మానవ వ్యర్థాలతో నడిచే పూ బస్ లను పరిచయం చేయనున్న యూపీ సర్కార్..

By Vinay

మానవ వ్యర్థాలతో నడిచి ఇందనాన్ని ఆదా చేయడంతో పాటు వాతావరణ కాలుష్యాన్ని అరికట్టే పూ బస్ లను భారత్ లో తొలిసారి

ఉత్తరప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ పరిచయం చేయనుంది.

ఈ మానవ వ్యర్థాలతో నడిచే బస్సులు ప్రస్తుతం బ్రిటన్, ఇటలీ, స్వీడన్ మరియు పోలాండ్ వీధుల్లో పరుగులు తీస్తున్నాయి. యూపీ రోడ్డు రవాణా సంస్థ 75 జిల్లాల్లోని అన్ని ప్రధాన నగరాలలో ఈ బస్సులు నడిపేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.

ఆగ్రా డివిజన్ సర్వీస్ మేనేజర్ రవీంద్ర సింగ్ మాట్లాడుతూ...స్వీడిష్ బస్ తయారీ సంస్థ తమకు మానవ, గృహ వ్యర్థాలతో నడిచే బస్సు గురించి వివరించినట్లు తెలిపారు. దీని ద్వారా నగరాల్లో కాలుష్యాన్ని చాలా వరకు తగ్గించగలుగుతామన్నారు.

క్రింది కథనం ద్వారా ఈ మానవ, గృహ వ్యర్థాలతో నడిచే బస్సు గురించి మరిన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం....

40-సీటర్ బయో-బస్

40-సీటర్ బయో-బస్

ఈ మానవ, గృహ వ్యర్థాలతో నడిచే బస్సు 40 మంది ప్రయాణీకులు

కూర్చునే విధంగా ఉంటుంది. వ్యర్థాల ద్వారా ఉత్పత్తయ్యే గ్యాస్ ద్వారా

ఈ బస్సు నడుస్తుంది.

300 కి.మీ నడుస్తుంది

300 కి.మీ నడుస్తుంది

ఈ బస్సుకు ఒక్క సారి గ్యాస్ ఫుల్ ట్యాంక్ చేస్తే 300 కిలో మీటర్లు

నడుస్తుంది. ఈ గ్యాస్ ను బ్రిస్టోల్ సివేగ్ ట్రీట్ మెంట్ ద్వారా ఉత్పత్తి

చేస్తారు.

మరిన్ని గణాంకాలు

మరిన్ని గణాంకాలు

ఈ బస్సుకు ఒక్క సారి గ్యాస్ ఫుల్ ట్యాంక్ చేయడానికి ఐదు మంది

ద్వారా ఏడాదికి ఉత్పత్తి చేయబడే గ్యాస్ అవసరమవుతుంది.

ఒక మనిషి ద్వారా ఏడాదికి ఉత్పత్తి చేయబడే గ్యాస్ తో ఈ బస్సు 55

కిలో మీటర్లు నడుస్తుంది.

బ్రిస్టోల్ విమానాశ్రయం నుంచి....

బ్రిస్టోల్ విమానాశ్రయం నుంచి....

మానవ, గృహ వ్యర్థాలతో నడిచే బస్సు మొదటిసారి యూకేలోని బ్రిస్టోల్

విమానాశ్రయం నుంచి చారిత్రక నగరం బాత్ కు ప్రయాణీకులను

తీసుకెళ్లడంతో ప్రారంభమైంది.

గ్యాస్ బస్సు టాప్ పైన....

గ్యాస్ బస్సు టాప్ పైన....

ఉత్పత్తి అయిన గ్యాస్ ను పెద్ద పెద్ద ట్యాంక్ లలో నిల్వ చేస్తారు.

అనంతరం దాన్ని బస్సు టాప్ పైన ఉన్న పైప్ ద్వారా లోడ్ చేస్తారు.

Most Read Articles

English summary
The UPSRTC is going to be introduced Poo-Bus firs time in india. It is fully run by human and household wastage.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X