ప్రపంచంలో కెల్లా అత్యంత భయంకరమైన ఎయిర్‌పోర్ట్ రన్‌వేస్

By Super

విమాన ప్రయాణం అంటే ఎవ్వరికైనా ఇష్టమే. మనం పక్షిలా గాలిలో ఎగిరిపోతుంటే, ఆ ఆనందానికి అవధులు ఉండవు. అందులోను తొలిసారిగా విమానం ఎక్కేవారి అనుభవాన్ని వర్ణించడానికి మాటలు ఉండవు. వేల మైళ్ల దూరానికైనా గంటల్లో చేరవేయగల అత్యాధునిక రవాణా సాధణం మానవుడు కనిపెట్టిన ఈ 'విమానం'.

విమాన ప్రయాణంలో అతిముఖ్యమైన ఘట్టాలు, టేకాఫ్ (ఎగరటం) మరియు ల్యాండింగ్ (దిగటం). బహుశా విమానంలో ప్రయాణీకులంతా 'భగవంతుడా మమ్మల్ని సురక్షితంగా గమ్యానికి చేర్చు' అని దేవుడ్ని గట్టిగా ప్రార్థించుకునే రెండు సందర్భాలు కూడా ఇవేనేమో. విమానం టేకాఫ్ చేయాలన్నా, ల్యాండింగ్ అవ్వాలన్నా మంచి రన్‌వే అవసరం.

మరి ఈనాటి ఆఫ్‌బీట్ కథనంలో ప్రపంచంలో కెల్లా అత్యంత భయనాకమైన (ప్రయాణీకులకు భీతి కలిగించే) టాప్ 25 ఎయిర్‌పోర్ట్ రన్‌వేల గురించి ఈ కథనంలో తెలుసుకుందాం రండి..! మీరు ఈ రన్‌వేలను చూస్తే, వామ్మో అని గుండె మీద చేయి వేసుకోవటం ఖాయం. మరి ఆలస్యమెందుకు వెంటనే ఈ ఫొటో ఫీచర్‌ను తిరగేయండి.

ప్రపంచంలో కెల్లా అత్యంత భయంకరమైన ఎయిర్‌పోర్ట్ రన్‌వేస్

తర్వాతి స్లైడ్‌లలో ప్రపంచంలో కెల్లా అత్యంత భయాన్ని కలిగించే టాప్ 25 ఎయిర్‌పోర్ట్ రన్‌వేస్ గురించి తెలుసుకోండి.

బర్రా ఎయిర్‌పోర్ట్

బర్రా ఎయిర్‌పోర్ట్

స్కాట్‌ల్యాండ్‌లోని వెస్ట్ కోస్ట్ వద్ద ఈ రన్‌వే ఉంది. వాస్తవానికి ఇదొక ఇసుకతో కూడిన రన్‌వే (బీచ్ రన్‌వే). ఈ రన్‌వేను కేవలం డేటైమ్ ఫ్లైట్ల కోసం మాత్రమే ఉపయోగిస్తారు.

ఫొటో మూలం: calflier001

చుబు సెంట్రైర్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్

చుబు సెంట్రైర్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్

ఈ ఎయిర్‌పోర్ట్ జపాన్‌లోని టోకోనేమ్ వద్ద ఉంది. సిటీకి దూరంగా, సముద్రంపై ఉండటం దీని విశిష్టత. చుట్టుపక్కల నీటితో ఈ రన్‌నవే ల్యాండ్ అవుతుండే గుండె ఝల్లు మంటుంది.

ఫొటో మూలం: Kyodo News/AP

కాంగోనాస్ ఎయిర్‌పోర్ట్

కాంగోనాస్ ఎయిర్‌పోర్ట్

ఇది బ్రెజిల్ దేశంలో సావ్ పాలో నగరం మధ్యలో ఉంది. నగర నడిబొడ్డున ఉండే ఈ ఎయిర్‌పోర్ట్ రన్‌వే టేకాఫ్, ల్యాండింగ్ రెండూ కూడా పైలట్లకు సవాలుతో కూడుకున్నవే.

ఫొటో మూలం: Joao Carlos Medau

కోపాలిస్ స్టేట్ ఎయిర్‌పోర్ట్

కోపాలిస్ స్టేట్ ఎయిర్‌పోర్ట్

ఇది కూడా మరొక రిస్కీ బీచ్ ఎయిర్‌పోర్ట్. ఇది వాషింగ్టన్‌లోని గ్రేస్ హార్బర్ కౌంటీ వద్ద ఉంది. ఇక్కడ ప్రత్యేకించి రన్‌వే అంటూ ఏమీ లేదు కానీ ఇసుక రోడ్డుపైనే టేకాఫ్, ల్యాండింగ్‌లు జరుగుతూ ఉంటాయి. కోపాలిస్ నది తీర ప్రాంతంలో ఈ ఎయిర్‌పోర్ట్ ఉంది.

