వీడియో: ఫోక్స్‌వ్యాగన్ ఆలోచింపజేసే ప్రకటన

By Ravi

డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మొబైల్ ఫోన్ వినియోగించకండి. ఈ సేఫ్టీ స్లోగన్‌ను మనం నిత్యం వింటూ ఉంటాం. అయితే, దీనిని పాటించే వారి సంఖ్య మాత్రం చాలా తక్కువ. ఈ నేపథ్యంలో, డ్రైవింగ్ చేసేటప్పుడు మొబైల్ వినియోగం వల్ల కలిగే ప్రమాదం గురించి ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఫోక్స్‌వ్యాగన్ ఓ విచిత్రమైన ప్రకటనను రూపొందించింది.

సినిమా చూడటం కోసం థియేటర్‌కు వచ్చిన ప్రేక్షకులను టార్గెట్‌గా చేసుకొని ఫోక్స్‌వ్యాగన్ ఈ ప్రకటనను రూపొందించింది. ఇందులో ఓ లొకేషన్ ఆధారిత పరికరాన్ని ఉపయోగించి, థియేటర్‌కు వచ్చిన వారి ఫోన్ నెంబర్లను కలెక్ట్ చేసింది.

ప్రేక్షకులు అందరూ తమ సీట్లలో కూర్చోగానే తెరపై ఓ కారు రోడ్డుపై వెళ్తూ ఉంటుంది. అలా కారు వెళ్తున్నప్పుడు, ప్రొజెక్టర్ రూమ్ నుంచి ప్రేక్షకులందరి సెల్ ఫోన్‌లకు ఒకేసారి మెసేజ్‌ను పంపించారు. దాంతో ప్రేక్షకులందరూ తెరపై నుంచి దృష్టి మరల్చి తమ ఫోన్‌లను చూడటం ప్రారంభించారు.

ఆ సమయంలో కారు యాక్సిడెంట్ అయ్యి, అద్దాలు పగినట్లుగా భీకరమైన శబ్ధం వస్తుంది. ఆ శబ్ధాలకు అవాక్కయిన ప్రేక్షకులు ఫోన్లను వదిలి తెరపైకి చూస్తారు. ఆ తర్వాత డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మొబైల్ ఫోన్ వాడటం ప్రమాదకరమనే సందేశం వస్తుంది. ఆ విశిష్టమైన ప్రకటనను మనం కూడా ఈ వీడియోలో చూసేద్దాం రండి.
<center><iframe width="100%" height="450" src="//www.youtube.com/embed/JHixeIr_6BM?rel=0" frameborder="0" allowfullscreen></iframe></center>

Most Read Articles

English summary
Don't text and drive. A road safety slogan that is repeated regularly, but presumably not enough number of times because a large number of people still die in accidents resulting from texting and driving.&#13;
Story first published: Wednesday, June 11, 2014, 9:44 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X