బడ్జెట్ కార్లలో ఉండాల్సిన టాప్ 10 కార్ యాక్ససరీలు

By Ravi

సాధారణంగా ప్రస్తుతం మార్కెట్లలో లభించే బేసిక్/బడ్జెట్ కార్లలో చాలా ఫీచర్లు/యాక్ససరీలు లభ్యం కావు. ఎంట్రీ లెవల్ కార్లను కొనుగోలు చేసే కస్టమర్లు ఆఫ్టర్ మార్కెట్ యాక్ససరీస్‌తో తమ కారును తమకు నచ్చిన విధంగా మార్చుకుంటూ ఉంటారు.

కొన్ని బేసిక్ కార్లలో అయితే, వినోదం కూడా మ్యూజిక్ సిస్టమ్ కూడా అందుబాటులో ఉండదు. కస్టమర్లు ఇలాంటి కనీస ఫీచర్లను అధీకృత డీలరు నుంచి కానీ లేదా బయటి మార్కెట్లో అందుబాటులో ఉన్న కార్ యాక్ససరీ దుకాణాల నుంచి కానీ కొనుగోలు చేయవచ్చు.

మరి ఈనాటి మన కార్ టాక్ కథనంలో బేసిక్ కార్లలో ఉండాల్సిన టాప్ 10 కార్ యాక్ససరీస్ ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి..!

రిమోట్ లాకింగ్

రిమోట్ లాకింగ్

బేసిక్ బడ్జెట్ కార్లలో రిమోట్ సెంట్రల్ లాకింగ్ కూడా ఉండదు. కారును లాక్ చేయాలనుకున్న ప్రతిసారి, కారు దగ్గరకు వెళ్లి కీతో లాక్ చేయాల్సి ఉంటుంది. అదే రిమోట్ లాకింగ్ ఫీచర్ ఉన్నట్లయితే, కారును దూరం నుంచే లాక్ చేసుకోవచ్చు. ఈ ఫీచర్‌ను ఆఫ్టర్ మార్కెట్ నుంచి కొనుగోలు చేయవచ్చు.

జిపిఎస్ నావిగేషన్

జిపిఎస్ నావిగేషన్

కొత్త రూట్లలో ప్రయాణం చేసేవారికి, తెలియన్ రోడ్లపై వాహనం నడిపే వారికి జిపిఎస్ నావిగేషన్ చక్కగా దారి చూపుతుంది. ప్రస్తుతం మార్కెట్లో చాలా తక్కువ ధరకే జిపిఎస్ నావిగేషన్ పరికరాలు లభ్యమవుతున్నాయి. జిపిఎస్ ఉంటే మనం వెళ్లే రూట్, వెళ్లాల్సిన దూరం తదితర విషయాలను తెలుసుకోవచ్చు.

మ్యాజిక్ సిస్టమ్

మ్యాజిక్ సిస్టమ్

బేసిక్ కార్లలో మ్యాజిక్ సిస్టమ్ కూడా లభ్యం కాదు. ప్రస్తుతం మార్కెట్లో అనేక రకాల మ్యూజిక్ సిస్టమ్స్ అందుబాటులో ఉన్నాయి. అందులో బేసిక్ మ్యూజిక్ సిస్టమ్ మొదలుకొని డబుల్ డిన్ ఆడియో సిస్టమ్ వరకూ లభ్యమవుతున్నాయి. కారులో ఇది ఉంటే సంగీతంతో సరదాగా ముందుకు సాగిపోవచ్చు.

రివర్స్ పార్కింగ్ సెన్సార్స్

రివర్స్ పార్కింగ్ సెన్సార్స్

రివర్స్ పార్కింగ్ సెన్సార్లతో కారును సురక్షితంగా రివర్స్ చేయటమే కాకుండా, కారును సురక్షితంగా పార్క్ చేయటానికి మరియు కారు వెనుక ఉండే స్థితిగతులను తెలుసుకోవటం సులువు అవుతుంది.

ఫుల్ వీల్ క్యాప్స్

ఫుల్ వీల్ క్యాప్స్

బేసిక్ కార్లు స్టీల్ వీల్స్‌తో లభిస్తాయి, కాబట్టి వాటికి మరింత అందమైన లుక్ కల్పించాలంటే ఫుల్ వీల్ క్యాప్స్ అమర్చుకోవాలి. స్టీల్ వీల్స్‌కి ఫుల్ వీల్ క్యాప్స్ అమర్చకుంటే, అవి దూరం నుంచి చూడటానికి అల్లాయ్ వీల్స్‌గా లభిస్తాయి.

సీట్ కవర్స్

సీట్ కవర్స్

సీట్ కవర్స్ కారులోని ఇంటీరియర్‌కి మరింత అందాన్ని తెచ్చిపెట్టడమే కాకుండా, మంచి డ్రైవింగ్ సౌకర్యాన్ని కూడా అందిస్తాయి. మీకు ఇన్‌సైడ్ పార్కింగ్ లేకుండా ఉండి, ఎక్కువ సమయం ఎండలో కారును పార్క్ చేయాల్సి వస్తే మాత్రం బ్లాక్ సీట్ కవర్స్‌ని ఉపయోగించకండి, ఎందుకంటే ఇవి త్వరగా వేడెక్కుతాయి.

ఫ్లోర్ మ్సాట్స్

ఫ్లోర్ మ్సాట్స్

సాధారణంగా బేసిక్ కార్లలో కొన్ని కంపెనీలు ఫ్లోర్ మ్సాట్స్‌ని ఆఫర్ చేయవచ్చు లేదా చేయకపోవచ్చు. కానీ, కారులో ఫ్లోర్ మ్యాట్స్ ఉండటం తప్పనిసరి. ఇవి కారులోకి దుమ్ము, ధూళి చేరకుండా ఉంచేందుకు సహకరిస్తాయి.

బ్లూటూత్/స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ

బ్లూటూత్/స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ

కారులో బ్లూటూత్/స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ ఉన్నట్లయితే యూజర్ ఎక్స్‌పీరియెన్స్ మరింత మెరుగ్గా ఉంటుంది. సాధారణంగా మనం ఎంచుకునే ఆడియో సిస్టమ్‌లోనే ప్రీమియం వెర్షన్‌ను ఎంచుకున్నట్లయితే, ఈ ఫీచర్ లభిస్తుంది.

ఫాగ్ ల్యాంప్స్

ఫాగ్ ల్యాంప్స్

బేసిక్ కార్లలో ఫాగ్ ల్యాంప్స్ ఆప్షన్ ఉంటుంది కానీ, అందులో ఫాగ్ ల్యాంప్స్ ఉండవు. ఆఫ్టర్ మార్కెట్ నుంచి కానీ లేదా డీలర్ నుంచి కానీ ఫాగ్ ల్యాంప్స్‌ని కొనుగోలు చేసి అమర్చుకున్నట్లయితే, మరింత అదనపు సేఫ్టీని లభిస్తుంది.

లాంబార్ సపోర్ట్

లాంబార్ సపోర్ట్

కారులో లాంబార్ సపోర్ట్ లాంగ్ డ్రైవ్స్‌కి చక్కగా ఉపయోగపడుతుంది. బ్యాక్ పెయిన్ ఉన్న వారికి కూడా ఇది మంచి సౌకర్యాన్ని ఇస్తుంది.

Most Read Articles

English summary
Here are given top 10 essential Accessories for Budget Cars. Take a look.
Story first published: Thursday, March 5, 2015, 17:01 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X