2016 లో దేశీయ వాహన పరిశ్రమ మీద ప్రభావం చూపిన ఐదు మార్పులు

భారతీయ ఆటోమొబైల్ పరిశ్రమలో ఈ ఏడాది (2016) చోటు చేసుకున్న ఐదు అతి ముఖ్యమైన మార్పులు గురించి ప్రత్యేక కథనం....

By Anil

ప్రపంచ ఆటోమొబైల్ పరిశ్రమలో భారత్‌కు ప్రత్యేక స్థానం ఉంది. ఈ ఏడాది(2016)లో ఏకంగా 40 కార్ల వరకు విడుదలయ్యాయి. అత్యంత శక్తివంతమైన దేశీయ వాహన పరిశ్రమలో ఐదు కీలక ప్రభావాలు ఏర్పడ్డాయి. ఫోర్ వీలర్ మరియు టూ వీలర్ సంస్థలు వీటిని అధిగమించడానికి ఈ ఏడాదిలో నానాపాట్లు పడ్డాయి.

భారత వాహన పరిశ్రమలో చోటు చేసుకున్న ఐదు కీలక మార్పులు గురించి వివరంగా ఇవాళ్టి స్టోరీలో తెలుసుకుందాం రండి...

1. ఢిల్లీలో డీజల్ వాహన అమ్మకాల నిషేధం

1. ఢిల్లీలో డీజల్ వాహన అమ్మకాల నిషేధం

ఢిల్లీలో డీజల్ వాహనాల రిజిస్ట్రేషన్ల రద్దు నిజంగా తయారీ, అమ్మకం మరియు కొనుగోలుదారులకు ఆశ్చర్యకరమైన వార్త. ఢిల్లీ మరియు కేంద్ర రాజధాని పరిధిలో 2,000సీసీ కన్నా ఎక్కువ సామర్థ్యం ఉన్న డీజల్ వాహనాల రిజస్ట్రేషన్లను రద్దు చేయాలని నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ సూచించింది.

2016 లో దేశీయ వాహన పరిశ్రమ మీద ప్రభావం చూపిన ఐదు మార్పులు

ఈ నిర్ణయం కాస్త టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, మెర్సిడెస్ బెంజ్ వంటి కార్ల సంస్థల అమ్మకాల మీద తీవ్ర ప్రభావం చూపింది. రద్దును ఎత్తివేయాలని వాహన తయారీ సంస్థలు సుప్రీం కోర్టుకు వెళ్లాలి. ఆ మేరకు గ్రీన్ ట్యాక్స్ చెల్లించడానికి వాహన సంస్థలు ఒప్పుకోవడంతో 2000సీసీ వాహనాల బ్యాన్ అంశం సమసిపోయింది.

02. కొత్త భద్రత నియమాలు

02. కొత్త భద్రత నియమాలు

దేశీయంగా ప్యాసింజర్ మరియు పాదచారుల భద్రతకు సంభందించిన నిర్ణయాలు తీసుకోవడంలో ఎన్నో ఏళ్లుగా భారత ప్రభుత్వం విఫలమవుతూ వచ్చింది. అయితే ఈ ఏడాదిలో తీసుకున్న నిర్ణయాల ప్రకారం ఇండియన్ మార్కెట్లోకి విడుదలయ్యే ప్రతి వాహనానికి కూడా సేఫ్టీ కోసం అక్టోబర్ 1, 2017 నుండి క్రాష్ పరీక్షలను తప్పనిసరి చేసింది.

2016 లో దేశీయ వాహన పరిశ్రమ మీద ప్రభావం చూపిన ఐదు మార్పులు

అంతే కాకుండా అక్టోబర్ 1, 2020 నుండి దేశీయ విపణిలోకి విడుదలయ్యే కార్లలో యాంటిలాక్ బ్రేకింగ్ సిస్టమ్ మరియు ఎయిర్ బ్యాగులను తప్పనిసరి చేస్తూ నిర్ణయం వెలువడింది.

