ఇండియాలో అత్యంత రద్దీగా ఉండే రైల్వే స్టేషన్లు

By Anil

ఇండియన్ రైల్వే చాలా ప్రాంతాల ప్రజలకు రవాణా సేవలందిస్తోంది. బస్సు మార్గాలు లోని ప్రదేశాలలో కూడా ఇండియన్ రైల్వే సేవలు ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా అతి పెద్ద రైల్వే నెట్‌వర్క్‌లలో ఇండియన్ రైల్వే ఒకటి. సుమారుగా 1,15,000 కిలోమీటర్ల ఇండియన్ రైల్వే పట్టాలు పరుచుకున్నాయి. అందులో ప్రతి నిత్యం కొన్ని కోట్ల మంది ప్రజలను తమ గమ్య స్థానాలకు చేరుస్తోంది.

ఇండియన్ రైల్వేలో వివిధ నగరాలలో భారీ రైల్వే స్టేషన్లు ఉన్నాయి. చాలా వరకు రైల్వే స్టేషన్లు అత్యంతో రద్దీతో కూడికుని ఉన్నాయి. అక్కడ ప్రయాణికుల సందడి మరియు రైళ్ల రాకపోకలు చాలా ఎక్కువ స్థాయిలో ఉంటాయి. ఇలాంటి చోట తప్పకుండా జాగ్రత్తగా వ్యవహరించాలి. దేశ వ్యాప్తంగా అత్యంత రద్దీగా ఉండే అతి ముఖ్యమైన 12 రైల్వే స్టేషన్ల గురించి నేడు మన ఆఫ్ బీట్ శీర్షికలో రైలు సెక్షన్ ద్వారా తెలుసుకుందాం రండి.

 12. ఛత్రపతి శివాజీ టెర్మినస్

12. ఛత్రపతి శివాజీ టెర్మినస్

ఇండియన్ రైల్వేలో అత్యంత రద్దీగా ఉండే స్టేషన్‌లలో ముంబాయ్ ఛత్రపతి శివాజీ టెర్మినస్ ఒకటి. ఈ స్టేషన్ ఇండియాలోని సుధీర రైళ్ల రాకపోకలకు మరియు ముంబాయ్ ప్రాతీయ రైళ్ల రాకపోకలకు అత్యంత ముఖ్యమైనది. మరియు ఈ స్టేషన్ ముఖ బాగం నిర్మాణం ఎంతో సుందరంగా ఉంటుంది. అందువలన ఇది దేశీయంగా మరియు అంతర్జాతీయంగా అందమైన రైల్వే స్టేషన్‌ల జాబితాలో నిలిచింది.

Picture credit: Aaditya Ganapathy/Wiki Commons

 11. ముగల్ సరాయ్ జంక్షన్

11. ముగల్ సరాయ్ జంక్షన్

ఇండియాలో అత్యంత రద్దీగా ఉండే రైల్వే స్టేషన్‌లలో ముగల్ సరాయ్ రైల్వే స్టేషన్ 11 వ స్థానంలో నిలిచింది. ఇక్కడ ఉన్న గూడ్సు రైళ్ల పట్టాల క్రాసింగ్ (ఒక పట్టా మీద నుండి చాలా పట్టాలకు మారే ప్రదేశం) ఆసియాలోనే అతి పెద్దది. ఇది ఉత్తర ప్రదేశ్‌లో కలదు.

Picture credit: wikimapia

10. లక్నో స్టేషన్

10. లక్నో స్టేషన్

ఇండియాలో అత్యంత రద్దీతో కూడుకున్న రైల్వే స్టేషన్‌లలో ఇది 10 వ స్థానంలో నిలిచింది. ఈ స్టేషన్ గుండా రోజుకు 300 వరకు రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి. మరియు ఇండియన్ రైల్వేలో అత్యంత అందమైన రైల్వే స్టేషన్‌లలో మొదటి స్థానంలో ఉంది.

Picture credit: Mohit/Wiki Commons

9. వడోదర స్టేషన్

9. వడోదర స్టేషన్

వడోదర జంక్షన్ రైల్వే స్టేషన్ గుజరాత్ రాష్ట్రంలో అత్యంత రద్దీతో కూడుకున్నది మరియు దేశవ్యాప్తంగా ఉన్న రద్దీ పరంగా చూస్తే తొమ్మిదవ స్థానంలో ఉంది. ఇక్కడ అతి పెద్ద ఎలక్ట్రిక్ లోకో షెడ్ కలదు.

Picture credit: indiarailinfo

8. ఇటార్సి జంక్షన్

8. ఇటార్సి జంక్షన్

మధ్య ప్రదేశ్ రాష్ట్రంలో అత్యంత రద్దీగా ఉండే రైల్వే స్టేషన్ ఇటార్సి. ఇక్కడ రోజుకు సుమారుగా 330 రైళ్లు ఆగుతాయి. ఇండియాలోని సుదూర ప్రాంతాలను కలిపే విధంగా ఏడు అతు ముఖ్యమైన ట్రాక్‌లు ఇందులో ఉన్నాయి. Picture credit: indiarailinfo

7. అలహాబాద్ జంక్షన్

7. అలహాబాద్ జంక్షన్

ఉత్తర ప్రదేశ్‌లో అత్యంత రద్దీగా ఉండే రైల్వే స్టేషన్లలో ఇది రెండవ స్థానంలో నిలిచింది. మరియు అత్యంత వేగంగా పరుగులు పెట్టే సుమారు అన్ని రైళ్లు కూడా ఈ జంక్షన్ గుండా ప్రయాణిస్తాయి. అందులో రాజధాని మరియు దురంతో ఎక్స్‌ప్రెస్ రైళ్లు కూడా ఉన్నాయి.

