టాప్ 10 ఫాస్టెస్ట్ ఎలక్ట్రిక్ కార్స్

By Ravi

భవిష్యత్తులో ఎలక్ట్రిక్ కార్లదే హవా. శిలాజ ఇంధనాలు (పెట్రోల్, డీజిల్ వంటి భూమిలో లభించే ఇంధనాలు) అంతరించిపోతున్న తరుణంలో, కార్ కంపెనీలు ప్రత్యమ్నాయ ఇంధనాలతో నడిచే వాహనాలపై దృష్టి సారిస్తున్నారు. ఇందులో ప్రధానంగా, విరివిగా లభించేంది విద్యుత్. కాబట్టి, భవిష్యత్తులో ఎలక్ట్రిక్ కార్లు రాజ్యమేలబోతున్నాయన్నమాట.

ఎలక్ట్రిక్ కార్ల విషయంలో చాలా మందికి కొన్ని అపోహలు ఉన్నాయి. వీటి రేంజ్ తక్కువగా ఉంటుందని, మార్గ మధ్యంలో బ్యాటరీ అయిపోతే చార్జింగ్ కోసం ఇబ్బందులు ఎదుర్కోవాలని, ఇవి ఎక్కువ వేగంతో వెళ్లవని ఇలాంటి అపోహలు చాలానే ఉన్నాయి. అయితే, నానాటికీ అభివృద్ధి చెందుతున్న సాంకేతికతతో ఈ సమస్యలన్నింటికీ చెక్ పెట్టవచ్చు.

ఈనాటి మన ఆఫ్-బీట్ కథనంలో ప్రపంచంలో కెల్లా అత్యంత వేగంగా పరుగులు తీసే టాప్ 10 ఎలక్ట్రిక్ కార్ల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి.

మరింత సమాచారం తర్వాతి సెక్షన్‌లో.. మరిన్ని వివరాలను ఈ ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి..!

టాప్ 10 ఫాస్టెస్ట్ ఎలక్ట్రిక్ కార్స్

తర్వాతి స్లైడ్‌లలో ప్రపంచంలో కెల్లా అత్యంత వేగంగా పరుగులు తీసే టాప్ 10 ఎలక్ట్రిక్ కార్ల గురించి తెలుసుకోండి.

10. టెస్లా రోడ్‌స్టర్ స్పోర్ట్

10. టెస్లా రోడ్‌స్టర్ స్పోర్ట్

కాలిఫోర్నియాకి చెందిన టెస్లా మోటార్స్ ఎలక్ట్రిక్ కార్ కంపెనీ తొలిసారిగా 2008లో విడుదల చేసిన టెస్లా రోడ్‌స్టర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ కార్, హైవేపై వినియోగించదగిన మొట్టమొదటి పూర్తి ఎలక్ట్రిక్ వాహనం. లిథియం అయాన్ బ్యాటరీలతో నడిచే ఈ ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ కారు పూర్తి చార్జ్‌పై 200 మైళ్ల (320 కిలోమీటర్ల) దూరం నడుస్తుంది. ఇది కేవలం 3.7 సెకండ్ల వ్యవధిలోనే 0-60 మైళ్ల వేగాన్ని అందుకుంటుంది.

9. డెట్రాయిట్ ఎలక్ట్రిక్ ఎస్‌పి:01

9. డెట్రాయిట్ ఎలక్ట్రిక్ ఎస్‌పి:01

అమెరికాకి చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ల తయారీ కంపెనీ డెట్రాయిట్ ఎలక్ట్రిక్ తయారు చేసిన టూ-సీటర్ ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ కార్ 'ఎస్‌పి:01' కేవలం 3.7 సెకండ్ల వ్యవధిలోనే 0-60 మైళ్ల వేగాన్ని అందుకుంటుంది. దీని గరిష్ట వేగం గంటకు 155 మైళ్లు. పూర్తి చార్జ్‌పై ఈ కారులో 180 మైళ్ల (288 కిలోమీటర్ల) దూరం ప్రయాణించవచ్చని కంపెనీ చెబుతోంది.

