టాప్ 10 ఐకానిక్ మూవీ కార్స్

సినిమాలకి, కార్లకి మధ్య అవినాభావ సంబంధం ఉంటుంది. కొన్ని సినిమాల్లో కార్లకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంటే, మరికొన్ని సినిమాలు కేవలం కార్లతోనే ముడిపడి ఉంటాయి. ఏదేమైనప్పటికీ, క్లాసిక్ సినిమాలు మొదలుకొని మోడ్రన్ సినిమాల వరకు, ప్రతి తరంలోను వివిధ రకాలను కార్లను మనం చూస్తూ వచ్చాం.

మరిన్ని టాప్ 10 కథనాల కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి

అయితే, కొన్ని సినిమాల్లో కనిపించే కార్లు కేవలం సినిమాలకు మాత్రమే పరిమితం అవుతుంటాయి. నిజజీవితంలో అలాంటి కార్లను మనం చూడటం సాధ్యం కాకపోవచ్చు. కొన్ని సినిమాల్లో కార్లు ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటే, మరికొన్ని సినిమాలు కేవలం కార్లను గుర్తింపు తెచ్చుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి.

ఈనాటి మన ఆఫ్ బీట్ కథనంలో టాప్ 10 ప్రముఖ మూవీ కార్స్ గురించి తెలుసుకుందాం రండి.

మరింత సమాచారం తర్వాతి సెక్షన్‌లో.. మరిన్ని వివరాలను ఈ ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి..!

టాప్ 10 ఐకానిక్ మూవీ కార్స్

తర్వాతి స్లైడ్‌లలో టాప్ 10 ఐకానిక్ మూవీ కార్స్ గురించి తెలుసుకోండి.

బంబల్ బీ

బంబల్ బీ

బంబల్ బీ చిత్రంలో గార్డియన్ రోబోట్‌గా ఉండే షెవర్లే కమారో కారు కూడా మంచి పాపులారిటీని దక్కించుకుంది. సాధారణ ప్రజల్లో ఓ రెగ్యులర్ కారు మాదిరిగా దాగి ఉండే ఈ ఆటోబోట్, చిత్రంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఈ చిత్రంలో షెవర్లే కమారో కారు సాధారణంగా డ్రైవ్ చేసుకునే కారు గాను మరియు భూమిని రక్షించే భారీ రోబోటో గాను మారిపోతుంటుంది.

ఘోస్ట్ బస్టర్స్

ఘోస్ట్ బస్టర్స్

ఘోస్ట్ బస్టర్స్ అనే ఆంగ్ల చిత్రం కోసం ఉపయోగించిన 1959 కాడిలాక్ లేగా ఎక్టో 1 అనే వాహనం అత్యంత ఫేమస్ అయ్యింది. అంబులెన్స్ స్టయిల్‌లో ఉండే ఈ కారును అత్యధికంగా మోడిఫై చేశారు. సినిమాలో దెయ్యాలను వేటాండేందుకు వీలుగా ఈ కారును అనేక ఆయుధాలు, పరికాలతో తీర్చిదిద్దారు.

బ్యాక్ టు ది ఫ్యూచర్

బ్యాక్ టు ది ఫ్యూచర్

మన బాలక్రిష్ణ నటించిన తెలుగు సినిమా ఆదిత్య 369 మాదిరిగా హాలీవుడ్‌లో కూడా బ్యాక్ టు ది ఫ్యూచర్ అనే పేరుతో ఓ చిత్రం నిర్మితమైంది. ప్రస్తుతం నుంచి గతంలోకి ప్రయాణించేందుకు వీలుగా ఈ చిత్రంలో టైమ్ మెషీన్ లాంటి కారును తయారు చేశారు. డెలోరియన్ డిఎమ్‌సి-12 అనే కారును అత్యధికంగా మోడిఫై చేసి ఈ చిత్రంలో ఉపయోగించారు. ఈ చిత్రంలో ఇది న్యూక్లియర్ రియాక్షన్ వలన ఏర్పడే విద్యుత్తుతో పనిచేస్తుంది. వాస్తవానికి ఈ కారు ఓ ఫ్లాప్ మోడల్ అయినప్పటికీ, బ్యాక్ టు ది ఫ్యూచర్ చిత్రం వలన ఈ కారు ఫేమస్ అయ్యింది. ప్రస్తుతం ఈ కారును హాలీవుడ్‌లోని యూనివర్సల్ స్టూడియోలో ప్రదర్శనకు ఉంచారు.