ఫొటో మూలం: Alex Derr

కౌర్చెవల్ ఎయిర్‌పోర్ట్ (ఫ్రాన్స్)

కౌర్చెవల్ ఎయిర్‌పోర్ట్ (ఫ్రాన్స్)

హిమపు కొండల మధ్యలో ఉండే ఈ రన్‌వే పొడవు కేవలం 545 మీటర్లు మాత్రమే. ఇది ఫ్రాన్స్‌‌లో ఉంది.

ఫొటో మూలం: Peter Robinett

గిబ్రాల్టర్ ఎయిర్‌పోర్ట్

గిబ్రాల్టర్ ఎయిర్‌పోర్ట్

గిబ్రాల్టర్ ఎయిర్‌పోర్ట్ రద్దీ నగరానికి మరియు పర్వతాలకు మధ్యలో ఉంటుంది. ఈ రన్‌వే మొత్తం పొడవు 1800 మీటర్లు మాత్రమే. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఇదే రన్‌పై నగరంలోని వాహనాలు వెళ్లడానికి ఓ రహదారి కూడా ఉంటుంది. ఆ రోడ్డే విన్‌స్టన్ చర్చిల్ అవెన్యూ రోడ్, ఇది అత్యంత రద్దీగా ఉండే రోడ్. ప్లేన్ ల్యాండ్/టేకాఫ్ సమయాల్లో ఈ రోడ్డును మూసేస్తుంటారు.

ఫొటో మూలం: kimhollingshead

గస్తాఫ్ 3 ఎయిర్‌పోర్ట్

గస్తాఫ్ 3 ఎయిర్‌పోర్ట్

దీనినే సెయింట్ బర్తెల్మీ ఎయిర్‌పోర్ట్ అని కూడా పిలుస్తుంటారు. ఇది సెయింట్ బెర్తెల్మీలోని కరేబియన్ ఐలాండ్‌లో ఉంది. ఈ అతిచిన్న రన్‌వే ఓ స్లోప్‌తో ప్రారంభమై బీచ్ వద్ద ముగుస్తుంది.

ఫొటో మూలం: John M

కాయ్ టక్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్

కాయ్ టక్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్

కాయ్ టక్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ హాంగ్‌కాంగ్‌లో ఉంది. దీని రన్‌వే ముగింపు వద్ద మొత్తం నీళ్లే ఉంటాయి. పైలట్ ఏ మాత్రం అజాగ్రత్త వహించినా, విమానం నేరుగా నీళ్లలోకి వెళ్లిపోయే ప్రమాదం ఉంటుంది.

ఫొటో మూలం: Vincent Yu/AP

కన్సాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌‌పోర్ట్

కన్సాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌‌పోర్ట్

జపాన్‌‍‌లోని ఒసాకాలో కన్సాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌‌పోర్ట్ ఉంది. ఈ ఎయిర్‌పోర్ట్‌ను చేరువ అవుతుంటే, పైలట్ విమానాన్ని నీళ్లలో ల్యాండ్ చేస్తున్నట్లు అనిపిస్తుంది. ఎందుకంటే, ఈ ఎయిర్‌పోర్ట్ చుట్టూ నీళ్లే ఉంటాయి.

ఫొటో మూలం: mrhayata

మడీరా ఎయిర్‌పోర్ట్

మడీరా ఎయిర్‌పోర్ట్

మడీరా ఎయిర్‌పోర్ట్ పోర్చుగల్ దేశంలో ఉంది. అట్లాంటింక్ మహా సముద్రపు ఒడ్డున మరియు పర్వతాలకు అంచులకు మధ్యలో ఈ ప్రమాదకరమైన ఎయిర్‌పోర్ట్ ఉంటుంది. దీనిపై టేకాఫ్, ల్యాండింగ్ చేయాలంటే ఎంతో నైపుణ్యం కావాలి.

ఫొటో మూలం: Thilo Hilberer

మేట్‌కేన్ ఎయిర్ స్ట్రిప్

మేట్‌కేన్ ఎయిర్ స్ట్రిప్

ఆఫ్రికాలోని లెసోతోలో ఈ మేట్‌కేన్ ఎయిర్ స్ట్రిప్ ఉంది. దీని పొడవు కేవలం 400 మీటర్లు మాత్రమే. ఈ రన్‌వే చివర్లో లోతైన అఘాదం ఉంటుంది. బహుశా ఇది చిన్నసైజు ప్రైవేట్ విమానాల కోసం ఉద్దేశించబడినదేమో.

