వేలానికి విజయ్ మాల్యా వ్యక్తిగత విమానం...దీని ఇంటీరియర్ చూసినోళ్లంతా ఆశ్చర్యపోవాల్సిందే

By Anil

కొన్ని వేల కోట్ల రుపాయలను బ్యాంకుల ద్వారా అప్పుగా తీసుకుని వాటిని చెల్లించలేక పోయాడు విజయ్ మాల్యా. అయితే అప్పు ఇచ్చిన వారు అంత సులభంగా విడిచి పెట్టరు కదా. అందుకే మాల్యాకు చెందిన విమానాన్ని వేలం ద్వారా అమ్మేసి ఆ వచ్చిన డబ్బుతో బ్యాంకుల అప్పులు చెల్లించాలని కోర్టు తీర్పు వచ్చింది. విజయ మాల్యా మూల్యం చెల్లించుకునేందుకు తన వ్యక్తిగత విమానాన్ని వదులుకోనున్నాడు.

అయితే ఇది ఎంతో గోప్యంగా ఉన్న సమాచారం కాని ఇండియన్ ఎక్స్ ప్రెస్ పత్రిక మాల్యాకు చెందిన ఎయిర్ బస్ విమానం యొక్క ఇంటీరియర్ ఫోటోలను విడుదల చేసింది. ఇంద్ర భవనంలాంటి ఇంటీరియర్ ఈ విమానం సొంతం. ఈ ఇంటీరియర్‌కు చెందిన ఫోటోలు మరియు దీనికి చెందిన సమాచారం క్రింది స్లైడర్లలో కలవు.

 విమానం మోడల్

విమానం మోడల్

విజయ్ మాల్యా తన అన్ని వ్యాపార సమావేశాల కోసం, అమెరికా మరియు బ్రిటన్ పర్యటనల కోసం కస్టమైజ్డ్ ఎయిర్ బస్ ఎ-319 విమానం కలిగి ఉన్నాడు.

రిజిస్ట్రేషన్

రిజిస్ట్రేషన్

విజయ్ మాల్యా తన ఈ వ్యక్తిగత విమానాన్ని 2006 లో విటి-విజెఎమ్ పేరుతో రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు.

పన్ను బకాయిలు

పన్ను బకాయిలు

విజయ్ మాల్యాకు చెందిన ఈ విమానాన్ని 2013 లో సర్వీస్ ట్యాక్స్ చెల్లించనందుకుగాను అధికారులు జప్తు చేశారు. ఈ కారణంగానే ఇది వేలానికి రానుంది.

అద్దె విమానం

అద్దె విమానం

కింగ్‌ఫిషర్ పేరుతో ఈ విమానం లీజుకు ఉన్నట్లు తెలిసింది.

దీని విలువ

దీని విలువ

ఎయిర్‌బస్ ఎ319 వ్యక్తిగత విమానం విలువ దాదాపుగా 70 నుండి 90 మిలియన్ అమెరికన్ డాలర్లుగా ఉంది. అయితే మాల్యా ఈ విమానం ఖరీదు 88.6 మిలియన్ అమెరికన్ డాలర్లు అని తెలిపాడు.

నిర్వహణ

నిర్వహణ

విజయ్ మాల్యాకు చెందిన ఈ వ్యక్తిగత విమానాన్ని మాల్యా యొక్క కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ ఆధ్వర్యంలో నిర్వహించబడేది.

వసతులు

వసతులు

విమానం లోపల దాదాపుగా 6,000 క్యూబిక్ అడుగుల విస్తీర్ణం కలదు. మరియు దీనిలోపల వ్యక్తిగత అవసరాల కోసం ప్రత్యేక సదుపాయలతో దీని కస్టమైజ్ చేయించుకున్నాడు అంటే అదనపు వసతులను కల్పించుకున్నాడు.

అన్ని సౌకర్యాలతో

అన్ని సౌకర్యాలతో

22 మంది అతిధులతో ఇందులో మాల్యా విలాసవంతంగా ప్రయాణించవచ్చు. వీరందరికి సకల సౌకర్యాలు అందుబాటులో ఉండే విధంగా రూపొందించారు.

శాటిలైట్ టీవి

శాటిలైట్ టీవి

ఎయిర్‌బస్ వ్యక్తిగత విమానంలో మాల్యా శాటిలైట్ టీవీని వినియోగించుకునే వాడు. ఎటువంటి పరిమితులు లేకుండా విమానం ఎక్కడ ఎగురుతున్నా అతను ఈ టెలివిజన్‌ను వీక్షించగలడు.

