అద్భుతమైన & ప్రఖ్యాత 10 భారత రహదారులు

By N Kumar

మన భారతదేశంలో రహదారులకు ఓ ప్రత్యేకత ఉంది. ప్రపంచంలో కెల్లా అత్యధిక దూరం రోడ్ నెట్‌వర్క్ కలిగిన దేశాల్లో మన దేశం ద్వితీయ స్థానంలో ఉంది.

భారతదేశ రోడ్ నెట్‌వర్క్‌లో 1000 కిలోమీటర్లకు పైగా ఎక్స్‌ప్రెస్‌వేలు, 79,243 కిలోమీటర్ల మేర జాతీయ రహదారులు, 13.19 లక్షల కిలోమీటర్ల మేర రాష్ట్ర రహదారులు మరియు ఇతర ప్రధాన జిల్లా, గ్రామీణ రహదారులు ఉన్నాయి. కాగా.. ఈ రోడ్ నెట్‌వర్క్ విస్తరణ ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉంది.

భారత్‌లో అద్భుతమైన 10 రహదారుల గురించి కొన్ని ఆసక్తికర విషయాలను క్రింది కథనం ద్వారా తెలుసుకుందాం రండి.........

అతి పొడవైన జాతీయ రహదారి

అతి పొడవైన జాతీయ రహదారి

మన దేశంలో అతి పొడవైన జాతీయ రహదారి ఎన్‌హెచ్7. ఇది 4572 కిమీ పొడవు కలిగి ఉంది. ఇది వారణాసి నుంచి కన్యాకుమారిని కలుపుతూ పోతుంది.

బెస్ట్ నేషనల్ ఎక్స్‌ప్రెస్‌వే

బెస్ట్ నేషనల్ ఎక్స్‌ప్రెస్‌వే

అహ్మదాబాద్ వడోదరా ఎక్స్‌ప్రెస్‌వే భారతదేశంలోని బెస్ట్ ఎక్స్‌ప్రెస్‌వేలలో ఒకటి, దీనిని నేషనల్ ఎక్స్‌ప్రెస్‌‍వే 1 అని కూడా పిలుస్తారు. మొత్తం 95 కిలోమీటర్ల పొడవు ఉన్న ఈ ఎక్స్‌ప్రెస్‌వే అహ్మదాబాద్-వడోదరాలను కలుపుతుంది, దీనిని గోల్డెన్ క్వాడ్రిలటెరల్ ప్రాజెక్ట్ క్రింద్ 2004లో నిర్మించారు

పొడవైన ఫ్రీవే

పొడవైన ఫ్రీవే

చెన్నై పోర్ట్ మధురవాయల్ ఎలివేటెడ్ ఎక్స్‌ప్రెస్‌వే దేశంలో కెల్లా అతి పొడవైన ఫ్రీవే. ఇది 19 కి.మీ పొడవు ఉంది.

అతి పొడవైన టన్నల్ రోడ్డు

అతి పొడవైన టన్నల్ రోడ్డు

మనదేశంలో కెల్లా అతి పొడవైన టన్నల్ రోడ్డు చెనాని నాష్రి టన్నల్ లేదా పట్నిటాప్ టన్నల్ రోడ్డు. జమ్మూ అండ్ కాశ్మీర్‌లోని ఉధంపూర్ జిల్లాలో ఉన్న చెనాని వద్ద ఈ టన్నల్ రోడ్డు నిర్మించారు. ఈ టన్నల్ మొత్తం పొడవు 9.2 కిలోమీటర్లు

క్లవర్‌లీఫ్ ఇంటర్‌చేంజ్

క్లవర్‌లీఫ్ ఇంటర్‌చేంజ్

చెన్నైలోని కత్తిపారా జంక్షన్ వద్ద ఉన్న క్లవర్‌లీఫ్ ఇంటర్‌చేంజ్ దేశంలో కెల్లా అతిపెద్దది. ఇది కేవలం భారతదేశంలోనే కాదు, ప్రపంచంలో కెల్లా అతిపెద్ద క్లవర్‌లీఫ్ ఇంటర్‌చేంజ్. ఇది గ్రాండ్ సథరన్ ట్రంక్ రోడ్, ఇన్నర్ రింగ్ రోడ్, పూనమల్లే రోడ్, అన్నా సలై జంక్షన్లను కలుపుతుంది.