8. రెనోవో కూపే

8. రెనోవో కూపే

వచ్చే ఏడాది నుంచి అమ్మకాలకు సిద్ధం కానున్న రెనో కూపే ఎలక్ట్రిక్ కారు కేవలం 3.4 సెకండ్ల వ్యవధిలోనే 0-600 మైళ్ల వేగాన్ని అందుకుంటుంది. అంతేకాదు, ఈ కారులోని మరో విశిష్టత ఏంటంటే, ఇది కేవలం 30 నిమిషాల వ్యవధిలోనే పూర్తిగా చార్జ్ అవుతుంది. పాత కాలపు కార్ల డిజైన్‌ను తలపించే ఈ మోడ్రన్ రెనోవో కూపే ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ కారు గరిష్టంగా 500 హెచ్‌పిల శక్తిని ఉత్పత్తి చేస్తుంది.

7. టెస్లా మోడల్ ఎస్

7. టెస్లా మోడల్ ఎస్

అమెరికాకి చెందిన పాపులర్ ఎలక్ట్రిక్ కార్ కంపెనీ టెస్లా మోటార్స్ అందిస్తున్న మరో ఎలక్ట్రిక్ కార్ 'మోడల్ ఎస్ పి85డి'లో రెండు ఎలక్ట్రిక్ మోటార్లు ఉంటాయి. ఇవి రెండూ కలిగి గరిష్టంగా 691 హార్స్ పవర్‌ల శక్తిని ఉత్పత్తి చేస్తాయి. ఇది కేవలం 3.2 సెకండ్ల వ్యవధిలోనే 0-60 మైళ్ల వేగాన్ని అందుకుంటుంది. దీని గరిష్ట వేగం గంటకు 155 మైళ్లు.

6. డ్రేసన్ రేసింగ్ బి12/69

6. డ్రేసన్ రేసింగ్ బి12/69

ఈ జాబితాలో ఆరవ స్థానంలో ఉన్నది డ్రేసన్ రేసింగ్ బి12/69 ఎలక్ట్రిక్ కారు. వాస్తవానికి ఇదొక ఫార్ములా వన్ టైప్ కారు. ఇందులో 5.5 లీటర్, బయో-ఫ్యూయెల్డ్ ఇంజన్‌ను తొలగించి ఎలక్ట్రిక్ మోటార్‌ను అమర్చారు. ఈ ఎలక్ట్రిక్ మోటార్ గరిష్టంగా 850 హార్స్ పవర్‌ల శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఈ కారు కేవలం 3 సెకండ్ల వ్యవధిలోనే 0-60 మైళ్ల వేగాన్ని అందుకుంటుంది. దీని గరిష్ట వేగం గంటకు 320 కి.మీ.

5. స్పార్క్-రెనో ఎస్ఆర్‌టి 01ఈ

5. స్పార్క్-రెనో ఎస్ఆర్‌టి 01ఈ

ఈ జాబితాలో ఐదవ స్థానంలో ఉన్నది స్పార్క్-రెనో ఎస్ఆర్‌టి 01ఈ ఎలక్ట్రిక్. వాస్తవానికి ఈ ఎలక్ట్రిక్ రేస్ కారును సాధారణ రోడ్లపై ఉపయోగించేందుకు తయారు చేయలేదు. ఫార్ములా వన్ మాదిరిగా ఈ ఏడాది నుంచి జరుగుతున్న ఫార్ములా ఈ ఎలక్ట్రిక్ కార్ రేసులో పాల్గొనేందుకు ఈ కారును తయారు చేశారు. ఇది కేవలం 3 సెకండ్ల వ్యవధిలోనే 0-62 మైళ్ల వేగాన్ని అందుకుంటుంది.