హెర్బీ

హెర్బీ

హెర్బీ చిత్రం పేరు వినగానే 1963 మోడల్ ఫోక్స్‌వ్యాగన్ బీటెల్ కారు గుర్తుకు వస్తుంది. రేసింగ్ కారును తలపించేలా మోడిఫై చేసిన ఈ కారు, హెర్బీ చిత్రం ద్వారా మంచి పాపులారిటీని దక్కించుకుంది.

మ్యాడ్ మ్యాక్స్

మ్యాడ్ మ్యాక్స్

మ్యాడ్ మ్యాక్స్ చిత్రంలో ఉపయోగించిన 1974 ఫోర్డ్ ఫాల్కన్ కారు కూడా ఫేమస్ మూవీ కారుగా నిలిచింది. ఆస్ట్రేలియా మార్కెట్లో అమ్ముడవుతున్న హార్డ్ టాప్ లిమిటెడ్ ఎడిషన్ మోడల్‌ను సేకరించి, ఈ చిత్రంలో ఉపయోగించారు.

నైట్ రైడర్

నైట్ రైడర్

నైట్ రైడర్ అనే హాలీవుడ్ చిత్రం కోసం ప్రత్యేకంగా తయారు చేసిన సూపర్ కారు ఇది. దీని పేరు ది పోంటియాక్ ఫైర్‌బర్డ్ ట్రాన్స్ యామ్. ఈ చిత్రంలో హీరో చెడుపై పోరాటం చేసేందుకు గాను తయారు చేసిన కారు ఇది. ఈ 1982 స్పోర్స్ట్ మోడల్ ధర 1,00,000 డాలర్లు.

ఫాస్ట్ అండ్ ఫ్యూరియెస్

ఫాస్ట్ అండ్ ఫ్యూరియెస్

ఫాస్ట్ అండ్ ఫ్యూరియెస్ చిత్రం అంటేనే కార్ల పండుగ. ఈ చిత్రంలో అత్యంత పాపులర్ అయిన కారు డాడ్జ్ చార్జర్. ఒరిజినల్ ఫాస్ట్ అండ్ ఫ్యూరియెస్ చిత్రం కోసం ప్రత్యేకంగా 900 హార్స్ పవర్‌ల శక్తిని ఉత్పత్తి చేసేలా ఈ కారును తయారు చేశారు.

బ్యాట్‌‌మ్యాన్

బ్యాట్‌‌మ్యాన్

బ్యాట్‌‌మ్యాన్ సిరీస్‌లో ఇప్పటికే అనేక చిత్రాలు వచ్చాయి, ఈ చిత్రాల్లో అనేక రకాల బ్యాట్‌మొబైల్స్ (బ్యాట్‌మ్యాన్ ఉపయోగించే వాహనాల)ను ఉపయోగించారు. అయితే, వీటన్నింటిలో కెల్లా అత్యంత పాపులర్ అయిన మాత్రం 1955 లింకన్ ఫ్యూచురా కాన్సెప్ట్, అప్పట్లో దీనిని మోడల్ చేసేందుకు అయిన ఖర్చు 30,000 డాలర్లు.

స్కై ఫాల్

స్కై ఫాల్

జేమ్స్ బాండ్ చిత్రాలలో కార్లకు ఓ ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. ఇందులో అత్యంత పాపులర్ అయిన కారు ఆస్టన్ మార్టిన్ డిబి5. ఈ కారును అనేక జేమ్స్ బాండ్ చిత్రాల్లో ఉపయోగించారు. జేమ్స్ బాండ్ చిత్రాల ద్వారా ఈ కారు మంచి గిరాకీ ఏర్పడింది, ఈ మోడల్ అమ్మకాలు కూడా జోరందుకున్నాయి.

గాన్ ఇన్ 60 సెకండ్స్

గాన్ ఇన్ 60 సెకండ్స్

గాన్ ఇన్ 60 సెకండ్స్ అనే హాలీవుడ్ చిత్రంలో ఉపయోగించిన 1967 ఫోర్డ్ మస్టాంగ్ కారు కూడా మంచి పాపులారిటీని దక్కించుకుంది. ఈ కారును స్టీవ్ స్టాన్‌ఫోర్డ్ ప్రత్యేకంగా కస్టమైజ్ చేశారు. ఈ కండలు తిరిగిన ఫోర్డ్ మస్టాంగ్ కారుకు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు.

Most Read Articles

Read in English: Top 10 Iconic Movie Cars
English summary
Here in our list, we take a look at a few cars that have appeared in movies and proved that they were not simply modes of getting around, but they created a lasting impression on us. Whether they were just plain getaway cars or cars that helped keep the bad guys under control, these cars were truly iconic.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X