ప్రపంచ వ్యాప్తంగా అత్యంత పొడవైన టాప్ 10 రహదారులు

By N Kumar

ప్రజాజీవనంలో రహదారులు పాత్ర ఎంతో కీలకం చిన్న చిన్న పల్లెలను కలుపుకుని ఖండాలను దాటి ఎన్నో దేశాలను కలుపుతున్నాయి రహదారులు. 20 వ శతాబ్దంలో రోడ్ల విస్తరణ బాగా పెరిగింది అని చెప్పవచ్చు.

వ్యాపార, విద్య, ఆరోగ్య మరియు విహారం అంటూ అనేక అవసరాలకు రహదారులను విరివిగా వినియోగించుకుంటున్నాం. మానవ అభివృద్దికి ఎంతో కీలకంగా వ్యవహరించే రోడ్లు చాలా ప్రత్యేకతలను కలిగి ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా కొన్ని లక్షల కిలోమీటర్ల మేర రహదారులు విస్తరించి ఉన్నాయి.

అందులో నేడు మన ఆఫ్ బీట్ శీర్షిక ద్వారా రహదారుల విభాగం నుండి పాఠకుల కోసం ప్రపంచంలో కెల్లా అత్యంత పొడవైన పది రహదారుల గురించి తెలుసుకుందాం....

10. ఇంటర్ స్టేట్ 80(ఐ-80) అమెరికా

10. ఇంటర్ స్టేట్ 80(ఐ-80) అమెరికా

అమెరికాలో ఈ ఇంటర్‌‌స్టేట్ 80(ఐ-80) అనే జాతీయ రహదారిని క్రిస్టోఫర్ కొలంబస్ హై వే అని కూడా పిలుస్తారు. అమెరికాలో ఈ రహదారి సుమారుగా 11 రాష్టాలను కలుపుతూ ఉంది. దీని పొడవు సుమారుగా 4,666 కిలోమీటర్లుగా ఉంది. అంతే కాదు ఇండియాలో రెండవ అత్యంత పొడవైన ఇంటర్‌స్టేట్ రహదారిగా ఇది నిలిచింది. ఇది కాలిఫోర్నియాలోని శాన్‌ ప్రాన్సిస్కోలో ప్రారంభం అయ్యి న్యూ జెర్సీలో ముగుస్తుంది.

Picture credit: Jo-H/Flickr

09. ఇంటర్‌స్టేట్ 90(ఐ-90) అమెరికా

09. ఇంటర్‌స్టేట్ 90(ఐ-90) అమెరికా

అమెరికాలో అత్యంత పొడవైన మరియు ప్రఖ్యాత గాంచిన రహదారికి పేరుగాంచింది ఈ ఇంటర్‌స్టేట్ 90(ఐ-90) రహదారి. ఈ రహదారి మొత్తం పొడవు సుమారుగా 4,860.2 కిలోమీటర్లుగా ఉంది. ఈ రహదారి నిర్మాణాన్ని 1950 లో ప్రారంభించి 1985 లో ముగించారు. ఇంటర్‌స్టేట్ 90(ఐ-90) రహదారి అమెరికాలోని సుమారుగా 13 రాష్ట్రాలను కలుపుతూ పోతుంది.

Picture credit: Ed Suominen/Flickr

08. అమెరికా రూట్ 6

08. అమెరికా రూట్ 6

అమెరికా రూట్ 6 రహదారి మొత్తం పొడవు సుమారుగా 5,158 కిలోమీటర్ల పొడవు ఉంది. దీనిని గ్రాండ్ ఆర్మీ ఆఫ్ ది పబ్లిక్ హై వే అని కూడా పిలుస్తారు. ఈ రహదారిని అమెరికన్ అసోషియేషన్ ఆఫ్ స్టేట్ హై వే వారు డిజైన్ చేశారు. ఇది బిషప్-కాలిఫోర్నియాల నుండి ప్రారంభమయ్యి మసూచాసెట్స్ లోని ప్రొవిన్స్ టౌన్‌ను ముస్తుంది.

Picture credit: Doug Kerr/Wiki Commons

07. అమెరికా రూట్ 20

07. అమెరికా రూట్ 20

అమెరికా రూట్20 రహదారి 1926 లో నిర్మించబడింది. దీని పొడవు సుమారుగా 5,415 కిలోమీటర్ల మేర కలదు. 1940 లో దీనిని పొడగించారు. సుమారుగా తొమ్మిది అమెరికా రాష్ట్రాల గుండా ఈ రహదారి పోతుంది. అమెరికాలోని అత్యంత సుందరమైన రహదారుల్లో ఇది మొదటి స్థానంలో ఉంది.

Picture credit: John Phelan/Wiki Commons

06. చైనా నేషనల్ హై వే 010

06. చైనా నేషనల్ హై వే 010

చైనా నేషనల్ హై వే 010 చైనాలో అత్యంత పొడవైన మరియు ప్రపంచ వ్యాప్తంగా ఆరవ అత్యంత పొడవైన రహదారిగా నిలిచింది. చైనాలో అత్యంత పొడవైన ఉన్న ఈ హై వే టాంగ్సాన్ ఎక్స్‌ప్రెస్‌ వేగా కూడా వాడుకలో ఉంది. దీని మొత్తం పొడవు 5,700 కిలోమీటర్లు ఉంది.

