వీర బాధుడు బాదే విరాట్ కోహ్లి కార్ కలెక్షన్

By N Kumar

ప్రపంచ కప్ ట్వంటీ20 సిరీస్ మొదలైనప్పటి నుండి క్రికెట్ అభిమానులకు సంక్రాంతి సెలవులు దొరికినట్లు తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ఇక ఇండియాతో క్రికెట్ మ్యాచ్ అంటే క్షణం క్షణం ఎంతో ఉత్కఠం.... అంతేనా విజయానికి ఆమడ దూరంలో ఉన్నపుడు టీమ్ ఇండియా చేసే పోరాటం యావత్ భారత్‌ను ఉత్కంఠంలో ముంచేస్తుంది.

అందులో చివరి నిమిషం దాకా రాకాసి బౌన్సర్లకు సరైన ఫోర్లు, సిక్సర్లతో సమాధానం చెప్పగల సత్తా ఉన్నోడు విరాట్ కోహ్లి అందుకు సాక్ష్యం ప్రస్తుతం వరల్డ్ కప్ సిరీస్‌లో కోహ్లి ఆటతీరు అచ్చంగా తెలుపుతుంది. స్టేడియంలోనే కాదు తన వాహన ప్రపంచంలో శరవేగంగా దూసుకెళ్లడం కూడా కోహ్లికి ఇష్టమే. ఈ ప్రయాణంలో తనకు నచ్చిన కార్లన్నింటిని అనుభవిస్తూ వచ్చాడు.

టీమిండియాలో తనకంటూ ఓ ప్రత్యేకతను సాధించుకున్న విరాట్ కోహ్లి కార్ల గురించి మరియు కార్ల ఎంపిక పట్ల ఇతనికి ఉన్న మక్కువ గురించి క్రింది కథనం ద్వారా తెలుసుకుందాం రండి.

ఆడి కార్లకు దాసోహం

ఆడి కార్లకు దాసోహం

ప్రపంచ వ్యాప్తంగా బిఎమ్‌డబ్ల్యూ కార్లకు క్రికెట్ లెజెండ్ సచిన్ ఎంతటి బానిసో అచ్చం అలాగే ఈ నవ క్రికెట్ స్టార్ విరాట్ కోహ్లి కూడా ఆడి కార్ల ప్రేమికుడు. అయితే ఓ సారి టయోటా మోటార్స్‌కు కూడా బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించాడు. కోహ్లి ఎంచుకున్న సాధారణ మరియు ఆడి కార్ల గురించి వివరంగా తరువాత స్లైడర్ల ద్వారా తెలుసుకోగలరు.

రెనో డస్టర్

రెనో డస్టర్

విరాట్ తన 23 ఏట టీమ్ ఇండియా తరపున 2012 శ్రీలంక తో ఆడిన మ్యాచ్‌లో 74 పరుగులు తీసి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా రెనో డస్టర్‌ను బహుమతిగా పొందాడు. మ్యాచ్ తరువాత కోహ్లి తన టీమ్‌‌ను కారులో ఎక్కించుకుని స్టేడియం మొత్తం రౌండ్లు వేశాడు.

ఆప్టిమైజ్ మోడల్

ఆప్టిమైజ్ మోడల్

కోహ్లి వ్యక్తిగతంగా వినియోగించుకునే సమయంలో ఈ డస్టర్ టాప్ ఎండ్ డీజల్ వేరియంట్ తన అవసరాలకు తగ్గట్టుగా మోడిఫైడ్ చేయించుకున్నాడు. ముఖ్యంగా దాదాపుగా 459 లీటర్ల ఇంధనాన్ని ఇందులో నింపుకునే విధంగా రూపొందించుకున్నాడు.

