ఇండియాలో ఉన్న పది అత్యద్బుత రైల్ కమ్ రోడ్ వంతెనలు

భారత దేశంలో అద్బుతమైన రైల్వే మరియు రహదారుల నెట్‌వర్క్ ఉంది. అందులో దేశ వ్యాప్తంగా చాలా వరకు రైల్వే మరియు రహదారి విభాగాలు రెండూ ద్వందంగా ఒకే వంతెన మీద రైలు మరియు వాహనాలు ప్రయాణించే వీలును కల్పించాయి.

Written By:

భారత దేశంలో రహదారులు మరియు రైల్వే విభాగాలు అద్బుతమైన నెట్‌వర్క్ కలిగి ఉన్నాయి. వేల కిలోమీటర్లు రైల్వే మరియు రహదారులు దేశవ్యాప్తంగా పరుచుకున్నాయి. ఇందులో దేశ ఖ్యాతిని తెలిపే విధంగా రహదారులు మరియు రైల్వే విభాగాలు రైలు మరియు రోడ్డును ఒకే వంతెన మీద నిర్మించాయి. 

బోగీబీల్

బోగీబీల్ రైల్ కమ్ రోడ్ వంతెన అస్సాం రాష్ట్రంలోని ఢిబ్రూఘర్ జిల్లాలో ఉన్న బ్రహ్మపుత్ర నది మీద నిర్మాణ దశలో ఉంది. దీని నిర్మాణం పూర్తి అయితే భారత దేశంలో అత్యంత పొడవైన రైల్ కమ్ రోడ్ బ్రిడ్జిగా రికార్డులకెక్కనుంది.

అస్సాం మరియు అరుణాచల్ ప్రదేశ్‌లను కలిపే ఈ బోగీబీల్ వంతెన పొడవు సుమారుగా 4.94 కిలోమీటర్లుగా ఉంది. అనేక కారణాల వలన దీని నిర్మాణంలో జాప్యం జరుగుతూనే ఉంది. అయితే మోదీ ప్రభుత్వంలో బోగీబీల్ నిర్మాణ పనుల్లో వేగం పుంజుకుంది.
Picture Credit: WalkThroughIndia

గంగా రైల్ కమ్ రోడ్ బ్రిడ్జి

భారత దేశంలో నిర్మాణ దశలో ఉన్న మరో వంతెన గంగా రైల్ కమ్ రోడ్డ బ్రిడ్జి. బీహార్ రాష్ట్రంలో ఉన్న గంగా నదిపై ఈ వంతెన నిర్మాణం జరుగుతోంది. బీహార్‌లోని రెండు ప్రధాన భాగాలను కలపే విధంగా దీని నిర్మాణం చేపట్టారు.

 

ఇది పూర్తి స్థాయిలో నిర్మాణ పనులు పూర్తి చేసుకుంటే దీని పొడపు సుమారుగా 4.55 కిలోమీటర్లుగా ఉండే అవకాశం ఉంది. అంటే ఇండియాలో రెండవ అత్యంత పొడవైన రైల్ కమ్ రోడ్ వంతెనగా నిలవనుంది. మరియు బీహార్ రాష్ట్రంలో అత్యంత పొడవైన మొదటి రైల్ కమ్ రోడ్ వంతెన ఇదే అవనుంది.
Picture Credit: WalkThroughIndia

మంగర్ గంగా బ్రిడ్జి

బీహార్ రాష్ట్రంలో నిర్మాణ దశలో ఉన్న మరో రైల్ కమ్ రోడ్ వంతెన మంగర్ బ్రిడ్జి. దీనిని మంగర్ అనే ప్రాంతంలో గంగా నది మీద నిర్మిస్తున్నారు. దీని పొడవు సుమారుగా 3.19 కిలోమీటర్లుగా ఉండనుంది.
Picture credit: slideshare

బీహార్‌లో రెండవ అత్యంత పొడవైన రైల్ కమ్ రోడ్ బ్రిడ్జిగా ఇది నిలవనుంది. మరియు దేశవ్యాప్తంగా మూడవ అత్యంత పొడవనైన రైల్ కమ్ రోడ్ వంతెనగా నివనుంది. బీహార్‌లోని భక్తియర్‌పూర్ మరియు తాజ్‌పూర్ నగరాలను ఇది కలపనుంది. అంతే కాకుండా ఎన్‌హెచ్ 80 మరియు ఎన్‌హెచ్ 31 అనే రెండు ప్రధాన రహదారులకు ఇది వారధి కానుంది.
Picture Credit: WalkThroughIndia

గోదావరి వంతెన

ఆంధ్రప్రదేశ్‌ను ప్రపంచ పటంలో గర్వంగా చూపిస్తుంది ఈ గోదావరి వంతెన. కొన్ని దశాబ్దాల చరిత్ర కలిగి ఉన్న గోదావరి రైల్ కమ్ రోడ్ వంతెన ఆసియాలో ఖండంలో రెండవ అత్యంత పొడవైన రైల్ కమ్ రోడ్ వంతెన.

