ప్రపంచంలో కెల్లా అత్యంత చవకైన ఎయిర్‌లైన్స్

By Ravi

ఒకప్పుడు విమానం అంటే, ధనవంతులకు మాత్రమే అందుబాటులో ఉండే ప్రయాణ సాధనం. కానీ, ఇప్పుడు ఈ లోహ విహంగంలో ప్రయాణం సామాన్యులకు సైతం అందుబాటులోకి వచ్చింది. ఎయిర్‌లైన్స్ మధ్య నానాటికీ పెరుగుతున్న పోటీ కారణంగా, విమానయాన సంస్థలు ఒకదానితో ఒకటి పోటీ అత్యంత చవక ధరకే తమ విమానాల్లో ప్రయాణాన్ని ఆఫర్ చేస్తున్నాయి.

ఇది కూడా చదవండి: ప్రపంచంలో కెల్లా అతిపెద్ద టాప్ 10 షిప్పింగ్ కంపెనీలు

ఈ నేపథ్యంలో, ఈనాటి మన ఆఫ్ బీట్ కథనంలో ప్రపంచంలో కెల్లా అత్యంత చవకైన ఎయిర్‌లైన్స్ గురించి తెలుసుకుందాం రండి. ముందుగా ఎయిర్‌లైన్స్ చరిత్రలను పరిశీలిస్తే డెలాగ్ (DELAG) అనే సంస్థ ప్రపంచంలో కెల్లా మొట్టమొదటి సారిగా విమానాన్ని ఆదాయ ప్రయోజనం కోసం నడిపింది. జర్మనీకి చెందిన ఈ కంపెనీ 1906లో స్థాపించారు. ఆ తర్వాతి కాలంలో అనేక కంపెనీలు ఈ రంగంలోకి ప్రవేశించి విమానయాన సేవలు అందిస్తున్నాయి.

వరల్డ్ ఎయిర్‌లైన్ సర్వే ఆధారంగా మరియు 105 దేశాలకు చెందిన విమాన ప్రయాణీకులు ఇచ్చిన ఫీడ్‌బ్యాక్ ఆధారంగా చూస్తే, తక్కువ ధరకే విమాన ప్రయాణాన్ని ఆఫర్ చేసే టాప్ కంపెనీల వివరాలు క్రింది విధంగా ఉన్నాయి. ఈ సర్వేలో అనేక దేశాలకు చెందిన దాదాపు 245కు పైగా ఎయిర్‌లైన్ సంస్థలను పరిగణలోకి తీసుకున్నారు. మరి ఆ వివరాలేంటో తెలుసుకుందాం రండి.

ప్రపంచంలో కెల్లా అత్యంత చవకైన ఎయిర్‌లైన్స్

తర్వాతి స్లైడ్‌లలో ప్రపంచంలో కెల్లా టాప్ 10 లో-కాస్ట్ ఎయిర్‌లైన్స్ గురించి తెలుసుకోండి.

10. స్కూట్

10. స్కూట్

ఈ జాబితాలో 10వ స్థానంలో ఉన్న స్కూట్ ఎయిర్‌లైన్స్. సింగపూర్‌కి చెందిన స్కూట్ ఎయిర్‌లైన్స్ సంస్థను నవంబర్ 2011లో స్థాపించారు, ఇది జూన్ 2012 నాటికి పూర్తిస్థాయిలో కార్యకలాపాలను ప్రారంభించింది. మొత్తం 6 విమానాలతో 12 దేశాలకు ఈ విమానసేవలు అందుబాటులో ఉన్నాయి.

9. జెట్‌స్టార్ ఏషియా

9. జెట్‌స్టార్ ఏషియా

తొమ్మిదవ స్థానంలో ఉన్నది కూడా సింగపూర్‌కి చెందిన విమానయాన సంస్థే. జెట్‌స్టార్ ఏషియా ఎయిర్‌వేస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీని 2004లో స్థాపించారు. ఇది 18 విమానాలతో 21 దేశాలకు సేవలు అందిస్తుంది.

Picture credit: Wiki Commons

Tsung TsenTsan

8. వర్జిన్ అమెరికా

8. వర్జిన్ అమెరికా

ఇకపోతే ఎనిమిదవ స్థానంలో ఉన్నది వర్జిన్ అమెరికా. అమెరికాకు చెందిన ఈ ఎయిర్‌లైన్ సంస్థను 2004లో స్థాపించారు. దూర ప్రయాణాలు చేసే వారికి తక్కువ ధర, ఎక్కువ నాణ్యతతో సేవలందించడమే ఈ సంస్థ ముఖ్య ఉద్దేశ్యం. వర్జిన్ అమెరికా మొత్తం 53 విమానాలతో 23 గమ్యాలకు సేవలు అందిస్తుంది.

7. వెస్ట్‌జెట్

7. వెస్ట్‌జెట్

ఈ జాబితాలో ఏడవ స్థానంలో ఉన్నది వెస్ట్‌జెట్. కెనడాకు చెందిన ఈ పబ్లిక్ కంపెనీ 120 విమానాలతో 89 గమ్యాలకు సేవలు అందిస్తుంది. ఈ సంస్థను 1996లో స్థాపించారు. ప్రస్తుతం ఇది కెనడాలో కెల్లా రెండవ అతిపెద్ద విమానయాన సంస్థ. దాదాపు 10,000 మంది ఉద్యోగులు ఇందులో పనిచేస్తున్నారు.

