ మరియు ఎలక్ట్రిక్ పవర్‌ ద్వారా నడిచే అన్ని రకాల జలాంతర్గాములు కలవు.

02.ఉత్తర కొరియా

02.ఉత్తర కొరియా

ఉత్తర కొరియా అణు శక్తి మరియు కృత్రిమ ఇందన వనరులైన డీజల్ మరియు విధ్యుత్ ద్వారా నడిచే జలాంతర్గామిలను కలిగి ఉంది. మొత్తం 70 సబ్‌మెరైన్‌లతో రెండవ స్థానంలో ఉంది. అయితే తాజాగా ఉత్తర కొరియా కథనం ప్రకారం ఒక జలాంతర్గామి తప్పిపోయింది కాబట్టి ప్రస్తుతం దీని వద్ద 69 ఉంటాయన్నమాట.

Picture credit: RT

01. అమెరికా

01. అమెరికా

ప్రపంచ వ్యాప్తంగా అత్యంత శక్తి వంతమైన సైనిక బలాన్ని మరియు ఎక్కువ జలాంతర్గామిలను కలిగి ఉన్న దేశాల జాబితాలో అమెరికా మొదటి స్థానంలో ఉంది. అణు శక్తి మరియు కృత్రిమ ఇందన వనరులైన డీజల్ మరియు విధ్యుత్ ద్వారా నడిచే 75 జలాంతర్గామిలను కలిగి ఉంది.

Picture credit: U.S. Navy/Wiki Commons

మరిన్ని ఆసక్తికరమైన కథనాలు మీ కోసం...
  • నార్త్ కొరియాను బయపెడుతున్న అమెరికన్ బోయింగ్ బి-52 బాంబర్
  • ఇండియా-పాకిస్తాన్‌ల మధ్య నెలకొన్న యుద్ద వాతావరణం....?
  • అత్యంత శక్తివంతమైన సైనిక బలాన్ని కలిగిన ప్రపంచ దేశాలు

Most Read Articles

English summary
North Korea Has Lost A Submarine! Here Are Some Highlights
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X