ప్రమాదకర శత్రువుల అంతానికి భారత్ వద్ద ఉన్న 5 శక్తివంతమైన యుద్ద విమానాలు

By Anil

ప్రపంచ ఎయిర్ ఫోర్స్ జాబితాలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నాలుగవ అతి పెద్దది. సుమారుగా 1,27,000 మంది సైన్యం మరియు 1820 యుద్ద విమానాలు కలవు.

అయితే పొరగు దేశాలతో ప్రమాదం ఏ వైపు నుండి ఎలా వస్తుందో తెలియదు. ఈ సందర్బంలో ఇండియన్ ఆర్మీలో భాగంగా ఉన్న ఇండియన్ ఎయిర్ ఫోర్స్ తన దైన పాత్ర పోషించాల్సి ఉంటుది. కాబట్టి మన ఎయిర్ ఫోర్స్‌లో ఐదు రకాల శక్తివంతమైన యుద్ద విమానాలు ఉన్నాయి. వాటి గురించి క్లుప్తంగా తెలుసుకుందాం రండి.

 5. మికోయాన్-గురేవిచ్ మిగ్-21 యుద్ద విమానం

5. మికోయాన్-గురేవిచ్ మిగ్-21 యుద్ద విమానం

మికోయాన్-గురేవిచ్ మిగ్-21 సూపర్ సోనిక్ యుద్ద విమానాన్ని యూనియన్ సోవిట్‌లోని మికోయాన్-గురేవిచ్ డిజైన్ బ్యూరో వారు డిజైన్ చేశారు. ప్రస్తుతం మన వైమానక దళం వద్ద మూడవ తరానికి చెందిన మికోయాన్-గురేవిచ్ మిగ్-21 యుద్ద విమానాలు ఉన్నాయి. వీటిని సుమారుగా 60 కు పైగా దేశాలు వివియోగిస్తున్నాయి.

 ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో ప్రస్తుతం ఉన్న ఐదు శక్తివంతమైన యుద్ద విమానాలు

ప్రస్తుతం భారత వైమానిక దళంలో 245 మిగ్-21 యుద్ద విమానాలు ఉన్నాయి. ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో మిగ్-21 బిసోన్ మరియు మిగ్-21 ఎమ్‌ఎఫ్ అనే రెండు వర్షన్‌లు ఉన్నాయి. అయితే 2015 లో మిగ్-21 ఎఫ్ఎమ్ అనే వర్షన్ తొలగించడింది. దీని స్థానంలోకి హెచ్‌ఎఎల్ తేజాస్ వచ్చింది.

4. దస్సాల్ట్ మిరేజ్ 2000 మల్టీ రోల్ ఫైటర్

4. దస్సాల్ట్ మిరేజ్ 2000 మల్టీ రోల్ ఫైటర్

దస్సాల్ట్ మిరేజ్ 2000 యుద్ద విమానం ఫ్రెంచ్‌కు చెందినది. దస్సాల్ట్ ఏవియేషన్ సంస్థ అభివృద్ది చేసిన ఈ మల్టీ రోల్ యుద్ద విమానం నాలుగవ తరానికి చెందినది, ఇందులో సింగల్ సిలిండర్ ఇంజన్ కలదు. ప్రారంభంలో దీనిని 1970 లో మొదటి సారిగా డిజైన్ చేశారు.

 ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో ప్రస్తుతం ఉన్న ఐదు శక్తివంతమైన యుద్ద విమానాలు

దస్సాల్ట్ ఇప్పటి వరకు వీటిని కేవలం 600 మాత్రమే ఉత్పత్తి చేసింది. వీటిని సుమారుగా 9 దేశాలు కొనుగోలు చేశాయి. ప్రస్తుతం ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో సుమారుగా 50 మిరేజ్ 2000 విమానాలు సర్వీసులో ఉన్నాయి. ఇందులో దస్సాల్ట్ ఎమ్2000హెచ్ 39, దస్సాల్ట్ ఎమ్2000టిహెచ్ 9 మరియు దస్సాల్ట్ మిరేజ్ 2000ఐ/టిఐ 2 వంటి మూడు వర్షెన్లు ఉన్నాయి.