6. ఈజీజెట్

6. ఈజీజెట్

ప్రపంచంలో కెల్లా అత్యంత చవక ధరకే సేవలు అందించే విమానయాన సంస్థలలో ఆరవ స్థానంలో ఉన్నది ఈజీజెట్. లండన్‌కి చెందిన ఈ విమాన సంస్థ 202 విమానాలతో 134 గమ్యాలకు సేవలు అందిస్తుంది. 1995లో స్థాపించబడిన ఈ సంస్థ యూరప్‌లో కెల్లా రెండవ అతిపెద్ద లో కాస్ట్ క్యారియర్‌గా ఎదిగింది.

5. ఇండిగో

5. ఇండిగో

ఈ జాబితాలో విదేశీ విమానయాన కంపెనీలే కాదు మనదేశ కంపెనీలు కూడా ఉన్నాయి. ఐదవ స్థానంలో ఉన్న భారతదేశానికి చెందిన విమానయాన సంస్థ ఇండిగో. మొత్తం 78 కొత్త ఎయిర్‌బస్ ఏ320 విమానాలతో 36 గమ్యాలకు చేరుకుంటున్న ఇండిగో సంస్థను 2006 స్థాపించారు. ధరను తక్కువగా ఉంచేందుకు గాను ఈ విమానాల్లో ఎకానమీ క్లాస్ మాత్రమే అందుబాటులో ఉంటుంది. వీటిలో కాంప్లిమెంటరీ మీల్ ఆఫర్ చేయరు, ఇందులో ఫ్లైట్ ఎంటరైన్‌మెంట్ కూడా ఉండదు.

4. జెట్‌స్టార్ ఎయిర్‌వేస్

4. జెట్‌స్టార్ ఎయిర్‌వేస్

జెట్‌స్టార్ ఎయిర్‌వేస్ స్లోగన్ (ఆస్ట్రేలియాస్ నెంబర్ వన్ లో ఫేర్స్ ఎయిర్‌లైన్స్) చెప్పినట్లుగానే, ఇది అత్యంత తక్కువ ధరలను ఆఫర్ చేస్తుంది. ఆస్ట్రేలియాకు చెందిన ఈ విమానయాన సంస్థను 2003లో స్థాపించారు. ఇది మొత్తం 73 విమానాలతో 35 గమ్యాలకు ప్రయాణీకులను చేరవేస్తుంది.

Picture credit: Wiki Commons

Gertzy

3. నార్వేజియన్

3. నార్వేజియన్

ప్రపంచంలో కెల్లా అత్యంత చవక ధరకే విమాన ప్రయాణాన్ని ఆఫర్ చేస్తున్న సంస్థలలో ఓస్లోకి చెందిన నార్వేజియన్ మూడవ స్థానంలో ఉంది. 1993లో స్థాపించబడిన ఈ సంస్థ మొత్తం 89 విమానాలతో 126 గమ్యాలను చేరుకుంటుంది.

2. ఎయిర్ ఏషియా ఎక్స్

2. ఎయిర్ ఏషియా ఎక్స్

మలేషియాకు చెందిన లో కాస్ట్ ఎయిర్‌లైన్ కంపెనీ ఎయిర్ ఏషియా ఎక్స్ ఈ జాబితాలో రెండవ స్థానంలో ఉంది. మొత్తం 18 విమానాలతో ఇది 19 గమ్యస్థానాలకు ప్రయాణీకులను చేరవేస్తుంది. ఈ సంస్థను 2007లో స్థాపించారు. కామన్ టికెటింగ్ సిస్టమ్, ఎయిర్‌క్రాఫ్ట్ లైవరీ, ఎంప్లాయి యూనిఫారమ్స్, మేనేజ్‌మెంట్ స్టైల్ ద్వారా వీరు ఖర్చులను తక్కువగా ఉంచగలిగారు. ఇది ఎయిర్ ఏషియాకు చెందిన ఓ ఫ్రాంచైజీ కంపెనీ.

1. ఎయిర్ ఏషియా

1. ఎయిర్ ఏషియా

ఇక ప్రపంచంలో కెల్లా అత్యంత చవక ధరకే విమాన ప్రయాణాన్ని అందించే సంస్థ ఎయిర్ ఏషియా. ఈ సంస్థ ట్యాగ్‌లైన్ 'ఇప్పుడు ప్రతిఒక్కరూ ఎగరొచ్చు'కు తగినట్లుగానే ఇందులో ధరలు ఉంటాయి. 1993లో స్థాపించిన ఈ సంస్థ 169 విమానాలతో 88 గమ్యస్థానాలకు ప్రయాణీకులను చేరవేస్తుంది. ఈ సంస్థ ఉపయోగించేది అన్ని ఎయిర్‌బస్ ఏ320 విమానాలే.

Picture credit: Wiki Commons

Terence Ong

Most Read Articles

English summary
Based on the World Airline Survey and feedback from respondents representing 105 different nationalities, let's take a look at 10 of the cheapest airlines out there that make a budget holiday possible. The survey covered more than 245 airlines, from the largest international carriers to the smaller domestic airlines.
Story first published: Monday, July 21, 2014, 17:18 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X