విజయ్ మాల్యా కార్ల వేలం: కోట్లు విలువ చేసే కార్లకు చిల్లర పడేశారు !

By Anil

ప్రముఖ పారిశ్రామిక వేత్త విజయ్ మాల్యా గురించి ఇప్పట్లో తెలియని వారుండరు. చాలా వరకు బ్యాంకుల్లో తీసుకున్న రుణం చెల్లించలేక దేశం విడిచి పరారైన సంగతి తెలిసిందే. అయితే మాల్యా మోసం బారిన పడ్డ చాలా బ్యాంకులు అతనికి చెందిన ఒక్కొక్క అస్తులను వేలం వేస్తూ వచ్చారు. అందులో కార్లు కూడా ఉన్నాయి. అయితే అతని వయసుకు మించి చేసిన చేష్టలకు ఇప్పుడు మూల్యం చెల్లించుకుంటున్నాడు అని చెప్పవచ్చు.

విజయ్ మాల్యా ఒకప్పుడు అతి పెద్ద లిక్కర్ దిగ్గజ సంస్థ యునైటెడ్ స్పిరిట్ కు ఛైర్మెన్‌గా వ్యవహరించాడు. ఇతని భారిన పడి నష్టపోయిన సంస్థల్లో యునైటెడ్ స్పిరిట్‌ కూడా ఒకటి. అందుకోసం ఈ సంస్థ విజయ మాల్యాకు చెందిన అత్యంత ఖరీదైన పురాతణ కార్లకు ఆన్‌లైన్ ద్వారా వేలం నిర్వహించింది. అందులో అత్యంత ఖరీదైన వాహనాలు చాలా తక్కువ ధరకు అమ్ముడుపోయాయి.

విజయ్ మాల్యా లగ్జరీ కార్లు: కోట్లు విలువ చేసే అరుదైన కార్లు

మాల్యా కార్లకు ఆగష్టు 25 న వేలం నిర్వహించడానికి నిర్ణయించినప్పటి నుండి మరుసటి రోజు సాయం కాలం 4 గంటల వరకు వేలం నిర్వహించారు. మాల్యా వద్ద ఉన్నకార్లలో సుమారుగా 30 కార్లకు వేలం నిర్వహించారు. అందులో 8 వరకు పాత కాలం నాటి ఖరీదైన కార్లు కూడా ఉన్నాయి.

విజయ్ మాల్యా లగ్జరీ కార్లు: కోట్లు విలువ చేసే అరుదైన కార్లు

కోట్ల విలువ చేసే అత్యంత ఖరీదైన మరియు విలాసవంతమైన కార్లను వేలంలో పాల్గొన్నవారు అతి తక్కువ ధరకే సొంతం చేసుకున్నారు. అత్యంత పాత కార్ల వేలం వివరాలు మరియు అతి ముఖ్యమైన సమాచారాన్ని వేలంలో గుర్తించడం జరిగింది.

మెర్సిడెస్ బెంజ్ ఎస్‌-క్లాస్

మెర్సిడెస్ బెంజ్ ఎస్‌-క్లాస్

విజయ్ మాల్యా పార్లమెంట్ సభ్యులుగా ఉన్నపుడు తరచూ ఈ మెర్సిడెస్ బెంజ్ ఎస్-క్లాస్ కారును వినియోగించేవారు. దీనిని వేలం కేవలం 7.8 మిలియన్లకే అమ్మారు. అంటే 7 లక్షల 80 వేల రుపాయలకు. ఈ కారు యొక్క ప్రారంభ వేరియంట్ ధర సుమారుగా రూ. 2 కోట్ల వరకు ఉంది.

బెంట్లీ ఫ్లైయింగ్ స్పర్స్

బెంట్లీ ఫ్లైయింగ్ స్పర్స్

గోవాలో పార్టీలు మరియు విందులకు హాజరు కావడానికి విజయ్ మాల్యా ఈ కారును ఎక్కువగా వినియోగిస్తుండేవాడు. బెంట్లీ వారి ఈ లగ్జరీ కారును వేలం 44 లక్షల రుపాయలకే అమ్మారు. మార్కెట్లో కొత్త కారు విలువ సుమారుగా కొన్ని మిలియన్ల రుపాయలుగా ఉంది.

మసెరాటి క్వాట్రోపోర్ట్

మసెరాటి క్వాట్రోపోర్ట్

అత్యంత ఖరీదైన మసెరాటి క్వాట్రోపోర్ట్ కారును యునైటెడ్ స్పిరిట్ సంస్థ వారు వేసిన వేలం కేవలం 37 లక్షలకే అమ్ముడుపోయింది.

రోల్స్‌రాయిస ఘోస్ట్

రోల్స్‌రాయిస ఘోస్ట్

బెంగళూరులోని గుర్రాల రేసింగ్ మైదాని వెళ్లినట్లయితే ఈ రోల్స్‌రాయిస్ ఘోస్ట్‌ను తరచూ గమనించి ఉండేవారు. అప్పట్లో విజయ్ మాల్యా గుర్రాల రేసింగ్‌కు వెళ్లడానికి ఈ కారులో వెళ్లేవారు. దీనిని వేలంలో 2.42 కోట్లకు అమ్మేశారు.

