ప్రపంచంలో కెల్లా అతిపెద్ద వైమానిక దళాలు కలిగిన దేశాలు

By N Kumar

ఏదేశానికైనా సైన్యం అనేది ఆయా దేశాలకు ఆయువు పట్టి లాంటిది. సామ్రాజ్యం, సైన్యం అనేవి అనేక తరాల నుంచి ఆనవాయితీగా వస్తువున్నవే. ప్రస్తుతం సైన్యం లేని దేశం లేదు. సైన్యం కేవలం ఇతర దేశాలు చేసే దాడుల నుంచి తమ దేశాన్ని రక్షించడానికే కాకుండా, అత్యవసర పరిస్థితుల్లో దేశ ప్రజలను రక్షించుకునేందుకు, అవసరమైతే ఇతర దేశాలకు సాయం చేసేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుంది.

మనకు మొత్తం మూడు రకాల సైన్యం ఉంది. భూమిపై, నీటిపై మరియు గాలిలో సేవలందించే సైన్యం. దీనినే త్రివిధ బలగాలు అని కూడా అంటారు. ఈనాటి మన కథనంలో త్రివిధ బలగాల్లో ఒక్కటైన వైమానిక దళం (ఎయిర్ ఫోర్స్) గురించి తెలుసుకుందాం రండి. ఎయిర్ ఫోర్స్ అనేది తొలిసారిగా 1912లో బ్రిటీష్ రాయల్ కార్ప్స్ (ఇది 1918లో రాయర్ ఎయిర్ ఫోర్స్‌లో విలీనం అయ్యింది) ద్వారా ప్రారంభమైంది.

ఏదేశానికైనా సరే ప్రపంచాన్ని శాసించే శక్తి కావాలంటే, అందుకు తగిన బలగం ఉండాలి. ఈనాటి ఆఫ్-బీట్ శీర్షికలో ప్రపంచంలో కెల్లా 10 అతిపెద్ద కోంబాట్ ఎయిర్ ఫోర్సెస్ కలిగిన దేశాల గురించి ఈ ఫొటో ఫీచర్‌లో తెలుసుకుందాం రండి..!

10. జర్మన్ ఎయిర్ ఫోర్స్

10. జర్మన్ ఎయిర్ ఫోర్స్

ప్రపంచంలో కెల్లా అతిపెద్ద మైనిక దళాలు కలిగిన దేశాల్లో జర్మనీది 10వ స్థానం. జర్మన్ ఎయిర్ ఫోర్స్‌ను 1956లో స్థాపించారు. జర్మనీ దేశం ఎయిర్ ఫోర్స్ కలిగి ఉండటాన్ని వారు నాటోలో చేరి ఉన్నంత వరకు నిషేధించారు. ప్రస్తుతం జర్మనీ వద్ద మోడ్రన్ యూరోఫైటర్ టైఫూన్, పాపులర్ పనవియా టోర్నాడో వంటి అధునాత యుద్ధ విమానాలున్నాయి. జర్మనీ వద్ద 423 కోంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్స్ ఉన్నాయి.

9. రిపబ్లిక్ ఆఫ్ కొరియా ఎయిర్‌ఫోర్స్ (దక్షిణ కొరియా):

9. రిపబ్లిక్ ఆఫ్ కొరియా ఎయిర్‌ఫోర్స్ (దక్షిణ కొరియా):

రిపబ్లిక్ ఆఫ్ కొరియా ఎయిర్‌ఫోర్స్‌ను 1949లో ప్రారంభించారు. ఎప్పుడూ ఉత్తర కొరియాపై కాలు దువ్వుతూ ఉండే దక్షిణ కొరియా వద్ద అమెరికన్ ఎఫ్-16 ఫైటింగ్ ఫాల్కన్, నార్త్‌రాప్ ఎఫ్-5 వంటి అధునాతన యుద్ధ విమానాలున్నాయి. ఈ దేశం వద్ద 458 కోంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్స్ ఉన్నాయి. తీవ్రవాదంపై జరుగుతున్న గ్లోబల్ వార్‌లో కూడా రిపబ్లిక్ ఆఫ్ కొరియా ఎయిర్‌ఫోర్స్ తన వంతు సాయం చేస్తోంది.