గోదావరి రైల్ కమ్ రోడ్డు వంతెన పొడవు సుమారుగా 2.7 కిలోమీటర్లుగా ఉంది. కొవ్వూరు-రాజమండ్రి లను కలిపే ఈ వంతెనను రాజమండ్రి-కొవ్వూర్ రైల్ కమ్ రోడ్ వంతెన అని కూడా పిలుస్తారు.
Picture Credit: WalkThroughIndia

నారాయణ సేతు

అస్సాం రాష్ట్రంలో ఉన్న బ్రహ్మపుత్ర నది మీద ఉన్న మరో వంతెన నారాయణ సేతు. దీని పొడవు సుమారుగా 2.5-కిలోమీటర్లుగా ఉంది.
Picture credit: walkthroughindia

హోలీ బ్రహ్మపుత్ర నది మీదుగా నిర్మించిన ఈ రైల్ కమ్ రోడ్ బ్రిడ్జి అస్సాంలోని పంచరత్నా మరియు గోల్‌పారా అనే ప్రధాన నగరాలను కలుపుతుంది. ప్రస్తుతం అస్సాంలో రెండవ అత్యంత పొడవైన రైల్ కమ్ రోడ్ బ్రిడ్జిగా ఉంది.
Picture Credit: WalkThroughIndia

ఫరక్కా వంతెన

పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో నిర్మించిన ఫరక్కా బ్యారేజ్ మీద ఈ రైల్ కమ్ రోడ్ వంతెనను నిర్మించారు. ప్రస్తుతం భారత దేశంలోకెల్లా ఉండే రైల్ కమ్ రోడ్ వంతెనలలో ఈ ప్రఖ్యాత మరియు విభిన్నమైనది. బ్యారేజ్ మీద నిర్మించిన ఏకైక రైల్ కమ్ రోడ్ వంతెన ఇది.

ఫరక్కా బ్యారేజ్ మరియు రైల్ కమ్ రోడ్ వంతెన పొడవు సుమారుగా 2.24కిలోమీటర్లుగా ఉంది. ఇది ఉత్తర బెంగాల్‌తో పాటు ఉత్తర-తూర్పు రాష్ట్రాలను కూడా కలుపుతోంది.
Picture Credit: WalkThroughIndia

రాజేంద్ర సేతు

గంగా నది మీద నిర్మించబడిన మొదటి రైల్ కమ్ రోడ్ వంతెన రాజేంద్ర సేతు. బీహార్ రాష్ట్రం యొక్క రెండు ప్రధాన భాగాలను కలుపుతూ దీని నిర్మాణం జరిగింది. బీహార్ రాజధాని పాట్నాకు సమీపంలోని మొకామా అనే ప్రాంతంలో దీనిని నిర్మించారు. అందుకుగాను దీనిని మొకామా రైల్ కమ్ రోడ్ వంతెన అని కూడా సంభోదిస్తారు.
Picture credit: bbjconst

2.0-కిలోమీటర్ల మేర పొడవున్న ఈ వంతెన మీద రైలు రూటు మరియు రెండు లేన్ల రహదారి కలదు. జాతీయ రహదారిఎన్‌హెచ్ 31 కోసం నాలుగు లేన్ల రహదారిని ఈ వంతెన మీద నిర్మించే ప్రతిపాదనలు కూడా ఉన్నాయి.
Picture Credit: WalkThroughIndia

సరైఘాట్ వంతెన

బ్రహ్మపుత్ర నది మీద నిర్మించిన మొదటి రైల్ కమ్ రోడ్ వంతెన ఇది. దీనిని గౌహతి వద్ద నిర్మించారు. సరైఘాట్ అనే ప్రఖ్యాత గ్రామాన్ని కలుపుతుంది ఈ వంతెన. దీని పొడవు సుమారుగా 1.4కిలోమీటర్లుగా ఉంది.

ఇప్పుడు ఈ వంతెన ప్రక్కన మూడు లేన్ల రహదారి కోసం కాంక్రీట్ వంతెనను నిర్మిస్తున్నారు.
Picture Credit: WalkThroughIndia

కోయిల్వార్ వంతెన

కోయిల్వార్ వంతెనను అబ్దుల్ బరి రైల్ కమ్ రోడ్ వంతెన అని కూడా పిలుస్తారు. దీనిని బీహార్‌లోని సొనె నది మీద కోయిల్వార్ అనే ప్రాంతంలో నిర్మించారు. దేశంలో అత్యంత పురాతణమైన రైల్ కమ్ రోడ్ వంతెనల్లో ఇది ఒకటి.
Picture credit: Mapio

1.4-కిలోమీటర్ల పొడవున్న దీని మీద రైలు మరియు రెండు లేన్ల ఎన్‌హెచ్ 30 జాతీయ రహదారి కలదు.
Picture Credit: WalkThroughIndia

వివేకానంద సేతు

పశ్చిమ బెంగాల్‌లో ఉన్న అత్యంత పురాతణమైన రైల్ కమ్ రోడ్ వంతెనల్లో వివేకానంద సేతు ఒకటి. దీనిని దక్షినేశ్వర్ వద్ద హుగ్లి నది మీద నిర్మించారు. ఈ వంతెన పశ్చిమ బెంగాల్‌లోని రెండు ప్రధాన నగరాలైన హౌరా మరియు కలకత్తాలను కలుపుతుంది.

0.9 కిలోమీటర్ల పొడవున్న వివేకానంద సేతు కలకత్తా నుండి ఢిల్లీ వెళ్లే మార్గంలో ఇది ఉంది. దీని గుండానే కలకత్తా ఓడరేవుకు మార్గం కలదు.
Picture Credit: WalkThroughIndia


Cover Image Credit 

Click to compare, buy, and renew Car Insurance online

Buy InsuranceBuy Now

Story first published: Wednesday, October 26, 2016, 12:48 [IST]
English summary
Read In Telugu: Top 10 Impressive Rail Cum Road Bridges of India
Please Wait while comments are loading...

Latest Photos