ప్రపంచంలోకెల్లా అత్యంత ఎత్తైన పది వంతెనలు

By N Kumar

వంతెనలు రెండు సముద్రాలు, నదులు, లోయలను దాటడానికి రెండు అత్యంత ఎత్తైన ప్రాంతాలను కలపడానికి కూడా వంతెనలు ఉపయోగపడుతాయి. రావణాసురుడు సీతమ్మను లంకలో దాచితే అమెను రక్షించడానికి ఆంజనేయుడు వారధిని నిర్మించాడు అని ప్రతి ఒక్కరికీ తెలుసు. వంతెనలను నిర్మించే పద్దతిని హనుంతుడు కనుక్కున్నాడు అని చెప్పవచ్చు.

అలా మొదలైన వంతెనల నిర్మాణం నేడు ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో ఎత్తైన వంతెనల నిర్మాణం వరకు దారి తీసింది. ప్రపంచంలో ఎన్నో ఎత్తైన అత్భుతమైన వంతెనల నిర్మాణం జరిగింది. అందులో పదింటిని క్రింది కథనం ద్వారా తెలుసుకుందాం రండి.

 10. బైపన్ రివర్ హుకున్ ఎక్స్‌ప్రెస్ వే బ్రిడ్జి

10. బైపన్ రివర్ హుకున్ ఎక్స్‌ప్రెస్ వే బ్రిడ్జి

ప్రదేశం: చైనా

ఎత్తు: 318 మీటర్లు

బైపన్ హుకున్ ఎక్స్‌ప్రెస్ వే వంతనెను 2009 కన్నా ముందు నిర్మించారు. ఇది సస్పెన్షన్‌ బ్రిడ్జ్ కూడా. దీనిని చైనాలోని గుఝియో ప్రాంతంలో నిర్మించారు. దీనిని జి60 షాంఘై-కన్మింగ్ రహదరారి మీద 636 మీటర్లు మేర నిర్మించారు.

09. లిషుఇ రివర్ బ్రిడ్జ్

09. లిషుఇ రివర్ బ్రిడ్జ్

ప్రదేశం: చైనా

ఎత్తు: 330 మీటర్లు

లిషుఇ బ్రిడ్జిని 2013లో నిర్మించారు. తొమ్మిదవ స్థానంలో ఉన్న దీనిని కూడా చైనాలో నిర్మించారు. 856 మీటర్లు పొడవున ఉన్న ఈ వంతెన వ్రేలాడే వంతెన. దీనిని చైనాలోని యాంగ్‌డింగ్ జిల్లాలో నిర్మించారు. దీని ద్వారా దీనికి ఇరువైపులా ఉన్న ప్రాంతాలకు ప్రయాణించడానికి సగానికి పైగా తక్కువ సమయం పడుతుంది.

08. ఏఝాయ్ వంతెన

08. ఏఝాయ్ వంతెన

ప్రదేశం: చైనా

ఎత్తు: 336 మీటర్లు

ఎనిమిదవ స్థానంలో ఉన్న దీనిని కూడా చైనాలోనే నిర్మించారు. ఇది చైనాలోని ఛాంగ్కింగ్ మున్సిపాలిటీ నుండి షాంగ్‌షాలను కలపుతుంది. ఈ జాబితాలో ఇది ఎనిమిదవ స్థానంలో నిలవడమే కాదు. అత్యంత ఎత్తైన మరియు పొడవైన బ్రిడ్జి రెండు సొరంగాల మధ్య నిర్మింతమైన వంతెనగా ప్రపంచంలోనే మొదటిదిగా నిలిచింది.

07. లియుచాంగ్ రివర్ బ్రిడ్జి

07. లియుచాంగ్ రివర్ బ్రిడ్జి

ప్రదేశం: చైనా

ఎత్తు: 340 మీటర్లు

ఏడవ స్థానంలో ఉన్న ఈ వంతెన కూడా చైనాలోనే ఉంది. తీగల ద్వారా వ్రేలాడే వంతెనను 2013 లో నిర్మించారు. దీనిని లియుచింగ్‌లోని జార్జ్ నదీ మీద నిర్మించారు. దీని పొడవు 438 మీటర్లుగా ఉంది.