8. టర్కిష్ ఎయిర్ ఫోర్స్:

8. టర్కిష్ ఎయిర్ ఫోర్స్:

ఈ జాబితాలో ఎనిమదవ స్థానంలో ఉన్న టర్కీ, ప్రత్యేకించి తమ ప్రాంతంలో ఇది రియల్ మిలటరీ పవర్‌హౌస్ అని చెప్పవచ్చు. టర్కీ ఎయిర్‌ఫోర్స్ వద్ద మొత్తం 465 కోంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్స్ ఉన్నాయి. వీటిని నిర్వహించేందుకు 4 లక్షల మందికి పైగా సైన్యం ఉన్నారు. టర్కీ వద్ద అధిక సంఖ్యలో ఎఫ్-16 ఫైటింగ్ ఫాల్కన్ యుద్ధ విమానాలున్నాయి.

7. పాకిస్థాన్ ఎయిర్ ఫోర్స్

7. పాకిస్థాన్ ఎయిర్ ఫోర్స్

మన పొరుగు దేశమైన పాకిస్థాన్ కూడా శక్తివంతమైన వైమానిక దళాన్ని కలిగి ఉంది. ఈ జాబితాలో పాకిస్థాన్‌ది 7వ స్థానం. పాకిస్థాన్ వద్ద మొత్తం 502 కోంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ ఉన్నాయి. వీరి వద్ద చైనీస్ చెంగ్డు జే-7 (ఎక్కువగా ఉపయోగించేది), ఎఫ్-16 ఫైటింగ్ ఫాల్కన్, ఫ్రెంచ్ ఫైటర్ ఎయిర్‌క్రాఫ్ట్, డాసల్స్ మిరాజ్ 5 మరియు మిరాజ్ 3 వంటి మోడ్రన్ యుద్ధ విమానాలున్నాయి.

6. కొరియన్ పీపుల్స్ ఎయిర్ ఫోర్స్ (ఉత్తర కొరియా)

6. కొరియన్ పీపుల్స్ ఎయిర్ ఫోర్స్ (ఉత్తర కొరియా)

ఉత్తర కొరియా తమ పొరుగు దేశం (దక్షిణ కొరియా) దాడిని సమర్థవంతంగా తిప్పికొట్టేందు ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. ఇది పరిమాణంలో చిన్న దేశమే అయినప్పటికీ, వైమానిక దళం విషయంలో మాత్రం ఇది 6వ స్థానంలో ఉంది. ఉత్తర కొరియా వద్ద మొత్తం 661 కోంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్స్ ఉన్నాయి. ఇందులో ఎక్కువ భాగం చైన్, సోవియెట్ యూనియన్‌ల నుంచి కొనుగోలు చేసినవే. చైనీస్ షెన్యాంగా జే-5 ఫైటర్స్, మికోయాన్-గురెవిచ్ మిగ్-21 వంటి యుద్ధ విమానాలున్నాయి.

5. ఈజిప్షియన్ ఎయిర్ ఫోర్స్

5. ఈజిప్షియన్ ఎయిర్ ఫోర్స్

పిరమిడ్లకు ప్రాచుర్యమైన ఈజిప్ట్ పటిష్టమైన వైమానిక దళాన్ని కలిగి ఉంది. ఈజిప్ట్ వద్ద 900 కోంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్స్ ఉన్నాయి. ఈజిప్షియన్ ఎయిర్ ఫోర్స్ అత్యధికంగా ఎఫ్-16 ఫైటింగ్ ఫాల్కన్ యుద్ధ విమానాలను ఉపయోగిస్తుంది, మొత్తం యుద్ధ విమానాల్లో ఇవే దాదాపు 240 వరకు ఉన్నాయి. ప్రపంచంలో కెల్లా అతిపెద్ద మైనిక దళాలు కలిగిన దేశాల్లో ఈజిప్ట్‌ది 5వ స్థానం.

