బుద్దుంటే ఇలాంటి రోడ్ల మీద వెళ్లాలనుకోరు: ఎందుకో తెలుసా?

By N Kumar

ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి భూ భాగం ద్వారా చేరుకోవడానికి మానవుడు ముందుగా రహదారులను సృష్టించుకున్నాడు. ఇప్పుడు వాహనాలను వినియోగించుకుని ఆ రహదారుల మీద తన గమ్యస్థానాన్ని చేరుకుంటున్నాడు. అలా గమ్యస్థానికి చేరుకోవడానికి ప్రాణాలు సైతం కోల్పోయేటటువంటి భయంకరమైన రహదారుల మీద వెలుతున్నారు.

ప్రతి ఒక్కరి ప్రయాణం ఎంతో సాఫీగా సాగిపోవాలని కోరుకుంటారు. కాని మన జీవితంలో ఒక్కసారి కూడా ఇలాంటి రోడ్ల మీద ప్రయాణం చేయాలి అనుకోరు. అలా టాప్-10 రహదారుల గురించి క్రింది కథనం ద్వారా అందిస్తున్నాము. ఇలాంటి రోడ్ల మీద ప్రయాణం చేయాల్సి వస్తే ఆ ప్రయాణాన్ని మానుకోండి.

 1. లగ్జర్ అల్ హర్గాడ్ రోడ్డు-ఈజిప్ట్

1. లగ్జర్ అల్ హర్గాడ్ రోడ్డు-ఈజిప్ట్

ఈ రోడ్డు ఈజిప్ట్‌లోని పాత లగ్జర్ నగరాన్ని కలుపుతూ పోతుంది. చాలా మంది ఈ రోడ్డు మీద ప్రయాణాన్ని మానుకోండి అని చెపుతుంటారు. ఎందుకంటే ఈ మార్గంలో ఎక్కువగా బందిపోట్లు ఉంటారు రాత్రి వేళల్లో ఇటుగా వెళ్లే వారిని అడ్డగించి దాడి చేస్తారు. అందుకోసం ఈ రహదారుల మీద వెళ్లే వారు లైట్లు ఆఫ్ చేసుకుని వెళతారు తద్వారా ప్రమాదాలకు గురవుతారు. మీరు కనుక ఇలాంటి రోడ్డు మీద వెళ్లాల్సి వస్తే ప్రయాణాన్ని మానుకోండి.

Picture credit: Przemyslaw/Wiki Commons

2. టరోకో జార్జా రోడ్డు- తైవాన్

2. టరోకో జార్జా రోడ్డు- తైవాన్

అత్యంత డేంజర్ రోడ్డుగా ఈ జాబితాలో చోటు దక్కించుకున్న రోడ్డు తైవాన్ లోని ఎనిమిదవ జాతీయ రహదారి మీద కలదు. దీని మీరు చూస్తున్న ప్రదేశంలో అతి పెద్ద గుహ ఉంది కదూ ఇక్కడ భారీ స్థాయిలో వర్షాలు వచ్చిన లేదంటే కొండచరియలు విరిగి పడినా పెద్ద ప్రమాదమే సంభవిస్తుంది. ఎందుకంటే లోపలి వైపు ఎటువంటి అధిక ప్రదేశమూ లేదు. కుంచించుకుపోయిన ఉన్న ఈ రోడ్డు మీద ముమ్మాటికీ ప్రమాదమే.

Picture credit: Tom Cheng/Wiki Commons

3. పటియో పౌల్ పెరిడికాకి రోడ్డు- గ్రీస్

3. పటియో పౌల్ పెరిడికాకి రోడ్డు- గ్రీస్

గ్రీస్ దేశంలో 23.5 కిలోమీటర్ల మేర ఉన్న ఈ రోడ్డు మొత్తం కొండ ప్రాంతంలోనే కలదు. ఇందులో భయంకరమైన మలుపులు మరియు ప్రమాదకరంగా ఉండే ఇరుకైన రహదారి ఇది. రాత్రి వేళల్లో వాహనాలు అదుపు తప్పి లోయలోకి పడిపోయే అవకాశాలు చాలా ఎక్కువ.

Picture credit: thenewswheel

4. హల్సీమా హైవే-ఫిలప్పీన్స్

4. హల్సీమా హైవే-ఫిలప్పీన్స్

హల్సీమా జాతీయ రహదారిగా పిలువబడే ఈ రహదారి ఫిలిప్పీన్స్‌లో కలదు. ఇది సముద్ర మట్టం నుండి దాదాపుగా 7,400 అడుగుల కన్నా ఎత్తులో ఉంది. అంతే కాకుండా ఫిలిప్పీన్స్‌లో అత్యంత ఎత్తులో ఉండే రహదారి కూడా ఇదే. దీని ప్రయాణం ఎంత ఫన్నీగా ఉంటుందో అంతే ప్రమాదకరంగా కూడా ఉంటుంది. ఎందుకంటే ఈ ప్రాంతంలో ఎక్కువగా వర్షాలు కురుస్తాయి తద్వారా కొండచరియలు ఎక్కువగా విరిగిపడే అవకాశం ఉంది.