టయోటా ఫార్చ్యూనర్

టయోటా ఫార్చ్యూనర్

విరాట్ ఒక సారి టయోటా మోటార్స్‌కు చెందిన లివా కారు బ్రాండ్ అంబాసిడర్‌గా పని చేశాడు. అప్పుడు టయోటా కోహ్లికి ఫార్చ్యూనర్ ఎస్‌యువి వాహనాన్ని బహుమానం అందించారు. 25 లక్షలు పైబడి విలువ గల ఎస్‌యువిల మార్కెట్లో ఫార్చ్యూనర్ భారీ స్థాయిలో అమ్మకాలు సాధించేది.

టయోటా ఫార్చ్యూనర్ ప్రత్యేకతలు

టయోటా ఫార్చ్యూనర్ ప్రత్యేకతలు

టర్బో డీజల్ ఇంజన్ గల ఎస్‌యువి 4-వీల్ డ్రైవ్ సిస్టమ్‌ను కలిగి ఉంది. ఇందులో గల డి-4డి ఇంజన్ 170 బిహెచ్‌పి పవర్ మరియు 343 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను విడుదల చేయును.

లగ్జరీ ఎస్‌యువి ఆడి క్యూ7

లగ్జరీ ఎస్‌యువి ఆడి క్యూ7

సినిమా మరియు ఆటల పరంగా ఉన్న చాలా వరకు సెలబ్రిటీలు కోహ్లి కార్ గ్యారేజ్‌ను సందర్శించారు. అందులో చాలా వరకు ఆడి సంస్థకు చెందిన కార్లను గుర్తించినట్లు సమాచారం. అందులో చాలా ముఖ్యమైనది ఆడి క్యూ7 ఈ స్పెషల్ మోడల్ కారులో తక్కువ డిజైన్ మరియు ఎక్కువ ఇంటీరియర్ స్పేస్, లగ్జరీ ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

ఆడి క్యూ7 ప్రత్యేకతలు

ఆడి క్యూ7 ప్రత్యేకతలు

ఆడి క్యూ7 ఎస్‌యువిలో 4.2-లీటర్ కెపాసిటి గల టర్బో ఛార్జ్‌డ్ ఇంజన్ కలదు. ఈ ఇంజన్ 335 బిహెచ్‌పి పవర్‌ను ఉత్పత్తి చేయగలదు. ఈ ఇంజన్‌కు 8-స్పీడ్ ఆటోమోటిక్ గేర్ బాక్స్ అనుసంధానమై ఉంది. ఏడు మంది ప్రయాణించే వెసులుబాటు ఉన్న దీని ధర సుమారుగా రూ. 75 లక్షలుగా ఉంది.

ఆడి ఎస్ 6 లగ్జరీ కారు

ఆడి ఎస్ 6 లగ్జరీ కారు

ఆడి ఎ 6 కన్నా మరింత ఎక్కువ పనితీరును కనబరిచే కారు ఆడి ఎస్ 6. అందుకోసమే కాబోలు అత్యంత వేగవంతమైన సెడాన్ కారుకు ఆకర్షితుడయ్యాడు. ఇందులో ఉన్న ఫీచర్లకు ఫిదా అయిపోయిన కోహ్లి దీనిని డ్రైవ్ చేయడానికి ఎంతో అనువుగా ఉంటుంది అని తెలిపాడు.

ఆడి ఎస్ 6 ప్రత్యేకతలు

ఆడి ఎస్ 6 ప్రత్యేకతలు

ఆడి సంస్థ తమ ఎస్ 6 సెడాన్ కారులో 4.0-లీటర్ కెపాసిటి గల వి-8 ఇంజన్‌ను అందించింది. ఈ టర్బో పెట్రోల్ ఇంజన్ దాదాపుగా 420 బిహెచ్‌పి పవర్‌ను ఉత్పత్తి చేస్తుంది. అంతే కాకుండా కేవలం 1500 ఆర్‌పిఎమ్ వేగం వద్ద గరిష్టంగా 550 ఎన్ఎమ్ టార్క్‌ను విడుదల చేస్తుంది. ఇంజన్ విడుదల చేయు పవర్ మొత్తం 7-స్పీడ్ డ్యూయల్ క్లచ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ద్వారా అన్ని చక్రాలకు అందుతుంది

