ఐపిఎల్‌లో టాప్ 10 క్రికెటర్లు మరియు వారి అద్బుతమైన కార్లు

పదవ ఐపిఎల్ సందర్భంగా మీకు నచ్చిన క్రికెట్ తారలు మరియు వారి ఖరీదైన దిగ్గజ కార్ల గురించి ఇవాళ్టి కథనంలో తెలుసుకుందాం రండి....

By Anil

ప్రపంచ క్రికెట్ ప్రియులకు అత్యంత ఇష్టమైన పదవ ఐపిఎల్ ఘనంగా ప్రారంభమైంది. భారతదేశపు ఎనిమిది ప్రధాన నగరాలను జట్టు పేర్లుగా ఎంచుకుని జాతీయ మరియు అంతర్జాతీ ఆటగాళ్ల కలయికతో సాగే ఈ పదవ ఐపిఎల్ మ్యాచ్‌లు అత్యంత రసవత్తరంగా సాగుతున్నాయి.

ఒక్కో జట్టుది ఒక్కో ప్రత్యేకత, ఒక్కో ఆటగాడిది ఒక్కో శైలి. వీరి శైలి మరియు ఆట తీరు పరంగా మీరు మెచ్చే టాప్ 10 క్రికెటర్లు మరియు వారి ఖరీదైన విలాసవంతమైన కార్ల గురించి నేటి కథనంలో తెలుసుకుందాం రండి...

1. ఏబి డివిల్లియర్స్ - ఆర్‌సిబి

1. ఏబి డివిల్లియర్స్ - ఆర్‌సిబి

దక్షిణాఫ్రికాకు చెందిన దిగ్గజ ఆటగాడు ఏబి డివిల్లియర్స్ పూర్తి పేరు అబ్రహాం జేమ్స్ డివిల్లియర్స్. దక్షిణాఫ్రికాలోని ప్రిటోరియాలో ఫిబ్రవరి 17, 1984 లో జన్మించాడు. ప్రపంచపు అత్యుత్తమ బ్యాట్స్‌మెన్‌లలో ఒకరైన ఏబి డివిల్లియర్స్ రాయల్ ఛాలెంజర్స్ ఆఫ్ బెంగళూరు జట్టులో ఆడుతున్నాడు.

 ఐపిల్‌లో టాప్ 10 క్రికెటర్లు మరియు వారి అద్బుతమైన కార్లు

బంతిని బౌండరీలమయం చేసే ఏబి డివిలియర్స్ వద్ద ఆడి క్యూ7 మరియు బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్5 కార్లు ఉన్నాయి. 3.0-లీటర్ సామర్థ్యం ఉన్న పెట్రోల్ ఇంజన్ గల ఆడి క్యూ7 ధర రూ. 84.6 లక్షలు మరియు బిఎమ్‌డబ్ల్యూ ఎమ్-స్పోర్ట్ కారు ఉంది దీని ధర రూ. 72.8 లక్షలు. (భారత దేశపు ధరలు).

 2. రవీంద్ర జడేజా - గుజరాత్ లయన్స్

2. రవీంద్ర జడేజా - గుజరాత్ లయన్స్

భారత క్రికెట్టులో ఆల్ రౌండర్‌గా ఉన్న రవీంద్ర జడేజా గుజరాత్‌లోని సౌరస్త్రా ప్రాంతంలో డిసెంబర్ 06, 1988న జన్మించాడు. ప్రస్తుతం గుజరాత్ లయన్స్ జట్టులో ఆడుతున్నాడు.

 ఐపిల్‌లో టాప్ 10 క్రికెటర్లు మరియు వారి అద్బుతమైన కార్లు

ప్రస్తుతం రవీంద్ర జడేజా వద్ద ఆడి క్యూ3 మరియు ఆడి క్యూ7 కార్లు ఉన్నాయి. వీటి ధరలు వరుసగా రూ. 37.2 లక్షలు మరియు 84.6 లక్షలు ఆన్ రోడ్ ఢిల్లీగా ఉన్నాయి.

3. విరాట్ కోహ్లి - ఆర్‌సిబి

3. విరాట్ కోహ్లి - ఆర్‌సిబి

ప్రస్తుతం ఆర్‌సిబి మరియు భారత క్రికెట్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న విరాట్ కోహ్లి నవంబర్ 05, 1988లో ఢిల్లీలో జన్మించాడు. మలేషియాలో జరిగిన మ్యాచ్‌లో అద్వితీయమైన ఆట ఆడి 2008 ప్రపంచ కప్‌ సాధనకు కారకుడయ్యాడు.

 ఐపిల్‌లో టాప్ 10 క్రికెటర్లు మరియు వారి అద్బుతమైన కార్లు

విరాట్ కోహ్లి క్రికెట్ తరువాత అతిగా ఇష్టపడేది కార్లు. విరాట్ భారీ సంఖ్యలో సూపర్ మరియు లగ్జరీ కార్లు ఉన్నాయి. ప్రస్తుతం విరాట్ వద్ద ఉన్న ఖరీదైన కార్లలో ఆడి ఆర్8 వి10 ప్లస్ ఒకటి. దీని ధర రూ. 2 కోట్లుగా ఉంది. 5.2-లీటర్ సామర్థ్యం ఉన్న వి10 ఇంజన్ గరిష్టంగా 517బిహెచ్‌పి పవర్ మరియు 530ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేయును.