Picture credit: Yaoleilei/Wiki Commons

05. గోల్డెన్ క్వాడ్రిలాటిరల్ హైవే నెట్‌వర్క్, ఇండియా

05. గోల్డెన్ క్వాడ్రిలాటిరల్ హైవే నెట్‌వర్క్, ఇండియా

గోల్డెన్ క్వాడ్రిలాటిరల్ హైవే నెట్‌వర్క్ ఇండియాలో అత్యంత పొడవైన రహదారుల్లో ఒకటి. 2001 లో దీని నిర్మాణాన్ని ప్రారంభించి 2012 జనవరి నాటికి దీనిని పూర్తి చేశారు. ఈ హై వే మొత్తం పొడవు 5,846 కిలోమీటర్లుగా ఉంది. ప్రపంచ వ్యాప్తంగా ఐదవ అత్యంత పొడవైన రహదారిగా ఇది నిలిచింది. ఈ రహదారి ఇండియాలో అతి ముఖ్యమైన నాలుగు నగరాలు (కలకత్తా, చెన్నై, ముంబాయ్ మరియు ఢిల్లీ)ను కలుపుతుంది. దీని సుమారుగా 600బిలియన్ రుపాయలతో నిర్మించారు.

04. ట్రాన్స్-కెనడా హై వే

04. ట్రాన్స్-కెనడా హై వే

ప్రపంచ వ్యాప్తంగా నాలుగు స్థానంలో ఉన్న అత్యంత పొడవైన రహదారుల్లో ఇది నాలుగవ స్థానంలో నిలిచింది. దీని మొత్తం పొడవు 7,821 కిలోమీటర్లుగా ఉంది. ఈ రహదారి కెనడాలోని సుమారుగా 10 రాష్ట్రాలను కలపుతూ కెనడాలోని అన్ని ప్రధాన నగరాల మీదుగా వెళుతుంది.

Picture credit: WikiPedant/Wiki Commons

03. ట్రాన్స్-సైబీరియన్ హై వే

03. ట్రాన్స్-సైబీరియన్ హై వే

ఈ హై వే మొత్తం పొడవు 11,000 కిలోమీటర్లుగా ఉంది. ఈ సైబీరియన్ జాతీయ రహదారి సుమారుగా 7 ఫెడరల్ జాతీయ రహదారులను కలుపుతూ పోతుంది. ఇది రష్యాలోని సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో ప్రారంభమయ్యి రష్యాలోని వ్లాడివోస్టక్‌లో ముగుస్తుంది.

Picture credit: Mike1979 Russia/Wiki Commons

02. హై వే 1, ఆస్ట్రేలియా

02. హై వే 1, ఆస్ట్రేలియా

అత్యంత పొడవైన జాతీయ రహదారిని 1955 లో ప్రారంభించారు. ఈ రహదారి ఆస్ట్రేలియాలో అత్యంత పొడవైన మరియు ప్రఖ్యాత గాంచిని రహదారిగా మరియు ప్రపంచ వ్యాప్తంగా రెండవ అత్యంత పొడవైన రహదారిగా నిలిచింది. ఈ రహదారి సింగిల్ మరియు మల్టీ లేన్ రహదారిని కలిగి ఉంది. ఈ రహదారి మీదు 24 గంటల్లో సుమారుగా 10 లక్షల మందికి పైగా ప్రయాణిస్తుంటారు.

Picture credit: Tony Bowden/Flickr

01.ప్యాన్ అమెరికా

01.ప్యాన్ అమెరికా

ప్యాన్ అమెరికన్ రహదారి ప్రపంచ వ్యాప్తంగా అత్యంత పొడవైన రహదారిగా ప్రఖ్యాతగాంచింది. ఈ రహదారి మొత్తం పొడవు 48,000 కిలోమీటర్లుగా ఉంది. వాహనాల తిరగడానికి వీలున్న ప్రపంచ వ్యాప్తంగా అత్యంత పొడవైన రహదారిగా గిన్నిస్ బుక్ రికార్డుల్లోకెక్కింది. ఈ రహదారి ఎన్నో చీకటి అడవులు గుండా, నీటి జాడలేని ఎడారుల గుండా వివిధ రకాల వాతావరణాన్ని కలిగి ఉండే ప్రదేశాల గుండా వెళుతుంది.

Picture credit: JorgeBRAZIL/Wiki Commons

ప్రపంచంలోకెల్లా అత్యంత పొడవైన 10 రహదారులు

  • భారతదేశంలో కెల్లా 10 పొడవైన జాతీయ రహదారులు
  • ప్రపంచంలోకెల్లా అత్యంత పొడవైన 10 రహదారులు

    • ప్రపంచంలో కెల్లా పది అత్యంత వేగవంతమైన రోడ్లు
    • ప్రపంచంలోకెల్లా అత్యంత పొడవైన 10 రహదారులు

      • టాప్ 10 ఇండియన్ రోడ్ ఫ్యాక్ట్స్

Most Read Articles

English summary
Top Ten Longest Highways In The World
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X