06. గ్యాగ్జింగ్ హైవే బ్రిడ్జ్

06. గ్యాగ్జింగ్ హైవే బ్రిడ్జ్

ప్రదేశం: చైనా

ఎత్తు: 366 మీటర్లు

ప్రపంచ వ్యాప్తంగా ఎత్తైన వంతెనలలో ఆరవ స్థానంలో ఉంది ఈ బైపన రివర్ గ్యాగ్జింగ్ హై వే వంతెన. దీనిని 2003 లో నిర్మించారు.

05. బాలింగ్ రివర్ వంతెన

05. బాలింగ్ రివర్ వంతెన

ప్రదేశం: చైనా

ఎత్తు: 370 మీటర్లు

చైనాకు చెందిన మరొక వంతెన వరుసగా ఐదవ స్థానంలో ఉంది. దీనిని బాలింగ్ నది మీద రెండు కొండలను అనుసంధానం చేస్తూ నిర్మించారు. చైనాలోని జి60 షాంఘై-కన్మింగ్ రహదారిని అనుసంధానం చేయడానికి నిర్మించారు. ఈ రహదారి మీద ఇది రెండవ వంతెన.

4. బలార్టీ వంతెన

4. బలార్టీ వంతెన

ప్రదేశం: మెక్సికో

ఎత్తు: 390

నాలుగు స్థానంలో ఉన్న ఈ బలార్టీ కేబుల్ వంతెన 520 మీటర్ల పొడవున కలదు. కేబుళ్ల ద్వారా వ్రేలాడే అత్యంత ఎత్తైన వంతెనల జాబితాలో మరియు అమెరికాలో కూడా ఇది మొదటి స్థానంలో ఉంది. 2012 లో ప్రారంభించిన ఈ వంతెన డ్యురాంగో మరియు మజట్లాన్ జాతీయ రహదారి మీద కలదు.

 03. క్వింగ్షూయి రివర్ బ్రిడ్జి

03. క్వింగ్షూయి రివర్ బ్రిడ్జి

ప్రదేశం: చైనా

ఎత్తు: 406 మీటర్లు

మూడవ అత్యంత ఎత్తైన బ్రిడ్జి చైనాలో కలదు. 1.130 మీటర్లు పొడవున్న ఈ వంతెన గుయెంగ్ రహదారిలో భాగంగా ఉంది. ఈ వంతెన నిర్మాణానికి సుమారుగా 128 మిలియన్ పౌండ్లను ఖర్చు చేశారు. ఈ వంతెన ద్వారా వెంగ్‌యాన్ దేశం మరియు గుయాంగ్ మధ్య గల 100 మైళ్ల దూరాన్ని కేవలం 23 మైళ్లు వచ్చేలా కుదించారు.

02. పులి వంతెన

02. పులి వంతెన

ప్రదేశం: చైనా

ఎత్తు: 485 మీటర్లు

మళ్లీ రెండవ స్థానంలో ఉన్న బ్రిడ్జి చైనాకు చెందిన పులి వంతెన. దీనిని జి56 హ్యాంగ్‌ఝూయి రూయిలి ఎక్స్‌ప్రెస్ వే మీద ఉన్న లియుపాన్‌షి మరియు జాన్వే ప్రాంతాలను కలిపే దారిలో ఉంది. దీనిని 2015 లో ప్రారంభించారు. ఈ వంతెన పొడవు 628 మీటర్లుగా ఉంది.

01. సిడు రివర్ బ్రిడ్జ్

01. సిడు రివర్ బ్రిడ్జ్

ప్రదేశం: చైనా

ఎత్తు: 496 మీటర్లు

ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ఎత్తైన వంతెనగా చైనాలోని సిడు బ్రిడ్జి మొదటి స్థానంలో నిలిచింది. ఇది సుమారుగా 900 మీటర్లు పొడవుగా ఉంది. చైనాలోని జి50 హోయు ఎక్స్‌ప్రెస్‌ వే రహదారిలో భాగంగా ఉన్న దీనిని 2009 లో ప్రారంభించారు.

 ప్రపంచంలోకెల్లా అత్యంత ఎత్తైన పది వంతెనలు

జీవితంలో చూసిన తీరాల్సిన రోడ్లు మరియు వంతెనలు

Most Read Articles

English summary
Top 10 Highest Bridges In The World: How High Is The Highest?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X