అతిపెద్ద అర్బన్ ఫ్లైఓవర్

అతిపెద్ద అర్బన్ ఫ్లైఓవర్

బెంగుళూరులోని హెబ్బాల్ ఫ్లైఓవర్ దేశంలో కెల్లా అతిపెద్ద అర్బన్ ఫ్లైఓవర్. దీని పొడవు 5.23 కిలోమీటర్లు. ఇది అవుటర్ రింగ్ రోడ్డుని, బళ్లారి రోడ్డును కలుపుతుంది. భారతదేశంలోని సివిల్ ఇంజనీరింగ్ వండర్లలో హెబ్బాల్ ఫ్లైఓవర్ కూడా ఒకటి.

అతి పొడవైన రివర్ బ్రిడ్జ్

అతి పొడవైన రివర్ బ్రిడ్జ్

బిహార్‌లోని గంగా నదిపై నిర్మించిన మహాత్మా గాంధీ సేతు దేశంలో కెల్లా అతి పొడవైన రివర్ బ్రిడ్జ్. ఇది పాట్నా, హాజీపూర్‌లను కలుపుతుంది. ఇది 5.5 కిలోమీటర్ల పొడవు ఉంది. ఇదొక 4-లేన్ బ్రిడ్జ్.

అతిపొడవైన రైల్ కమ్ రోడ్ బ్రిడ్జ్

అతిపొడవైన రైల్ కమ్ రోడ్ బ్రిడ్జ్

మనదేశంలో కెల్లా అతిపొడవైన రైల్ కమ్ రోడ్ బ్రిడ్జ్ రాజమండ్రిలోని గోదావరి నదిపై నిర్మించారు. ఒకే వంతెనపై క్రింది భాగంలో రైలు, పైభాగంలో వాహనాలు వెళ్తుంటాయి. ఇది దేశంలోనే కాదు ఆసియాలోనే రెండవ అతిపెద్ద రోడ్ కమ్ రైల్ బ్రిడ్జ్. ఇది 2.7 కిలోమీటర్లు పొడవు ఉంది.

అతి పొడవైన సీ బ్రిడ్జ్

అతి పొడవైన సీ బ్రిడ్జ్

దేశంలో కెల్లా అతి పొడవైన సీ బ్రిడ్జ్ బంద్రా వోర్లీ సీ లింక్. ఇది బాంద్రా, వోర్లీ ప్రాంతాలను కలుపుతుంది, ఇది ప్రతిపాదిత వెస్టర్న్ ఫ్రీవేలో భాగం. ఇది కేబుల్ ఆధారిత బ్రిడ్జ్. దీని మొత్తం పొడవు 22 కిలోమీటర్లు.

అతిపెద్ద టోల్ ప్లాజా

అతిపెద్ద టోల్ ప్లాజా

దేశంలో కెల్లా అతిపెద్ద టోల్ ప్లాజా ఢిల్లీ-గుర్గావ్ ఎక్స్‌ప్రెస్‌వే రూట్లో ఢిల్లీ-గుర్గావ్ బార్డర్ వద్ద ఉంది. ఇక్కడ 32 టోల్ బూత్‌లు ఉన్నాయి. ఇది దేశంలోనే కాదు ఆసియా మొత్తంలో కెల్లా అతిపెద్ద టోల్ ప్లాజా.

Most Read Articles

English summary
Here we are go tell about top 10 indian road facts. tallest roads and more.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X