ఆడి ఆర్‌8 వి-10 స్పోర్ట్స్ కారు

ఆడి ఆర్‌8 వి-10 స్పోర్ట్స్ కారు

ఆడి అత్యధికంగా అమ్మకాలు సాధిస్తున్న వాటిలో ఇది కూడా ఒకటి. ఆడి ఆర్8 కారు వి-10 మరియు వి8 ఇంజన్‌తో అందుబాటులో ఉంది. వీటిలో ఆడి ఆర్8 వి-10 కారును విరాట్ కోహ్లి కొనుగోలు చేశాడు.

ఆడి ఆర్8 వి-10 ప్రత్యేకతలు

ఆడి ఆర్8 వి-10 ప్రత్యేకతలు

ఇందులో 5.2-లీటర్ కెపాసిటి గల వి-10 ఇంజన్ కలదు. టర్బో ఛార్జర్ గల ఇందులోని ఇంజన్ 517 బిహెచ్‌పి పవర్ మరియు 530 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు. ఇందులోని ఆటోమేటిక్ గేర్ బాక్స్ ఇంజన్ విడుదల చేయు పవర్‌ను అన్ని చక్రాలకు సరఫరా చేస్తుంది. దీని విలువ సుమారుగా రూ. 2 కోట్లుగా ఉంది.

ఆడి ఆర్8 ఎల్‌ఎమ్ఎక్స్

ఆడి ఆర్8 ఎల్‌ఎమ్ఎక్స్

విరాట్ గత ఏడాదిలో రెండు ఆడి కార్లను తన ఇంటికి తీసుకెళ్లాడు. అందులో గత మే లో ఆడి మార్కెట్లోకి విడుదల చేసిన ఆర్‌8 ఎమ్ఎమ్ఎక్స్ కారును వెంటనే కొనుగోలు చేశాడు. దీనికి చెందిన బుకింగ్స్ ప్రారంభించిన వెంటనే దీనిని కొనేశాడు. ఎందుకంటే ఇది దీని గరిష్ట వేగం గంటకు 320 కిలోమీటర్లుగా ఉంది. అందుకే కాబోలు అంతే వేగంతో దీనిని కొనేశాడు. లిమిటెడ్ ఎడిషన్‌గా ఆడి కేవలం 99 కార్లను మాత్రమే అందుబాటులోకి తీసుకువచ్చింది అందులో ఒకటి కోహ్లి సొంతం చేసుకున్నాడు.

ఆడి ఆర్‌8 ఎల్ఎమ్ఎక్స్ సిరీస్ - 1

ఆడి ఆర్‌8 ఎల్ఎమ్ఎక్స్ సిరీస్ - 1

ఈ కారు వేగవంతమైనదే కాదు. అత్యంత శక్తివంతమైన హై బీమ్ లేజర్ లైటింగ్ వ్యవస్థను కలిగి ఉంది. దీనికి ఎంతో ఆకర్షితుడయ్యాడు కొహ్లి. ఈ లైట్ సాధారణ లైట్ల కన్నా రెండు రెట్లు ఎఫెక్టివ్ కాంతిని ఇస్తాయి. దాదాపుగా అర కిలోమీటర్ వరకు స్పష్టంగా రోడ్డు గమనించగలము.

ఆడి ఆర్‌8 ఎల్ఎమ్ఎక్స్ సిరీస్ - 2

ఆడి ఆర్‌8 ఎల్ఎమ్ఎక్స్ సిరీస్ - 2

ఇందులో 570 బిహెచ్‌పి పవర్ మరియు 540 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌‌ను ఉత్పత్తి చేయగల 5.2-లీటర్ కెపాసిటి గల వి-10 ఇంజన్ కలదు. మాటల్లోనే కాదు రోడ్లు మీద కూడా ఇది ఇంతే పని తీరుతో గరిష్ట వేగాన్ని అందుకుంటుంది. ఎంత అంటే కోహ్లి సిక్స్‌ల కన్నా వేగం అని చెప్పవచ్చు.

