వీడియో: దేవుడు చేతులు తీసేస్తే ఏం, కాళ్లున్నాయ్ కదా..

By Ravi

సాధించాలనే తపన ఉంటే, సాధ్యం కానిదేదీ లేదని ఎందరో మహానుభావులు చెప్పారు. బార్టెక్ ఓస్టాలోస్కీ విషయంలో ఈ సూత్రం ఇది నూటికి నూరుపాళ్లు నిజం. ఇతనికి రెండు చేతులు లేవు, కానీ కార్ డ్రైవింగ్ మహా ఇష్టం. అందులోను అత్యంత ప్రమాదకరమైన కార్ డ్రిఫ్టింగ్ అంటే మహా సరదా. ఓస్టాలోస్కీ తన వైకల్యాన్ని సైతం జయించి అందరిచేత శభాష్ అనిపించుకుంటున్నాడు.

ఓస్టాలోస్కీ 2006లో జరిగిన ఓ ప్రమాదంలో తన రెండు చేతులు కోల్పోయాడు. అయితే, తాను ఆ విషయాన్ని మర్చిపోయి, కుంగిపోకుండా ధైర్యంతో తన కాళ్లనే చేతులుగా ఉపయోగించి డ్రిఫ్టింగ్ నేర్చుకున్నాడు. రెండు కాళ్లలో ఒక కాలుని స్టీరింగ్ ఆపరేట్ చేసేందుకు ఇంకో కాలును యాక్సిలరేటర్, బ్రేక్ పెడల్స్‌ను ఆపరేట్ చేసేందుకు ఉపయోగిస్తాడు.

బార్టెక్ ఓస్టాలోస్కీ డ్రిఫ్టింగ్ కోసం నిస్సాన్ స్కైలైన్ జిటి-టి ఆర్34 ఆటోమేటిక్ కారును ఉపయోగిస్తాడు. ఈ కారులోని ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్‌ను మ్యాన్యువల్‌గా తన భుజంతో ఆపరేట్ చేసేందుకు ఓ ప్రత్యేకమైన ఏర్పాటు కూడా చేయించుకున్నాడు. కారు ఇగ్నిషన్, ఇంజన్ స్టార్టింగ్, స్టాపింగ్‌లను కూడా తానే స్వయంగా తన కాళ్లతో ఆపరేట్ చేస్తాడు.

అంతేకాదు ఓస్టాలోస్కీ పోలిష్ కప్, పోలిష్ చాంపియన్‌షిప్ ర్యాల్ రేస్‌వే క్రాస్‌లలో కూడా పాల్గొన్నాడు. అంగవైకల్యం వచ్చిందని కుంగిపోయే వారికి కొండంత ధైర్యాన్ని ఓస్టాలోస్కీ చేసిన స్టన్నింగ్ స్టంట్‌లను మనం కూడా చూద్దాం రండి..!
<center><iframe width="100%" height="450" src="//www.youtube.com/embed/DDpYaH2719U?rel=0" frameborder="0" allowfullscreen></iframe></center>

Most Read Articles

English summary
Bartek Ostalowski has no arms but this Polish driver uses his left foot to steer and his right foot for the accelerator. Drifting with hands is already difficult enough but Bartek Ostalowski hasn’t let his disability hinder his love for sliding sideways in his Nissan Skyline GT-T R34.&#13;
Story first published: Wednesday, July 2, 2014, 12:24 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X