అత్యంత ఖరీదైన టాప్ 10 ప్రైవేట్ జెట్స్

By Ravi

అత్యంత వేగంగా గమ్యాన్ని చేరుకోవడానికి ఉన్న ఏకైక మార్గం విమానం. కానీ, విమానాల్లో ప్రయాణం చాలా ఖర్చుతో కూడుకున్నది. సామాన్యులు మహా అయితే, వారి జీవితంలో ఎప్పుడో ఓసారి విమాన ప్రయాణం చేయగలరు కానీ ఓ ప్రైవేటు విమానాన్ని కొనుక్కోలేరు.

మరిన్ని టాప్ 10 కథనాల కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి

కానీ ఇప్పుడు ఈ కథనంలో మనం చెప్పుకోబోయే వ్యక్తులు మాత్రం ప్రపంచంలో కెల్లా అత్యంత ఖరీదైన, విలాసవంతమైన ప్రైవేట్ జెట్ విమానాలను కలిగి ఉన్నవారే. మరి ఆ టాప్ 10 సెలబ్రిటీలు ఎవరో, వారి విమానాల కథేంటో ఈ కథనంలో తెలుసుకుందాం రండి.

మరింత సమాచారం తర్వాతి సెక్షన్‌లో.. మరిన్ని వివరాలను ఈ ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి..!

టాప్ 10 ప్రైవేట్ జెట్స్

తర్వాతి స్లైడ్‌లలో టాప్ 10 ప్రైవేట్ జెట్ విమానాల గురించి, వాటిని కలిగి ఉన్న వ్యక్తుల గురించి తెలుసుకుందాం రండి.

10. డాసల్ట్ ఫాల్కన్ 900

10. డాసల్ట్ ఫాల్కన్ 900

ఈ జాబితాలో 10వ స్థానంలో ఉన్న ప్రైవేట్ జెట్ విమానం పేరు డాసల్ట్ ఫాల్కన్ 900. స్విట్జర్లాండ్‌కి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త సెర్గియో మాంటెగాజా వద్ద ఈ ప్రైవేట్ జెట్ విమానం ఉంది. దీని ఖరీదు సుమారు 33 మిలియన్ల అమెరికన్ డాలర్లు. అధిక వేడి వాతావరణంలో హై ఆల్టిట్యూడ్స్ వద్ద సైతం ఈ విమానం పలు ఎయిర్‌పోర్టులను యాక్సిస్ చేసుకోగలదు. ఇది వేగవంతమైన మరియు సమర్థవంతమైన విమానం. మూడు హనీవెల్ టిఎఫ్ఈ731-5బిఆర్-1సి టర్బోఫ్యాన్ ఇంజన్లను ఇందులో ఉపయోగించారు. ఈ విమానంలో ఏడుగురు ప్యాసింజర్లకు మాత్రమే చోటు ఉంటుంది. ఇది గంటకు 950 కి.మీ. వేగంతో మొత్తం 7,400 కి.మీ. దూరం ప్రయాణించగలదు.

9. ఎంబ్రాయెర్ ఈఎమ్‌బి190బిజె లీనేజ్ 1000

9. ఎంబ్రాయెర్ ఈఎమ్‌బి190బిజె లీనేజ్ 1000

ఈ జాబితాలో తొమ్మిదవ స్థానంలో ఉన్నది ఎంబ్రాయెర్ ఈఎమ్‌బి190బిజె లీనేజ్ 1000. మెక్సికన్ వ్యాపారవేత్త జార్జ్ వెర్గరా వద్ద ఈ ప్రైవేట్ జెట్ విమానం ఉంది. బ్రెజిల్ డిజైన్ చేయబడి, అక్కడే నిర్మితమైన ఈ ప్లేన్‌ను ఓ పెద్ద ప్యాసింజర్ క్యారియర్ విమానం ఆధారంగా చేసుకొని తయారు చేశారు. దీని ధర సుమారు 40.95 మిలియన్ డాలర్లు. ఇందులో రెండు జనరల్ ఎలక్ట్రిక్ సిఎఫ్34-10ఈ టర్బోఫ్యాన్ ఇంజన్లు ఉంటాయి. ఫుల్ ట్యాంక్‌పై ఈ విమానంలో 8,149 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చు.

