టోయింగ్ ట్రక్కులు ఫాస్ట్‌గా వెళితే ఇలానే జరుగుతుంది!

By Ravi

అసలు టోయింగ్ ట్రక్కుల పనేంటి, బ్రేక్‌డౌన్ అయిన వాహనాలను సురక్షితంగా వాటి గమ్యస్థానాలకు చేర్చడమే. కానీ, ఈ టోయింగ్ ట్రక్కుల వల్లనే ప్రమాదం జరిగితే.. ఇదిగో ఈ వీడియో చూడండి. బ్రేక్‌డౌన్ అయిన ఓ ఫోక్స్‌వ్యాగన్ టోరెగ్ ట్రక్కును టో చేసుకొని వెళ్తున్న ఓ ట్రక్కు మితిమీరిన వేగం కారణంగా అదుపు తప్పి ప్రమాదానికి గురైంది.

టోయింగ్ ట్రక్కు వెనుక మరొక వాహనాన్ని టో చేసుకుంటూ వేగంగా వెళ్తున్నప్పుడు సదరు ట్రక్ బ్రేక్ వేసినంత ఫాస్ట్‌గా వెనుక కారులో ఉన్న వ్యక్తి బ్రేక్ వేయటం అన్ని సందర్భాల్లో సాధ్యం కాకపోవచ్చు. ఈ సంఘటనలో కూడా అదే జరిగినట్లు అనిపిస్తోంది.

వేగంగా వస్తున్న టోయింగ్ ట్రక్కుకు రోడ్డుపై అడ్డుగా మరో ట్రక్కు రావటంతో సదరు టోయింగ్ ట్రక్ డ్రైవర్ బ్రేక్ వేయటానికి బదులుగా ట్రక్కును రోడ్డు పక్కకు మళ్లించాడు. అయితే, అప్పటికే రోడ్డుపైకి వచ్చిన మరో ట్రక్కు ఈ టోయింగ్ ట్రక్కు వెనుక భాగాన్ని ఢీకొట్టడంతో, దీంతో అదుపు తప్పిన టోయింగ్ ట్రక్కు అవతలి రోడ్డుపై పల్టీలుకొట్టుకుంటూ వచ్చి రోడ్డుపై ఆగిన మరో కారును ఢీకొట్టడం జరిగింది.

అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో ఎవ్వరికీ ప్రణాపాయం జరగలేదు. ఏదేమైనప్పటికీ, టోయింగ్ ట్రక్కులు ఉన్నవి ఇతర వాహనాలకు సాయం చేయటానికి కానీ, ఇలా మితిమీరిన వేగంతో వచ్చిన ఇతరులను ఇబ్బంది పెట్టడానికి కాదని గ్రహించాలి. మరి మీరు కూడా ఆ వీడియో చూసేయండి.
<center><iframe width="100%" height="450" src="//www.youtube.com/embed/Sj-R5dlhC8U?rel=0" frameborder="0" allowfullscreen></iframe></center>

Most Read Articles

English summary
The job of a tow truck is to help another vehicle that is facing trouble. Here we have a tow truck who gets into more trouble than helping others. In the video below you will see a Volkswagen Touareg being helped by a tow truck.&#13;
Story first published: Tuesday, August 19, 2014, 16:48 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X