ఆడి ఆర్‌8 ఎల్ఎమ్ఎక్స్ సిరీస్ - 3

ఆడి ఆర్‌8 ఎల్ఎమ్ఎక్స్ సిరీస్ - 3

ఆడి ఆర్‌8 ఎల్ఎమ్ఎక్స్ సిరీస్ కారు కేవలం 3.4 సెకండ్ల కాలంలోనే 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని చేరుకుటుంది. మరియు ఇది గరిష్టంగా 320 కిలోమీటర్ల వేగంతో పరుగులు పెడుతుంది. ఇంత వేగం ఇండియన్ రోడ్ల మీద సాధ్యం కాకపోవచ్చు. అయితే దీని ధర రూ. 3 కోట్లుగా ఉంది.

ఆడి ఏ-8 ఎల్ లగ్జరీ కారు

ఆడి ఏ-8 ఎల్ లగ్జరీ కారు

ఆడి సంస్థ గత ఏడాది దీనిని అందుబాటులోకి తీసుకువచ్చింది. ఆడి ఉత్పత్తి చేసిన సెడాన్ కార్లలో ఇది అన్నింటి కన్నా ఎంతో ఖరీదైనది. ఈ ఆడి ఏ-8 సెడాన్ కారులో వీల్ బేస్ అధికంగా కలదు. ఇండియన్ మార్కెట్లోకి దీనిని ప్రదర్శించిన వెంటనే కొనుగోలు చేయజడానికి వెళ్లిన మొదటి వ్యక్తి కోహ్లి.

ఆడి ఏ-8 ఎల్ ప్రత్యేకతలు

ఆడి ఏ-8 ఎల్ ప్రత్యేకతలు

ఆడి సంస్థ ఇందులో 3.0-లీటర్ కెపాసిటి గల వి-6 డీజల్ ఇంజన్ 4.2-లీటర్ కెపాసిటి గల వి-8 డీజల్ ఇంజన్ మరియు 6.3-లీటర్ కెపాసిటి గల పెట్రోల్ ఇంజన్ లలో అందుబాటులో కలదు. అయితే కోహ్లి ఎంచుకున్న కారులో ఉన్న ఇంజన్ దాదాపుగా 494 బిహెచ్‌పి పవర్ మరియు 625 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దాదాపుగా 100 వరకు ఎక్ట్సీరియర్ రంగుల్లో అదేవిధంగా 23 కాంబినేషన్లలో ఇంటీరియర్ రంగుల్లో ఇది లభించును.

డ్రీమ్ కారు

డ్రీమ్ కారు

ఆడి కార్లకు అడిక్ట్ అయిపోయిన కోహ్లి స్వయంగా మాట్లాడుతూ ఆస్టన్ మార్టిన్ డిబిఎస్ కారును కొనుగోలు చేయాలని తెలిపాడు.

ఆస్టన్ మార్టిన్ డిబిఎస్

ఆస్టన్ మార్టిన్ డిబిఎస్

గోల్డెన్ ఫింగర్, గోల్డెన్ ఐ, టుమారో నెవర్ డై, క్యాసినోరాయల్ వంటి చిత్రాల్లో ఈ ఆస్టన్ మార్టిన్ డిబిఎస్ కారును వినియోగించారు. అయితే ప్రస్తుతం అమ్మకాల పరంగా దీని స్థానాన్ని ఆస్టన్ మార్టిన్ వ్యాన్‌క్విష్ ఆక్రమించింది.

సెలబ్రిటీల కార్ల గురించి....
  • కోట్ల మంది అభిమానించే సచిన్ ఎవరి అభిమానో తెలుసా ?
  • 100 కు పైబడి లగ్జరీ కార్లను కలిగి ఉన్న ఫేమస్ బాక్సర్ ఫ్లాయిడ్ మేవెధర్

Most Read Articles

English summary
Virat Kohli Car Collection Read More In Telugu DriveSpark
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X