3. మికోయాన్ మిగ్-29 ఎయిక్ సుపీరియారిటీ ఫైటర్

3. మికోయాన్ మిగ్-29 ఎయిక్ సుపీరియారిటీ ఫైటర్

మికోయాన్ మిగ్-29 మల్టీ రోల్ ఎయిర్ సుపీరియారిటీ ఫైటర్ జెట్‌లో రెండు ఇంజన్‌లు కలవు, వీటిని సోవియట్ యూనియన్ డిజైన్ చేసింది. వీటిని విభిన్న వేరియంట్లలో అందుబాటులోకి తెచ్చారు. అవి, మికోయాన్ మిగ్-29, నవలైస్డ్ మికోయాన్ మిగ్-39 కె మరియు అడ్వాన్స్‌‌డ్ మిగ్-35.

 ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో ప్రస్తుతం ఉన్న ఐదు శక్తివంతమైన యుద్ద విమానాలు

మిగ్-29 యుద్ద విమానాలను సర్వీసులోకి 1983 కాలంలో పరిచయం చేసారు. ఒకప్పుడు ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో ఉన్న మిగ్-29 స్థానంలోకి మిగ్-29 యుపిజి స్టాండర్డ్‌ని ప్రవేశపెట్టారు. ఏవియానిక్ సూట్, ఆధునిక ఇంజన్ మరియు ఆయుధాలను నియంత్రించే వ్యవస్థ ఇందులో కలదు.

2.హెచ్‌ఏఎల్ తేజాస్ మల్టీ పైటర్

2.హెచ్‌ఏఎల్ తేజాస్ మల్టీ పైటర్

గరిష్ట ఎత్తుకు, గరిష్ట వేగంతో, సింగల్ సీట్ మరియు సింగల్ ఇంజన్‌ గల ఈ తేజాస్ సూపర్ సోనిక్ మల్టీ రోల్ యుద్ద విమానాన్ని హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ అభివృద్ది చేసింది. 1980 లో ప్రారంభమైన లైట్ కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ (LCA) ఆధారంతో లైట్ వెయిట్‌గా డిజైన్ చేసారు.

 ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో ప్రస్తుతం ఉన్న ఐదు శక్తివంతమైన యుద్ద విమానాలు

ప్రస్తుతం భారత వైమానిక దళంలో ప్రస్తుతం 9 హెచ్‌ఏఎల్ తేజాస్ సర్వీసులో ఉన్నాయి. ఇంకా 119 విమానాలకు ఆర్డర్ ఇచ్చారు. మొదటి సారిగా ఈ తేజాస్ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్‌లను జనవరి 17, 2015 న దేశీయ ఎయిర్ ఫోర్స్‌లోకి పరిచయం చేశారు.

 1. సుఖోయ్ ఎస్‌యు-30 ఎమ్‌కెఐ మల్టీ రోల్ సుపీరియారిటీ ఫైటర్

1. సుఖోయ్ ఎస్‌యు-30 ఎమ్‌కెఐ మల్టీ రోల్ సుపీరియారిటీ ఫైటర్

సుఖోయ్ ఎస్‌యు-30 ఎమ్‌కిఐ రెండు ఇంజన్‌లను కలిగి ఉన్న సుపీరియారిటీ ఫైటర్ జెట్ విమానం. దీనిని హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ లైసెన్స్‌తో రష్యా సుఖోయ్ ఆధ్వర్యంలో అభివృద్ది చేసారు. దీని ప్రత్యేకంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కోసమే అభివృద్ది చేసారు.

 ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో ప్రస్తుతం ఉన్న ఐదు శక్తివంతమైన యుద్ద విమానాలు

ప్రస్తుతం ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో సుమారుగా 220 సుఖోయ్ ఎస్‌యు-30 ఎమ్‌కెఐ విమానాలు ఉన్నాయి. మొత్తం 272 విమానాలకు ఆర్డర్ ఇచ్చారు. మొత్తం విమానాలను 2018-2019 మధ్యలో డెలివరీ ఇవ్వనున్నారు.

.

  • ప్రపంచంలో అత్యంత ఖరీదైన యుద్ధ విమానం
  • కేవలం రెండే గంటల్లో ప్రపంచంలోని ఏ మూలకైనా చేరుకోగలదు
  • ప్రపంచ వ్యాప్తంగా ఉత్తమ యుద్ద హెలికాఫ్టర్‌ను కలిగిన భారత్
  • .

    • యుద్దానికి సిద్దమైన ఇండియన్ ఆర్మీ, డిఫెన్స్ మరియు నేవీ
    • భారత సైన్యం యొక్క వెన్నెముక, ఈ 45 సాయుధ వాహనాలు

Most Read Articles

English summary
Read In Telugu: Top 5 Most Dangerous Fighter Aircrafts Indian Airforce
Story first published: Tuesday, September 27, 2016, 15:10 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X