తాగి వాహనాలు నడిపే వారిలో అధికమంది విఐపిలే: పోలీస్ రిపోర్ట్

Drunk And Drive
మద్యం సేవించి వాహనం నడపకండి బాబోయ్ అని ఎంతో మంది ఎన్నో రకాలుగా నెత్తి నోరూ బాదుకొని చెబుతున్నప్పటికీ, వాటిని లెక్కచేయకుండా, తమ ఇష్టానుసారంగా మద్యం సేవించి తమ ప్రాణాలను రిస్కులో పెట్టుకోవటమే కాకుండా ఇతరుల ప్రాణాలను కూడా రిస్కులో పెట్టేస్తున్నారు కొందరు తాగుబోతులు. తాజాగా... హైదరాబాద్‌ ట్రాఫిక్ పోలీసులు నగరంలో అక్టోబర్ 19, 20 తేదీలలో డ్రంక్ డ్రైవింగ్‌పై ఓ స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఈ డ్రైవ్‌లో మొత్తం 223 కేసులు నమోదైనట్లు పోలీసులు ప్రకటించారు. వాటి వివరాలు ఇలా ఉన్నాయి:

  • ఫోర్ వీలర్స్ సంఖ్య - 61
  • టూవీలర్స్ సంఖ్య - 157
  • ఆటోరిక్షాల సంఖ్య - 5

హైదరాబాద్ నగర ట్రాఫిక్ పోలీసులు చేపట్టిన ఈ స్పెషల్ డ్రైవ్‌లో అధికారులు గుర్తించిన దానిని బట్టి గమనిస్తే, డ్రంక్ డ్రైవ్ కేసులో పట్టుబడిన వారిలో అధిక సంఖ్యలో విఐపిలు, వారి పిల్లలే ఉన్నట్లు తేలింది. ఇలా పట్టుబడిన వారి రక్తంలో ప్రతి 100 మి.లీ. 30 మి.గ్రా. ఆల్కహాల్ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వారి వాహనాలను పోలీసులు సీజ్ చేశారు. వీరిపై 2,000 నుంచి 3,000 జరిమానాలు విధించారు. కోర్టులో జరిమానాను చెల్లించిన తర్వాత వాహనాలను విడుదల చేశామని పోలీసులు తెలిపారు.

ఆపరేషన్ బ్లాక్ ఫిల్మ్‌: 2వ రోజు అప్‌డేట్స్
మోటార్ వాహనాలకు బ్లాక్/సన్ ఫిల్ముల వాడకంపై అక్టోబర్ 25, 2012 హైదరబాద్‌లో నిషేధం అమల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, ఇప్పటికీ వానాలకు నల్లటి ఫిల్ములను తొలగించని వాహనాలపై కేసులు బుక్ చేస్తున్న పోలీసు అధికారులు, ఈ నిబంధన అమల్లోకి వచ్చిన రెండవ రోజు చివరి నాటికి 10,500 లకు పైగా కేసులను బుక్ చేసినట్లు పేర్కొన్నారు. ప్రారంభంలో భాగంగా, పోలీసులు ఈ తప్పుకు కేవలం రూ.100 లను మాత్రమే జరిమానాగా విధిస్తున్నారు. రెండవ సారి కూడా ఇదే తప్పుకు పాల్పడితే ఈసారి అధిక మొత్తాలలో జరిమానాలను విధిచడం జరుగుతుందని అధికాలు తెలిపారు.

Source: HTP

Most Read Articles

English summary
The Drunk Driving enforcement was carried out over the last weekend i.e. on October, 19th and 20th Hyderabad Traffic Police. Total 223 cases were registered against Drunk Drivers. During this enforcement drive, a large number of VIPs, their children were checked for D.D. and some of them tested positive i.e. 30 m.g. / 100 m.l. of blood BAC Count. It is surprising that even after 10 months of D.D. enforcement, quite a few VIPs are still getting caught in the dragnet.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X