హాలీవుడ్ మూవీ కోసం సైన్స్ ఫిక్షన్ కారును డిజైన్ చేసిన ఆడి

By Ravi

హాలీవుడ్ సినిమాల్లో చిత్రవిచిత్రాలు చేసే మోడ్రన్ కార్లను మనం చూస్తూ ఉంటాం. ప్రత్యేకించి ఇటీవలి కాలంలోని హాలీవుడ్ సినిమాల్లో ఆడి కార్లు ప్రత్యేక అట్రాక్షన్‌గా నిలుస్తున్నాయి. ఐరన్ మ్యాన్ 3, ది వోల్వెరైన్ వంటి సూపర్ హీరోస్ చిత్రాల్లో ఆడి కార్లను ఉపయోగించారు. ఈ చిత్రాల్లో ఆడి ఆర్8 వి10 స్పైడర్ కారును ఉపయోగించారు. అయితే, రెగ్యులర్ సూపర్ కారు మాత్రమే.

కానీ.. జర్మన్ లగ్జరీ కార్ కంపెనీ ఆడి తాజాగా మరో హాలీవుడ్ చిత్రం కోసం ఓ సైన్స్ ఫిక్షన్ కారును డిజైన్ చేసింది. పలు అవార్డులు పొంది, అత్యధికంగా అమ్ముడుపోతున్న 'ఎండర్స్ గేమ్' అనే నవలను ఆధారంగా చేసుకొని సమ్మిట్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ నిర్మిస్తున్న ఓ చిత్రం కోసం ఆడి డిజైన్ బృందం ఓ కంప్లీట్ విర్చ్యువల్ కారును అభివృద్ధి చేసింది.

ఈ ఆడి సైన్స్ ఫిక్షన్ కారుకు సంబంధించిన మరింత సమాచారాన్ని క్రింది ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి.

హాలీవుడ్ మూవీ కోసం ఆడి సైన్స్ ఫిక్షన్ కారు

ఆడి అభివృద్ధి చేసిన ఈ సైన్స్ ఫిక్షన్ కారును ఎండర్స్ గేమ్ చిత్రంలో ఉపయోగించనున్నారు. ఫ్యూచర్ ఫిల్మ్ కోసం ఆడి ఆవిష్కరించిన మొట్టమొదటి పూర్తి విర్చువల్ కారు కూడా ఇదే కావటం మరో విశేషం.

హాలీవుడ్ మూవీ కోసం ఆడి సైన్స్ ఫిక్షన్ కారు

కంపెనీకి చెందిన చెందిన 'వార్స్‌ప్రంగ్ డర్చ్ టెక్నిక్' సిద్ధాంతాన్ని ఆధారంగా చేసుకొని డిజైన్ చేసిన ఈ కారు విషయంలో డైరెక్టర్ గేవిన్ హుడ్, ప్రొడక్షన్ టీమ్‌లు కీలక పాత్ర పోషించాయి.

హాలీవుడ్ మూవీ కోసం ఆడి సైన్స్ ఫిక్షన్ కారు

సాంకేతికపరంగా అధునాతన ప్రపంచమైన ఎండర్స్ గేమ్‌లో ఈ సైన్స్ ఫిక్షన్ కారు కూడా అంతే అధునికతను ప్రతిభింభింపజేసిందని కంపెనీ పేర్కొంది.

హాలీవుడ్ మూవీ కోసం ఆడి సైన్స్ ఫిక్షన్ కారు

ఈ కారును డిజైన్ చేయటం అనేది టైలర్ తయారు చేసిన సూట్‌ను కస్టమైజ్ చేసిన విధంగా ఉంటుందని, ఎండర్స్ గేమ్ సైన్స్ ఫిక్షన్ చిత్రంలోని ప్రపంచానికి అనుగుణంగా ఈ కారు ఉంటుందని కంపెనీ అధికారులు తెలిపారు.

Most Read Articles

English summary
Futuristic, progressive and cutting edge: the Audi Design Team has developed an entirely virtual car for Summit Entertainment’s film adaptation of the award-winning, best-selling novel “Ender’s Game”. With its visionary design, the Audi fleet shuttle quattro blends easily into the world of the science fiction feature film and combines futuristic design with groundbreaking technology.
Story first published: Wednesday, October 30, 2013, 12:24 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X