నేటి వీడియో: కవాసకి జే కాన్సెప్ట్ ఎలక్ట్రిక్ వెహికల్

గడచిన నవంబర్ నెలలో జరిగిన 2013 టోక్యో మోటార్ షోలో కవాసకి ఆవిష్కరించిన 'జే' (J) ఎలక్ట్రిక్ వెహికల్ గుర్తుందా..? టూవీలర్ గానూ అలాగే త్రీవీలర్ గాను నడుపుకునే ఈ కవాసకి జే పనితీరును చూపించే వీడియోని తాజాజాగా కంపెనీ విడుదల చేసింది.

మోటార్‌సైకిల్, ట్రైసైకిళ్ల నుంచి స్ఫూర్తి పొంది ఈ కవాసకి జే కాన్సెప్ట్ ఎలక్ట్రిక్ వాహనాన్ని రూపొందించారు. కవాసకి జే కాన్సెప్ట్‌లో ముందు వైపు రెండు సన్నటి చక్రాలు, వెనుక వైపు ఓ పెద్ద చక్రం ఉంటుంది. ఇందులో రెండు రైడింగ్ మోడ్స్ ఉంటాయి. 1) కంఫర్ట్ మోడ్ 2) స్పోర్ట్ మోడ్.


కంఫర్ట్ మోడ్‌లో ముందు చక్రాలు దూరంగా జరిగి, రైడర్ కంఫర్టబల్ పొజిషన్‌లో కూర్చొని నడిపే వీలుంటుంది. అలాగే, స్పోర్ట్ మోడ్‌లో ముందు రెండు చక్రాలుగా ఒక్కటిగా కలిసిపోయి ఇది మోటార్‌సైకిల్‍‌లా మారిపోతుంది. ఈ మోడ్ స్పీడ్ కోసం డిజైన్ చేశారు.

ముందు చక్రాల్లోని ప్రతి చక్రం లోపల అమర్చిన రెండు లివర్ల సాయంతో ఈ వాహనాన్ని స్టీర్ చేయవచ్చు. మలుపుల వద్ద ఈ చక్రాలు ఫ్లెక్సిబల్‌గా రొటేట్ అవుతాయి. కవాసకి జే కాన్సెప్ట్ లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్‌తో కాకుండా, బెస్పోక్ 'గిగాసెల్' నికెల్ మెటల్ హైడ్రైన్ బ్యాటరీలతో నడుస్తుంది. కవాసకి జె పనితీరు వీడియోను వీక్షిండి.

<center><center><iframe width="100%" height="450" src="//www.youtube.com/embed/8P0DkEUGy_U?rel=0" frameborder="0" allowfullscreen></iframe></center></center>

Most Read Articles

English summary
Kawasaki recently revealed the 'J' 3-wheel electric concept vehicle at this year's 2013 Tokyo Motor Show. 'J' is a personal mobility system of the future that adapts to the type of travel required, from city riding to fun sport riding. Its sharp aggressive styling, like that of Kawasaki motorcycles, is one of its distinguishing characteristics. &#13;
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X