3. వోక్స్‌వ్యాగన్ డీజల్ ఉద్గార కుంభకోణం - ఇండియన్ మార్కెట్ మీద ప్రభావం

3. వోక్స్‌వ్యాగన్ డీజల్ ఉద్గార కుంభకోణం - ఇండియన్ మార్కెట్ మీద ప్రభావం

సెప్టెంబర్ 2015 లో జర్మనీకి చెందిన అతి పెద్ద కార్ల తయారీ దిగ్గజం యొక్క డీజల్ ఉద్గార కుంభకోణం వెలుగులోకి వచ్చింది. వోక్స్‌వ్యాగన్ ఉత్పత్తి చేసిన సుమారుగా 11 మిలియన్ల డీజల్ కార్లలో మోసపూరిత సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించినట్లు నిరూపితమైంది. వోక్స్‌వ్యాగన్ అభవృద్ది చేసిన ఇంజన్‌లను వోక్స్‌వ్యాగ్, ఆడి, పోర్షే, స్కోడా మరియు సియట్ వంటి కార్లలో వినియోగించారు.

2016 లో దేశీయ వాహన పరిశ్రమ మీద ప్రభావం చూపిన ఐదు మార్పులు

వోక్స్‌వ్యాగన్ యొక్క డీజల్ ఉద్గార కుంభకోణం ముందుగా అమెరికన్ మార్కెట్లో వెలుగు చూసింది. దీంతో అమెరికా, యూరోప్ మరియు విభిన్న అంతర్జాతీయ మార్కెట్లతో పాటు ఇండియన్ మార్కెట్లో కూడా ఈ కుంభకోణం బారినపడ్డ కార్లు భారీ సంఖ్యలో రీకాల్‌కు గురయ్యాయి. ఈ కారణం చేత దేశీయంగా 1.90 లక్షల కార్లు రీకాల్ చేయడం జరిగింది.

4. నూతన మోటార్ వెహికల్ బిల్లు

4. నూతన మోటార్ వెహికల్ బిల్లు

2016 ఏడాది వేదిక కేంద్ర ప్రభుత్వం నూతన మోటార్ వెహికల్ సవరణ బిల్లును ప్రవేశపెట్టింది. ఇందులో కఠినమైన చట్టాలు మరియు వాటికి సంభందించిన జరిమానా వివరాలను వెల్లడించింది.

2016 లో దేశీయ వాహన పరిశ్రమ మీద ప్రభావం చూపిన ఐదు మార్పులు

ఇక మీదట రహదారి నియమాలు కఠనమవుతున్నాయనేది ఈ బిల్లు ద్వారా స్పష్టమవుతోంది. ఇక పై రహదారి నియమాల ఉల్లంఘనలకు పాల్పడితే కఠినమైన చర్యలు మరియు ఊహించిన దానికంటే ఎక్కువ జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.

5. నోట్ల రద్దు ప్రభావం

5. నోట్ల రద్దు ప్రభావం

దేశీయంగా నల్ల ధనాన్ని వెలికితీయడానికి భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నోట్ల రద్దు అంశం కేవలం భారతీయ వాహన పరిశ్రమ మీద మాత్రమే కాదు, దేశ ఆర్థిక రంగం మీద తీవ్ర ప్రభావం చూపింది. నవంబర్ 8, 2016 న పెద్ద రూ. 500 లు మరియు రూ. 1,000 నోట్ల రద్దు కారణంగా ఫోర్ వీలర్ మరియు టూ వీలర్ అమ్మకాల్లో తీవ్ర మందగమనం ఏర్పడింది.

2016 లో దేశీయ వాహన పరిశ్రమ మీద ప్రభావం చూపిన ఐదు మార్పులు

ప్రతి ఏడాది చివరిలో కార్ల తయారీ సంస్థలు విభిన్న ఆఫర్లతో కస్టమర్లను ఆకట్టుకుని ఆ ఏడాదిలో కోల్పోయిన అమ్మకాలను రాబట్టుకునేందుకు ప్రయత్నిస్తాయి. అయితే నగదు కొరత కారణంగా క్యాష్ లెస్ మరియు భారీ క్యాష్ బ్యాక్ ఆఫర్లతో ఎన్నడూ లేని విధంగా దాదాపు అన్ని వాహన తయారీ సంస్థలు ముందుకు వచ్చాయి.

Most Read Articles

English summary
Top 5 Happenings Of 2016 In The Indian Automobile Industry
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X