8. డాసల్ట్ ఫాల్కన్ 7ఎక్స్

8. డాసల్ట్ ఫాల్కన్ 7ఎక్స్

ప్రముఖ ఐటి దిగ్గజం బిల్ గేట్స్ వద్ద ఉన్న డాసల్ట్ ఫాల్కన్ 7ఎక్స్ విమానం ఈ జాబితాలో 8వ స్థానంలో ఉంది. ఈ విమానం ఖరీదు సుమారు 41 మిలియన్ డాలర్లు. దీని రియల్ మోడల్‌ను తయారు చేయటానికి ముందుగా ఇంజనీర్లు ఓ విర్చ్యువల్ (కంప్యూటర్ గ్రాఫిక్స్‌తో) మోడల్‌ను తయారు చేసి, దాని పెర్ఫార్మెన్స్‌ను ఆప్టిమైజ్ చేసిన తర్వాత ఒరిజినల్ మోడల్‌ను తయారు చేశారు. ఇందులో 3 ప్రాట్ అండ్ విట్నీ కెనడా పిడబ్ల్యూ307ఏ టర్బో‌ఫ్యాన్ ఇంజన్స్ ఉన్నాయి. ఇది గరిష్టంగా గంటకు 900 కి.మీ. వేగంతో మొత్తం 11,000 కి.మీ. దూరం ప్రయాణించగలదు.

7. బాంబార్డీర్ బిడి-700 గ్లోబల్ ఎక్స్‌ప్రెస్

7. బాంబార్డీర్ బిడి-700 గ్లోబల్ ఎక్స్‌ప్రెస్

దాదాపు 47.7 మిలియన్ డాలర్ల ఖరీదు చేసే ఈ బాంబార్డీర్ బిడి-700 గ్లోబల్ ఎక్స్‌ప్రెస్ ప్రైవేట్ జెట్‌ను ప్రముఖ సెలబ్రిటీ ఓప్రా విన్‌ఫ్రే కలిగి ఉంది. ఈ విమానంలో రెండు బిఎమ్‌డబ్ల్యూ రోల్స్ రాయిస్ బిఆర్-710ఏ-220 టర్బోఫ్యాన్ ఇంజన్లను ఉపయోగించారు. హైస్పీడ్ క్రూయిజింగ్‌లో ఇది గంటకు గరిష్టంగా 935 కి.మీ. వేగంతో పరుగులు తీస్తుంది, అదే నార్మల్ క్రూయిజింగ్ స్పీడ్‌లో అయితే గంటకు 904 కి.మీ. వేగంతోను మరియు లాంగ్ రేంజ్ క్రూయిజ్ స్పీడ్ వద్ద గంటకు 850 కి.మీ. వేగంతో పరుగులు తీస్తుంది. దీని మొత్తం రేంజి 11,390 కి.మీ.

6. బోయింగ్ బిజినెస్ జెట్

6. బోయింగ్ బిజినెస్ జెట్

ఈ విమానం మనదేశపు ప్రముఖ వ్యాపారవేత్త ముకేష్ అంబానీ వద్ద ఉంది. ఈ బోయింగ్ బిజినెస్ జెట్ విమానం ఖరీదు 55.5 మిలియన్ డాలర్లు. ఇందులో 50 మంది ప్రయాణీకులు ప్రయాణించవచ్చు. ఈ విమానంలో రెండు సిఎఫ్ఎమ్ ఇంటర్నేషనల్ సిఎఫ్ఎమ్56-7 టర్బోఫ్యాన్ ఇంజన్లను ఉపయోగించారు. దీని రేంజ్ 11,480 కిలోమీటర్లు. ఇది గరిష్టంగా గంటకు 890 కిలోమీటర్ల వేగంతో పరుగులు తీస్తుంది.

5. గల్ఫ్‌స్ట్రీమ్ జి-550

5. గల్ఫ్‌స్ట్రీమ్ జి-550

ఈ విమానం కూడా మనదేశపు ప్రముఖ వ్యాపారవేత్త లక్ష్మీ మిట్టల్‌కు చెందినది. ఈ గల్ఫ్‌స్ట్రీమ్ జి-550 విమానం ఖరీదు 59.9 మిలియన్ డాలర్లు. బ్రిటన్‌కు చెందిన వ్యాపారవేత్త ఫిలిప్ గ్రీన్ వద్ద కూడా ఈ విమానం ఉంది. ఈ విమానం తన తొలి ఐదేళ్ల సర్వీసులో 40 సిటీ పెయిర్ రికార్డు సృష్టించింది. ఈ విమానంలో 4 హనీవెల్ డియూ-1310 ఈఎఫ్ఐఎస్ స్క్రీన్స్ ఉంటాయి, ఈ గల్ఫ్‌స్ట్రీమ్‌లో కర్సర్ కంట్రోల్ సిస్టమ్ మరియు ఎన్‌హాన్స్డ్ విజన్ సిస్టమ్ (ఈవిఎస్) కూడా ఉంటుంది. ఈ సిస్టమ్ వలన తక్కువ విజిబిలిటీలోను ల్యాండింగ్ సులువుగా ఉంటుంది. ఇందులో రోల్స్ రాయిస్ బిఆర్710 టర్బోఫ్యాన్ ఇంజన్లను ఉపయోగించారు. దీని రేంజ్ 12,501 కిలోమీటర్లు.

