ఇండియాలో ఉన్న ఆరు అందమైన ఎయిర్‌పోర్ట్‌లు

By N Kumar

ఇండియా ఇప్పుడు అన్ని రకాల రవాణాల పరంగా అభివృద్ది చెందుతున్న దేశం. ఇందులో విమానయాన సేవలు ఎంతో వేగంగా వృద్ది చెందుతున్నాయి. ప్రస్తుతం దేశ వ్యాుప్తంగా సుమారు 20 కి పైగా అంతర్జాతీయ విమానాశ్రయాలు ఉన్నాయి. అందులో మన దేశంలో అత్యంత సుందరమైన విమాన రన్‌వేలు కలిగిన ఆరు పోర్ట్‌లు ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. వాటి వివరాలు క్రింది కథనంలో....

06. ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయం, ముంబాయ్

06. ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయం, ముంబాయ్

ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయం దేశీయంగా సరుకు రవాణా మరియు ప్రయాణికుల రవాణా పరంగా ఎంతో రద్దీతో కూడుకుంది. మహరాష్ట్రలో ఎంతో ముఖ్యమైన ఎయిర్ పోర్ట్ ‌కూడా ఇదే. మధ్య ఆసియాలో రెండవ మరియు ఇండియాలో ఉత్తమ ఎయిర్ పోర్ట్‌కు అవార్డును కూడా పొందింది. దీని ఇన్‌ఫ్రాస్ట్రక్ఛర్ ఎంతో అందంగా ఉంటుంది.

05. ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం, ఢిల్లీ

05. ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం, ఢిల్లీ

ఢిల్లీ ఎయిర్ పోర్ట్ అత్యంత రద్దీ గల ఎయిర్ పోర్ట్‌లలో దేశీయంగా మొదటి స్థానంలో ఉంది. ఇందులో ప్రయాణికులకు ఎంతో అందమైన వాతావరణాన్ని కల్పించడానికి అత్భుతమైన ఆధునిక హంగులతో ఢిల్లీ ఎయిర్ పోర్ట్‌ను నిర్మించారు. దక్షిణాసియాలో అతి పెద్ద ఎవియేషన్ హబ్‌గా కూడా ఇది ఎంపికైంది.

04. అగత్తి ఐలాండ్ ఎయిర్ పోర్ట్, లక్షద్వీప్

04. అగత్తి ఐలాండ్ ఎయిర్ పోర్ట్, లక్షద్వీప్

భారత దేశానికి పశ్చిమ తీరంలో ఉన్న లక్షద్వీప్ దీవుల్లో ఈ అందమైన అగత్తి ఐలాండ్ రన్‌లే కలదు. లక్షద్వీప్ దీవుల్లోని చిన్న చిన్న దీవులను చేరుకోవడానికి, ఒక ఐలాండ్‌ను పూర్తిగా రన్‌వేలా మర్చేశారు. ల్యాండింగ్ సమయంలో ఆ రన్ వే ఇలా అత్యంత ఆకర్షణీయంగా కనిపిస్తుంది.

 03. కుషోక్ బకులా రింపోచీ ఎయిర్ పోర్ట్, లేహ్

03. కుషోక్ బకులా రింపోచీ ఎయిర్ పోర్ట్, లేహ్

దీనిని లేహ్ ఎయిర్ పోర్ట్ అని కూడా అంటారు. ప్రపంచలో అత్యంత ఎత్తైన వాణిజ్య విమానాశ్రయాల్లో లేహా్ ఎయిర్ పోర్ట్ ఒకటి. ఇది సముద్ర మట్టానికి సుమారుగా 3,256 మీటర్లు (10,682 అడుగుల) ఎత్తులో కలదు. దీని మీద ల్యాండ్ అయ్యే సమయంలో చూట్టూ మంచు కొండలు ఎంతో అందంగా దర్శనమిస్తాయి.

02. డబొలిమ్ ఎయిర్ పోర్ట్, గోవా

02. డబొలిమ్ ఎయిర్ పోర్ట్, గోవా

డబొలిమ్ ఎయిర్ పోర్ట్ దేశీయంగా అత్యంత అందమైన ఎయిర్ పోర్ట్ మరియు అంతర్జాతీయ ఎయిర్ పోర్ట్‌లలో ఇది ఒకటి. గోవా లోని డబొలిమ్ గ్రామం సముద్ర తీరానికి అత్యంత దగ్గరలో ఈ విమానాశ్రయం కలదు. ఇందులో ఉన్న రన్‌ వే సుమారుగా 688 హెక్టార్ల విస్తీర్ణంలో కలదు.

01. వీర్ సవర్కార్ అంతర్జాతీయ విమానాశ్రయం, పోర్ట్ బ్లెయిర్

01. వీర్ సవర్కార్ అంతర్జాతీయ విమానాశ్రయం, పోర్ట్ బ్లెయిర్

అండమాన్ దీవుల్లో ఉన్న ముఖ్య నగరమైన పోర్ట్ బ్లెయిర్ లో ఈ వీర్ సవర్కార్ విమానాశ్రయం కలదు. ఇండియాలోకెల్లా అత్యంత సుందరమైన రన్‌వేను కలిగిన ఎయిర్ పోర్ట్‌లలో ఇది మొదటి స్థానంలో కలదు.

మరిన్ని కథనాల కోసం....

ఇండియాలో అత్యంత రద్దీగా ఉన్న టాప్-10 అంతర్జాతీయ విమానాశ్రయాలు

ఖండాతరాలను చుట్టేస్తున్న 19 నాన్-స్టాప్‌ విమానాలు

మరిన్ని కథనాల కోసం....

ప్రపంచ వ్యాప్తంగా మొదటి స్థానంలో ఉన్న ఢిల్లీ విమానాశ్రయం

వేలానికి విజయ్ మాల్యా వ్యక్తిగత విమానం...!!

Most Read Articles

English summary
Top 6 Most Beautiful Airports in India
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X