టైరు విషయంలో అపోహలు మరియు వాస్తవాలు

ఓ కారుకు టైరు అనేది చాలా ముఖ్యమైనది. కానీ, చాలా మంది కార్లను వినియోంచే వారు టైరు మెయింటినెన్స్ మరియు సేఫ్టీ విషయంలో పెద్దగా అవగాహన కలిగి ఉండరు. ఎప్పటికప్పుడు టైర్లను చెక్ చేసుకోవటం, సరైన మెయింటినెన్స్ విధానాలను పాటించడం వలన టైరు జీవితకాలాన్ని/మన్నికను పెంచుకోవటమే కాకుండా, లాంగ్ ట్రిప్‌లలో సైతం రిస్కు లేకుండా ప్రయాణించవచ్చు.

టైర్ల విషయంలో చాలా మందికి పలు అపోహలు ఉంటాయి. ఈ అపోహల విషయంలో పలు వాదనలు కూడా తలెత్తి ఉండి ఉంటాయి. ఈ నేపథ్యంలో, మనం ఇప్పుడు ఈ కథనంలో టైర్లకు సంబంధించిన అపోహలను మరియు వాటి వాస్తవాలను గురించి తెలుసుకుందాం.

ఈ చిన్ని అంశాలే భవిష్యత్తులో మీ కారు టైర్ ఫెయిల్ కాకుండా ఉండేందుకు లేదా సీరియస్ యాక్సిడెంట్ నుంచి మిమ్మల్ని రక్షించేందుకు సహకరస్తాయి. మరి ఆలస్యమెందుకు... చదవండి..!

అపోహ

అపోహ

టైరుపై పేర్కొన్న విలువల ప్రకారం, టైరులో గాలిని నింపాలి. నిజమేనా..?

వాస్తవం

వాస్తవం

వాస్తవానికి ఒక్కో టైరు ఒక్కో రకమైన విలువను కలిగి ఉంటుంది. ఖచ్చితమైన విలువలు కావాలంటే, కారు డోర్‌కు సైడ్‌లో అంటించబడి ఉన్న స్టిక్కరులో ఉండే విలువల ప్రకారం, టైర్లలో గాలిని నింపాలి.

అపోహ

అపోహ

వాల్వ్ క్యాప్స్ టైరులో నుంచి గాలి బయటి పోకుండా ఉండేందుకు సహకరిస్తాయి.

వాస్తవం

వాస్తవం

ఇది పూర్తిగా అవాస్తవం, వాల్వ్ క్యాప్స్ టైరులోని గాలిని బయటిపోకుండా కాపాడలేవు. ఇవి దుమ్ము, ధూళి, నీరు, బురద వంటివి టైరు/ట్యూబ్ లోపలికి ప్రవేశించకుండా ఉండేందుకు సహకరిస్తాయి.

అపోహ

అపోహ

తక్కువ గాలితో కూడిన టైర్లు, తడిచిన రోడ్లపై కారు జారిపోకుండా, మంచి గ్రిప్‌నిస్తాయా?

వాస్తవం

వాస్తవం

ఇది ముమ్మాటికి అవాస్తవం, తక్కువ గాలి కలిగిన టైర్ల త్రెడ్ మూసుకుపోవటం లేదా గ్యాప్ తక్కువ కావటం వలన తడిచిన రోడ్లపై మరింత ఎక్కువ జారిపోయే ఆస్కారం ఉంటుంది.

అపోహ

అపోహ

వేసవిలో అధిక ఉష్ణోగ్రతల కారణంగా టైర్లలోని గాలి వ్యాకోచించి, అందులో కొంత గాలి తగ్గిపోతుంది.

వాస్తవం

వాస్తవం

తక్కువ పిఎస్ఐ (ప్రెజర్) కారణంగా టైరు వెచ్చగా మారటం ఫలితంగా టైర్ వాల్ ఫ్లెక్స్ లేదా బెండ్ కావటం వలన టైరు వేడిగా మారుతుంది. వేసవి సమయాల్లో కారు టైర్లలో తగిన పిఎస్ఐ (ప్రెజర్/గాలి)ని మెయింటైన్ చేయమని మేము సలహా ఇస్తాం.

అపోహ

అపోహ

శీతాకాల సమయాల్లో మంచి హ్యాండ్లింగ్ కోసం టైర్లలో గాలిని కొంచెం తగ్గించాలి.

