Thought for the day
Your page will load in ...
Close Ad X
Advertisement
English हिन्दी ಕನ್ನಡ മലയാളം தமிழ்
 
Share This Story

మనుషులను మోటార్‌సైకిళ్లుగా మలచిన అర్టిస్ట్ ట్రినా మేరీ

Written by:
Published: Saturday, October 27, 2012, 16:19 [IST]

కళకు అంతు, అవధులు అనేవి లేవు. సృజనాత్మకత, ఓర్పు, నైపుణ్యాలతో అద్భుతాలను సృష్టించవచ్చు. మన దేశంలో బాడీ పెయింటింగ్ పెద్దగా పాపులర్ కాలేదు కాని విదేశాల్లో మాత్రం దీనికి మంచి ఆదరణ ఉంది. మానవ శరీరాలనే కాన్వాస్‌గా చేసుకొని, కుంచెలతో అద్భుతాలను సృష్టించవచ్చని నిరూపించింది ప్రముఖ ఆర్టిస్ట్ ట్రినా మేరీ. శాన్ ఫ్రాన్సిస్కో బే ఏరియాకు చెందిన ఈవిడ మనుషులనే బైక్‌లుగా మార్చేసింది (నిజంగా కాదులెండి.. బాడీ పెయింటింగ్ కళతో).

యోగా, జిమ్నాస్టిక్స్‌లో నిపుణులైన కొంతమంది శరీరాలపై పెయింటిగ్ వేసి వారి నుంచి డర్ట్ బైక్, స్పోర్ట్స్ బైక్, క్రూయజర్ వంటి మోటార్‌ వాహనాలకు రూపం పోసింది. ప్రోగ్రెసివ్ ఇంటర్నేషల్ మోటార్‌సైకిల్ షోల ద్వారా ట్రినా మేరీ ఆర్ వర్క్‌ను ప్రదర్శనకు ఉంచనున్నారు. ఎంతో ఓర్పు, నైపుణ్యం ఉంటేనే వీటిని అనుకున్న రూపం ఇవ్వటం సాధ్యమవుతుంది. ఈ ఫోటోలను గమనిస్తే.. ఇందులో దాగి ఉన్న కళానైపుణ్యం ఏంటో మీకే అర్థమవుతుంది. ట్రినా మేరీ రూపొందించిన డిజైన్లను అమెరికాలోని పలు రోడ్ మోటార్ షోలలో ఉపయోగించనున్నారు.

ట్రినా మేరా ఆర్ట్ వర్క్ - స్పోర్ట్స్ బైక్

ట్రినా మేరా ఆర్ట్ వర్క్ - మోడల్

ట్రినా మేరా ఆర్ట్ వర్క్ - డర్ట్ బైక్

ట్రినా మేరా ఆర్ట్ వర్క్ - మోడల్

ట్రినా మేరా ఆర్ట్ వర్క్ - క్రూయిజర్ బైక్

ట్రినా మేరా ఆర్ట్ వర్క్ - స్పోర్ట్స్ బైక్ మేకింగ్

ట్రినా మేరా ఆర్ట్ వర్క్ - స్పోర్ట్స్ బైక్ మేకింగ్

ట్రినా మేరా ఆర్ట్ వర్క్ - డర్ట్ బైక్ మేకింగ్

ట్రినా మేరా ఆర్ట్ వర్క్ - డర్ట్ బైక్ మేకింగ్

ట్రినా మేరా ఆర్ట్ వర్క్ - మోడల్


ఈ బాడీ పెయింట్ ఆర్ట్ వర్క్‌లో పాల్గొన్న యోగా నిపుణులు, మోడళ్ల శరీరాలపై హానికలిగించని సహజ రంగులను ఉపయోగించారు. శరీరంపై నుంచి ఈ రంగులను తొలగించడం కూడా చాలా సులువు. శరీరాలపై పెయింట్‌ను వేయటానికి కుంచెలు, స్ప్రేలను ఉపయోగించారు. బైక్‌ల షేప్ కోసం కావల్సిన భాగాలను విడి విడిగా పెయింట్ చేసుకున్న తర్వాత ఫైనల టచ్అప్ కోసం వీరంది ఓ చోటకి చేర్చడం జరుగుతుంది. పెయింట్ మొత్తం పూర్తయిన తర్వాత వారు ఆ పోశ్చర్‌లో సుమారు 5-6 నిమిషాలు కదలకుండా అలానే ఉండాలి వస్తుంది.

English summary
These motorcycles for sure will not clock the required kilometers. However, Trina Merry and her team’s latest naked human body motorcycle creation will surely get heads turning.
మీ వ్యాఖ్య రాయండి
Click here to type in Telugu