పోర్షే బాక్ట్సర్

పోర్షే బాక్ట్సర్

పోర్షే బాక్ట్సర్‌ను మహరాష్ట్రలో రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. అయితే ఎక్కువగా గోవాలోనే వినియోగిస్తుండేవారు. వేలంలో ఈ కారును సుమారుగా 44.5 లక్షల రుపాయలకు అమ్మేశారు. సెలవు దినాల్లో ఈ రెండు డోర్లున్న కారులో హై వే ల మీద ప్రయాణించడానికి ఎంతో ఇష్టపడేవాడు.

మెర్సిడెస్ బెంజ్ ఎస్‌ఎల్‌కె

మెర్సిడెస్ బెంజ్ ఎస్‌ఎల్‌కె

గోవాలో ఈ మెర్సిడెస్ బంజ్ ఎస్‌ఎల్‌కె కారును రిజిస్ట్రేషన్ చేయించారు. మరియు దీనిని గోవాలో ఉన్న తన నివాసంలో గల కారు గ్యారేజిలో ఉంచేవాడు. వేలం ద్వారా దీనిని సుమారుకా 29.25 లక్షల రుపాయలకు అమ్మారు

మెర్సిడెస్ బెంజ్ ఎస్-క్లాస్

మెర్సిడెస్ బెంజ్ ఎస్-క్లాస్

గోవా లోని మాల్యా నివాసంలోని కారు గ్యారేజి నుండి సేకరించిన వాటిలో మెర్సిడెస్ బెంజ్‌కు చెందిన ఎస్-క్లాస్ కూడా ఒకటి. దీనిని కూడా వేలం నిర్వాహకులు అమ్మేశారు, అయితే ఎంత మొత్తానికి అమ్మారు అనే విషయాన్ని వెల్లడించడానికి నిరాకరించారు.

రోల్స్‌రాయిస్ ఫాంటమ్

రోల్స్‌రాయిస్ ఫాంటమ్

ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ఖరీదైన కార్లలో ఒకటి రోల్స్‌రాయిస్ ఫాంటమ్. దీనిని కూడా మాల్యా ఒకప్పుడు కొనుగోలు చేశాడు. ఈ కారును వేలం ద్వారా కేవలం 77.2 లక్షల రుపాయలకు మాత్రమే అమ్మారు.

1903 హంబర్

1903 హంబర్

భారత దేశపు అత్యంత పురాతణ కారు ఇది. వేలంలో దీనిని దక్కించుకోవడానికి వేలంలో పాల్గొన్న వారు సుమారుగా కోటి రుపాయల వరకు వెచ్చించేందుకు సిద్దమయ్యారు. వేలం చివరి వరకు ఈ కారు మీద ఉత్కంఠభరితమైన పోటీ సాగింది.

వోస్లి

వోస్లి

మాల్యా వద్ద ఉన్న అత్యంత పురాతణమైన కార్లలో వోస్లి కూడా ఒకటి. ముంబాయ్ లో జరిగిన పురాతణ కార్ల ప్రదర్శనలో మరియు దేశ వ్యాప్తంగా వివిధ సందర్శనల్లో ఈ కారును ప్రదర్శన నిమిత్తం ఉంచాడు. అయితే యునైటెడ్ స్పిరిట్ వారు నిర్వహించిన వేలంలో ఇది సుమారుగా కోటి రుపాయలకు పైగానే అమ్ముడుపోయింది.

ఇతర కార్లు

ఇతర కార్లు

విజయ్ మాల్యా వద్ద ఇంత వరకు చూసిన కార్లే కాకుండా ఇంకా ఉన్నాయి. అందులో: బిఎమ్‌డబ్ల్యూ 750ఐ, మహీంద్రా థార్ జీప్ డీజల్, బెంట్లీ సూపర్ స్పోర్ట్స్, కొన్ని వింటేజ్ కార్లతో పాటు, మెర్సిడెస్ బెంజ్ మరియు లాన్సియా ఎస్ఎల్‌టి వేలంలో అమ్ముడుపోయాయి.

విజయ్ మాల్యా లగ్జరీ కార్లు: కోట్లు విలువ చేసే అరుదైన కార్లు

మారుతి ఒమిని మిని బస్, మారుతి ఆల్టో, టయోటా క్వాలిస్, ఫోర్డ్ ఎండీవర్, మహీంద్రా స్కార్పియో, టయోటా క్యామ్రీలతో పాటు మొత్తం 30 వరకు కార్లు ఉన్నాయి.

విజయ్ మాల్యా లగ్జరీ కార్లు: కోట్లు విలువ చేసే అరుదైన కార్లు

  • బీరు, బారు, కారు ఇదీ మాల్యా తీరు: విజయ్ మాల్యా కారు కలెక్షన్
  • వేలానికి విజయ్ మాల్యా వ్యక్తిగత విమానం

Most Read Articles

English summary
Read in Telugu: 30 of Mallya's vintage cars were put on the auction block as Global liquor giant Diageo, which controls controlled United Spirits Ltd tried to reduce the company debt, which stood at nearly Rs 4,000 crore as on March 31, 2016.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X