వాస్తవం

వాస్తవం

వాస్తవానికి శీతాకాల సమయంలో టైరు పిఎస్‌ఐను 2 పాయింట్లు పెంచుకోవటం ఉత్తమం. ఎందుకంటే, ఉష్ణోగ్రతలు ప్రతి 3-4 డిగ్రీలు పడిపోయే కొద్దీ టైరు పిఎస్ఐ 1 పాయింట్ తగ్గుతూ టైరు జీవిత కాలాన్ని తగ్గించడమే కాకుండా, ప్రమాదాలకు కూడా కారణం అవుతుంది.

అపోహ

అపోహ

పొడిగా ఉండే రోడ్లపై మంచి హ్యాండ్లింగ్ కావాలంటే, థ్రెడ్ ప్యాటర్న్స్ (టైర్ బటన్స్ అని కూడా అంటారు) అవసరం.

వాస్తవం

వాస్తవం

వాస్తవానికి థ్రెడ్ ప్యాటర్న్స్ మంచి స్టయిల్, అప్పీరెన్స్ కోసం మాత్రమే. థ్రెడ్ ప్యాటర్న్స్ యొక్క ప్రధాన పాత్ర ఏంటంటే, తడి రోడ్లపై నీటిని డిశ్చార్జ్ చేసేందుకు మాత్రమే ఇవి సహకరిస్తాయి.

అపోహ

అపోహ

టైర్లను చేతుల్తో చెక్ చేయటం ద్వారా అవి మెత్తగా ఉన్నాయా లేక గట్టిగా ఉన్నాయో తెలుసుకోవచ్చు.

వాస్తవం

వాస్తవం

బయటకు కనిపించే టైరు ఎక్సీటిరయర్ సర్ఫేస్ మరియు సైడ్ వాల్, టైరు గురించి కొంతవరకు మాత్రమే తెలుసుకునేందుకు సహకరిస్తుంది. మనకు కనిపించే ఎక్స్టీరియర్ లేయర్స్‌కు అడుగున మరిన్ని లేయర్స్ ఉంటాయి. కాబట్టి కొన్నిసార్లు టైరును చేతుల్తో చెక్ చేయటం సాధ్యం కాదు.

అపోహ

అపోహ

పొడిమంచు రాలనప్పుడు వాహనాలకు వింటర్ టైర్లు అవసరం లేదు.

వాస్తవం

వాస్తవం

వింటర్ టైర్లు కేవలం పొడిమంచు లేదా హిమంతో నిండిన రోడ్ల కోసం మాత్రమే కాదు. మీరు నివసించే ప్రాంతంలో ఉష్ణోగ్రతలు 10 డిగ్రీల కన్నా తక్కువగా ఉన్నట్లయితే, మీ వాహనాలకు వింటర్ టైర్లు అమర్చుకోవటం ఉత్తమం. వింటర్ టైర్ల థ్రెడ్ ప్యాటర్న్ సాధారణ టైర్లతో పోల్చుకుంటే భిన్నంగా ఉండి, ఆ ప్రాంతంలోని రోడ్లపై మంచి గ్రిప్‌ను ఆఫర్ చేస్తాయి.

అపోహ

అపోహ

థ్రెడ్స్ (బటన్స్) లేని రేసింగ్ టైర్లు వాహన టాప్ స్పీడ్‌ను పెంచుతాయి.

వాస్తవం

వాస్తవం

పొడిగా ఉండే రోడ్ల విషయంలో, రోడ్డుకు మరియు టైరు రబ్బరుకు ఉండే రాపిడి వలన హ్యాండ్లింగ్ మెరుగు పడుతుంది. అందుకే ఫార్ములా కార్లు, మోటోజిపి వాహనాల్లో ఉపయోగించే టైర్లకు థ్రెడ్స్ ఉండవు. అనేక డ్రై సర్ఫేస్ లేదా రేసింగ్ టైర్లను థ్రెడ్ ప్యాటర్న్స్ లేకుండానే తయారు చేస్తారు. ఇవి మంచి గ్రిప్‌ను, హ్యాండ్లింగ్‌ను ఆఫర్ చేస్తాయి.

అపోహ

అపోహ

మీ కారును సర్వీస్ చేయించేటప్పుడు, టైర్ ప్రెజర్‌ను చెక్ చేయాలి.

వాస్తవం

వాస్తవం

ఇది అవాస్తం, టైరు ప్రెజర్‌ను కనీసం వారానికి ఒక్కసారైనా చెక్ చేసుకోవాలి.

Most Read Articles

English summary
Tyres in a car is very important. However majority of car owners are clueless when it comes to maintenance and safety checks. Most of us don't even care about the tyres on our cars. Some owners on the other hand have strange ideas or rather lets just call it tyre myths.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X