వీడియో: ఈ హిజ్రాలు చాలా గ్రేట్ గురూ..!

హిజ్రాలంటే చాలా మందికి అసహ్యం. రోడ్డుపై వారు కనిపిస్తే, వారికి దూరంగా వెళ్లిపోతుంటారు. ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద యాచనకు వస్తే, కారు అద్దాలన్నీ గట్టిగా బిగించేస్తుంటారు. ఏదో కొందరు హిజ్రాలు చేసే అనైతిక పనుల వలన అనేక మందిలో ఇలాంటి అభిప్రాయం కలిగి ఉండొచ్చు.

వాస్తవానికి మనదేశంలో హిజ్రాలను మంచి శకునంగా భావిస్తారు. వారి దీవిస్తే, చల్లగా ఉంటామని విస్వసిస్తారు. చాలా వరకు హిజ్రాలు యాచనను తమ వృత్తిగా ఎంచుకుంటుంటారు. రైళ్లు, బస్‌స్టాండ్‌లు, ట్రాఫిక్ సిగ్నల్ ఇలా ఎక్కడపడితే అక్కడ యాచన చేసి, వచ్చిన డబ్బుతో జీవనం సాగిస్తుంటారు. వీరిలో అతికొద్ది మంది మాత్రమే అనేక అవాంతరాలను అధిగమించి పలు రంగాల్లో రాణిస్తుంటారు.

కానీ.. ఇప్పుడు మనం ఈ వీడియోలో హిజ్రాలు మాత్రం అందరిలా నడిరోడ్డుపై డబ్బు కోసం అడుక్కోకుండా, వాహనాలు నడిపే వారి రక్షణ కోసం సందేశాలు ఇస్తున్నారు. విమానాల్లో ఎయిర్‌హెస్టెస్ మాదిరిగా డ్రెస్ కోడ్ ధరించి, ఒక లీడర్ హిజ్రా మెగాఫోన్‌లో సీట్ బెల్ట్ గురించి సందేశం ఇస్తుంటే, ఇతర హిజ్రాలు రోడ్డుపై సీట్ బెల్టును ఎలా ధరించాలో చేతులతో అనుకరించి చూపిస్తుంటారు.

సీట్ బెల్ట్ క్రూ పేరిట యూట్యూబ్‌లో అప్‌లోడ్ అయిన ఈ వీడియో ఇప్పుడు అత్యంత పాపులర్ అయిపోంది. హిజ్రాలు చేస్తున్న ఈ మంచి పనికి నెటిజెన్లంతా హ్యాట్సాఫ్ అంటున్నారు. మరి ఆలస్యమెందుకు, ఆ అద్భుతమైన వీడియోని మీరు కూడా చూసేయండి.
<center><iframe width="100%" height="450" src="//www.youtube.com/embed/muCU6_Y_Kyo?rel=0" frameborder="0" allowfullscreen></iframe></center>

Most Read Articles

English summary
The Seatbelt Crew is a YouTube video that shows a group of transgenders dressed as air crew members at a traffic signal in India. They can be seen giving out instructions for road safety by asking drivers to wear a seat belt at all times.&#13;
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X