Picture credit: Leocadio Sebastian/Wiki Commons

5. పాసేజ్ డ్యు గోయిస్ - ఫ్రాన్స్

5. పాసేజ్ డ్యు గోయిస్ - ఫ్రాన్స్

ఇది ఫ్రాన్స్‌లో ఉండే అతి భయంకరమైన రహదారి అని చెప్పవచ్చు. ఈ రహదారి రోజు మొత్తం 1.3 నుండి నాలుగు మీటర్ల లోతు వరకు మునిగిపోయిం ఉంటుంది. రోజుకు రెండు సార్లు ఒకటి లేదా రెండు గంటల పాటు రోడ్డు మీద ఉన్న నీరు మొత్తం ప్రక్కకు జరిగిపోతుంది. ఆసమయంలోనే ఆ రోడ్డు మీద వెళ్లాల్సిన వారు వెళ్లిపోవాల్సి ఉంటుంది. తరువాత నీరు మొత్తం ఆ రహదారిని కప్పేస్తుంది.

Picture credit: sylvia vue/Flickr

6. స్కిప్పర్ క్యానన్ రోడ్డు-న్యూజిలాండ్

6. స్కిప్పర్ క్యానన్ రోడ్డు-న్యూజిలాండ్

ఈ స్కిప్పర్ క్యానన్ రోడ్డుగా పిలువబడే ఈ రోడ్డు నైఋతి న్యూజిల్యాండ్‌లో కలదు. దీనిని 140 సంవత్సరాల క్రితం నిర్మించారు. ఇరుకైన స్థలం గల ఈ రోడ్డు మీద ఏ మాత్రం ఏమరపాటుగా ఉన్నా అంతే సంగతులు. రాతి మీద మలచబడిన ఈ రహదారి దాదాపుగా 16.5 మైళ్ల పొడవు కలదు.

Picture credit: YSander/Wiki Commons

7. కారాకోరమ్ హైవే

7. కారాకోరమ్ హైవే

కారాకోరమ్ రహదారి పాకిస్తాన్ మరియు చైనా దేశాలను కలపుతుంది. ప్రపంచ మొత్తం గర్వించదగ్గ రహదారి ఇది. అయితే ప్రమాదకరమైన ప్రయాణ మార్గాలలో దీనికంటూ ఒ స్థానం ఉంది. కొండ చరియలు మరియు గుహలలో ప్రయాణించాల్సి ఉంటుంది. ఎంతో ఎత్తులో ప్రయాణించే సమయంలో ఊపిరి కూడా సరిగ్గా ఆడదు. అంతే కాకుండా ఈ మార్గంలో తీవ్రవాదులు మరియు బందిపోట్ల అలజడి కూడా ఎక్కువే.

Picture credit: Colegota/Wiki Commons

8. టియాన్‌మెన్ మౌంటైన్ రోడ్

8. టియాన్‌మెన్ మౌంటైన్ రోడ్

ప్రపంచ వ్యాప్తంగా అత్యంత చెత్త రోడ్లలో చైనాలోని టియాన్‌మెన్ మౌంటైన్ ఘాట్ రోడ్డు ఒకటి. కేవలం 11 కిలోమీటర్ల ప్రయాణానికి 99 మలుపులు ఉన్నాయి. ఇక ఈ దారిలో మీరు వెళ్తున్నపుడు ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించడం చాలా రిస్క్‌తో కూడుకున్నది. ఈ పర్వతాల మీద నుండి కొన్ని 1000 అడుగల ఎత్తులో ఉన్న రోలర్ ద్వార్ ఎంతో సులభంగా చేరుకోవచ్చు, అందువలన ఇది పర్యాటకులకు ఎంతో ప్రత్యేకంగా నిలయమైంది.

Picture credit: Dennis Grice/Flickr

9. ఐరి హైవే - ఆస్ట్రేలియా

9. ఐరి హైవే - ఆస్ట్రేలియా

145.6 కిలోమీటర్ల పాటు ఒక్క మలుపు కూడా లేకుండా అత్యంత పొడవైన హైవే ఇది. కాని ఇలాంటి చోట్లు ప్రమాదం ఏముంది అంటారు కదా. ఎటువంటి మలుపులు లేనందువలన చాలా వరకు కార్లను అత్యంధిక వేగంతో నడుపుతారు. అంతే కాకుండా అక్కడక్కడ ఉన్నట్లుండి రోడ్ల మీదకు జంతువులు వస్తుంటాయి. ఇలాంటి సంధర్బాలలో వాటిని తప్పించే ప్రయత్నంలో ఇతర వాహనాలను ఢీకొంటారు. ఈ కారణాల వలన ఇక్కడ ఎక్కువ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి.

10. జోజి లా రోడ్డు-భారత్

10. జోజి లా రోడ్డు-భారత్

కొండ ప్రాంతాలలో గల అత్యంత భయకరమైన రోడ్డు ఇది. ఇది సముద్ర మట్టానికి 11,575 అడుగుల ఎత్తులో కలదు. ఇది పశ్చిమ హిమాలయ పర్వత శ్రేణులలో గల శ్రీనగర్‌ సమీపంలోని లేహ్ ప్రాంతంలో కలదు. వారాంతాలలో ఈ రోడ్డు మీద మీరు అస్సలు ప్రయాణించలేరు.

ఆసక్తికరమైన కథనాల కోసం...
  • 170 సంవత్సరాల ఇండియన్ రైల్వే చరిత్రలో :49 ఆసక్తికరమైన నిజాలు
  • దెయ్యాలు తిరిగే ఈ రోడ్ల మీదకు వెళితే తిరిగి రావడం కష్టమే
  • వేలానికి విజయ్ మాల్యా వ్యక్తిగత విమానం...!!

Most Read Articles

English summary
Top 10 Roads You Would Never Want to Drive On
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X