విశ్రాంతి సౌకర్యాలు

విశ్రాంతి సౌకర్యాలు

ఇందులో విశ్రాంతి తీసుకునేందుకు అనేక సౌకర్యాలను సృష్టించుకున్నాడు. అందులో వీడియో గేమ్స్ ఆడటానికి అతి పెద్ద డిస్ల్పే బార్‍ కలిగి ఉంది.

 వేలానికి విజయ్ మాల్యా వ్యక్తిగత విమానం...!!

ఇంత వరకు మాల్యాకు చెందిన వ్యక్తిగత విమానం యొక్క అత్భుతమైన ఇంటీరియర్ గురించి తెలుసుకున్నారు కదా. ఈ విమానంకు చెందిన సాంకేతిక వివరాలను వచ్చే స్లైడర్ల ద్వారా చూద్దాం ముందుకు క్లిక్ చేయండి.

మిడిల్ రేంజ్ విమానం

మిడిల్ రేంజ్ విమానం

ఎయిర్‌బస్ కుటుంబంలో ఎ320 విమానం మద్య తరగతికి చెందినది. వీటిని ఎక్కువగా తక్కువ మరియు మధ్యమ దూరాలకు మాత్రమే నడిపే వారు. ఈ విమానాన్ని 1988 లో ప్రపంచానికి పరిచయం చేశారు.

సీటింగ్ సామర్థ్యం

సీటింగ్ సామర్థ్యం

మాల్యాకు చెందిన ఈ వ్యక్తిగత విమానంలో కేవలం 22 అతిథులు మాత్రమే ప్రయాణించవచ్చు. కాని సాదారణంగా ఈ ఎయిర్‌బస్ ఎ320 విమానంలో 124 మంది వరకు ప్రయాణం చేయవచ్చు.

వేగం

వేగం

ఇది గరిష్టంగా 41,000 అడుగుల ఎత్తు వరకు ఎగరగలదు. దీని గరిష్ట వేగం 871 కిలోమీటర్లుగా ఉంది, అయితే ఇది సరాసరగా గంటకు 828 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది.

 ప్రయాణ దూరం

ప్రయాణ దూరం

మాల్యాకు చెందిన ఈ వ్యక్తిగత విమానంలో అదనపు ఇంధన ట్యాంకు కలదు. తద్వారా 11,000 కిలోమీటర్లు పాటు ఇది ప్రయాణం చేస్తుంది. మరియు ఇందులో నిండుగా 30,000 లీటర్ల ఇంధనాన్ని నింపవచ్చు.

ముఖ్య వినియోగం

ముఖ్య వినియోగం

దీనిని ఎక్కువగా మూడు రకాలుగా వినియోగించుకోవచ్చు ప్రయాణికుల రవాణా, సరుకు రవాణా మరియు వ్యక్తిగత రవాణా కోసం దీనిని వినియోగించుకోవచ్చు.

తయారీ

తయారీ

ఇప్పటి వరకు ఎయిర్‌బస్ దాదాపుగా 1,453 ఎ319 విమానాలను డెలివరీ చేసింది. దీనిని మంచి మెటీరియల్‌తో తయారు చేయడం వలన ఎక్కువగా విజయవంతమైందని తెలిసింది.

ముఖేష్ అంబానీ వద్ద మాత్రమే

ముఖేష్ అంబానీ వద్ద మాత్రమే

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ముఖేష్ అంబానీ వద్ద మాత్రమే ఈ ఎయిర్‌బస్ ఎ319 వ్యక్తిగత విమానం కలదు. ఎందుకంటే మాల్యా విమానం వేలానికి వెళ్లనుంది కాబట్టి.

జప్తు

జప్తు

2013 లో ఈ విమానంతో పాటు ఐదు ప్లేన్లు, రెండు హెలీకాఫ్టర్లను కూడా జప్తు చేశారు.

 విజయ్ మాల్యా వాహన ప్రపంచం

విజయ్ మాల్యా వాహన ప్రపంచం

  • బీరు, బారు, కారు విజయ్ మాల్యా తీరు: విజయ్ మాల్యా జీవితంలో ఉన్న వాహన ప్రపంచం గురించి....

Most Read Articles

English summary
Vijay Mallya Personal Jet up Auction Here How It Looks
Story first published: Tuesday, March 8, 2016, 19:15 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X