ట్యూబ్ లెస్ టైర్లను ఎంచుకోవడంలో తికమక పడుతున్నారా...? అయితే నిపుణుల సలహాలు ఏంటో చూద్దాం రండి.

Written By:

ప్రస్తుతం ఆటోమొబైల్ మార్కెట్లో ప్రతి వెహికల్ కూడా ట్యూబ్ లెస్ టైర్లతో వస్తున్నాయి. మరియు చాలా కంపెనీలు ట్యూబ్ లెస్ టైర్లను కలిగి ఉన్న వాహనాలకు ఇది ఒక ప్రత్యేత ఫీచర్‌గా చెప్పుకుంటూ తెగ ప్రచారం చేసేస్తున్నాయి. మొత్తానికి ట్యూబ్ లెస్ టైర్ అంటే ఏమిటి అనేగా మీ ప్రశ్న?

ట్యూబ్ లెస్ టైర్లు చూడటానికి మామూలు టైర్ల తరహాలోనే ఉంటాయి. అయితే మామూలు టైర్లు ట్యూబులను కలిగి ఉంటాయి. ట్యూబ్ లెస్ టైర్లలో ట్యూబ్‌లు ఉండవు. ట్యూబ్ లేకపోతే గాలిని ఎక్కడ నింపుతారని అనుకుంటున్నారా? ఈ ట్యూబ్ లెస్ టైర్‌లోకి గాలిని నింపిన తరువాత ఎయిర్ టైట్ సీల్ ద్వారా రిమ్ కు మరియు టైరుకు మద్య గాలి లీకు అవ్వకుండా చేస్తారు.
Also Read: ఆటోమొబైల్ రంగాన్ని శాసిస్తున్న ఆనంద్ మహీంద్ర గురించి ఆసక్తికరమైన విషయాలు

ఈ ట్యూబ్ లెస్ టైర్ల వలన కలగే ప్రయోజనాలు మరియు అప్రయోజనాలను క్రింది కథనం ద్వారా తెలుసుకుందాం రండి...

1.చిన్న పంక్చర్లకు ఏ మాత్రం జంకదు.

మామూలుగా సాధారణ టైర్లు ప్రతి చిన్న దానికి పంక్ఛర్ అవుతుంటాయి. అయితే అలాటివి ఇప్పుడు ఈ ట్యూబ్ లెస్ టైర్లలో కుదరదు. మరియు గాలి లీక్ అవుతున్న శబ్ధం మీరు గ్రహించినట్లయితే అది పంక్చర్ అనుకొని పొరబడేరు. ఎందుకంటే రిమ్ మరియు టైర్ కు మద్య గల రాపిడి వలన అలా జరుగుతుందని నిపుణుల అభిప్రాయం.

2.తక్కువ గాలితో కూడా నడపవచ్చు.

మీ టైరు ఎక్కడైనా పంక్చర్ అయితే ఏం చేస్తారు. దానిని అక్కడే వదిలేస్తారు లేదా పంక్చర్ షాప్ వరకు నెట్టుకుంటూ వెళతారు.అయితే ఈ ట్యూబ్ లెస్ టైర్లలో గాలి తక్కువగా ఉన్నా లేదా పంక్ఛర్ అయినా మీరు దీనిని నిశ్చింతగా ఉపయోగించవచ్చు. తరువాత దీనికి సర్వీసింగ్ చేయవచ్చు.

3.లిక్విడ్‌తో సీలింగ్

ఒక వేళ మీ ట్యూబ్ లెస్ టైర్‌ను ఏదయినా పదునైన పరికరం తూట్లు పొడిచిందనుకోండి. ఈ లిక్విడ్ వెళ్లి ఆ తూట్లను మూసివేస్తుంది. అయితే ఇది సాధారణ టైర్లలో సాధ్యం కాదు.

4. గాలి నిదానంగా బటకు వెళ్లడం

సాధారణ టైర్లు గల వాహనాలు పంక్చర్‌కు గురైతే అది వాహనాన్ని ప్రమాదానికి గురి చేస్తుంది. ఎందుకంటే ఒక్క సారి ఎక్కువ గాలి బయటకు రావడం వలన టైర్ పేలి వాహనాన్ని బోల్తా పడే విధంగా చేస్తుంది.అయితే ఈ ట్యూబ్‌ లెస్ టైర్లు పంక్చర్ అయితే గాలి చాలా నిదానంగా బయటకు వస్తుంది. దీని వలన ప్రమాదాలు జరిగే అవకాశం చాలా తక్కువ.