4. రోహిత్ శర్మ - ముంబై ఇండియన్స్

4. రోహిత్ శర్మ - ముంబై ఇండియన్స్

ముంబై ఇండియన్స్ జట్టుకు ప్రాతనిథ్యం వహిస్తోన్న రోహిత్ శర్మ ఏప్రిల్ 30, 1987 లో మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో జన్మించాడు. ముంబాయ్ నగరం నుండి రంజీ ట్రోఫీల్లో వచ్చి భారత్ జట్టుకు ఎంపికయ్యి, బ్యాట్స్‌మెన్‌గా రాణిస్తున్నాడు.

 ఐపిల్‌లో టాప్ 10 క్రికెటర్లు మరియు వారి అద్బుతమైన కార్లు

రోహిత్ శర్మ వద్ద 1.39 కోట్ల ఖరీదైన బిఎమ్‌డబ్ల్యూ ఎమ్5 కారు ఉంది. ఇందులో 4.4-లీటర్ సామర్థ్య గల ట్విన్ టుర్బో వి8 పెట్రోల్ ఇంజన్ కలదు. ఇది గరిష్టంగా 560బిహెచ్‌పి పవర్ మరియు 680ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేయును.

 5. హర్బజన్ సింగ్ ముంబాయ్ ఇండియన్స్

5. హర్బజన్ సింగ్ ముంబాయ్ ఇండియన్స్

ముంబై ఇండిన్స్ జట్టులో ఉన్న దిగ్జజ బౌలర్లలో ఒకరు హర్బజన్ సింగ్. జూలై 01, 1980లో పంజాబ్ రాష్ట్రంలోని జలంధర్ ప్రాంతలో జన్మించాడు. హర్బజన్ కెరీర్ ప్రారంభించిన తొలినాళ్లలో ఆందోళనకరమైన ఫ్యాషన్లకు చోటిచ్చి ఫేమస్ అయిపోడు.

హర్బజన్ సింగ్ హమ్మర్ హెచ్2

హర్బజన్ సింగ్ హమ్మర్ హెచ్2

హర్బజన్ సింగ్ హమ్మర్ హెచ్2 వాహనాన్ని వినియోగిస్తున్నాడు. దిగుమతి పన్నులతో కలుపుకుని దీని ధర సుమారుగా రూ. 75 లక్షలకు పైగానే ఉంది. 6.0-లీటర్ సామర్థ్యం ఉన్న వి8 ఇంజన్ గరిష్టంగా 393బిహెచ్‌పి పవర్ మరియు 563ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేయును.

సురేష్ రైనా - గుజరాత్ లయన్స్

సురేష్ రైనా - గుజరాత్ లయన్స్

భారత క్రికెట్ జట్టులో బ్యాట్స్‌మెన్‌గా రాణిస్తున్న సురేష్ రైనా, నవంబర్ 27, 1986లో ఉత్తర ప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో జన్మించాడు. పదవ ఐపిల్ సీజన్‌లో గుజరాత్ లయన్స్ జట్టుకు కెప్టెన్‌గా ప్రాతినిథ్యం వహిస్తున్నాడు.

 ఐపిల్‌లో టాప్ 10 క్రికెటర్లు మరియు వారి అద్బుతమైన కార్లు

సురేష్ రైనా వద్ద పోర్షే బాక్ట్సర్ కారు కలదు. దీని ప్రారంభ ధర రూ. 1.02 కోట్లు రుపాయలుగా ఉంది. ఇందులో 2.7లీటర్ సామర్థ్యం గల ఫ్లాట్-6 ఇంజన్ కలదు. ఈ శక్తివంతమైన ఇంజన్ గరిష్టంగా 315బిహెచ్‌పి పవర్ మరియు 360ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేయును.

యువరాజ్ సింగ్ - సన్ రైజర్స్ ఆఫ్ హైదరాబాద్

యువరాజ్ సింగ్ - సన్ రైజర్స్ ఆఫ్ హైదరాబాద్

అండర్ 19 లెవల్‌లో క్రికెట్ బాల్‌కు క్లీన్ హిట్లను రుచిచూపించి, జూనియర్స్‌ క్రికెట్‌లో సునామీ సృష్టించాడు. సన్ రైజర్స్ ఆఫ్ హైదరాబాద్‌లో ప్రధాన బ్యాట్స్‌మెన్‌గా ఉన్న యువరాజ్ డిసెంబర్ 12, 1981లో చండీఘర్‌లో జన్మించాడు.