4. ఎయిర్‌బస్ ఏ319 కార్పోరేట్ జెట్

4. ఎయిర్‌బస్ ఏ319 కార్పోరేట్ జెట్

ఈ జాబితాలో నాలుగో స్థానంలో ఉన్నది ఎయిర్‌బస్ ఏ319 కార్పోరేట్ జెట్ విమానం. దీని ఓనర్ మన విజయమాల్య. ఈ విమానం ఖరీదు సుమారు 80.7 మిలియన్ డాలర్లు. ఇందులో 39 మంది ప్రయాణీకులు కూర్చోవచ్చు. ఇందులో రెండు సిఎఫ్ఎమ్ ఇంటర్నేషనల్ సిఎఫ్ఎమ్56-5 సిరీస్ లేదా రెండు ఐఏఈ వి2500 సిరీస్ ఇంజన్లు ఉంటాయి. ఇది 10 మంది ప్రయాణీకులతో మొత్తం 11,650 కిలోమీటర్ల దూరంతో ప్రయాణిస్తుంది.

3. బోయింగ్ 767

3. బోయింగ్ 767

టాప్ 3లో ఉన్నది బోయింగ్ 767 విమానం. రష్యాకు చెందిన వ్యాపారవేత్త రోమన్ అబ్రమోవిచ్ దీని యజమాని. గూగుల్ ఫౌండర్ లారీ పేజ్ వద్ద కూడా ఈ తరహా విమానం ఉంది. ఇందులో రెండు ప్రాట్ అండ్ విట్నీ పిడబ్ల్యూ4062 టర్బోఫ్యాన్ ఇంజన్లు (10,343 కి.మీ. రేంజ్) లేదా రెండు సిఎఫ్6-80సి2బి8ఎఫ్ ఇంజన్లను (10,418 కి.మీ. రేంజ్) ఉపయోగించారు.

2. బోయింగ్ 747

2. బోయింగ్ 747

ఈ జాబితాలో ద్వితీయ స్థానంలో ఉన్నది బోయింగ్ 747 విమానం. దీని ధర 153 మిలియన్ డాలర్లు. ప్రముఖ రియల్ ఎస్టేట్ ఇన్వెస్టర్ జోసెఫ్ లావ్ దీని యజమాని. ఈ విమానంలో 4 జెన్ఎక్స్-2బి67 ఇంజన్లను ఉపయోగించారు. ఇది గరిష్టంగా గంటకు 917 కిలోమీటర్ల వేగంతో 14,800 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలదు.

1. ఎయిర్‌బస్ ఏ380

1. ఎయిర్‌బస్ ఏ380

ఇక అగ్రస్థానంలో నెంబర్ వన్‌గా ఉన్న ప్రైవేట్ జెట్ ఎయిర్‌బస్ ఏ380. ప్రపంచంలో కెల్లా అతిపెద్ద విమానం అయిన ఈ విమానాన్ని ప్రత్యేకించి ప్రైవేట్ యూజ్ కోసం తయారు చేశారు. సౌదీ వ్యాపారవేత్త, ఇన్వెస్టర్ ప్రిన్స్ అల్వాలీడ్ బిన్ తలాల్ వద్ద ఈ విమానం ఉంది. దీని ధర సుమారు 300 మిలియన్ డాలర్లు. ఇందులో నాలుగు రోల్స్ రాయిస్ ట్రెంట్ 900 లేదా ఇంజన్ అలయన్స్ జిపి7200 ఇంజన్లను ఉపయోగించారు. ఇది గరిష్టంగా గంటకు 900 కిలోమీటర్ల వేగంతో 15,700 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలదు.

Most Read Articles

English summary
Flying has always been the fastest way to get to far-off places. While there are many airlines that offer this service, a few prefer to have planes of their own. A few who can afford the cost, like to travel to places fast, and in loads of luxury. With price tags that start from millions to own one, lets take a look at the world's top 10 most expensive private jets and the people who own it.
Story first published: Monday, July 28, 2014, 3:36 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X