Picture credit: Biswarup Ganguly/Wiki Commons

6. విజయవాడ జంక్షన్

6. విజయవాడ జంక్షన్

అత్యంత రద్దీ ఉన్న రైల్వే జంక్షన్‌లలో విజయవాడ రైల్వే జంక్షన్ ఒకటి. ఇక్కడ నుండి రోజుకి సుమారుగా 400 వరకు సరుకు రవాణా మరియు ప్యాసింజర్ రైళ్లు ప్రయాణం సాగిస్తున్నాయి. అంతే కాదండోయ్ మన విజయవాడ రైల్వే స్టేషన్‌ను ఇండియన్ రైల్వే ఏ-1 కేటగిరీగా ప్రకటించింది. దీనిని మోడల్ రైల్వే డివిజన్ కూడా చేశారు.

Picture credit: MyVijayawada/Wiki Commons

5.పాట్నా జంక్షన్

5.పాట్నా జంక్షన్

ఇండియన్ రైల్వే లైన్లలో అత్యంత రద్దీగా ఉండే వాటిలో పాట్నా జంక్షన్ ఒకటి. ఇది దేశంలో ఉన్న రెండు అతి పెద్ద నగరాలు న్యూ ఢిల్లీ మరియు కలకత్తాలను కలుపుతుంది. తూర్పు మధ్య రైల్వేలో అతి ముఖ్యమైన రైల్వే స్టేషన్ ఇది.

Picture credit: YouTube

4. కళ్యాణ్ జంక్షన్ రైల్వే స్టేషన్

4. కళ్యాణ్ జంక్షన్ రైల్వే స్టేషన్

ముంబాయ్ రైల్వే నెట్‌వర్క్‌లో అతి ముఖ్యమైన వాటిలో కళ్యాణ్ రైల్వే జంక్షన్ ఒకటి మరియు ముంబాయ్ సబ్అర్భన్ రైల్వే శాఖలో మూడవ అతి పెద్ద రైల్వే స్టేషన్ ఇది. ఇది లోకల్ మరియు దూర ప్రాంత రైళ్లకు సేవలందిస్తోంది.

Picture credit: Superfast1111/Wiki Commons

3. కాన్పూర్ సెంట్రల్

3. కాన్పూర్ సెంట్రల్

భారత దేశపు ఉత్తర మధ్య రైల్వే ఇదీ ఒక రద్దీ గల రైల్వే స్టేషన్లలో ఇది ఒకటి. ఇక్కడ రోజుకి సుమారుగా 280 రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి. ఢిల్లీ స్టేషన్ తర్వాత పొడవైన ఇంటర్ లాకింగ్ గల వ్యవస్థ ఇక్కడ కూడా కలదు.

Picture credit: Raulcaeser/Wiki Commons

2. న్యూ ఢిల్లీ స్టేషన్

2. న్యూ ఢిల్లీ స్టేషన్

ఢిల్లీలో ఉన్న రైల్వే స్టేషన్ దేశ వ్యాప్తంగా రెండవ అత్యంత రద్దీగా ఉండే స్టేషన్. ఇక్కడకు రోజుకు సుమారుగా 350 రైళ్లు మరియు 5 లక్షల మంది ప్రయాణికులు వస్తుపోతుంటారు. ఇక్కడ సుమారుగా 16 రైల్వే ఫ్లాట్‌ఫామ్‌లు కలవు. ప్రపంచపు అతి పొడవైన ఇంటర్‌లాకింగ్ వ్యవస్థ కూడా ఇక్కడే కలదు.

Picture credit: Superfast1111/Wiki Commons

 1. హౌరా జంక్షన్ రైల్వే స్టేషన్

1. హౌరా జంక్షన్ రైల్వే స్టేషన్

రోజు వారి ప్రయాణికులు వచ్చే రద్దీ పరంగా మరియు అత్యధికంగా వచ్చే రైళ్ల పరంగా అత్యంత రద్దీగా ఉండే రైల్వే స్టేషన్లలో దేశ వ్యాప్తంగా హౌరా జంక్షన్ రైల్వే స్టేషన్ మొదటి స్థానంలో ఉంది. ఇక్కడి రోజుకు సుమారుగా 10 లక్షల మంది ప్రయాణికులు వస్తు పోతుంటారు, ఇందులో 23 ఫ్లాట్‌ఫామ్‌లు కలవు.

Picture credit: Lovedimpy/Wiki Commons

ఇండియాలో అత్యంత రద్దీగా ఉండే రైల్వే స్టేషన్లు

  • ఇండియాలో అత్యంత రద్దీ గల టాప్-10 అంతర్జాతీయ విమానాశ్రయాలు ఇవే..!

Most Read Articles

English summary
Top 12 Most Busiest Railway Stations of India
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X