ఫొటో మూలం: Tom Claytor

నర్సార్‌సౌక్ ఎయిర్‌‌పోర్ట్

నర్సార్‌సౌక్ ఎయిర్‌‌పోర్ట్

నర్సార్‌సౌక్ ఎయిర్‌‌పోర్ట్ గ్రీన్‌ల్యాండ్‌లో ఉంది. సరస్సు ఒడ్డున ఉండే ఈ రన్‌వే విమానాలను టేకాఫ్/ల్యాండ్ చేయాలంటే పైలట్లకు చుక్కలు కనబడుతాయి. ఎందుకంటే, ఆ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో గాలి విపరీతంగా వీస్తుంటుంది. అందుకే ఈ రన్‌వే పై కేవలం పగటిపూట మాత్రమే టేకాఫ్/ల్యాండింగ్‍‌కు అనుమతి ఉంటుంది.

ఫొటో మూలం: Jim Stewart

పారో ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్

పారో ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్

రాయల్ భూటాన్ ఎయిర్‌లైన్స్‌కు స్వంత ఇల్లు లాంటింది ఈ పారో ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్. భూమిపై ఉపరితలంపై నుంచి సుమారు 2236 అడుగులు ఎత్తులో ఉండే ఈ ఎయిర్‌పోర్ట్ చుట్టూ 5000 మీటర్ల ఎత్తులో ఉండే హిమాలయ పర్వతాలుంటాయి. రాత్రివేళల్లో, మంచు ఎక్కువగా ఉన్న సమయాల్లో ఈ ఎయిర్‌పోర్ట్ రన్‌వేపై ల్యాండింగ్‌లను అనుమతించరు.

ఫొటో మూలం: Gelay Jamtsho

పెగాసస్ వైట్ ఐస్ రన్‌వే

పెగాసస్ వైట్ ఐస్ రన్‌వే

అంటార్కిటికాలో ఈ పెగాసస్ వైట్ ఐస్ రన్‌వే ఉంది. ఇది మంచుతో కూడిన రన్‌వే. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఈ ఐస్ రన్‌వేపై ఏడాది పొడవునా విమానాల ల్యాండింగ్, టేకాఫ్ జరుగుతూనే ఉంటాయి. అంటే ఈ ఐస్ ఎప్పటికీ కరిగిపోదన్నమాట.

ఫొటో మూలం: Tech. Sgt. Shane A. Cuomo/U.S. Air Force

ప్రిన్సెస్ జూలియానా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్

ప్రిన్సెస్ జూలియానా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్

ప్రిన్సెస్ జూలియానా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ సెయింట్ మార్టిన్‌లో ఉంది. దీని రన్‌వే పొడవు (2300 మీటర్లు) కావటంతో పెద్ద విమానాలు మహా బీచ్‌లోని పర్యాటకుల తల మీద నుంచి దూసుకుపోయినట్లు అనిపిస్తుంటాయి.

ఫొటో మూలం: Takashi

క్వైటో ఎయిర్‌పోర్ట్

క్వైటో ఎయిర్‌పోర్ట్

జనావాసం మధ్యలో ఉండే ఎయిర్‌పోర్ట్ ఇది. సన్నటి, ఇరుకుగా ఉండే రన్‌వే అత్యంత ప్రమాదకరమైనది.

ఫొటో మూలం: Dolores Ochoa/AP

స్వాల్బార్డ్ ఎయిర్‌పోర్ట్

స్వాల్బార్డ్ ఎయిర్‌పోర్ట్

లాంగ్ఇయర్‌బైన్‌లోని స్వాల్బార్డ్ ఎయిర్‌పోర్ట్ బారెంట్స్ సముద్రానికి సమీపంలో ఉంటుంది. దీనిని 1975లో పెర్మాఫ్రోస్ట్ యొక్క లేయర్‌పై నిర్మించారు. సింపుల్‌గా చెప్పాలంటే ఇదొక ఐసు గడ్డపై ఉండే ఎయిర్‌పోర్ట్.

ఫొటో మూలం: rune Petter Ness/AP

టెన్జింగ్-హిల్లరీ ఎయిర్‌పోర్ట్

టెన్జింగ్-హిల్లరీ ఎయిర్‌పోర్ట్

మన పొరుగు దేశమైన నేపాల్‌లోని లూక్లాలో టెన్జింగ్-హిల్లరీ ఎయిర్‌పోర్ట్ ఉంది. సముద్ర మట్టానికి 2860 మీటర్ల ఎత్తులో ఇది ఉంటుంది. దీని రన్‌వే కూడా చాలా చిన్నది. రన్‌వే చివర్లో ప్రమాదకరమైన లోయ ఉంటుంది.

ఫొటో మూలం: Alex Smith

టాంకోన్టిన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్

టాంకోన్టిన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్

టాంకోన్టిన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో చాలా చిన్న రన్‌వే ఉంటుంది. ఇది హ్యోండ్యూరాస్‌లో ఉంది. ఈ రన్‌వే చుట్టూ కొండలు ఉంటాయి.