 ఐపిల్‌లో టాప్ 10 క్రికెటర్లు మరియు వారి అద్బుతమైన కార్లు

యువరాజ్ వద్ద లాంబోర్గినీ మెర్సియలాజ్. లాంబోర్గిని తమ లైనప్ నుండి దీనిని తొలగించింది. ఇందులో 6.5-లీటర్ సామర్థ్యం గల వి12 పెట్రోల్ ఇంజన్ కలదు. ఇది గరిష్టంగా 631బిహెచ్‌పి పవర్ మరియు 660ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేయును.

 మహీంద్రా సింగ్ ధోని - రైసింగ్ పూనే సూపర్ నైట్స్

మహీంద్రా సింగ్ ధోని - రైసింగ్ పూనే సూపర్ నైట్స్

అత్యుత్తమ క్యాప్టెన్‌గా మహేంద్ర సింగ్ ధోనీని ప్రధాన ఉదాహరణగా తీసుకోవచ్చు. ధోని సారథ్యంలో భారత క్రికెట్ జట్టు అనేక అసాధ్యాలను సుసాధ్యం చేసింది. ప్రస్తుతం జరుగుతున్న 10 వ ఐపిల్‌లో రైసింగ్ పూనే సూపర్ నైట్స్ జట్టు వైపు ఆడుతున్నాడు. జూలై 07, 1981లో రాంచీలో జన్మించాడు.

ఐపిల్‌లో టాప్ 10 క్రికెటర్లు మరియు వారి అద్బుతమైన కార్లు

మహీంద్రా సింగ్ ధోనికి ఇష్టమై వెహికల్‌ ఏదంటే జిఎమ్‌సి సియెర్రా అని నిక్కచ్చితంగా చెప్పవచ్చు. ఇంపోర్ట్ ట్యాక్సులతో కలుపుకుంటే ఇండియాలో ఈ జిఎమ్‌సి సియెర్రా ప్రారంభ ధర రూ. 35 నుండి 44 లక్షలుగా ఉంది. ఇందులో 6.6-లీటర్ సామర్థ్యం గల వి8 ఇంజన్ కలదు. ఇది గరిష్టంగా 400బిహెచ్‌పి పవర్ మరియు 1036ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేయును.

గ్లెన్ మ్యాక్స్‌వెల్ - కింగ్స్ లెవన్ పంజాబ్

గ్లెన్ మ్యాక్స్‌వెల్ - కింగ్స్ లెవన్ పంజాబ్

మ్యాక్స్‌వెల్ ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో అక్టోబర్ 14, 1988 న గ్లెన్ జన్మించాడు. కింగ్స్ లెవన్ పంజాబ్ జట్టుకు కెప్టెన్‌గా ఉన్న మ్యాక్స్‌వెల్ తన కెరీర్ తొలినాళ్లలో అంతర్జాతీయ క్రికెటర్‌గా ఓ వెలుగు వెలిగాడు. గ్లెన్ మ్యాక్స్‌వెల్ ఆల్ రౌండర్ ప్లేయర్.

ఐపిల్‌లో టాప్ 10 క్రికెటర్లు మరియు వారి అద్బుతమైన కార్లు

గ్లెన్ మ్యాక్స్‌వెల్ నిస్సాన్‌కు చెందిన మ్యాక్సిమా కారును వినియోగిస్తున్నాడు. సుమారుగా 16 ఏళ్ల క్రితం నాటి కారునే ఇంకా వినియోగిస్తుండటంతో మ్యాక్స్‌వెల్‌కు ఎంత ప్రత్యేకమో తెలుస్తుంది.

 అజింకా రహానే - రైసింగ్ పూనే సూపర్ గెయింట్స్

అజింకా రహానే - రైసింగ్ పూనే సూపర్ గెయింట్స్

ముంబాయ్ రంజీ ట్రోపీలో ఆడటానికి ముందే తన వయస్సుకు తగ్గట్లుగా అన్ని మ్యాచ్‌లలో ఆడి తనను తాను మలుచుకుంటూ వచ్చాడు. బ్యాట్స్‌మెన్‌గా రాణిస్తున్న అజింకా జూన్ 06, 1988న మహారాష్ట్రలో జన్మించాడు. ప్రస్తుతం పదవ ఐపిల్‌లో రైసింగ్ పూనే సూపర్ గెయింట్స్ తరపున ఆడుతున్నాడు.

ఐపిల్‌లో టాప్ 10 క్రికెటర్లు మరియు వారి అద్బుతమైన కార్లు

అజింకా మొదటి కారు మారుతి సుజుకి వ్యాగన్ ఆర్. ఆ తరువాత కాలంలో ఆడి క్యూ5 కారును కొనుగోలుచేశాడు. కార్లను గరిష్ట వేగంతో నడపడం అంటే రహానే అత్యధిక ఇష్టం. ఢిల్లీలోని ఎఫ్ రేస్ ట్రాక్‌లో గరిష్టంగా 240 నుండి 260 కిలోమీటర్ల వేగంతో మరియు సాధారణ రోడ్ల మీద గంటకు 100కిమీల వేగానికి మించకుండా నడిపినట్లు చెప్పుకొచ్చాడు.

Most Read Articles

English summary
Read in Telugu Top 10 IPL Stars And Their Expensive Cars
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X