4. రైట్‌స్పీడ్ ఎక్స్1

4. రైట్‌స్పీడ్ ఎక్స్1

ప్రముఖ రేస్ కార్ల తయారీ కంపెనీ ఏరియల్ ఆటమ్ విక్రయిస్తున్న రైట్‌స్పీడ్ ఎక్స్1 ఎలక్ట్రిక్ రేస్ కార్, కంపెనీ ఆఫర్ చేస్తున్న రెగ్యులర్ రేస్ కారుకి ఎలక్ట్రిక్ వెర్షన్. ఇది కేవలం 2.9 సెకండ్ల వ్యవధిలోనే 0-60 మైళ్ల వేగాన్ని అందుకుంటుంది. ఈ కారు కేవలం కాన్సెప్ట్ దశలోనే మిగిలిపోయింది.

Picture credit: Scott Beale via Flickr

3. రీమ్యాక్ కాన్సెప్ట్ వన్

3. రీమ్యాక్ కాన్సెప్ట్ వన్

గ్రేప్ అనే ఎలక్ట్రిక్ వాహన తయారీ కంపెనీ తయారు చేసిన రిమ్యాక్ ఆటోమొబిలి కాన్సెప్ట్_వన్ హై పెర్ఫామెన్స్ ఎలక్ట్రిక్ కారు గరిష్టంగా 1088 హెచ్‌పిల శక్తిని, 1600 ఎన్ఎమ్‌ల టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఈ కారు కేవలం 2.8 సెకండ్ల వ్యవధిలోనే 0-60 మైళ్ల వేగాన్ని అందుకుంటుంది. దీని గరిష్ట వేగం గంటకు 305 కిలోమీటర్లు.

2. ప్లాస్మాబాయ్ రేసింగ్ వైట్ జోంబీ

2. ప్లాస్మాబాయ్ రేసింగ్ వైట్ జోంబీ

ఈ జాబితాలో ద్వితీయ స్థానంలో ఉన్నది ప్లాస్మాబాయ్ రేసింగ్ వైట్ జోంబీ. ఇదొక 1972 డాట్సన్ కారు. దీనిని వైట్ జోంబీ అని పిలుస్తారు. లక్ష డాలర్ల కన్నా ఎక్కువ ఖరీదు చేసే నావీ హెలికాఫ్టర్లలో ఉపయోగించే ప్రోటోటైప్ బ్యాటరీలతో ఈ కారును ఎలక్ట్రిక్ కారుగా మార్చారు. ఇది కేవలం 1.8 సెకండ్ల వ్యవధిలోనే 0-60 మైళ్ల వేగాన్ని అందుకుంటుంది.

1. ది గ్రిమ్సెల్

1. ది గ్రిమ్సెల్

ప్రపంచంలో కెల్లా అత్యంత వేగంగా పరుగులు తీసే ఎలక్ట్రిక్ కారు గ్రిమ్సెల్. స్విట్జర్లాండ్‌కి చెందిన విద్యార్థులు ఈ కాన్సెప్ట్ కారును తయారు చేశారు. ఇది కేవలం 1.7 సెకండ్ల వ్యవధిలోనే 0-60 మైళ్ల వేగాన్ని అందుకుంటుంది. ఈ వేగాన్ని చేరుకోవటానికి కేవలం 30 మీటర్ల రోడ్డు సరిపోతుంది. అదీ వేగమంటే.

టాప్ 10 ఫాస్టెస్ట్ ఎలక్ట్రిక్ కార్స్

మరి ఎలక్ట్రిక్ కార్లు వేగంగా వెళ్లవు, వీటి యాక్సిలరేషన్ సామర్థ్యం తక్కువగా ఉంటుందనుకునే వారికి ఈ కథనం, తమది కేవలం అపోహ మాత్రమే అని తెలియజేస్తుందని మేము భావిస్తున్నాము. మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో మాతో పంచుకోగలరు.

Most Read Articles

English summary
Many think Electric Vehicles (EV) are slow and expensive to run and maintain. Thats not true. Electric vehicles can be fast since power delivery is instantaneous. They are really cheap to run everyday and the best part- there is no pollution, whether it's sound or air pollution. In our list, we take a look at top 10 fastest electric cars in the world.
Story first published: Monday, December 1, 2014, 11:57 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X