ఫొటో మూలం: Enrique Galeano Morales

టొరంటో ఐలాండ్ ఎయిర్‌పోర్ట్

టొరంటో ఐలాండ్ ఎయిర్‌పోర్ట్

టొరంటో ఐలాండ్ ఎయిర్‌పోర్ట్ కెనడాలోని ఆంటారియాలో ఉంది. ఇదొక పిన్‌పాయింట్ ల్యాండింగ్ సైట్. ఈ రన్‌వే చుట్టూ నీళ్లు ఉంటాయి. ల్యాండింగ్ సమయంలో పైలట్ అప్రమత్తత ఎంతో అవసరం. ఈ రన్‌వేకు సమీపంలో ఓ నగ్న బీచ్ కూడా ఉంటుంది.

ఫొటో మూలం: John Steadman

జునాచో ఈ రాస్క్వియాన్ ఎయిర్‌పోర్ట్

జునాచో ఈ రాస్క్వియాన్ ఎయిర్‌పోర్ట్

ఈ ఎయిర్‌పోర్ట్ సాబాలో ఉంది. ఈ రన్‌వే సముద్రపు ఒడ్డున ఉంటుంది. దీని చుట్టూ ఎత్తైన పర్వాతాలుంటాయి. ఈ రన్‌వే రెండు చివర్లలో సముద్రం ఉంటుంది. ల్యాండింగ్‌లో ఏ మాత్రం తేడా వచ్చినా సముద్రంలో పడిపోవట ఖాయం.

ఫొటో మూలం: Patrick Hawks

వెల్లింగ్టన్ ఎయిర్‌పోర్ట్

వెల్లింగ్టన్ ఎయిర్‌పోర్ట్

న్యూజిలాండ్‌లో వెల్లింగ్టన్ ఎయిర్‌పోర్ట్ ఉంది. ఇదొక షార్ట్ రన్‌వే. ఈ రన్‌వే చుట్టూ ఎత్తైన పర్వతాలు, బలమైన ఈదురుగాలు ఉంటాయి.

ఫొటో మూలం: Phillip Capper

విలియమ్స్ ఫీల్డ్

విలియమ్స్ ఫీల్డ్

ఇది అంటార్కిటికాపై ఉంది. సమ్మర్ సీజన్‌లో ఈ రన్‌వేపై విమానాలు టైర్లతో కాకుండా స్కీస్‌తో ల్యాండ్ అవుతాయి. దాదాపు 8 మీటర్ల మందం ఉన్న మంచుపై విమానాలు ల్యాండ్ అవుతాయి. ఈ మంచు దాదాపు 80 మీటర్ల ఎత్తున్న ఐస్‌పై పేరుకొని ఉంటుంది. ఈ ఐస్ 552 మీటర్ల పరిమాణంలో నీటిపై తేలుతూ ఉంటుంది. ఇక్కడ రక్తం గడ్డకట్టించే చలి ఉంటుంది.

ఫొటో మూలం: U.S. Air Force

జాన్ ఎఫ్. కెన్నడీ ఎయిర్‌పోర్ట్

జాన్ ఎఫ్. కెన్నడీ ఎయిర్‌పోర్ట్

పార్క్‌వే విజువల్ లేదా కానార్సీ అప్రోచ్ ఇందులో ప్రమాదకరమైనది. ఈ రన్‌వే మరో రెండు ఎయిర్‌పోర్ట్‌లకు కలుపబడి ఉంటుంది. ఎప్పుడు ఏ వైపు నుంచి విమానాలు వస్తాయో అనేది తెలుసుకొని, అప్రమత్తంగా ల్యాండింగ్ చేయాల్సి ఉంటుంది.

టిమోన్ ఐలాండ్

టిమోన్ ఐలాండ్

మలేషియాలో ఉన్న ఈ టిమోన్ ఐలాండ్ ఎయిర్‌పోర్ట్ కూడా అత్యంత భయాన్ని కలిగించే ఎయిర్‌పోర్ట్. ఇది కూడా పిన్‌పాయింట్ ల్యాండింగ్‌ను కలిగి ఉంటుంది. సముద్రం మధ్యలో ఈ ఎయిర్‌పోర్ట్ ఉంటుంది.

ప్రపంచంలో కెల్లా అత్యంత భయంకరమైన ఎయిర్‌పోర్ట్ రన్‌వేస్

ఈ కథనంలో పేర్కొన్నవి కాకుండా మీకు తెలిసిన భయంకరమైన రన్‌వేలు మరేమి ఏవైనా ఉన్నాయా?

ఈ కథనంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో మాతో పంచుకోగలరు. ఇది మీకు నచ్చినట్లయితే, మీ మిత్రులతో షేర్ చేసుకోగలరు.

Most Read Articles

English summary
Take a look at the top 25 scariest airport runways in the world.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X