బ్లాక్ నైట్ ట్రాన్స్‌ఫార్మర్ - ట్రక్ హెలికాఫ్టర్ హైబ్రిడ్

By Ravi

రోడ్డుపై వెల్లాల్సిన ట్రక్ హెలికాఫ్టర్‌లా గాల్లో ఎగురుకుంటూ వెళ్లిపోవటాన్ని మీరు ఎప్పుడైనా చూశారా? ఊరుకోండి సార్, ఇవన్నీ సినిమాల్లోనే సాధ్యం అవుతాయి, నిజంగా జరుగుతాయా అంటారా..! అయితే ఈ కథనం చదవండి, మీరే ఆశ్చర్యపోతారు.

అమెరికన్ మిలటరీకి సంబంధించిన ఓ ప్రాజెక్టును అడ్వాన్స్డ్ టాక్టిక్స్ అనే కంపెనీ హ్యాండిల్ చేస్తోంది. ఇందులో భాగంగానే ఓ ఫ్లయింగ్ ట్రక్కును డిజైన్ చేస్తున్నారు. ఈ ఫ్లయింగి ట్రక్కు పేరు 'బ్లాక్ నైట్ ట్రాన్స్‌ఫార్మర్' (Black Knight Transformer).

బ్లాక్ నైట్ ట్రాన్స్‌ఫార్మర్ ఒక హైబ్రిడ్ వాహనం దీనిని రోడ్డుపై సాధారణ ట్రక్కులా నడపవచ్చు, అలాగే గాల్లో హెలికాఫ్టర్‌లా కూడా ఎగిరించవచ్చు. కాలిఫోర్నియాలోని ఎల్ సెగుండో ప్రాంతానికి చెందిన అడ్వాన్స్డ్ టాక్టిక్స్ కంపెనీ, ఈ నెక్స్ట్ జనరేషన్ మిలటరీ అండ్ సివిల్ వెహికల్ టెక్నాలజీని అభివృద్ధి చేస్తోంది. మరిన్ని ఆసక్తికర విషయాలను ఈ ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి.

బ్లాక్ నైట్ ట్రాన్స్‌ఫార్మర్ - ట్రక్ హెలికాఫ్టర్ హైబ్రిడ్

బ్లాక్ నైట్ ట్రాన్స్‌ఫార్మర్ ఫ్లయింగ్ ట్రక్కును వెర్టికల్ టేకాఫ్ అండ్ ల్యాండింగ్ (విటిఓఎల్) వాహనంగా అభివృద్ధి చేస్తున్నారు. ఈ వాహనాన్ని గాల్లోకి లేపటానికి రన్‌వే అవసరం లేదు. ఇది హెలికాఫ్టర్ మాదిరి ఉన్న చోటు నుంచే గాల్లోకి ఎగరగలదు.

బ్లాక్ నైట్ ట్రాన్స్‌ఫార్మర్ - ట్రక్ హెలికాఫ్టర్ హైబ్రిడ్

బ్లాక్ నైట్ ట్రాన్స్‌ఫార్మర్ ఇటీవలే తన ఫస్ట్ ఫ్లైట్‌ను విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఈ ఫస్ట్ ఫ్లైట్‌లో భాగంగా బ్లాక్ నైట్ ట్రాన్స్‌ఫార్మర్ నేలపై నుంచి 10 అడుగుల ఎత్తు వరకు ఎగరగలిగింది.

బ్లాక్ నైట్ ట్రాన్స్‌ఫార్మర్ - ట్రక్ హెలికాఫ్టర్ హైబ్రిడ్

ఈ టెస్ట్ వెహికల్ చూడటానికి షిప్పింగ్ క్రేట్‌లా అనిపిస్తుంది, కానీ దీని నిర్మాణం పూర్తయిన తర్వాత ఇది నిజమైన ట్రక్కు రూపంలో దర్శనమిస్తుంది. 2000 కేజీల వరకు సామర్థ్యం కలిగిన సైనిక బలగాలు, వస్తువులను తరలించేలా దీనిని డిజైన్ చేస్తున్నారు.

బ్లాక్ నైట్ ట్రాన్స్‌ఫార్మర్ - ట్రక్ హెలికాఫ్టర్ హైబ్రిడ్

బ్లాక్ నైట్ ట్రాన్స్‌ఫార్మర్ అభివృద్ధి ఇప్పటికే దాదాపుగా పూర్తయింది, నేలపై నుంచి సుమారు 3050 మీటర్ల ఎత్తు వరకు ఎగరగలిగేలా దీనిని తయారు చేస్తున్నారు. దీనిని రోడ్డుపై గరిష్టంగా గంటకు 112 కిలోమీటర్ల వేగంతో డ్రైవ్ చేయవచ్చు.

బ్లాక్ నైట్ ట్రాన్స్‌ఫార్మర్ - ట్రక్ హెలికాఫ్టర్ హైబ్రిడ్

బ్లాక్ నైట్ ట్రాన్స్‌ఫార్మర్‌లో ఎనిమిది రోటార్లు (ఇరువైపులా నాలుగేసి) ఉంటాయి. వీటి సాయంతోనే ట్రక్ గాల్లోకి లేస్తుంది. రోడ్డుపై నడుపుతున్నపుడు ఈ రోటార్లను ఆటోమేటిక‌గా మడుచుకోవచ్చు.

బ్లాక్ నైట్ ట్రాన్స్‌ఫార్మర్ - ట్రక్ హెలికాఫ్టర్ హైబ్రిడ్

ప్యాంథర్ ట్రాన్స్‌ఫార్మర్ అనేది బ్లాక్ నైట్ ట్రాన్స్‌ఫార్మర్‌కి చిన్నపాటి వెర్షన్. బ్లాక్ నైట్ ట్రాన్స్‌ఫార్మర్ సామర్థ్యంలో ప్యాంథర్ ట్రాన్స్‌ఫార్మర్ సామర్థ్యం సగం ఉంటుంది.

బ్లాక్ నైట్ ట్రాన్స్‌ఫార్మర్ - ట్రక్ హెలికాఫ్టర్ హైబ్రిడ్

అడ్వాన్స్డ్ టాక్టిక్స్ తయారు చేస్తున్న ఈ విటిఓఎల్ వాహనాలను క్యాబిన్/కాక్‌పిట్ లోపల కూర్చొని కంట్రోల్ చేయవచ్చు లేదా బయటి నుంచి రిమోట్ ద్వారా నైనా కూడా కంట్రోల్ చేయవచ్చు.

Most Read Articles

English summary
A U.S military commissioned project, being handled by a company called Advanced Tactics, has taken its first step towards becoming a reality. Meet Black Knight Transformer, a truck that can take off like a helicopter.
Story first published: Friday, April 18, 2014, 15:28 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X