5.తక్కువ బరువు

ఈ ట్యూబ్ లెస్ టైర్లు సాధారణ టైర్లతో పోల్చుకుంటే తక్కువ బరువు ఉంటాయి. దీనిని వలన వెహితల బరువు తగ్గి ఇంజన్ మీద తక్కువ ప్రభావం పడుతుంది. దీనిని వలన ఇంజన్ తక్కువ ఇంధనాన్ని వినియోగించుకుని ఎక్కువ మైలేజ్‌ని ఇస్తుంది.

6.తక్కువ అరుగుదల

ట్యూబ్ గల టైర్లు ఎక్కువ వేగంలో టైరుకు మరియు రోడ్డుకు మద్య ఎక్కువ రాపిడి కలిగి అత్యధిక వేడి ఉత్పన్నమై టైర్ పేలిపోయే అవకాశం ఉంది. అయితే ట్యూబ్ లెస్ టైర్‌కు నిర్ణీతమైన గ్రిప్ ఉండటం వలన ఇలాంటివి జరిగే అవకాశమే ఉండదు

7.ధృడత్వం

ఎక్కువ వేగం వద్ద మీరు వాహనాన్ని నడుపుతున్నపుడు టైర్‌, ట్యూబ్, రిమ్ ఈ మూడు నిర్ధిష్టమైన వేగంతో ఉంటాయి. అయితే టైరు మరియు ట్యూబ్ ల మద్య గల వేగం యొక్క వ్యత్యాసాల వలన కొంచె గాలి బుడగల రూపంలో టైర్‌‌లోకి చేరుకుని ఉబ్బెత్తుగా ఉండేవిధంగా చేస్తుంది. కాని ట్యూబ్ లెస్ టైర్ లో టైర్ మరియు రిమ్ మాత్రమే ఉండటం వలన ఇలాంటి సమస్య వచ్చే అవకాశమే లేదు.

1.అమర్చడంలో ఇబ్బంది

ట్యూబ్ లెస్ టైర్లను రిమ్‌లోకి అమర్చడం కొంచెం ఇబ్బంది. ఎందుకంటే టైర్‌కు మరియు రిమ్ల మద్య ఎయిర్ టైట్ సీల్ ఉంటుంది కాబట్టి. అయితే దీనిని ఎక్స్‌పర్ట్‌‌లచే అమర్చితే రిమ్‌కు ఎలాంటి డ్యామేజ్ కలగకుండా చేయవచ్చు.

2.పంక్చర్

ఈ ట్యూబ్ లెస్ టైర్ పంక్చర్‌కు గురైతే దీనికి పంక్చర్ వేయడానికి ప్రత్యేక పరికరాలు కావాలి ఇవి అందరి దగ్గర దాదాపుగా అందుబాటులో ఉండవు.

3.టైర్ డ్యామేజ్

ఒక వేళ సాదారణ టైర్లు పెద్ద పంక్చర్ కు గురైతే ట్యూబ్‌ను మార్చేసి, దాని స్థానంలో కొత్త ట్యూబ్‌తో మార్పిడి చేయవచ్చు. కాని ట్యూబ్ లెస్ టైర్లు పెద్ద పంక్చర్‌కు గురైతే ఆ టైరును మార్చవలసి ఉంటుంది. ఇది మీ జేబుకు చిల్లులు పెట్టేస్తుంది.

4. ధర

ఈ ట్యూబ్ లెస్ టైర్ సాధారణ టైర్‌తో పోల్చుకుంటే ఎంతో ధరతో కూడుకున్నది. ఎందుకంటే ఇందులో ఎక్కువ విలువైన మెటీరియల్‌ను ఉపయోగించారు.

5.వ్యక్తిగత అనుభవం

  • ఈ మద్యనే డ్రైవ్ స్పార్క్ టీమ్ హిమాలయాలకు రెండు కెటియమ్ బైక్‌ల మీద ట్రిప్ నిర్వహించాము. అయితే ట్యూబ్‌లెస్ టైర్లు అత్భుతమైన పని తీరును కనబరిచాయి. మా నిర్ణయం ట్యూబ్ ‌లెస్ టైర్లును నిశ్చింతగా ఉపయోగించవచ్చు.

Click to compare, buy, and renew Car Insurance online

Buy InsuranceBuy Now

Story first published: Wednesday, November 4, 2015, 12:42 [IST]
English summary
Expert Talk: The Main Advantages & Disadvantages Of Tubeless Tyres
Please Wait while comments are loading...

Latest Photos