4. ఇండియన్ ఎయిర్ ఫోర్స్

4. ఇండియన్ ఎయిర్ ఫోర్స్

వైమానిక దళం విషయంలో మనం కూడా ప్రపంచ దేశాల సరసన ఉన్నాం. ఈ జాబితాలో భారతదేశానికి నాల్గవ స్థానం. భారత్ వద్ద 1080 కోంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్స్ ఉన్నాయి. సుమారు 1932 ప్రాంతంలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌ను స్థాపించారు. యుద్ధ విమానాలను స్వతహాగా అసెంబుల్ చేసుకునే సౌకర్యం మరియు రష్యన్ లైసెన్సుతో వందలాది సంఖ్యలో సుఖోయ సు-30ఎమ్‌కెఐ ఎయిర్ సుపీరియారిటీ ఫైటర్స్ తయారు చేయగల సామర్థ్యం ఉంది. ఇండియా వద్ద కూడా అనేక అధునాతన యుద్ధ విమానాలున్నాయి.

3. పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ ఎయిర్ ఫోర్స్ (చైనా)

3. పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ ఎయిర్ ఫోర్స్ (చైనా)

టాప్ 10లో మూడవ స్థానంలో ఉన్న చైనా వద్ద సుమారు 1500 యుద్ధ విమానాలు, దాదాపు 3.30 లక్షల మంది సైన్యం ఉన్నారు. చైనా కూడా తమ స్వంత యుద్ధ విమానాలను నిర్మించుకోగలదు. మ్యాచ్ 2.35, షెన్యాంగ్ జే-11, జియాన్ హెచ్-6 వంటి బాంబర్లను (బాంబులు జారవిడిచే విమానాలు) కూడా తయారు చేయగల సామర్థ్యం చైనాకు ఉంది.

2. రష్యన్ ఎయిర్ ఫోర్స్

2. రష్యన్ ఎయిర్ ఫోర్స్

రష్యన్ ఎయిర్ ఫోర్స్ వద్ద సుమారు 1900 కోంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్స్ ఉన్నాయి. పాత సోవియెట్ ఎయిర్ ఫోర్సెస్ (1990లోనే 6100 ఫైటర్లు, బాంబర్లు మరియు అటాక్ ఎయిర్‌క్రాఫ్ట్స్ కలిగి ఉన్న దేశం) నుంచి 1992లో ప్రారంభించబడిన రష్యన్ ఎయిర్ ఫోర్స్ భారీ వైమానిక దళాన్ని కలిగి ఉండి, ప్రపంచాన్ని శాసిస్తున్న దేశాల్లో రెండవ దేశంగా ఉంది. తమ దేశం అధునాతన విమానాలను తయారు చేసుకోవటమే కాకుండా, పొరుగు దేశాలకు విక్రయించే సత్తా కూడా రష్యాకు ఉంది.

1. యునైటెడ్ స్టేట్స్ ఎయిర్ ఫోర్స్

1. యునైటెడ్ స్టేట్స్ ఎయిర్ ఫోర్స్

వైమానిక దళంలో ప్రపంచపు అగ్రగామి దేశం అమెరికానే. యునైటెడ్ స్టేట్స్ ఎయిర్ ఫోర్స్ వద్ద సుమారు 3,318 యుద్ధ విమానాలు ఉన్నాయి. అమెరికా తమ యుద్ధ విమానాలు స్వంతంగా తయారు చేసుకోవటమే కాకుండా అనేక ప్రపంచ దేశాలకు కూడా విక్రయిస్తుంటుంది. ఇతర యుద్ధ వాతావరణ పరిస్థితులు ఏర్పడినప్పుడు అమెరికా బలగాలు జోక్యం చేసుకుని, ఆయా దేశాలకు సహకరిస్తుంటుంది. అత్యంత అధునాతమైన యుద్ధ విమానాలు అమెరికా సొంతం.

ప్రపంచంలో కెల్లా అతిపెద్ద వైమానిక దళాలు కలిగిన దేశాలు

మరి వైమానిక దళంలో ఏది పెద్ద దేశం..? ఇంకేది అమెరికానే అంటారా..!


మూలం: ది రిచెస్ట్

Most Read Articles

English summary
Take a look at the Top 10 Largest Combat Air Forces in the World. These 10 countries know the value of a large, strong combat air force, with the highest numbers of combat aircraft in the world.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X